Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్INS Jatayu: లక్షద్వీప్‌లో ఐఎన్‌ఎస్‌ జటాయు వ్యూహాత్మక నౌకాదళ స్థావరం

INS Jatayu: లక్షద్వీప్‌లో ఐఎన్‌ఎస్‌ జటాయు వ్యూహాత్మక నౌకాదళ స్థావరం

అంతర్జాతీయంగా పెద్దన్నయ్యగా ఎదుగుతున్నది మనమే

2024 సంవత్సరానికి వరల్డ్‌ డైరెక్టరి ఆఫ్‌ మోడర్న్‌ మిలిటరీ వార్‌ షిప్స్‌ ప్రకటించిన ప్రపంచ నావికాదళ ర్యాంకింగ్స్‌ ప్రకారం 99.1 టివిఆర్‌తో 7వ స్థానంలో ఉన్న భారత్‌ ఈ నెల మార్చి 6, 2024న లక్షద్వీప్‌ లోని మిని కాయ్‌ ద్వీపంలో ఐఎన్‌ఎస్‌ జటాయు పేరుతో వ్యూహాత్మ కంగా రెండవ పూర్తి స్థాయి నౌకాదళ స్థావరాన్ని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌ హరి కుమార్‌ చేతుల మీదుగా ప్రారంభించింది. రావణుడి ద్వారా సీతాపహ రణం జరిగిన సందర్భంలో మొదట స్పందించిన జటా యువు పేరును దీనికి పెట్టడం ప్రతిష్టాత్మకమని పేర్కొం టూ ఈ ప్రాంతంలో ఈ యూనిట్‌ ముందుగా స్పందించే వ్యవస్థ (ఫస్ట్‌ రెస్పాండర్‌)గా ఉంటుందని ఆయన తెలి పారు. 1980వ సంవత్సరంలోనే లక్షద్వీప్‌లోని మినీ కాయ్‌లో నావికాదళ కార్యక్ర మాలు ప్రారంభించిన మన దేశం 2012లో ఐఎన్‌ఎస్‌ ద్వీప్‌ రక్షక్‌ పేర లక్షద్వీప్‌ లోని కవరత్తిలో మొదటి పూర్తి స్థాయి నౌకాదళ స్థావరం స్థాపిం చింది. అయితే చైనా హిమాలయ సరిహద్దులలో సైనిక ప్రతిష్టంభన దరిమిలా ఆసియా దిగ్గజాల మధ్య సంబం ధాలు మరింత క్షీణించడమే కాక ఇరు దేశాల వాణిజ్యానికి మరియు నౌకాదళ శక్తి ప్రదర్శనకు ఇది భారీ వ్యూహాత్మక జలమార్గం కావడంతో మినీకాయ్‌లోని వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఐఎన్‌ఎస్‌ జటాయు పేర రెండవ నౌకాదళ స్థావరంగా ప్రారంభించింది. ఈ ఏర్పాటు హిం దూ మహా సముద్రంలో, సముద్ర జలాలు, తీర ప్రాంత పరిరక్షణలో వ్యూహా త్మకంగా నిలవడంతో పాటు భారత సైనిక ఉనికిని, పరిధిని విస్తరించినట్లయింది. లక్షద్వీప్‌ మరో ప్రత్యేకత ఏమిటంటే, మే 20, 1498 న ఈ ప్రాంతంలో పాదం మోపిన తొలి విదేశీయుడు పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా.

