నవ్వుకుందురంటే ఇదే. రష్యా, ఉక్రైన్ యుద్ధ పరిష్కారానికి చైనా ముందుకు రావడం ఆహ్వానించదగ్గదే. అయితే హటాత్తుగా శాంతియుత ధోరణిలో జిన్ పింగ్ మాట్లాడటం సమంజసంగా లేదు. శాంతి చర్చలు జరగాలని, ఇరు పక్షాలకు అంగీకారామయే విధానాలతోనే ఇది ముగింపు దశకు చేరుకోగలదని భారత్ ఎప్పుడో ఉటంకించింది. తగుదునమ్మా అంటూ చైనా ఇప్పుడు శాంతి అనే మాట పలకడం నివ్వెరపరుస్తోంది. ఒక ప్రక్క భారత్ సరిహద్దులో, మరోప్రక్క అరుణాచల్ ప్రదేశ్ లో సమస్యలు సృష్టించి, అక్కడ గ్రామాలకు పేర్లు మారుస్తూ పలు సమస్యలు సృష్టించింది. దీనికి భారత్ దీటుగా స్పందించే సరికి వెనక్కు తగ్గింది. ఇప్పుడేమో మేము ఎప్పుడూ శాంతి పక్షమే అని అనడం దేనికి సంకే తమో తెలియడం లేదు. శాంతి చర్చలకు చైనా కట్టుబడి ఉంటుందని చెప్పడం నమ్మశక్యంగా లేదు. నీకు అంత చిత్త శుద్ధి ఉంటే ప్రస్తుతం జరుగుచున్న యుద్ధాన్ని నిలుపుదల చేసి చైనా, ఎప్పుడూ యుద్దానికి వ్యతిరేకం అనే మాట నిలుపుకోవాలి.. విశ్వంలోని పలు దేశాలు రష్యా, ఉక్రైన్ యుద్ధం నిలుపుదల చేయాలని గగ్గోలు పెడుతున్నాయి. భారత్ ప్రప్రథమం లోనే ఇది యుద్దాలా యుగం కాదని శాంతితో మనం ముందుకు పోవాలని భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం గమనించదగ్గ విషయం. ఇటీవలే జిన్ పింగ్ ఉక్రైన్ అధ్యకుడు జెలెన్ స్కితో టెలిఫోన్‌లో సం భాషిస్తూ సంక్షోభానికి రాజకీయ పరిష్కారం చూపాలని అణు వస్త్రాలపై అందరూ సమన్వయం పాటించాలని కోరారు.
చైనాతో ఉక్రైన్‌కు సంబంధాలు నెలకొన్న పరిణామా లపై ఇరువురు తమ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. రష్యా, ఉక్రైన్ యుద్ధం మానవాళిని బయపెడుతోందని దాని నివారణకు చైనా తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిదిని ఉక్రైన్ ఇతర దేశాలలో పర్యటించడానికి పంపుతున్నట్లు చెప్పారు. రెండు దేశాల మధ్య నుంచి సహకారం, సం బంధాలు, దౌత్య విధానాలు కొనసాగుతున్నాయాన్నారు. 31 ఏళ్ళ ద్వైపాక్షిక సంబంధాలు, భాగస్వామ్యం అనేది అభివృద్ధికి నిదర్శనమని మా మధ్య సంబంధాలు ఎప్పుడు నిరాశజనకంగా లేవు. రెండు దేశాలు పరస్పర సహకారా నికి కృషి చేస్తాయని జెలెన్ స్కి చేసిన వ్యాఖ్యలను జిన్ పింగ్ ప్రశంశించారు. సార్వభౌమాధికారం అనేది ఒక దేశపు హక్కు. ప్రాదేశిక సమగ్రత, ఒకరి అంతరంగిక వ్యవహారా లలో జోక్యం