Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Jail reforms: జైళ్లకు ఎప్పుడు మోక్షం?

Jail reforms: జైళ్లకు ఎప్పుడు మోక్షం?

పాతబడిన క్రిమినల్‌ చట్టాలు, పనికిరాని జైళ్ల చట్టాల కారణంగా దేశంలోని చెరసాలలు క్రిక్కిరిసిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో అంతుబట్టక అటు ప్రభుత్వాలు, ఇటు న్యాయస్థానాలు తలలు పట్టుకుని కూర్చోవాల్సి వస్తోంది. ఒకపక్క న్యా యస్థానాలు ఈ సమస్య గురించి గగ్గోలు పడుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ సమస్య గురించి అడపా దడపా చేయడం ఆచరణలో ఏమీ చేయలేకపోతున్నారు. జైళ్ల పరిస్థి వ్యాఖ్యలు తప్ప తిని చక్కదిద్దడానికి పురాతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని, జైళ్ల విషయంలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టాలని ఇటీవల మోదీ పిలుపు నిచ్చారు. అయితే, పిల్లి మెడలో గంట కట్టేదెవరు? పాత చట్టాలను రద్దు చేయడం, జైళ్ల సంస్కరణలు చేపట్టడం దాదాపు ఏక కాలంలో జరగాల్సి ఉంటుంది. దేశంలో నేర సంబంధమైన చట్టాలు ఏ విధంగా, ఎంతవరకూ పని చేస్తు న్నాయన్నది మొదటగా పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జైళ్ల పరిస్థితిని మదింపు చేయాల్సి ఉంటుంది.
దేశంలోని జైళ్లన్నీ మరీ దారుణంగా క్రిక్కిరిసిపోతు న్నాయి. ఒకరు ఉండడానికి కూడా సాధ్యం కాని చోట పదిమంది ఉండాల్సి వస్తోంది. ఇందులో ఎక్కువ శాతం మంది 18 నుంచి 30 ఏళ్ల లోపువారే. విచిత్రమేమిటంటే, వీరిపై న్యాయస్థానాలలో ఇంకా విచారణ కొనసాగుతోంది. వారికి న్యాయస్థానాల ద్వారా ఇంకా శిక్షలు పడకుండానే, వారు చేసినట్టు చెబుతున్న నేరాలు ఇంకా నిర్ధారణ కాకుండానే వారంతో చాలా ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్నారు. జాతీయ క్రైమ్‌ రికార్డుల బ్యూరో నివేదిక ప్రకారం, 2021 వరకు జైళ్ల లోని ఖైదీల సంఖ్య 130 శాతం ఎక్కువగా ఉంది. గత ఏడాది కంటే ఇది 12 శాతానికి పైగా ఎక్కువ. జైళ్లు ఖైదీలతో క్రిక్కిరిసిపోతున్నాయంటే అందుకు ప్రధాన కారణం మొత్తం 5.54 లక్షల మంది ఖైదీల్లో 7 7 శాతం మంది ఇంకా విచారణలో ఉన్నవారే. ప్రతి నలుగురిలో ముగ్గురికి ఇంకా న్యాయస్థానాలు శిక్ష విధించనే లేదు. సుమారు పన్నెండు వేల మంది ఖైదీలు ఎటువంటి శిక్షా పడకుండా అయిదేళ్లకు పైగా చెరసాలల్లోనే గడుపుతున్నారు. వీరి మీద విచారణ ఎప్పటికి పూర్తవుతుందో, వారికి శిక్ష పడడం గానీ, వారు విడుదల కావడం గానీ ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ లోగా ప్రతి ఏటా ఖైదీల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది.
పాతబడిన చట్టాలు
క్రిమినల్‌ చట్టాల్లో అనేకం పాతబడిపోవడం, ఇప్పుడు అవి వర్తించకపోవడం, అవేవీ హేతుబద్ధంగా లేకపోవడం వంటి కారణాల వల్ల నేరస్థుల విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. అసలు విచారణే పూర్తి కానప్పుడు శిక్షలు పడడం ఎలా సాధ్యమవుతుంది. 2021 సంవత్సర లెక్కల ప్రకారం, మొత్తం ఖైదీలలో సుమారు 10 శాతం ఖైదీలు అత్యాచారాలు, వరకట్నహత్యలకు సంబంధించిన వారే. ఇవి రెండూ దారుణమైన నేరాలే. వీటికి కఠినాతి కఠిన శిక్షలు పడాల్సి ఉంటుంది. అయితే, లైంగిక దాడికి సంబంధించిన చట్టాల దృష్టిలో అత్యాచారాలకు, పెళ్లికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలకు మధ్య తేడా ఏమీ లేదు ఇక, వరకట్న నిర్మూలన చట్టాలు ఏవిధంగా ఉన్నాయంటే, ఒకే నేరం కింద చాలామందిని అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదు, ఈ చట్టాలను దుర్వినియోగం చేసిన సందర్భాలు కూడా చాల ఎక్కువ. లేనిపోని ఆరోపణలు మోపి, అరెస్టులు చేయడం, వారిని జైళ్లకు పంపడం వంటివి దేశంలో చాలా ఎక్కువ సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.
