Monday, November 25, 2024
Homeఓపన్ పేజ్Kerala govt: అడకత్తెరలో కేరళ ప్రభుత్వం

Kerala govt: అడకత్తెరలో కేరళ ప్రభుత్వం

గత 20వ తేదీ నుంచి కేరళలో సి.పి.ఐ(ఎం) నాయకత్వంలోని ఎల్‌.డి.ఎఫ్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజా ప్రతిఘటన ప్రదర్శన ప్రారంభం అయింది. దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ నాయకత్వం వహిస్తున్నారు. గత ఆగస్టులో ఈ పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన మొదటి కార్యక్రమం ఇదే. పార్టీ పరంగా ఇంతవరకూ ఆయన చేసిందేమీ లేదనే చెప్పవచ్చు. ఇంతకూ సుమారు నెల రోజుల పాటు ఆయన చేపట్టే ఈ ప్రదర్శన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పచ్చ జెండా ఊపారు. ఉత్తర కేరళలోని కాసర్‌గోడ్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన తిరువనంతపురంలో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కేరళ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నందుకు నిరసనగా ఈ ప్రజా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రకటించింది కానీ, ఈ ప్రదర్శన నిర్వహించడం వెనుక మరో ఉద్దేశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ 21 నెలల కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనను అడ్డుకోవడానికి, ఎల్‌.డి.ఎఫ్‌ ప్రభుత్వంపై జరుగుతున్న దాడులను నిరోధించడానికి ఈ ప్రదర్శన జరుగుతున్నట్టు జనం చెప్పుకుంటున్నారు. అంతేకాదు, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ఎల్‌.డి.ఎఫ్‌ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించిందని కూడా అర్థం చేసుకోవచ్చు.
అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఎల్‌.డి.ఎఫ్‌ ప్రభు త్వాన్ని కొన్ని రకాల వివాదాలు కూడా చుట్టుముడుతుండడం అటు మార్కి స్టు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీలో బూర్జువా ధోరణులు ప్రబలుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తడంతో గత ఏడాది ఈ పార్టీ నాయకత్వం దీన్ని మొగ్గు దశలోనే తుంచివేయడానికి ఒక ‘దిద్దుబాటు’ ప్రచారాన్ని చేపట్టింది. పార్టీలో బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఆస్తులు కూడగట్టుకోవడం, పదవుల కోసం పాకులా డడం వంటి అనేతిక బూర్జువా ధోరణులు పేట్రేగిపోతున్నాయంటూ విమర్శలు తలెత్తడంతో పార్టీ ఈ దిద్దుబాటు కార్యక్రమాన్ని చేపట్టింది. గత 12 ఏళ్ల కాలంలో ఇటువంటి కార్యక్రమం ఏనాడూ జరగలేదు. చాలా ఏళ్లుగా అధికారంలో కొనసాగు తుండడం వల్ల ఈ ధోరణులు ప్రబలుతున్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. సంస్థాగతంగా కూడా ఆధిపత్య ధోరణుల విజృంభిస్తున్నాయని భావిస్తు న్నారు. సంస్థాగతంగా పైనుంచి కింది స్థాయి వరకు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉం దని గోవిందన్‌ సైతం ప్రకటించడం జరిగింది. పార్టీ నాయకులు, పార్టీకి సంబం ధించిన మంత్రులు తమ బంధువులను విశ్వవిద్యాలయాల్లో నియమించడం ప్రారం భం అయినప్పటి నుంచి వివాదాలు మిన్నంటడం మొదలైంది.
