Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్

Lata Mangeshkar: భారతీయ గాన కోకిల లతా మంగేష్కర్

ఆమె మాటే ఒక తీయనైన పాట ఆమె జీవితం ఒక సంగీత ప్రవాహం. భారతీయ సంగీత ప్రపంచంలో పాటల ప్రవాహానికి ప్రాణం పోసిన గాయని గాన కోకిల లతా మంగేష్కర్ . ఏడు దశాబ్దాలకు పైగా వివిధ భాషలలో తన పాటలతో అలరించి ఐదు దశాబ్దాలు పాటు హిందీ చిత్ర పరిశ్రమలో పాటలకు ప్రాణం పోసి చరిత్రలో నిలిచిపోయిన భారతీయ సంగీత ప్రపంచంలోనే గాన కోకిలగా పేరుగాంచిన లతా మంగేష్కర్ గారు తెలుగు సినిమాలు మూడు పాటలు పాడటం మన అదృష్టంగా భావించవచ్చు. 1955వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన సంతానం అనే సినిమాలో నిదురపోరా తమ్ముడా అనే గీతాన్ని ఆలపించారు ఆ తరువాత 1965 సంవత్సరములో దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వెంకటేశ్వర గీతాన్ని ఆలపించారు. తెలుగులో చివరిగా అక్కినేని నాగార్జున నటించిన ఆఖరి పోరాటం సినిమాలో తెల్లచీర పాటను పాడారు. వివాదాలకు అతీతంగా అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం గల లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 29న సుప్రసిద్ధ సంగీత కారుడు దీనానాథ్ మంగేష్కర్ పెద్ద కుమార్తెగా జన్మించారు. తండ్రి వద్దనే సంగీత ఓనమాలు నేర్చుకొని ఐదేళ్ల వయసులో పాటను ప్రారంభించి తన పాటలనే పాఠశాల విద్యగా భావించి సంగీత విద్యను కొనసాగిస్తున్న తరుణంలో తండ్రి మరణం వారి కుటుంబ బాధ్యతను ఆమె భుజస్కంధాలపై మోయవలసిన పరిస్థితి ఏర్పడింది. తన 13 ఏళ్ల ప్రాయంలో ఒక వైపు నటన మరొకవైపు పాటతో తన జీవన గమనాన్ని ప్రారంభించి 1942 సంవత్సరంలో కోసం ఆమె పాడిన పాట సినిమాలో లేకపోవడం వినయ్ మాస్టర్ సంగీత సారధ్యంలో పెహ్లి మంగల్ గౌడ్ సినిమాలో లతకు చిన్న వేషం లభించింది అదే చిత్రంలో ఒక పాటను పాడటం తన పాటల ప్రయాణం కొనసాగించడం జరిగింది. హిందీలో మాట్ ఎస్ సపోట్ దునియా భాదల్ దాతు అనే పాటతో హిందీ పాటల ప్రస్థానాన్ని కొనసాగించారు. 1945వ సంవత్సరంలో వినాయక కంపెనీ ముంబాయికి మారడంతో లతా కూడా తన జీవన ప్రస్థానాన్ని ముంబైకి మార్చుకొని అక్కడే హిందుస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకున్నారు ఆమె పాటకు భాష భేదం లేదు. మరాఠీలో నాలుగు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి నిర్మాతగా బాధలు మరాఠీ చిత్రాన్ని నిర్మించారు 1955లో జాన్ జాన్ చిత్రాలు 1990లోకిన్ చిత్రం నిర్మించారు.
భారతీయ సంగీతానికి ఒక మణిహారం, గానకోకిల లతా మంగేష్కర్. ఆమె గాత్రం నుండి పుట్టిన ప్రతి పాట ఒక అద్భుతం, ఒక భావోద్వేగం. సుమారు 7 దశాబ్దాల పాటు సాగిన ఆమె సినీ జీవితం ఒక స్ఫూర్తిదాయకమైన కథ.1942లో ‘మహల్’ చిత్రంతో లతా మంగేష్కర్ గాన ప్రయాణం ప్రారంభమైంది. హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు తో పాటు 36 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడింది. ‘ఆయేగా ఆయేగా’, ‘ప్యార్ లాంటి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రం ఇచ్చింది.భారతీయ సినిమా సంగీతానికి ఒక ప్రత్యేక శైలిని తీసుకువచ్చింది.
భారతీయ సినిమా ప్రపంచం నుంచి అనేక అవార్డులను అందుకున్నారు 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999 మరియు 2009లో ఎన్టీఆర్ జాతి అవార్డు, 1969లో భారత భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ 1999 భారతరత్న అవార్డులను అందుకున్నారు. శాంతినికేతన్ విశ్వభారతి శివాజీ విశ్వవిద్యాలయం వారి చేత డాక్టర్ పురస్కారాన్ని పొందారు. 1990లో రాజ్యలక్ష్మి అవార్డు. ఆతరువాత అప్సర అవార్డు, కాళిదాసు, సన్మాన్ అవార్డు, సేన అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు,3 జాతీయ ఫిల్మ్ అవార్డులు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 15 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అవార్డులను అందుకున్నారు.