ఇక, సుమారు 25 శాతం మంది ఖైదీలను ప్రత్యేక చట్టాల కింద, స్థానిక చట్టాల కింద అరెస్టు చేసి, జైళ్లలో ఉంచడం జరిగింది. ఇవి మద్యం, మాదక ద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు. ఎవరిని ఎందుకు అరెస్టు చేశారో, వారి నేరాల మీద విచారణ ఎప్పుడో, వాటి మీద దర్యాప్తు ఎప్పుడో ఎవరికీ అంతుబట్టని విషయం. ఇక అనేక రాష్ట్రాలలో మద్యనిషేధ చట్టాలు పనిచేస్తున్నాయి. వీటి కింద అరెస్టు అయిన వారిలో ఎక్కువ మంది నిర్దోషులు, అమాయకులే. అయినప్పటికీ, వారిని జైళ్లలో ఉంచడమో, కోర్టుల చుట్టూ పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉండడమో జరుగుతోంది. ఇందుకు కారణం, దేశంలో న్యాయ సహాయ వ్యవస్థ పని చేయకపోవడం. బ్రిటిష్వారు పాలిస్తున్నప్పుడు ఐపిసి సెక్షన్‌ 292ను ప్రవేశపెట్టారు. అసభ్యత, అశ్లీలతకు సంబంధించిన చట్టం ఇది. అమాయక పౌరులను వేధించి పబ్బం గడుపుకోవడానికి ఈ చట్టాన్ని మధ్య మధ్య ఉపయోగించడం జరుగుతోంది. బ్రిటిష్వారి కాలంలోనే ప్రవేశపెట్టిన మరొక చట్టం దేశ ద్రోహ చట్టం. ఇది ఇప్పుడు వర్తించకపోయినా, పౌరులను వేధించడానికి మాత్రం ఉపయోగంలోకి వస్తుంటుంది.
మరిన్ని జైళ్లను నిర్మించడం వల్ల, జైళ్లను విస్తరించడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుందనుకుంటే పొరపాటే. సగానికి సగం మంది ఖైదీలను విడుదల చేయడం ద్వారానే జైళ్లను బాగు చేయడం సాధ్యం అవుతుంది. విచారణలో ఉన్న ఖైదీలలో సగానికి సగం మందిని విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవడం తక్షణావసరం. ఇందుకు న్యాయస్థానాలే నడుం బిగించాల్సి ఉంటుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాత చట్టాలను బుట్ట దాఖలు చేయడానికి చర్యలు చేపట్టడం ప్రారంభించింది. ఈ చర్య లను వేగవంతం చేయడం ద్వారా ఖైదీలకు విముక్తి కలి గించవచ్చు. క్రిమినల్‌ చట్టాలలోని అనేకానే కాంశాలు నేరస్థుల విడుదలకు అవరోధంగా నిలిచాయి. కొన్ని చట్టాలే అనవసరం కాగా, కొన్ని చట్టాలలోని అంశాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. వాటిని గుర్తించి రద్దు చేయడం మొట్టమొదటగా చేయాల్సిన పని. ముందుగా అనవసర చట్టాలను రద్దు చేస్తే, జైళ్ల సంస్కరణలకు అవకాశం పెరుగుతుంది. ఇవన్నీ ఒక్క కేంద్రానికే పరిమితం అనుకోకూ డదు. రాష్ట్రాలకు కూడా భాగం ఉంది.
