యువత మేలుకో నవ సమాజాన్ని ఏలుకో సృజన విలక్షణ ఆలోచనల ఆవిష్కరణ వెలుగులతో యువ శక్తి డిజిటల్ యుగంలో మానవాళి కృత్రిమ మేధో ఇందనoగ మరో ప్రపంచాన్ని నిర్మించడానికి ముందుకు సాగుతోంది. ఉజ్జ్వల భవిష్యత్తుతో ఉత్తమ సమాజాన్ని నిర్మించుకో నిరాశను విడనాడు ఆశావాదంతో అడుగేయి ఆశయసాథనలో సారథివై పట్టుదలే పెట్టుబడిగా సంకల్పమే ఆయుధంగా అభివృద్ధే ధ్యేయంగా ప్రపంచ ప్రగతికి అగ్రేసరుడివై స్వేచ్చా’ సౌభ్రాతృత్వ సమానత్వ సంఘీభావ పునాదులపై మానవీయ విలువలతో భారత జాతి ఔన్నత్యానికి‘ పాటుపడు అభివృద్ధికర ఆలోచనలనల ఆవిష్కరణలతో ఆత్మనిర్భర నైపుణ్యాభివృద్ధితో ప్రపంచ సవా ళ్ళను పరిష్కరించే శక్తి యుక్తులను సంతరించుకో యువత తమ శక్తి యుక్తులతో ఆరోగ్య వంతమైన ప్రపంచానికి బాటలు వెయ్యాలి.
స్వార్థం విడనాడి సోమరితనం మానుకొని నేర మయ రాజకీయాలను అవినీతిని అడ్డుకొని ప్రగతి శీలురను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలి. పాలన లో వికేంద్రీకరణ జవాబుదారీతనం పారదర్శక పాల న ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధికి బాట వెయ్యాలి. ప్రపంచ శాంతి సుస్థిరతకు ప్రగతికి యువత పట్టు కొమ్మలు కావాలి. యవ్వనదశ ఆశావహ దృక్పథంతో కూడిన ఆలోచన భరితం కావాలి.
ఆవేశం వదిలి అంకితభావంతో పాజిటివ్ వైఖరి తో లక్ష్యసాధనకై పురోగమించాలి. ధైర్యమే యవశక్తి ఆయుధం అవుతే అభివృద్ధి స్వావలంభన స్వయం స్వమృద్ది ప్రపంచ ప్రగతి అవుతుంది.
యువ శక్తి చైతన్యవంతమై ప్రపంచ సమస్యల పరిష్కార కర్తలుగా ఎదుగాలి. ప్రపంచ నాయకులుగా రాణించాలి. ప్రపంచాన్ని పీడిస్తున్న జాడ్డ్యాలు నిరక్ష రాస్యత నిరుద్యోగం: పేదరికం ఆర్థిక అసమానతలు లింగవివక్షత జనాభా విస్పోటనం ప్రకృతి విపత్తులు కాలుష్యనివారణ పర్యావరణ పరిరక్షణ యుధ్ధ వాతా వరణం సామాజిక హింసాత్మక జాతి విద్వేష ఉన్మాద సంస్కృతి కట్టడికి శాస్త్ర సాంకేతిక తను ఉపయోగించే మేలైన మెలుకువలతో యువశక్తి సామర్ధ్యాలు ఇను మడించాలి. ప్రపంచ మానవాళి ప్రగతి పురోగతి సాధ నకు పునరంకితం కావాలి. జగతిని వసుదైక కుటుం బంగా తీర్చి దిద్దడానికి యువశక్తి ప్రతిన పూనాలి.
ఉగ్రవాదాన్ని అగ్రవాదాన్ని అడ్డుకొని విశ్వ మాన వ సౌభ్రాతృత్వానికి యువత పాటు పడాలి. మాదక ద్రవ్యాల వినియోగం వుమెన్ ట్రాఫికింగ్ శ్రమదోపిడి అవినీతి అత్యాచారాలు అక్రమాలు బాలకార్మిక వ్యవ స్థ లైంగిక హింస నిర్మూలన పర్యావరణహిత సుస్తిరాబి వృద్ధి మార్గములో యువత ఉద్యమించాలి.
అందరికీ విద్య ఆరోగ్యం పారిశుద్ధ్యం పర్యావర ణం ప్రకృతి విద్వంసం ప్లాస్టిక్ సమస్య గ్లోబల్ వార్మిం గ్‌పై అదుపుకై యువత సంసిద్ధులై అవగాహనతో చైత న్య శక్తిగా యువత స్వచ్ఛంద సైనికులుగా ఎదుగాలి. ప్రజల్లో విజ్ఞాన వికాస విశ్లేషణాత్మక దృక్పథ పరి వ్యాప్తిలో యువత ప్రచార సారథి కావాలి.
అంతర్జాతీయ యువజన దినం 2023 నినాదం గా సుస్థిరాభివృధ్ది సాధనలో హరిత నైపుణ్యాల యువ త గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రం జపిస్తుంది. యువత ప్రపంచ శాంతి స్థాపనలో శాంతి కిషోరా లుగా మారి ఉగ్రవాదం అగ్రవాధం తీవ్రవాదం యుధ్ధ వాతావరణానికి కారణాలు అర్థం చేసుకుంటూ భూ మాత చుట్టు శాంతి కపోతాలు స్వేచ్చగా ఎగిరే వాతావరణం కల్పించేలా యువత కార్యోన్ముఖులు కావా లన్న ఐరాస ఆశయం యువత లక్ష్యం కావాలి. పున రుత్పాదక శక్తి వనరుల అభివృద్ధి జీవ వైవిధ్య రక్షణతో గ్రీన్ విలువలు కలిగిన సమాజం కోసం యువత సన్నద్ధం కావాలి.
యువత విశ్వవ్యాప్త సామాజిక సమస్యల పరి ష్కారమే మార్గంగా సమగ్ర సమాజాభివృద్ధియే లక్ష్యం గా సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వికాసమే కార్యాచరణ ప్రణాళికగా మానవ వనరుల అభివృద్ధి యే ధ్యేయంగా ప్రపంచ ప్రగతికి బాటలు వేయాలి.
ప్రపంచ యువత పబ్బులు క్లబ్బులు సినిమాలు సికారులు పార్కులు కలిమిడి పేరున ప్రేమాయణాలు పలకరింపులు ఆశల పల్లకిలో డిప్రెసై డ్రగ్గులు రిసా రట్స్ కారాదు. యువశక్తి జాతీయ శక్తి యువత ఆశ యాల సాధనకై చోదక శక్తిగా ఎదుగాలి యువత మేలుకో మెరుగైన జీవనశైలిని ఎంచుకో ఆశయాల ఆకాంక్షల సాథనకై మత్తు మానుకో మానవతను ఎంచుకో మనోసంకల్పంతో ముందడుగువేయి పనియే ధైవంగా భావించి కష్టపడేతత్వం పెంచుకో ఆత్మనిర్భత జీవన శైలి కావాలి. జీవితంలో స్వశక్తితో ఉన్నత శిఖరాలు చేరుకో ప్రభావ పుంజమైచరిత్రలో నిలిచిపో విశ్వమానవ వికాసము సర్వమానవ సమా నత్వం సౌభ్రాతృత్వం. శాంతి సామరస్య సాధనతో ప్రగతిశీల ప్రపంచాన్ని నిర్మించాలి. జగతిన నూతన ఆవిష్కరణలతో యువశక్తి సత్తా చాటాలి.
- నేదునూరి కనకయ్య
9440245771
(నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం)