Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Judiciary in new style: కొత్త ఒరవడితో పరుగులు తీస్తున్న న్యాయవ్యవస్థ

Judiciary in new style: కొత్త ఒరవడితో పరుగులు తీస్తున్న న్యాయవ్యవస్థ

న్యాయవ్యవస్థ బారతీయతను సంతరించుకోవాలంటూ గత ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన పిలుపు రేపటి మార్పుకు మొదటి అడుగు

గత కొద్ది నెలలుగా భారత న్యాయవ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలమీద న్యాయవ్యవస్త స్పందిస్తున్న, ఘర్జిస్తున్న తీరుతెన్నులు చూ స్తుంటే ప్రభుత్వ స్పందనకోసం నిండుసభలో కన్నీళ్ళ పర్యంతమైన ఒకనాటి న్యాయవ్యవస్త ఇదేనా, ఇంతలోనే అంత మార్పా అనిపిస్తున్నది. వివిధ న్యాయస్థానాలలో కొత్త న్యాయమూర్తుల నియామకాల విషయమే కావచ్చు, న్యాయమూర్తుల బదిలీ విషయమే కావచ్చు, పెగాసన్‌, దేశద్రోహం, ఉగ్రవాద చట్టాల వంటి తీవ్రమైన అంశాల మీద చర్చే కావచ్చు, కరోనా మృతులకు పరిహారం విషయంలోనే కావచ్చు, న్యాయవ్యవస్థ ఆర్ధిక స్వాతంత్రం గురించే కావచ్చు, ఒకటీ అరా అని కాకుండా ఈనాడు భారత ఉన్నత న్యాయవ్యవస్త ప్రతినిత్యం ఏదో ఒక సంచలనానికి కేంద్రబిందువు అవుతూనే ఉన్నది. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి సర్వోన్నత న్యాయస్థానంలో నలుగురు మహిళా న్యాయమూర్తులను చూస్తున్నాం.
అటు న్యాయవాదులతో ఇటూ న్యాయముర్తులతో లౌఖ్యంగా, నిక్కచ్చితంగా వ్యవహరిస్తూ, సమాన దూరాన్ని పాటిస్తూ సామాన్యుల మనోభావాలను ఆకర్షిస్తూ న్యాయం జరుపడమే కాదు, జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో నెలకొల్పాలన్న ప్రాథమిక సూత్రానికి వారు పెద్దపీట వేస్తున్నారు ఈనాటి ప్రధాన న్యాయమూర్తులు. కఠిన పద జాలాన్ని కటువుగా కాకుండా నవ్వుతూ, నరాల్లోకి ఎక్కే విధంగా చొప్పించడం వారికి మాత్రమే చెల్లింది. బేషజం లేకుండా న్యాయవాదులతో నవ్వుతూ మాట్లాడే ప్రధాన న్యాయమూర్తులను చూస్తున్నాం. ఇంతవరకూ ప్రధాన న్యాయమూర్తి అంటే ఒంటిస్థంభ మేడలో అందనంత ఎత్తులో ఉండే విగ్రహంగానే తలుస్తూ వచ్చిన నేటి తరానికి అతి సామాన్యంగా, అందరిలో ఒకడిగా ఉంటూ, అన్ని గొంతుకలకు ఆవకాశం ఇస్తానంటున్న నేటితరం ప్రధాన న్యాయ మూర్తులు ఒకింత నిస్మయాన్ని కలిగిస్తున్నారు అనే చెప్పాలి.