కనీస సౌకర్యాలు మృగ్యం
జైళ్లలో కనీస ప్రాథమిక హక్కులను అనుభవించడానికి కూడా ఖైదీలకు అవకాశం లేకుండాపోతోంది. సాధా రణంగా ఖైదీలు కొంత సమయాన్ని జైళ్ల ఆవరణల్లో గడపడం జరుగుతుంది. అయితే, వీరు ఇప్పుడు రోజులో సగటున 23 గంటలు సెల్‌లోనే గడపడం జరుగుతోంది. జైలు గదుల్లో చాలినన్ని పడకలు లేనందువల్ల, వంతుల వారీగా పడుకోవాల్సి వస్తోంది. కిటికీల్లోనూ, స్నానాల గదుల్లోనూ కూడా నిద్రపోవడం జరుగుతోంది. ఇతర దేశాల్లో ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో ఖైదీ లను విడుదల చేస్తున్నప్పటికీ, జైళ్ల గదుల్లో వీరి సంఖ్య మితిమీరి ఉండడం మాత్రం కొనసాగుతూనే ఉంది. నిజానికి బ్రిటన్‌లో 2020 తర్వాత అదనంగా సుమారు 250 జైళ్లను నిర్మించినా పరిస్థితి మాత్రం చక్క బడలేదు. మహిళలు, పిల్లల్లో కూడా నేరస్థులు భారీ సంఖ్యలో పెరుగుతుండడం, కొత్త కొత్త నేరాలు వెలుగులోకి రావడం, సైబర్‌ నేరాలు పెరగడం వంటివి ప్రతిఏటా ఈ సమస్యను పెంచి పెద్ద చేస్తున్నాయి. ఆస్ట్రేలియాలో అనేకానేక పాత చట్టాలకు స్వస్తి పలకడం జరిగింది కానీ, అందుకు దీటుగా కొత్త నేరాలు విజృంభిస్తుండడంతో ఈ సమస్యకు ముగింపు అంటూ లేకుండా పోతోంది.
గత కొద్ది కాలంగా ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు, న్యాయ నిపుణులు పాతబడిన చట్టాల గురించి, జైళ్లలో నేరస్థులు క్రిక్కిరిసిపోతుండడం గురించి అనేక పర్యాయాలు, అనేక సందర్భాలలో ఆవేదన, ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాక, అనేక జాతీయ స్థాయి సదస్సులలో కూడా నిపుణులు సూచనలు చేయడం, సలహాలు ఇవ్వడం జరిగింది. నిజానికి జైళ్ల సంస్కరణలకు సంబంధించి, 80ల లోన ఆందోళన వ్యక్తంకావడం మొదలైంది. పాతబడిన, పనికిరాని, అనవసర చట్టాలు వందల సంఖ్యలో ఉన్నాయని, వీటిని ముందుగా రద్దు చేయనిదే జైళ్లలో ఖైదీల సంఖ్య, విచారణలో ఉన్నవారి సంఖ్యత అవకాశం లేదని నిపుణులు సలహాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, ఉన్నత, ఉచ్ఛన్యాయస్థానాలు ఈ జటిల సమస్య మీద దృష్టి పెట్టి దీన్ని వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది.
విదేశాల్లోనూ ఇదే సమస్యత
ఇది ఇలా ఉండగా, జైళ్లు క్రిక్కిరిసిపోవడమన్నది అంతర్జాతీయంగా ఉన్న సమస్య. సుమారు 118 దేశాలు ఈ సమస్యతో అవస్థ పడుతున్నాయి. ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో తెలియక అవి కూడా సంస్కర ణల్లో నిమగ్నం అయ్యాయి. అనేక దేశాల్లో ఈ జైళ్లు ఎంతగా క్రిక్కిరిసిపోతున్నాయంటే, ఇక్కడి ఖైదీలు మానసిక, శారీరక అనారోగ్యాలతో కుంగి కృశించిపోవడం కూడా జరుగుతోంది. జైళ్ల అధికారులు ఈ ఖైదీలకు మౌలిక వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేయలేనంత స్థాయికి పరిస్థితి దిగజారిపోతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలు కొన్ని ప్రత్యామ్నాయ 3 మార్గాలను అనుసరిస్తున్నాయి.
ఖైదీలను, నేరస్థులను, విచారణలో ఉన్న ఖైదీలను జైళ్లలో ఉంచకుండా ఇతర విధాలుగా వారి సేవలను వినియోగించుకోవడం, వారికి ఇతరత్రా ఉపాధి కల్పించడం, వారికి శిక్షపడినా, శిక్ష పడకపోయినా వీరిని సంస్కరించడానికి ప్రయత్నాలు సాగించడం వంటివి ఇందులో ముఖ్యమైనవి. చిన్న చిన్న కేసులను పూర్తిగా క్రిమినల్‌ న్యాయ వ్యవస్థ నుంచి బయటికి తీసుకురావడం కూడా ఇందులో ముఖ్యమయింది. నేరాలను తగ్గించడానికి, నేరాలను నిరోధించడానికి కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. ఖైదీలకు న్యాయ సహాయ సౌకర్యాలను కల్పించడం ద్వారా విచారణలో ఉన్న ఖైదీలకు విముక్తిని ఏర్పాటు చేయడం, ఖైదీల్లో మానసిక సమస్యలున్నవారికి ఆస్పత్రులలో పునరావాసం కల్పించడం కూడా ఆ దేశాలు చేపడుతున్న ప్రత్యామ్నాయ మార్గాలలో ఒకటి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News