వాస్తవానికి ఈ నియామకాల కారణంగానే ముఖ్యమంత్రికి, గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌కు మధ్య విభేదాలు కూడా ప్రారంభం అయ్యాయి. విశ్వవిద్యాలయాల చాన్స్‌లర్‌ గా ఆరిఫ్‌ ఖాన్‌ ఈ నియామకాలను ప్రశ్నించడంతో పాటు, మార్కిస్టు పార్టీ మీద రాజకీయ విమర్శలు చేయడం కూడా మొదలుపెట్టడంతో ప్రభుత్వం మరింతగా ఇరకాటంలో పడింది. ఈ వివాదాలను దృష్టిలో పెట్టుకుని మీడియాలో కూడా ప్రభు త్వ వ్యతిరేక కథనాలు రావడం ప్రారంభం అయింది. ఈ వివాదాలు, విమర్శల కార ణంగానే ప్రభుత్వం 64 వేల కోట్ల రూపాటయలతో నిర్మించ తలపెట్టిన సెమీ హై స్పీడ్‌ రైల్‌ లైన్‌ ప్రాజెక్టుకు కూడా స్వస్తి చేప్పాల్సి వచ్చింది. గత ఏడాది మే నెలలో జరిగిన త్రిక్కకర శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడం పార్టీకి దిగ్భ్రాంతి కలిగించింది.
ఇక గత ఫిబ్రవరి 3న సమర్పించిన రాష్ట్ర బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంతో పాటు, పన్నులు కూడా పెంచడం తీవ్ర స్థాయి విమర్శలకు కారణమైంది. కేంద్ర ప్రభుత్వ వివక్ష వల్ల రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం ఏర్పడి నందువల్ల తాము ఈ చర్యలు తీసుకున్నట్టు ఆర్థిక మ్రంతి సమర్థించుకోజూచారు కానీ, ఆ వాదన ప్రజలను నమ్మించలేకపోయింది. ఆర్థిక లోటు, ఆర్థిక సమస్యలు పెరిగిపోతుండడం, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లేకుండా పోవడం వగైరాలు కూడా ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యలకు కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, పన్నుల వసూళ్లు సక్రమంగా జరగకపోవడం, ప్రభుత్వ దుబారా, ప్రభుత్వానికి ఒక విజన్‌ అంటూ లేకపోవడం ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణాలని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పనితీరును, విధానాలను, బడ్జెట్‌ ప్రతి పాదనలను నిరసిస్తూ కాంగ్రెస్‌, బీజేపీలు కూడా ఆందోళనలను చేపట్టడంతో ప్రభు త్వ పరిస్థితి మరింత ఇరకాటంలో పడింది. ఇది చాలదన్నట్టు ముఖ్యమంత్రి మాజీ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మళ్లీ అరెస్టు చేయడం కూడా విజయన్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేస్తోంది. ఒక ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో చోటు చేసుకున్న కుంభకోణంలో శివశంకర్‌కు పాత్ర ఉందని ఇ.డి ఆరోపించింది. ఈ పథకం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అమలు జరిగింది.
ఇది ఇలా ఉండగా, పార్టీలో దిద్దుబాటు కార్యక్రమం చేపట్టినప్పటికీ పార్టీ పనితీరులో మార్పేమీ రాలేదని పార్టీలోని కొందరు నాయకులు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. బంధుప్రీతి, అక్రమార్జన, ఆధిపత్య ధోరణులు యథాతథంగా కొనసాగుతు న్నాయని వారు చెబుతున్నారు. పార్టీ నాయకులు కొందరు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, బంగళాలలో నివసిస్తున్నారని, లైంగిక వేధింపులకు కూడా పాల్ప డుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. కణ్ణూరులో పార్టీ అనుచరుడుగా వ్యవ హరించిన ఆకాశ్‌ తిల్లంకేరి అనే వ్యక్తిని ఇటీవల కొన్ని నేరాల విషయంలో అరెస్టు చేసి నప్పుడు తాను పార్టీ నాయకులు చెప్పినట్టే చేశానని, వారు చేయిస్తేనే చేశానని చెప్ప డంతో పార్టీ కొద్దిగా అప్రతిష్ఠపాలయింది. 2024 ఎన్నికలు ఇంకా ఏడాది దూరం ఉన్నప్పటికీ, పార్టీ ప్రభుత్వ పరంగా గానీ, పార్టీ పరంగా గానీ ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News