Tuesday, September 10, 2024
Homeఓపన్ పేజ్Kavithvam: చిగురించిన కవిత్వం

Kavithvam: చిగురించిన కవిత్వం


తెలుగు సాహిత్యంలో కవిత్వం ఒక అద్భుతమైన ప్రక్రియ కవిత్వం రాయటం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రకృతిలోని ప్రతి విషయాన్ని మనసుల మనస్తత్వానికి ముడిపెట్టి హృదయాన్ని రంజం పని చేయగల అద్భుతమైన సాహితీ ప్రక్రియ కవిత్వం ఇలాంటి కవిత్వం రాయాలంటే సామాజిక స్పృహ స్పందించగల తత్వము తెలుగు భాష పట్ల, సాహిత్యం పట్ల అపారమైన అవగాహన ఉండాలి. శతాబ్దాల చరిత్ర గలిగిన తెలుగు సాహిత్యంలో ఎందరో కవులు తమదైన శైలిలో కవిత్వాన్ని రాస్తూ వస్తున్నారు అందులో ప్రాచీన కాలం నుండి తెలుగు సాహిత్యంలో మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రకృతిలో వస్తున్న పరిణామాలను సమాజంలో జరుగుతున్న సంఘటనలను సమూహరించి అందమైన అద్భుతమైన తెలుగు పదాలతో కవిత్వాన్ని చిగురింప చేశారు. కవయిత్రి జవేరియా గారు. ఈమె ముస్లిం మహిళ అయినప్పటికీ తెలుగు సాహిత్యంపై అత్యంత మమకారముతో తెలుగు భాషపై ఉన్న ప్రేమను తన కవిత్వం ద్వారా చాటుకున్నారు. ఈమె విద్యార్థులలోని అజ్ఞానాన్ని తొలగించి విద్యా విజ్ఞాన వెలుగులను నింపే ఉపాధ్యాయురాలుగా సమాజంలోని అవినీతి అన్యాయాలపై అక్షర యుద్ధం చేయగల యోధురాలు. కలం చేతబట్టి కవిత్వంతో సమాజాన్ని సంస్కరించగలరు. చైత్రమాసంలో చెట్లు సిగరించినట్లుగా ప్రకృతి పురుడు పోసుకున్నట్లుగా జవేరియా గారి కవిత్వంతో సమాజం చైతన్యవంతం అవుతుంది.
దిక్కారస్వరం నా కలం అంటూ
ప్రజల పక్షాన నిలబడే నా కలానికి
దిక్కరించే స్వరం ఉంది.
నీతిని నిలబెట్టే నా కలానికి
అవినీతితో పోరాడే దమ్ముంది!
మందు గుండు లాంటి
అక్షర తూటాలను పేల్చేటి
నాకలం ప్రజల పక్షాన
నిలబడే ప్రజాపక్షపాతి
జవేరియా గారు ప్రజల పక్షాన నిలబడి అక్షరాలను తూటాలుగా మార్చి వారికి జరుగుతున్న అన్యాయాలపై అక్షర యుద్ధం చేయగల తెగువన్న కవయత్రి మన జవేరియా గారు. దేశం గురించి మాట్లాడుతూ ఎటు పోతుంది నా దేశం అంటారు సస్యశ్యామలమైన నా దేశంలో ముళ్ల పదులు మొలుస్తున్నాయి ఓట్లతో గెలిచినవాడు నోట్ల కోసం దేశాన్ని అమ్మేస్తున్నారంటూ ఆవేదన తెలియజేస్తున్నారు. నేటి సాంకేతిక యుగములో మనిషి కాలంతో కాకుండా సెల్‌ఫోన్‌ కాల్‌తో కాలం వృధా చేస్తున్నారు అంటూ అర చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే సొల్లు కబుర్లకు కొదవ లేదంటూ ఫోన్లో కాలం వృధా చేసే వారి గురించిన కవిత్వాన్ని మనకు అందించారు నేటితరం విద్యార్థులు యువత విజయం ఎలా సాధించాలో అయోమయంలో ఉన్నారు. ఆవేదనకు గురవుతున్నారు చిన్నచిన్న కష్టాలను కూడా భరించలేకపోతున్నారు ఇలాంటి యువకుల్లో ఆత్మ విశ్వాసం నింపే అద్భుతమైన అక్షర సాహిత్యంతో చైతన్య వంతమైన కవిత్వము మనకు అందించారు
పడి లేచే కెరటాలను చూశాక తెలిసింది
అలజడలతో నిండిన సముద్రానికి కూడా కష్టాలు తప్పవని!