- Advertisement -

ఎందుకు స్థాపించారు?
గత దశాబ్ద కాలంగా, పొరుగున ఉన్న శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవు మరియు పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ వంటి ప్రదేశాలలో చైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా భారతదేశ తీరానికి చేరువవడం ఆందోళన కలిగి స్తోంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఉనికి కారణంగా, భారత్‌కు నావికా సామర్థ్యాలను పెం చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని విశ్లేషకుల అభిప్రా యం. హిమాలయ సరిహద్దులలో చైనా దూకుడుతో ఆసి యా దిగ్గజాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడం, ఇరు దేశాల వాణిజ్యా మరియు నౌకాదళ శక్తి ప్రదర్శనకు ఇది వ్యూహాత్మక జలమార్గం కావడంతో ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి నౌకాదళ స్థావరం యొక్క ఆవశ్యకత ఏర్ప డింది. ఈ స్థావరం నేవీ యొక్క కార్యాచరణ పరిధిని విస్త రించడానికి, పశ్చిమ అరేబియా సముద్రంలో యాంటీ-పైరసీ మరియు మాదక ద్రవ్యాల నిరోధక ప్రయత్నాలను అడ్డుకునేందుకు దోహదపడుతుంది. చైనా అనుకూల అధ్యక్షుడి ఎన్నిక తర్వాత మాల్దీవులతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రభావాన్ని కట్టడిచేసేందుకు ఐ ఎన్‌ ఎస్‌ జటాయు అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతే కాక ఐ ఎన్‌ ఎస్‌ జటాయు స్థావరం భౌగోళికంగా మాల్దీవులకు 9-డిగ్రీ ఛానెల్‌కు ఉత్తరాన ఉండడంతో, ప్రపంచంలోని 90 శాతం వాణిజ్య కార్యకలాపాలతో పాటు మాల్దీవుల ఉత్తర ద్వీపమైన తురాకును నుండి కేవలం 130 కి.మీ దూరంలో ఉండటం వలన చైనా-మాల్దీవుల కార్యకలాపాలపై కూడా నిఘా ఉంచడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, సముద్ర నేరాలు మరియు పైరసీ పెరుగుతున్న సమయం లో, ఈ ప్రాంతంలోని ఉగ్రవాద శక్తులతో పోరాడేందుకు, హిందూ మహాసముద్రంలో పెట్రోలింగ్‌ చేసే భారత నౌకా దళాలకు విశ్రాంతి స్థలంగా కూడా ఉపయోగపడుతుంది.
మాల్దీవులకు భారత్‌ చేయూత
దక్షిణాసియాలో దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగి పూర్తిగా పర్యాటకరంగం పై ఆధారపడిన చిన్న దేశం మాల్దీవులు. భారత్‌ ఈ పొరుగు దేశానికి ఎంతో కాలంగా సైనిక మరియు ఆర్థిక సాయాన్నందిస్తూ ఆదుకుంటోంది. గతేడాది చివరలో మొహమ్మద్‌ మొయిజు దేశాధ్యక్షుడయ్యే వరకు కూడా గత అధ్యక్షుడు మొహమ్మద్‌ సోలిహ్‌ మన దేశంతో సఖ్యతగా మెలిగే వారు.
