Monday, December 4, 2023
Homeఓపన్ పేజ్Kavitha: తొలి అరుణ కిరణం

Kavitha: తొలి అరుణ కిరణం

పాత్రికేయులకి వందనాలు

తొలి పొద్దులో తొలి అరుణ కిరణమై
ప్రపంచలోని సమస్త సమాచారాన్ని
మన ముంగిటకి చేరవేస్తున్న
పాత్రికేయులకి వందనాలు..! నాలుగో స్తంభంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతు
ఊపర్‌ షేర్వాణి, అందర్‌ పరేషానీ’ చందంగా బ్రతుకు బండి సాగిస్తున్న పాత్రికేయులకి వందనాలు..! రాత్రి అనక పగలనకా కష్టపడుతూ…
సామాజిక స్పృహ, అంకితభావం, నైతిక విలువలతో పాత్రికేయ వృత్తికి వన్నె తెస్తున్న పాత్రికేయులకి వందనాలు..! కదిలే కాలంలో పరుగెత్తుతూ
పండుగ పబ్బం అనేవి లేకుండా
దళారుల అఘాయిత్యాలకు
ఆదరకుండా బెదరకుండా
నిజాలను నిర్భయంగా మోసుకొస్తున్న
పాత్రికేయులకి వందనాలు..! గుండె నిండా బాధలు పెట్టుకున్న చెదరని చిరునవ్వుతో
ముందుకు సాగుతున్న ఓ అద్భుత రథ సారధి
మీ ప్రయాణం నిత్యనూతన చైతన్యంతో, సంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటూ… శ్రీమతి మంజుల పత్తిపాటి కవయిత్రి
చరవాణి 9347042218

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News