అస్తమించే సూర్యున్ని చూశాక తెలిసింది
రోజంతా ప్రపంచానికి వెలుగునిచ్చే
కిరణాలకుకూడా చీకటి ఆవరించటం ఖాయమని!
అలాంటప్పుడు నిన్ను నన్ను పరీక్షించడానికి వచ్చిన కష్టాలు ఎంతో కాలం మన వెంట ఉంటాయి కష్టాలు ఎదు రైనప్పుడే సడలని ఆత్మ ధైర్యంతో తట్టుకొని నిలబడినప్పుడే కదా విజయం వస్తుంది.
నిర్లక్ష్యంగా నిద్రపోతున్న
నేటితరం యువతరాన్ని
జవేరియా గారు తన కవిత్వంతో మేల్కొల్పి నవ యువకుడైన స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధికి ప్రతి యువకుడు నడుం బిగించాలని స్ఫూర్తింవంతమైన కవిత మంత్రాన్ని మనకు అందించారు కవయిత్రి జవేరియా గారు.
పంట పొలాలకు పుష్కలంగా
నీటిని అందిస్తాయి
రైతన్నల పాలిట కష్టాలను తీర్చే కల్పవృక్షాలు
అందుకే మనం బాధ్యతగా మొక్కలను పెంచాలి
హరితహారంలో భాగమై చేతిలో చెయ్యి కలిపి మొక్కలను నాటాలి!
నాటి అడుగులు నేటి పారిశ్రామిక వాడలై నాటి వ్యవసాయ భూములు నేటి రియల్‌ ఎస్టేట్లుగా మారాయి మనకు బ్రతుకు నిచ్చే మనలను బ్రతకనించే చెట్లను మనం నిర్లక్ష్యంగా నరికేస్తున్నాం మనం ఈ ప్రకృతిలో పది కాలాలు పాటు పచ్చగా బ్రతకాలంటే మనం మొక్కలను నాటుకోవాలి చెట్లను పెంచుకోవాలి పశుపక్షాదులు ప్రకృతికి అందం వాటిని కాపాడుకుంటేనే మనకు ఆనందం అంటూ ఈ కవితలో ప్రకృతి యొక్క గొప్పతనాన్ని చెట్టులో దాగున్న సత్యాన్ని మనకు తెలియజేశారు కవయిత్రి
అమ్మ లాంటి మన తెలుగు
అపురూపంగా కనిపిస్తుంది
అన్నం పెట్టే మన తెలుగు
అందరినీ ఆదరిస్తుంది!
తెలుగు అక్షరాలు మదిలో యాదికొచ్చినప్పుడల్లా స్వేచ్ఛగా విహరించే రంగురంగుల చితాకో చిలుకలు ఒక్కచోట పోగై అందమైన పూలవనాన్ని తలపిస్తున్నట్టు నోటికి విరామం లేకుండా మాట్లాడే
ఒక మధురమైన స్వరం
పాఠంగానో.. గేయంగానో.. మారి
శ్రవణానందాన్ని కలిగిస్తూ
మరో ప్రపంచానికి తీసుకెళ్తుంది
ఇటు తెలుగు భాషపై మమకారాన్ని చూపిస్తూ అటు ప్రకృతిపై ప్రేమ అనురాగాలను అక్షరబద్ధం చేస్తూ చక్కనైన కవిత్వాన్ని చిగురింప చేశారు కవయిత్రి జవేరియా గారు.
చదువులు నేర్పిన మా ఊరి బడి
పల్లె ప్రజలను కాపాడే దేవుడు గుడి
గుండెను బరువెక్కించే కన్నీటి తడి
ఇంకా మరిచిపోలేదు
మరుపురాని జ్ఞాపకాలు
ఇంకా గుర్తుకొస్తున్నాయి!