చేసుకోవడం కూడా తప్పు. అటువంటిది ఇక జరగదని జిన్ పింగ్ వ్యాఖ్యానించారు. మేము ఉక్రైన్ తో సంబంధాలు మెరుగు పరచుకోవడానికి (చైనా) చెప్పడం గమనార్హం. అయితే చైనాను ఇప్పుడు నమ్మే స్థితిలో ఉక్రైన్ లేదు. ఒక ప్రక్క రష్యాతో స్నేహం నెరపుతూనే ప్రత్యర్థి దేశం యొక్క సార్వబౌమాధికారం, సమగ్రత అనే అం శాలు తెరపై కి తెచ్చి శాంతి పక్షమే మనం ఉండాలి అని చెప్పడం ఉక్రైన్ పట్ల చైనా ఎటువంటి ఆలోచన కలిగి ఉందొ అర్ధం అవుతోంది. ఈ వ్యాఖ్యలన్నీ రష్యాకు ఎప్పుడో తెలుసు. ఐక్యరాజ్య సమితిలో భద్రతమండలిలో ఇరు దేశాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నందువల్ల రష్యా కూడా శాంతి మార్గమే అని ఎప్పుడో చెప్పింది. కాని ఉక్రైన్ మాత్రం ‘నాటో’లో చేరడం పెద్ద తప్పు అని చాలా రోజు లకు ఉక్రైన్ తెలుసుకోగలిగింది. ఈ విషయం ముందుగానే చైనా, ఉక్రైన్ కు చెప్పి ఉంటే బాగుండేది. నాటోలో చేరకు, అది నీ భవిషత్తుకు దెబ్బ అని ఎందుకు చెప్పలేక పాయింది? ఇప్పుడేమో చర్చలు, సంప్రదింపులతోనే ఉక్రైన్ సంక్షోభానికి పరిష్కారమని శాంతి వచనాలు పలకడం ఆశ్చర్యమనిపిస్తోంది. ఉక్రైన్, చైనాకు సంబంధాలు ఉన్నా అవి అంతా లోలోపలే. వాస్తవానికి చైనా, రష్యా పక్షమే. అమెరికా ను ఎదుర్కోవాలంటే రష్యా తో జత కట్టాలి అనే మిషతోనే చైనా, రష్యాను దగ్గరకు చేర్చుకుంటుంది. గతం లో రెండు దేశాల మధ్య సంబంధాలు అంతగా లేవు. అగ్ర దేశానికి వ్యతిరేకంగా వున్న దేశాలన్నీ చైనా కు మిత్రపక్ష మే. వాస్తవంగా విశ్వంలో ఎన్నో సంఘటనలు జరుగుతు న్నాయి. సూడన్‌లో తిరుగుబాటు, ఆఫ్రికాలో కొన్ని దేశా లలో ఆకలి, కరువు మొదలైన సమస్యలు ఉన్నాయి. వీటి నివారణ కోసం చైనా ఎందుకు కృషి చేయలేదు. సూడాన్ లో చైనీయులు కూడా ఉన్నట్లు భోగట్ట. భారత్ అడుగు ముందుకు వేసి ఆపరేషన్ కావేరి పేరుతో సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షిస్తోంది. ఏది ఏమైనా చైనా, ఉక్రైన్ తో శాంతి చర్చలు జరగాలి అనుకోవడం కేవలం భ్రమ. ఇప్పుడు పరిస్థితి మించి పాయింది. తాడో, పేడో అన్నట్లుగా రెండు దేశాలు ఉన్నాయి. ఒక వేళ యుద్ధం ఆగాలంటే అమెరికానే చొరవ తీసుకుని ఉక్రైన్ తో ఏమైనా సంభాషిస్తే కాస్త ఫలితం ఉంటుంది. కాని అగ్రరాజ్యం ఆ పని చేస్తుందా అనేది ఎవరికీ అంతు బట్టని విషయం.
- కనుమ ఎల్లారెడ్డి,
పౌరశాస్త్ర అధ్యాపకులు,
93915 23027.