- Advertisement -
  • ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో ఎక్కువ పాటలు పాడిన గాయనిగా రికార్డు సృష్టించారు.
    లతా మంగేష్కర్ ఒక గాయని మాత్రమే కాదు, ఒక సంస్థ. ఆమె గానం ద్వారా ఎన్నో తరాల ప్రేక్షకులను మెప్పించి, భారతీయ సంగీతానికి ఒక గొప్ప కృషి చేసింది. ఆమె గాత్రం ఒక అమరత్వం, ఆమె పాటలు ఒక శాశ్వత నిధి.
    ఆమె చివరి రోజుల్లో పలికిన అమృత వాక్యాలు”లోకంలో మరణానికి మించిన సత్యం లేదు”అత్యంత విలువైన బ్రాండెడ్ కారులు నా ఇంటి గ్యారేజ్ లో ఉన్నాయి కానీ నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను, అత్యంత విలువైన అలంకార చీరలు ఆభరణాలు రకరకాల పాదరక్షకులు నా ఇంట్లో పడి ఉన్నాయి, కానీ హాస్పటల్ వారి చిన్న చిన్న గౌను వేసుకొని ఉన్నాను. నా బ్యాంక్ అకౌంట్ లో కావలసినంత డబ్బు ఉంది, నాకు రాజ భవనం లాంటి ఇల్లు ఉంది, కానీ హాస్పటల్లో చిన్న బెడ్ మీద పడి ఉన్నాను. ప్రపంచంలో ఉన్న అన్ని ఫైవ్ స్టార్ హోటల్లో ప్రయాణం చేశాను, కానీ నేడు హాస్పటల్లో ఆపరీక్ష ఈ పరిక్ష అంటూ మారి మారి వెళ్తున్నాను. ఆనాడు నిత్యము శిరోజాల అలంకరణలు ఇప్పుడు నా శిరస్సుపై శిరోజాలు లేవు. ప్రసిద్ధి చెందిన హోటల్లో ఆహారం తినేదాన్ని కానీ ఈనాడు పగలు రెండు మాత్రలు రాత్రి చిటికెడు ఉప్పు. ప్రత్యేక విమానాలలో ప్రపంచమంతా తిరిగి వచ్చాను కానీ ఇప్పుడు హాస్పటల్ వరండా దాకా వెళ్లడానికి ఇద్దరు సహాయం చేస్తున్నారు. ఏ సంపద వసతులు ఏవి నాకు సహాయ పడలేదు ఏ విధమైన ఓదార్పును ఇవ్వలేదు కానీ కొంతమంది ఆత్మీయుల ఆప్యాయత వారి ప్రార్థనలు నాకు ప్రోత్సాహాన్నిచ్చాయి. ఇంతేనండి ఈ జీవితం ఎవరికి సహాయం చేయలేని ధనం పదవి ఉన్నవారికి విలువ ఇవ్వకండి మంచి మనసున్న వారికి విలువనిచ్చి స్నేహం ఆప్యాయత ప్రేమను పంచండి రేపటి తరానికి బతుకు భద్రతతో పాటు భారతీయతను నేర్పించండి అంటూ చివరి రోజుల్లో తన జీవితం సత్యాన్ని నేర్పించి మనం ఎలా బ్రతకాలి జీవిత పరమార్ధాన్ని నేర్పించిన లతా మంగేష్కర్ గారు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మానవత్వం బ్రతుకుదాం.
    ఫిబ్రవరి 6 లతా మంగేష్కర్ గారి వర్ధంతి సందర్భంగా.

కవి సాహితి విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News