కన్నతల్లి నీ ఉన్న ఊరిని చదువు నేర్పిన బడిని దేవుడు గుడిని పల్లెటూరి బాల్య స్మృతులను జీవితాంతము గుర్తు చేసుకుంటూనే ఉంటాము గత కాలపు బాల్య స్మృతులను తలచుకుంటూ ఎంతటి కష్టమైనా మరిచిపోవచ్చునని జవే రియా గారి కవిత్వము చదువుతుంటే ప్రతి ఒక్కరి బాల్య స్మృతిలో మనకు కళ్ళకు కట్టినట్లుగా గుర్తుకొస్తాయి.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రను పరి శీలిస్తే దేశ అభివృద్ధికి ప్రధాన ఆటంకం అవినీతి ఇలాంటి అవినీతిని నిర్మూలించాలని తన కవిత్వం ద్వారా వివరి స్తున్నారు.
సలసల మరిగే ఎర్రని రుధిరాన్ని నింపి
జగన్నాధ రథచక్రాలు గా మలిచి
ముందుకు కదలాలి!
అడుగు అడుగు నా నిండిన అవినీతి కంపును! కడిగేందుకు!
నడుము కట్టిన మనం
అక్షర ఆయుధాలుగా మలిచి
అవినీతి పరుల మీద ఎక్కుపెట్టి
ఎక్కడికక్కడే కడిగిపారేయాలి
ఐక్యమత్యాన్ని మంత్రంగా జపిస్తూ
నిత్య నూతనమైన చైతన్యాన్ని అను అణువు నింపుతూ
సత్యమేవ జయతి అంటూ
సత్యం వైపు అడుగులు వేయాలి అవినీతిని అంత మొందించాలి అంటూ కవిత్రి జవేరియా గారు మనలో చైతన్యాన్ని నింపుతున్నారు.
అన్నం పెట్టే రైతన్న
ఇప్పుడు ఆకుపచ్చని
పంట పొలాలలో
ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేయడం లేదు!
ఉద్యమస్ఫూర్తితో రగిలిపోతున్నాడు
అక్షర జ్ఞానం లేనంత మాత్రాన
అతను అజ్ఞాని కాదు
సకల శాస్త్రాల సారాన్ని అనుభవించి
వంటబట్టించుకున్న కాలజ్ఞాని
దేశ ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ
నిద్రాహారాలు మాని ఉద్యమ బాట పట్టాడు!!
ఆరు కాలము శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు ఉద్యమ బాట పట్టాడు ఇది దేశ ప్రజల శ్రేయస్సుకై దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన రైతన్న వ్యవ సాయ అభివృద్ధిపై నాయకులు దృష్టి పెట్టాలని రైతు ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్న తీరును ఈ కవితలో వివరించారు
కుల మతాల ఊసు లేకుండా
మనమంతా కలిసి నడవాలి
అసమానతులను తొలగించాలి
ఐక్యమత్యంతో ఏకత్వం అనే మంత్రం చదవాలి
మూడు బారిన మనిషి జీవితం
ఇప్పుడు చెట్టులా చిగురించాలి!!
అంటూ కవిత్రి జవేరియా గారు మానవత్వ విలువ లను తన కవిత్వంతో చిగురింపజేశారు చిగురించిన చెట్టు శీర్షికతో చక్కనైన కవిత్వం అందించిన జవేరియా గారి కవిత్వానికి గుడిపాటి గారి సానుకూల పార్శ్వం, ప్రముఖ కవి రచయిత సాహితీ విమర్శకులు డాక్టర్‌ మహమ్మద్‌ హసేన గారి ముందుమాట, చిగురించిన చెట్టు అమరత్వానికి ప్రతీక అంటూ సర్వేశ్వరరావు గారి విశ్లేషణ విఆర్‌ తుములూరి గారి బుల్లెట్‌ లాంటి పదాలు చిగురించిన చెట్టును మరింత సాహితీ కొత్తదనాన్ని నింపాయి కవిత్రి జెవేరియా గారి కలం నుండి మరెన్నో కవిత పరిమళాలు విరజిమ్మాలని చైతన్యవంతమైన కవిత్వము తన కలం నుండి జాలువారాలని ఆశిద్దాం.

కవి రచయిత సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News