కోవిడ్‌ సమయంలో, మాల్దీవుల్లో పర్యాటకరంగంలో చాలా దేశాలు కార్యకలా పాలను నిలిపివేయగా, చైనా మాత్రం పెట్టుబడులు పెట్టింది. 2018లో మాల్దీవులలో తాగునీటి సంక్షోభం తలె త్తినప్పుడు భారత్‌ నీటిని పంపింది. ఇబ్రహీం సోలిహ్‌ ప్రభు త్వ హయాంలో భారత్‌ 45 కన్నా ఎక్కువ మౌలిక సదుపా యాల అభివృద్ధి పథకాలలో పాల్గొంది. ఆగస్టు 2021లో జరిగిన ఒప్పందం ప్రకారం గ్రేటర్‌ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్‌ కోసం మాల్దీవులకు భారత్‌ 500 మిలియన్‌ డాలర్ల సా యం అందించేందుకు అంగీకరించడంతో పాటు మార్చి 2022లో పది కోస్టల్‌ రాడార్‌ వ్యవస్థలను ఏర్పాటు మరియు అడ్డూ ఐలాండ్‌లో పోలీస్‌ అకాడెమీ ఏర్పాటులో తోడ్పాటునందించింది. అయితే దక్షిణాసియాలో ప్రాబ ల్యాన్ని పెంచుకునేందుకు భారత్‌, చైనాలకు మాల్దీవులు వ్యూహాత్మకం. ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా చైనా కూ డా మాల్దీవులకు భారీగా ఆర్థిక సాయమందిస్తూ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోర్టుల లీజు ఒప్పందాలతో ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది.
మాల్దీవుల్లో మన సైనికులు ఎందుకు?
గతంలో మాల్దీవులకు భారత్‌ అందజేసిన హెలికా ప్టర్లు, చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ కోసం మన సైనికులు మాల్దీవులలో ఉన్నారు. భారత ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ‘డోర్నియర్‌ 228 సముద్ర గస్తీ విమానం, రెండు హెచ్‌ఏఎల్‌ ధృవ్‌ హెలికాప్టర్లు, సుమారు 88 మంది భారత సైనికులు మాత్రమే అక్కడ ఉన్నట్టుగా రిపోర్టులు పేర్కొం టున్నాయి. సైనికులకు బదులు సాంకేతిక సిబ్బంది ద్వారా సేవలందించేలా భారత్‌, మాల్దీవుల మధ్య అంగీకారం కుదరడంతో వారం క్రితమే మాల్దీవుల్లోని మూడు ఏవియే షన్‌ ప్లాట్‌ఫాంలలో పనిచేయడానికి సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపింది భారత్‌. అయితే ఆ సమయంలోనే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని మే 10వ తేదీలోగా ఉప సంహరించుకునేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుది రింది. అందులో భాగంగా మార్చి10 నాటికి మొదటి దశ పూర్తికానుంది అని మొయిజు నుండి ఒక ప్రకటన వెలువ డింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన మే 10 తర్వాత దేశంలో యూనిఫాంలో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ భారత సైనికులు ఎవరూ ఉండరు. అలాంటి సందేహాలను, అసత్యాలను పట్టించుకోనవసరం లేదు. ఇకపై ఈ దేశంలో భారత సైన్యం ఏ రూపంలోనూ ఉండదని నేను గట్టిగా చెబుతున్నాను అన్నారు. కాగా మొయిజు ప్రకటన విడు దల చేసిన ముందురోజే మాల్దీవులు, చైనాల మధ్య మిల టరీ సహకారానికి సంబంధించి ఒప్పందం కుదరడం గమనార్హం.
చైనా మరియు తుర్కియే లతో మొహమ్మద్‌ మొయిజు చెట్టాల్‌ పట్టాల్‌