దేశ స్వాతంత్రోద్యమాన్ని, ఉద్యమకారులను అణగదొక్కే ఆలోచనలోంచి పుట్టిన వలసవాద దేశద్రోహ చట్టం ఇంకెన్నాళ్ళు మనమీద స్వారీ చేస్తుందంటూ వారు సంధించిన ప్రశ్న మేధావి వర్గంలో సంచలనానికి బిందువయ్యింది. 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా ఇంకా దాని అవసరం ఉన్నదా అన్న సుప్రీంకోర్టు పిలుపు నేడు అనేక చర్చా వేదికల మీద ప్రధాన అంశమయ్యింది. దేశద్రోహ చట్టాన్ని విచక్షణా రహితంగా ఉపయోగిస్తున్నా రంటూ వారు చేసిన నిశిత విమర్శ కేంద్ర, రాష్ట్రాల పాలకు లకు చురక అంటించిందనే చెప్పాలి. దేశద్రోహ చట్టం చెల్లుబాటు మీద విచారణ జరుపుతామంటూ సుప్రీం కోర్టు చేసిన ప్రకటన వెలుగులోకి రాకుండా పోతున్న వేలాది, లక్షలాది గొంతుకలకు ఊపిరిపోసిందనే చెప్పాలి. అదికార పార్టీకి జేజేలు కొడుతూ, అనుకూలంగా పనిచేస్తున్న కొం దరు అధికారులను ఉద్దేశించి ‘నేడు అధికారానికి జిందా బాదు కొడితే, రేపు అధికారం మారిన రోజు అదే అధికా రం మీకు యమపాశంలా మారుతుందని’ అంతర్లీనంగా కోర్టువారుచెప్పిన మాటలు అధికార వర్గాల్లో సంచలనాన్ని రేకెత్తిస్తున్నది. వివిధ ట్రిబ్యునల్ల అధ్యక్షులు, ఇతర సబ్యుల భర్తీలో కేంద్రం అలక్షాన్ని, అలసత్వాన్ని తీవ్రంగా వ్యతి రేకిస్తూ నిర్ద్వంద్వంగా వారు ఖండించిన తీరు, హెచ్చరిం చిన తీరు గత దశాబ్ద కాలంగా భారత న్యాయవ్యవస్థ తీరు తెన్నులను పరిశీలిస్తున్న వారికి కొత్తగానే తోస్తున్నాయి. ఆగమేఘాల మీద కేంద్రం స్పందించేలా చేసిన వారి హెచ్చ రిక న్యాయవ్యవస్థ చురుకుదనానికి మచ్చుతునక.
తల్లిగా, భార్యగా, కూతురుగా ప్రతి అడుగులో మొగ వాడికి చేదోడువాడుగా ఉంటూ తమ జీవితాలలోని విలు వైన సమయాన్ని మనకోసం కేటాయిస్తూ వేల కోట్ల రూపా యాల విలువైన సేవలు అందిస్తున్న భారతీయ మహిళల లను ఈనాటికీ ఏ సంపాదనా లేని వర్గాలుగా ప్రభుత్వాలు ప్రకటించడాన్ని నిశితంగా విమర్శిస్తూ, మహిళా శక్తిని, వారి సేవల విలువను గుర్తించాలని, అందుకు అనుగుణం గా చట్టాలను సవరించాలంటూ మాజీ ప్రధాన న్యాయ మూర్తిగారిచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. మాతృస్వామ్య వ్యవస్తకు ప్రతిరూపాలైన అనేక జాతుల సమ్మేలనమైన మనదేశంలో మాతృమూర్తుల శ్రమను విస్మరిస్తున్నామన్న కఠిననిజం ఎన్‌.వీ రమణ తమ ఉత్తర్వుల ద్వారా వెలికితీసి చూపేవరకు మనదృష్టికి రాకపోవడం శోచనీయం. తీర్పు ద్వారా వారు ప్రభుత్వం మీద తెచ్చిన ఒత్తిడి రేపటి రోజు భారతీయ మహిళల సేవలకు సరైన గుర్తింపును, విలువను అందించే చట్టాల రూపకల్పనకు మార్గదర్శకం అవుతుం దని చెప్పవచ్చు. మాతృభాష ఔన్నత్యాన్ని కీర్తిస్తూ, న్యాయ స్థానాలలో కూడా వాటికి సరైన గుర్తింపు రావాలంటూ వారిచ్చిన పిలుపు, మాతృభాష అవసరాన్ని వివరిస్తూ వారి చ్చిన సందేశం పరాయి భాషలకోసం అర్రులు చాస్తున్న, ఆ దిశలో అడుగులు వేస్తున్న ఎందరికో చెంపదెబ్బపెట్టు అనే చెప్పాలి.
కరోనా మృతులకు పరిహారం చెల్లించేలా కేంద్రం మీద సుప్రీం కోర్టు తెచ్చిన ఒత్తిడి గురించి ఎంత చెప్పినా తక్కవే. మేము పరిహారం చెల్లించలేము అని చేతులు ఎత్తే సిన కేంద్రాన్ని నిలువరించి, విపత్తు నివారణ, నియంత్రణ చట్టం ప్రకారం మృతులకు పరిహారం తప్పనిసరి చెల్లించా ల్సిందే, తప్పుకోవడం కోసం ప్రయత్నించడం కాదు, ఎంత ఇవ్వగలరో చెప్పండని ఖరాఖండిగా సుప్రీ చెప్పిన ఫలితమే కరోనా మృతులకు 50 వేలు చేల్లిస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటనకు మూలం. అక్రమ కట్టడాల కూల్చివేతల విష యంలో కార్పోరేట్‌ నష్టాల కోణంలో కాకుండా, చట్టాల అమలు, ప్రకృతి పరిరక్షనే ధ్యేయంగా ఉన్నత న్యాయ స్థానం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు భవిష్యత్తులో కా ర్పోరేటు క్రమశిక్షణకు బాటలు వేస్తుందని ఘంటాపతంగా చెప్పవచ్చు.
