Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Kavisena Manifesto: ఆధునిక కావ్యశాస్త్రం కవిసేన మేనిఫెస్టో

Kavisena Manifesto: ఆధునిక కావ్యశాస్త్రం కవిసేన మేనిఫెస్టో

ఏ విషయం మీదనైనా కవిత రాయండి కానీ, అది కవితే అన్న విషయాన్ని ప్రామాణీకరించుకోండి అని చెబుతుంది గుంటూరు శేషేంద్ర శర్మ ’కవిసేన మేనిఫెస్టో, ఈ పుస్తకంలో స్పష్టంగా కనిపించేది శాస్త్ర విధే యత. కవిత్వానికి సంబంధించి రచయిత తాను చేస్తున్న ప్రతి వాడానికి, తాను మాట్లాడే ప్రతి మాటకు ప్రామాణికాలను ఉటంకిస్తారు. గ్రంథాలను, సిద్ధాంతాలను, విమర్శలను ఉదహరిస్తారు. కేవలం తన అభి ప్రాయంగా, తన వాదనగా చెప్పడంతో పాటు, పూర్వాపరాలను స్పష్టంగా చిత్రీకరించడం, తన సిద్ధాంతానికి భాష్యాలు చెప్పడం శేషేంద్ర శర్మ ప్రత్యేకత. కవిత్వంలో ప్రక్రియ అనుసరిస్తున్నావన్నది ముఖ్యం. ఇందు లో సార్వజనిక శ్రేయస్సు ఉందా లేదా అన్నది విచారించాలనేది కవి అభిమతం. ఒక కవి తన కవిత ద్వారా సార్వజనిక శ్రేయస్సు అనే ప్రయోజనం పొందాలి. అంతకు మించి ఇందులో ప్రయోజనం వెతకాల్సిన అవసరం లేదు.
సమగ్ర మానవ జీవితంలో ఒక చిన్న భాగమైన రాజకీయాలకు లొంగిపోయి, కవిత్వ ఆశయాన్ని, ప్రయోజనాన్ని మరచిపోయి, కవిత్వం ముసుగులో తన నినాదాల్ని ఎడాపెడా చలామణీ చేస్తున్న కొందరు కవులకు‘ ఈ మేనిఫెస్టో అనేక హితవులు పలికింది. తెలుగులో వచన కవిత్వం మొదలైన తర్వాత అసలు సీసలు కవిత్వానికి నిర్వచనం చెప్పిన ఏకైక కావ్యశాస్త్ర విమర్శనా గ్రంథం ఇది. కవిత్వానికి సంబంధించిన అన్ని పార్శ్వాలు, అన్ని కోణాలను సమగ్రంగా, ఆసక్తికరంగా స్పృశిస్తూ చేసిన లోతైన పరిశోధనాత్మక విమ ర్శలో ఈ గ్రంథంలో ప్రతి పుటలోనూ ద్యోతకమవుతుంది. కవితా సాహిత్యంలో ఒక భావజాలానికి, ఒక పార్టీకి కట్టుబడి ఉండిపోయి, రాజకీయాధికారం హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నించిన కవితలపై ఈ క విసేన మేనిఫెస్టో ఘాటైన విమర్శలు చేసింది. కవులకు ప్రజలతో, ప్రజా రాజకీయాలతో సంబంధం ఉండా లే కానీ, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండకూడదనే సిద్ధాంతాన్ని ప్రవచించిన ఈ మేనిఫెస్టో సహ జంగానే సమకాలీన రచయితలు, కవుల విమర్శలకు గురైంది. దేశానికి నాయకత్వం వహించాల్సిన కవి, దేశానికి సమగ్ర రాజకీయ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన కవి, రాజకీయ భవంతుల్లో పెంపుడు కుక్క గా పెరగడాన్ని ఈ మేనిఫెస్టో తీవ్రంగా నిరసించింది.
కవిత అనేది కవి చేతిలోని వజ్రాయుధం. ఈ ఆయుధానికి ఉన్న చైతన్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సరైన విధంగా ప్రయోగించాల్సి ఉంటుంది. దేశంలో ఒక శాస్త్రీయమైన, వైజ్ఞానికమైన నాయకత్వాన్ని ప్రసా దించాల్సిన కవి ఒక రాజకీయ సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం, తన ఆయుధ ప్రాశస్త్యాన్ని గ్రహించలేకపో వడం అన్యాయం, అక్రమమని రచయిత 1977 నాటి ఈ కావ్యశాస్త్రంలో ఘోష పెట్టడం జరిగింది. కవి త్వం బతకు తెరువు కాదని, అదొక జీవన విధానమని అంటారు శేషేంద్ర. కవి నడుస్తున్న మానవతా సంక్షి ప్త శబ్ద చిత్రం అని కూడా రచయిత స్పష్టం చేశారు. కవిత్వాన్ని ప్రేమించేవాళ్లకు, విమర్శించేవాళ్లకు పనికి వచ్చే వాదనలు ఇందులో అనేకం ఉన్నాయి. ప్రతి కవితా ఒక మారణాస్త్రంలా పనిచేయాలి. ఉష్ణోగ్రత కలిగి ఉండాలి. తాకితే చస్తామేమోనన్న భయం ఉండాలి. దీన్ని చదివిన పాఠకుడు చావాలి. చచ్చి బతకా లి. కొత్త జన్మ ఎత్తాలి. ఈ విధంగా రచయిత కవిత్వం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో సుదీర్ఘంగా చర్చించడమే కాకుండా, అనేక ప్రామాణిక గ్రంథాలను, కవి పలుకులను ఉటంకించారు. ఈనాడు. ల్సింది సామాజిక చైతన్యం కాదని, సాహిత్య చైతన్యమనీ చెబుతారు రచయిత. ప్రతి రచనకూ దేశ కాల పరిస్థితుల పరిమితులుంటాయి. లక్ష్యాలకు కూడా హద్దులుంటాయి. వీటన్నిటినీ ఆకళింపు చేసుకున్నప్పుడే కాల ప్రవాహంలో కావ్యశాస్త్రం మరింత సుసంపన్నమవుతుంది. భవిష్యత్తులో వెలువడబోయే కావ్య శాస్త్రా లకు కవిసేన మేనిఫెస్టో ఒక పునాదిగా, మార్గదర్శిగా ఉంటుందని చెప్పవచ్చు.

- Advertisement -

రాజసుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News