Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telangana: రోజూ 19 గంటలు పనిచేస్తున్న రేవంత్ సర్కార్

Telangana: రోజూ 19 గంటలు పనిచేస్తున్న రేవంత్ సర్కార్

తెలంగాణ దశ, దిశ మారుతోందా?

ఈ నెల 16వ తేదీతో వంద రోజుల పాలన పూర్తి చేసుకోబోతున్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మున్ముందు అనేక సవాళ్లను ఎదుర్కోబోతున్నానడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన దోహదకారి అయినప్పటికీ, రాష్ట్ర ప్రజలు పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచిన కాంగ్రెస్‌ పార్టీకి పూర్వపు వైభవం తెచ్చి పెట్టడమే ఒక పెద్ద సవాలు కాగా, దాన్ని ఎన్నికల్లో గెలిపిం చడం మరొక పెద్ద సవాలు. అటువంటి అతిపెద్ద సవాళ్లను అవలీలగా ఎదుర్కొన్న రేవంత్‌ రెడ్డికి రాష్ట్రాన్ని దుష్పరిపా లన ప్రభావం నుంచి బయటికి తీసుకు రావడం, తాను ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ఆరు హామీలను విజ యవంతంగా అమలు చేయడం వంటివి పెను సవాళ్లు కాకపోవచ్చు. ఆయన తన హామీలను అమలు చేయడానికి వంద రోజుల గడువు పెట్టుకున్నారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు అనే పథకాన్ని మార్చి 11న ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు హామీల్లో భాగంగా మరెన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టబోతున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం ఈ హామీలను అమలు చేయడానికి రోజుకు 19 గంటలు శ్రమిస్తున్నదంటే ఆయన పట్టుదల, ఆయన చిత్తశుద్ధి, నిజాయతీలను అర్థం చేసుకోవచ్చు. ఈ ఆరు హామీల్లో అనేక పథకాలు ఇమిడి ఉన్నాయి. వీటిన న్నిటినీ వంద రోజుల్లోపల అమలు చేయడం అనేది ఆషా మాషీ విషయం కాదు. ఈ హామీలనన్నిటినీ అమలు చేయ డానికి ఎంత లేదన్నా 1.25 లక్షల కోట్ల రూపాయలు అవ సరమని అధికారిక అంచనా. ప్రభుత్వం తన చేతికి వచ్చే నాటికి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టగల స్థితిలో ఉంది. రాత్రింబగళ్లు కసరత్తు ఇక ఈ ఆరు హామీల్లోని మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలెండర్‌, మహిళలకు నెల నెలా 2,500 ఆర్థిక సహాయం వంటివి చేరి ఉన్నాయి. మొదటి రెండు కార్య క్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు లోకి తీసుకు వచ్చింది. ఇందులోని 2,500 రూపాయల సహాయ కార్య క్రమాన్ని ఇంకా అమలు చేయాల్సి ఉంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల వరకూ ఉచి తంగా విద్యుత్‌ సరఫరా చేయడం జరుగుతుందని ఆయన ప్రకటించడం జరిగింది. ఆ పథకాన్ని ఏదో విధంగా అమలు చేయాలని కృత నిశ్చయంతో ఉన్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి అతి తక్కువ కాలంలోనే అమలులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు తలకు మించిన భారం కాబోతున్న ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేయడానికి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అహర్నిశలూ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి రైతుకూ వారి బ్యాంకు ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయాల్సి ఉం టుంది. కౌలుదారు రైతులకు కూడా 15,000 రూపా యలు సహాయం అందజేస్తామని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వాగ్దానం చేసింది. అంతేకాదు, రైతు కూలీల ఖాతాల్లో కూడా 12,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు, ప్రతి పంటకూ 500 రూపాయల బోనస్‌ అందిస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది. సుమా రు 50,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంటే తప్ప ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కుదరదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకా నికి అయ్యే యావత్‌ ఖర్చును మదింపు చేయడంతో పాటు, నిధులు సమకూరే ప్రయ త్నాలను కూడా ప్రారంభించింది. రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ గత బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకాన్ని కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగించదలచు కుంది. బీ.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్ని ఎకరాల వారికి ఈ పథకాన్ని వర్తింపజేయాలన్నది నిర్దేశించలేదు కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అయిదెకరాల లోపు రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలనే నియ మాన్ని పెట్టుకుంది. నిజానికి, ఈ పథకాన్ని అమలు చేయడం బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే బాగా ఆల స్యం అయింది. ఈ పధకం విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతుండడంపై ఇప్పటికే రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఎంత కష్టం వచ్చినప్పటికీ ఈ పథకాన్ని ఏదో విధంగా అమలు చేయడానికే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. నిజానికి, ఆయన ఏ ప్రయత్నం చేసినా, ఏ పథకానికి శ్రీకారం చుట్టినా లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే లోపలే చేయాల్సి ఉంటుంది. అయితే గియితే, ఈ నోటిఫికే షన్‌ ఈ నెల 16 లోపే వెలువడే అవకాశం కూడా ఉంది. ఆయన కొన్ని పథకాలను తప్పకుండా శాసనసభలో చర్చిం చి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 11 నుంచి ప్రారంభించాలనుకోవడానికి అదే కార ణంగా కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 చదరపు గజాల చొప్పున స్థలాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ స్థలంలో ఇళ్లు కట్టుకోదలచుకున్నవారికి ప్రభుత్వం అయిదు లక్షల రూపాయల వంతున సహాయం అందజేయడం కూడా జరుగుతుంది. ఇప్పటికే స్థలాలున్న వారికి కూడా ఈ ఆర్థిక సహాయం అంద చేయా లని ప్రభుత్వం సంకల్పించింది. అయితే, తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నవారిని గుర్తించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కని పించడం లేదు. యువతకు పెద్ద పీట ఇది కాకుండా ప్రభుత్వం యువతీ యువకుల కోసం, విద్యార్థుల కోసం యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉంది. ఇది కూడా ఆరు హామీల్లో ఒకటి. ఈ పథకం కింద విద్యార్థులకు అయిదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే, భారీ సమయం, భారీ ఖర్చుతో కూడిన ఈ పథకాన్ని వంద రోజుల వ్యవధిలో పూర్తి చేయలేకపోవచ్చు. కొంచెం అటూ ఇటూగా పూర్తి చేయ డానికి అవకాశం ఉన్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్‌ కార ణంగా ఇది తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది ప్రారంభం కావచ్చు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద పేదలు, మధ్యతరగతివారి కోసం ఉద్దేశించిన వైద్య సహాయ పథ కాన్ని అయిదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం మీద ఈ పథకాలను ఎన్నికల నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకుని కాస్తంత అటూ ఇటూగా ప్రారంభించా లనే రేవంత్‌ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇదే ఉద్దేశంతో కేంద్రంతో సైద్ధాంతికంగా తప్ప వ్యక్తిగతంగా తలపడే ఉద్దేశంలో రేవంత్‌ రెడ్డి లేరనే విషయం అర్థమవుతూనే ఉంది. ఆయనకు ప్రజల సంక్షేమానికి సంబంధించిన పథ కాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడం ముఖ్యం. అహంకారంతో కేంద్రంతో తలపడేందుకు ఆయన సిద్ధంగా లేరు. మొత్తం మీద ఈ పథకాల అమలుకు ఆయన ప్రభు త్వం రాత్రింబగళ్లు కృషి చేస్తోంది. – జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News