పెగాసస్‌ విషయమై విచారణ కొనసాగిస్తూ ‘గూఢ చర్యాన్ని గూర్చి ప్రశ్నిస్తే దేశభద్రత అంటూ తప్పించుకో వడానికి ప్రయత్నిస్తున్నారా’? అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశించిన తీరు న్యాయవితరణ లో కోర్టులు రాజ్యాంగానికి తప్ప మరేశక్తికి భయపడవు అని రూడీ అవుతున్నది. జాతీయ భద్రత పేరుతొ స్వతంత్ర భారత పౌరుల స్వేచ్చను హరించారా నిగ్గుతేల్చాలంటూ ‘పెగాసస్‌’ వ్యవహారంలో నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని నియమించి 8 వారాలలో నివేదికను సమర్పించాలంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల వెనుకున్న ఆలోచన, ధైర్యం మారు తున్న కోర్టుల ఆలోచనాతీరే అనడంలో ఏమాత్రం అనుమా నం లేదు. రాబోయే రోజుల్లో పెగాసస్‌ వ్యవహారం సంచనా లకు కేంద్రం అయినా ఆశ్చర్యం లేదు. దశాబ్దాల స్వాతం త్రానంతరం కూడా ఇంకా దేశంలో పోలీసుస్టేషన్లలో మానవహక్కుల హననం జరుగుతున్నతీరు మీద సుప్రీం కోర్టు స్పందించడమే కాకుండా, రాజ్యాంగపరమైన హక్కు లను బాధితులకు అందించడానికే తామున్నామని ప్రకటిం చడం భారత న్యాయవ్యవస్థ సరికొత్త ఉత్సాహంతో పరు గులు తీస్తున్నదనటానికి నిదర్శనం. నిందితునికి అను కూలించే ధోరణిలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ ను కొట్టివేస్తూ ధనవంతులకు, సామాన్యులకు వేరు వేరు న్యాయాలను అందించలేం, అందరికీ ఒకే న్యాయసూత్రం వర్తిస్తుందంటు సుప్రీంకోర్టు ఘర్జించిన తీరు భారత సర్వో న్నత న్యాయస్థానం సమరోత్సాహంతో కదులుతున్న తీరుకు నిదర్శనం. కేంద్ర ప్రభుత్వాల కనుసన్నల్లో ఉన్నత న్యాయ్వవ్యవస్త కొనసాగుతుంది అన్న విమర్శ దశాబ్ద కాలంగా మన సమాజంలో వినిపిస్తున్నమాట, కాని స్వతం త్ర న్యాయవ్యవస్త రాజ్యంగానికి తప్ప మరే ఒత్తిడికి తలో గ్గదని నిక్కచ్చిగా చెప్పడమే కాదు అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది నేడు.
సింగపూరు ప్రధాన న్యాయమూర్తి సుదర్శ మీనన్‌ భారత్‌కు వచ్చిన సందర్భంలో మాట్లాడుతూ వ్యవస్థలు గాడితప్పిన రోజు ప్రజలవైపే ఖశ్చితంగా నిలబడతాం అం టూ నాటి భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన ప్రకటన భారత న్యాయవ్యవస్త బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. అప్పుడెప్పుడో ఆరు సంవత్సరాల కిందటే సుప్రీం కోర్టు రాజ్యంగా విరుద్దమంటూ కొట్టివేసిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాల జీ చట్టంలోని సెక్షన్‌ 66 ఏ ఇంకా విచక్షణా రహితంగా ఉపయోగిస్తుండటం మీద అగ్గిమీద గుగ్గిలంలా సుప్రీం మండిపడిన ఫలితంగానే దేశవ్యాప్తంగా వేలాదిమందిమీద ఆయాకేసులను ఎత్తివేస్తూ రాత్రికి రాత్రి హోం శాఖ ఆఘ మేఘాలమీద ఆదేశాలను జారీచేసింది. రాజకీయ అసమ్మ తిని అణచివేసేందుకు ఉగ్రవాద నిరోధక చట్టం ఊతం కాకూడదంటు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్‌ డీ.