ఇండియా అవుట్‌ అనే నినాదంతో ఇటీవల ఎన్నిక లలో గెలిచి 17 నవంబర్‌ 2023న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రెండవ రోజునే బలగాలను ఉపసంహరించుకో వాలని భారత ప్రభుత్వాన్ని మొహమ్మద్‌ మొయిజు కోరా రు. అధికారం చేపట్టాక ఆయన తొలుత తుర్కియే, చైనా లలో పర్యటించగా, భారత్‌ – మాల్దీవుల సంబంధాల్లో నెల కొన్న సమస్యలను, తనకు అనుకూలంగా మలుచుకుని ఆ ప్రాంతంలో పట్టు పెంచుకోవాలని చైనా భావిస్తోంది. భార త సైన్యం ఉపసంహరణ, సాంకేతిక బృందాన్ని మాల్దీవు లకు పంపడానికి సంబంధించి గడువు నిర్ణయించాక, ఉచిత మిలటరీ సహాయంతో పాటు ద్వైపాక్షిక సంబంధా లను బలపర్చుకునేలా మాల్దీవులు మరియు చైనా ప్రతి నిధులు ఒప్పందాలపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందం లో భాగంగా మాల్దీవుల ఆరోగ్య మంత్రిత్వ శాఖకు 12 అంబులెన్స్‌ల తో పాటు సైన్యానికి శిక్షణ, ప్రాణాంతకం కాని సైనిక సామగ్రి ఉచితంగా లభిస్తుంది. తుర్కియే పర్య టించిన సమయంలోనే ఆయన ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 3.70 కోట్ల డాలర్ల విలువైన డ్రోన్లు మార్చ్‌ 3, 2024న మాలే చేరుకున్నట్లు, వీటిని భారత హెలికాప్టర్లకు బదులుగా సముద్రంపై నిఘాకు వినియో గించనుంది. ఈ డ్రోన్లను యుక్రెయిన్‌ రష్యాపై ఉపయోగిం చింది. బేరక్తార్‌ టిబి2 డ్రోన్లుగా పిలిచే వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉండడమే గాక వీటి ధర అమె రికా ఎంక్యూ-బి ప్రెడేటర్‌ డ్రోన్ల కంటే చాలా తక్కువ మరి యు సమర్థవంతమైనవి. దాదాపు 50 లక్షల డాలర్ల విలువ చేసే ఈ డ్రోన్లను ప్రపంచవ్యాప్తంగా 30 పైగా దేశాలు సైనికావసరాల కోసం వినియోగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆహార ధాన్యాల దిగుమతుల కోసం భారత్‌ పై ఆధారపడ్డ మాల్దీవులు ఇప్పుడు వాటిని తుర్కియే నుంచి కొనుగోలు చేయలని నిర్ణయించడంతో, అందుకు డ్రోన్లను కూడా కొనాలని ఆ దేశం షరతు విధించింది. భారత్‌ రెండు హెలి కాప్టర్లతో నిఘాతో పాటు రెస్క్యూ కూడా నిర్వహించగా తుర్కియే డ్రోన్లు కేవలం నిఘా మాత్రమే నిర్వహించగలవు. రెస్క్యూ మరియు అత్యవసర పరిస్థితుల కోసం చైనా సైనికులు ఉచితంగా సేవలందిస్తారని ఆ దేశం చెబుతున్న ప్పటికీ, అది భారత్‌ పై నిఘా పెట్టేందుకు అని మన దేశం భావిస్తోంది. భారత్‌ కు సమీపంలో మాల్దీవులను మరో బేస్‌గా మార్చుకోవడానికి డ్రాగన్‌ దేశం చేస్తున్న కుట్ర ఇది.
భారత బాయ్‌ కాట్‌ నినాదం
భారత్‌ పట్ల మొయిజు వ్యవహారశైలి మరియు అయన మంత్రివర్గ స హచరులు భారత పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవులను ఉద్దేశిస్తూ భారతీ యులు ఇచ్చిన బాయ్‌ కాట్‌ నినాదంతో ఆ దేశ పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. డిసెంబర్‌ 31, 2023 వరకు మాల్దీవులను సందర్శించే పర్యాటకులలో 11 శాతం (2.09 లక్షలు) తో అగ్ర స్థానంలో ఉండే భారత ర్యాంకింగ్‌ ఈ సంక్షోభం తరువాత 6వ స్థానానికి (20 వేలు) చేర డంతో భారత పర్యాటకుల ద్వారా ఆ దేశానికి వచ్చే ఆదా యం ఘననీయంగా తగ్గింది. అయినా ఇవేమీ పట్టకుండా ఆ దేశాధ్యక్షుడు మొహమ్మార్‌ మొయిజు మాత్రం భారత్‌ పై నిప్పులు కక్కుతూనే ఉన్నాడు. వాస్తవానికి మాల్దీవులు మన దేశానికి ఏ మాత్రం పోటీ కానప్పటికీ, ఎల్లప్పుడూ తన పొరుగు దేశాలతో సుహృద్భావ సంబంధాలను కొనసాగించాలనుకునే భారత్‌ మాత్రం ఆ దేశానికి ఆపన్న హస్తం అందిస్తూనే ఉంది.
పొరుగు దేశాలపై భారత్‌ పెత్తనం చెలాయిస్తోందా?
ఇటీవల ఓ పుస్తకావిష్కరణ సభలో ఎదురైన ఈ ప్రశ్న కు సమాధానమిస్తూ భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశం కర్‌, శ్రీలంకకు సాయం చేయడాన్ని ప్రస్తావిస్తూ, భారత్‌కు పెత్తనం చేసే ఉద్దేశమే ఉంటే పొరుగు దేశాలకు క్లిష్ట సమ యాలలో 4.5 బిలియన్‌ డాలర్లు సాయంగా ఇవ్వదని అన్నారు. జైశంకర్‌ వ్యాఖ్యలపై మాల్దీవుల మీడియాలో విస్తృతంగా చర్చలు జరిగినట్లు ది హిందూ పత్రిక కథనం ప్రచురించింది. చైనా పర్యటన అనంతరం మాల్దీవులు చిన్న దేశమే కావొచ్చు కానీ, ఏ దేశమైనా సరే, బెదిరింపులకు పాల్పడే హక్కునైతే ఇవ్వలేదు అని మొయిజు చేసిన ప్రక టన మరియు భారత విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్య లను ప్రస్తావిస్తూ ఈ చర్చలు జరిగాయి. మరో ప్రశ్నకు సమాధానంగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌ ఈ ప్రపంచం కృతజ్ఞతతో కాదు, దౌత్యంతో నడుస్తుంది. చర్చలతో సమస్యలను పరిష్కరిస్తాం అని వ్యాఖ్యానించడం గమనార్హం.

యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

  • 8885050822
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News