Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Maldives in China trap: చైనా బుట్టలో మాల్దీవ్స్

Maldives in China trap: చైనా బుట్టలో మాల్దీవ్స్

మా దేశం, మా దీవులు, మా అందం

మాల్దీవుస్ అధ్యక్షుడు మయుజ్జ భారత్ పట్ల వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారు. గతంలో భారత్ తో
స్నేహ పూరిత విధానం అవలంభించిన అధ్యక్షులకు మయుజ పూర్తి తిరోగమనా సిద్ధాంతాన్ని ప్రదర్శిస్తున్నారు. భారత్ చేసిన సాయం విస్మరించింది. మాల్దీవ్స్ కు రాడర్ స్టేషన్స్, నిఘా విమానాల వ్యవస్థను అందించిందే భారత్. ఇవి దీవులకు అత్యంత అవసరమైనవి. దీవుల అభివృద్ధికి, అక్కడ ఉన్న సైన్య బృందానికి, భారత్ సైన్యాలు సాంకేతిక సహాయాన్ని, రక్షణను అందిస్తున్నాయి. అటువంటి నైపుణ్య భారత్ సైన్యాన్ని దశలవారీగా వెన్నక్కు వెళ్ళాలి అని హుకుం జారీచేసి తన అయిష్టతను వెల్లడించాడు. గతంలో ఏ అధ్యక్షుడు ఈ విధంగా వ్యవహరించలేదు. మయుజ్జ భారత్ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, దీని వెనుక ఎవరు ఉన్నారో భారత్ కు అవగతం అయింది.

- Advertisement -

లక్షదీవులను భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించి, లక్షదీవుల అందాన్ని, అక్కడి దీవుల సముదాయన్ని కొనియాడుతూ భారత్ పర్యాటకులకు ఓ సందేశం ఇచ్చారు. లక్ష దీవులు భారత్ లో అత్యంత సుందర దీవులని, మాల్ దీవులకంటే ఉన్నతమైనవి, లక్షదీవులను ప్రతివారు సందర్శించాలని అంటే, అదేదో పెద్దనెపం అన్న ధోరణిలో, మా దీవులకు గండి పడుతుందని, పర్యాటకులు రారు అని మాల్దీవుల మంత్రులు భారత ప్రధానిని అనుచితంగా విమర్శించారు. ఈ విమర్శను భారత్ పౌరులు సహించ లేకపోయారు. “మా దేశం, మా దీవులు, మా అందం ” అని లక్షదీవులను పొగడితే వారికి వచ్చిన నష్టం ఏమిటో, దీనికి తగిన మూల్యమే మాల్దీవులు చెల్లించుకున్నాయి. భారత్ ప్రధానిని విమర్శించినందుకు, భారత్ పౌరులు మాల్దీవుల పట్ల అయిష్టతను పెంచుకున్నారు. వారికి పర్యాటక ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అందు నిమిత్తమే మయుజ్జ ప్రభుత్వం, భారత్ పట్ల ఎప్పుడూ లేనివిధంగా ప్రవర్తించింది. ఈ దిశలోనే ఆయన చైనా సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా పట్ల స్నేహాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ఈ విషయంపై అక్కడి పార్లమెంట్ లో కూడా మా యుజ్జాపై విమర్శలు చేశారు. అందుకు మయూజ్జా తగ్గక మా భూభాగంలో ఉన్న భారత్ సైన్యలు పూర్తిగా మే 10 వ తేదీ నాటికి వెళ్ళాలి అని చెప్పడం, మా దేశ సార్వ బౌమత్వంను రక్షించుకునే సామర్థ్యం మాకు ఉంది అని ప్రకటించడం, అందుకు ఇతర దేశాలతో దౌత్య చర్చలు జరుపుతున్నామని ప్రకటించారు. మాల్దీవులలో, అక్కడి రక్షణ వ్యవస్థకు భంగం కలుగరాదు అనే విషయంపైన మాల్దీవులు కోరితేనే భారత్ సైన్యం అక్కడ ఉంది కానీ వాటిపై అధికారం చెలాయించాలి అనే కోరిక భారత్ కు ఏనాడూ లేదు. ఇతర దేశాల సార్వభౌమాత్వాన్ని కాపాడుంటే భారత్ విదేశాంగ లక్షణమని అందరికీ తెలుసు. మాయుజ్జా భారత్ స్నేహాన్ని వీడి, చైనా పంచన చేరడం, చైనా, మాల్దీవులకు సహాయ సహకారాలు, ఆర్ధిక సహాయం అందిస్తుంది అని చెప్పడం, ఆసియాలోనే అతి పెద్దదేశం చైనాతో అంటకాగడం మాల్దీవులకు మేలు అని మయూజ్జా గ్రహించినట్లు ఉన్నారు. అయితే భారత్ ను దూరం చేసుకోవడం అక్కడి ప్రధాన పార్టీలు మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ, ది డెమోక్రటిక్ పార్టీలు సుముఖంగా లేవు. భారత్ మాకు అత్యంత విశ్వనీయ దేశం అని వారి భావన. చైనా ప్రలోబాలకు మయూజ్జా పడ్డారు అని ఆ పార్టీలు విమర్శించాయి. కాని మయూజ్జా చైనాకు అనుకూలంగానే ఉన్నారు. అందుకే భారత్ సైన్యం వెనక్కి వెళ్ళాలి అని ప్రకటించడం వెనుక చైనా హస్తం ఉందని తెలుస్తోంది. ఇటీవల మయూజ్జా ప్రసంగాన్ని కూడా రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. మా దేశంలో ఎవరి పెత్తనం ఉండదు అని మయూజ్జా ప్రకటించడం చైనాను చూసుకొనే. ఎన్నో కష్టకాలాలలో భారత్ చేసిన సాయాన్ని మాల్దీవుల ప్రస్తుత అధ్యకుడు మయూజ్జా మరిచారు. ఇతను చైనాకు పూర్తిగా బద్దుడై మసులుతున్నాడు.
… కనుమ ఎల్లారెడ్డి,
ఆస్టిన్, టెక్సస్ స్టేట్,
అమెరికా, 93915 23027.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News