వై చంద్రచూడ్‌ ఇచ్చిన పిలుపు వారి నేతృత్వంలోని భారత న్యాయవ్యవస్త సమున్నత శిఖరాలవైపు అడుగులు వేస్తున్నదని చెప్పడానికి మచ్చు తునక. గతంలో ఒక జిలాస్థాయి న్యాయమూర్తిని హత్యచేశారన్న ఆరోపణలు వచ్చినా ఖశ్చితంగా వ్యవహరించలేకపోయారన్న అప వాదును మూటగట్టుకున్న ఉన్నత న్యాయస్థానం నేడు స్వ యంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కొడుకుమీద ఆరోపణలు వచ్చిన లఖింపూర్‌ లాంటి సంఘటనల మీద స్పందించన తీరు చూస్తుంటే ఇంతలోనే అంతమార్పా అనే విస్మయం కలుగుతున్నది. వ్యవసాయ చట్టాలమీద రైతుల ఉద్యమానికి స్పందించిన తీరు, తాత్కాలికంగా వాటి అమ లును నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించిన తీరు నాటి నిరుపేదల గుండెగొంతుక జస్టిస్‌ కృష్ణయ్యర్‌ను జ్ఞప్తికి తెస్తున్నది. చట్టాలను తయారు చేయడం మాత్రమే కాదు వాటి ఉద్దేశాలను పార్లమెంటు ఉభయ సభల్లో సంపూర్ణంగా చర్చించాలి, సాధ్యాసాధ్యాలను, వాస్తవాలను అవలోకం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు వేదికగా నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వీ రమణ ఇచ్చిన పిలుపు పైకి సున్నితంగా కనిపిస్తున్నా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా తయారయ్యే చట్టాలను భవిష్యత్తులో ఉపేక్షిం చబోము, రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉన్నత న్యాయస్థానం ఇకమీదట కటినంగా వ్యవహరిస్తుంది అని చేసిన హెచ్చరిక అనే చెప్పాలి.
ప్రజాప్రతినిధుల మీద నేరారోపణలమీద సత్వర విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టు వారు తెస్తున్న ఒత్తిడి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలన్న వారి తపనకు ప్రతిరూపం. న్యాయవ్యవస్త బారతీయతను సంతరించుకోవాలంటూ గత ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన పిలుపు రేపటి మార్పుకు మొదటి అడుగు అనే చెప్పాలి. ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలు తీసుకున్నది మొదలు శ్రీ జస్టిస్‌ డీ.వై చంద్రచూడ్‌ అలుపెరుగకుండా అన్నీ తానై వివిధ అంశాలను స్మ్రుశిస్తున్నారు. కోర్టులను ఆదునీకరిం చడం, డిజిటలైజేషన్‌ ను సంపూర్ణం చేయడం, ఇ ఫైలింగ్‌ ను పెంచడం ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతు న్నారు. న్యాయవ్యవస్తకు రాజకీయరంగు పులమాలని ప్రయత్నించిన మాజీ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజుకు నిక్కచ్చిగా సమాదానం ఇవ్వడం ద్వారా న్యాయ వ్యవస్థ స్వాతంత్రతను కాపాడటంలో తలవంచేదే లేడని తేల్చారు. న్యాయమూర్తులు రాజ్యాంగాన్ని అమలుచేసే నమ్మకమైన సైనికులు అన్న వారి మాటలు చేరాల్సిన వాల్లకు సూటిగా చేరిపోయాయి. జిల్లాస్థాయి న్యాయ మూర్తులతో వ్యవహరించేటప్పుడు వలసవాద మనస్తత్వం, అణచివేత సంస్కృతిని ప్రదర్శించరాదని వివిధ హైకోర్టు న్యాయముర్తులకు వారుచేసిన సూచన న్యాయవ్యవస్థలో రాబోతున్న సమూల మార్పులకు సూచన అనేచెప్పాలి. బిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, జాతులతో మేలవించబడిన సువిశాల భారతదేశం లో ప్రతి గొంతుకు ప్రాతినిధ్యం లభించాలంటే, ప్రతి పౌరుని హక్కు రక్షించ బడాలంటే, ప్రజాస్వామ్యం కలకాలం కొనసాగాలంటే అదికార ఒత్తిడికి తలోగ్గక, నిక్కచ్చిగా వ్యవహరించగలిగే న్యాయవ్యవస్త ఎంతైనా అవసరం. బలమైన, స్వతంత్ర మైన న్యాయవ్యవస్త కోసం అనుక్షణం తపిస్తున్న శ్రీ జస్టిస్‌ డీ.వై చంద్రచూడ్‌ నాయకత్వంలో ముందు ముందు మన న్యాయవ్యవస్త ఎన్నో మైలురాళ్ళను అదిగమిస్తుందని, ప్రాథమిక హక్కుల రక్షణలో శిఖరాయమయమైన నిర్ణ యాలు తీసుకుంటుందని, తీసుకోవాలని ప్రజాస్వామ్య వాదుల ఆశ.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి
    న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News