Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Medical college: ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు, లోపాలు

Medical college: ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపుల్లో తీవ్ర అసమానతలు, లోపాలు

దీనికంతటికీ కారణం అనంతరామన్‌ కమిటీ సూచనలే

‘వైద్యుడు దేవుడితో సమానం’గా భావించడం వలన ఇంటర్‌ తర్వాత ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాలని లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు. వైద్య విద్య అభ్యసించడం ద్వారా జీవితంలో స్థిరపడి ఉన్నతంగా జీవించవచ్చు అనే భావన ఉంది. ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందాలంటే విద్యార్థి అహర్నిశలు శ్రమించి చదవాల్సి ఉంటుంది అంతే కాక లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ విద్యతో పాటు నీట్‌ పరీక్షకు శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఒక్క ర్యాంకుతో సీట్‌ కోల్పోయిన విద్యార్థి, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు, ఒత్తిడికి గురి అవు తుంటారు.
ఆయా వర్గాలకు, కులాలకు విద్య, ఉద్యోగాలలో సమన్యాయం జరగడానికి ఆర్టికల్‌ 15 (4), 16(4)లు రాజ్యాంగంలోకి చేర్చబడ్డాయి. వెనకబడిన కులాలకు సమ న్యాయం జరగాలని అనంతరామన్‌ కమిటీ 1970 రిపోర్ట్‌ ఆధారంగా వారి వారి స్థాయిని బట్టి గ్రూప్‌ ఏ, బీ, సీ, డీల వర్గీకరణ జరిపి జనాభా దామాషాలో రిజర్వేషన్‌ శాతాన్ని నిర్ణయించారు. ఆనాటి పరిస్థితుల ప్రభావం కారణంగా కమిటీ చేసిన తప్పుల ఫలితంగా నిర్ణయించబడిన రిజర్వే షన్లు వెనుకబడిన కులాల మధ్య తీవ్ర అసమానతలు పెం చాయి. అనడానికి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌లో సీట్ల కేటా యింపును ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల కాలంలో ఎమ్‌ బీబీఎస్‌ సీట్ల సంఖ్య 2850 నుండి 8340కు, మెడికల్‌ పీజీ సీట్ల సంఖ్య 1183 నుండి 2716కు పెరిగాయి. పెరిగిన సీట్లు మరింత అసమానతలను పెంచుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మెడికల్‌ కౌన్సిలింగ్‌లో నీట్‌ 2021కు గాను 3038 ఎంబిబిఎస్‌ సీట్ల కేటాయింపును పరిశీలిస్తే రిజర్వేషన్ల పరంగా బీసీ ఏ, బిసి డీల రిజర్వేషన్లు 7 శాతంగా ఉన్నప్పటికీ బీసీ ఏ గ్రూప్‌కు 246, బీసీ డి గ్రూప్‌కు 400 సీట్లు కేటాయించడం జరిగింది.
అలాగే ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ, బీసీ బీ గ్రూప్‌లకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ ఈడబ్ల్యూఎస్‌కు 196, ఎస్టీ లకు 223, బీసీ బి గ్రూప్‌కు 556 సీట్లు కేటాయించడం జరిగింది. రిజర్వేషన్ల శాతం ఒకే రకంగా ఉన్నప్పటికీ కేటా యించిన సీట్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉండడం గమనించవచ్చు. అలాగే సీటు పొందిన గరిష్ట ర్యాంకును పరిశీలిస్తే బీసీ ఏ గ్రూప్‌కు సీట్ల కేటాయింపులు తక్కువగా ఉన్నప్పటికీ మెడికల్‌ కాలేజీలో సీటు పొందిన గరిష్ట ర్యాంకు 1,96,244 కాగా బీసీ డీ గ్రూప్‌కు 154 సీట్లు అదనంగా ఉన్నప్పటికి సీట్‌ పొందిన గరిష్ట ర్యాంక్‌ 1,11,715గా ఉంది. అలాగే నీట్‌ 2022లో బీసీ ఏ కంటే బీసీ డీ గ్రూప్‌కు 246 సీట్లు అదనంగా ఉన్నప్పటికీ సీట్‌ పొందిన గరిష్ట ర్యాంకులలో తేడా లక్ష వరకు ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ , బీసీ బీ గ్రూప్‌లకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కేటాయించిన సీట్ల సంఖ్యలో తేడా వందల్లో కనబడుతుంది. రిజర్వేషన్ల శాతం ఒకటే అయినా సీట్ల సంఖ్యలో భారీ తేడా ఎందుకు ఉందో అర్థం కాని విషయం.
ఇక డబ్బున్న వారికి మెడికల్‌ కాలేజీలో 9 లక్షల ర్యాంకు ఉన్న కూడా సీటు రావడం చూస్తూ ఉన్నాం. వైద్య పీజీ కోర్సులో 2,544 సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ లోపభూయిష్ట రోస్టర్‌ విధానం వల్ల బీసీ డీ గ్రూప్‌ కులాలకు గత 50 సంవత్సరాలుగా తీవ్రనష్టం జరుగుతూనే ఉంది. నీట్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించినప్పటికీ ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్లో సీట్‌ రాకుంటే విద్యార్థి, వారి తల్లదండ్రులు ఎంతో మానసిక క్షోభకు గురిఅవుతున్నారు. దీనికంతటికీ కారణం అనంతరామన్‌ కమిటీ సూచించిన లోపభూయిస్టంగా ఉన్న గ్రూప్‌ల ఏర్పాటు. బీసీఏ గ్రూప్‌లో 8 శాతం జనాభా ఉండగా ఏడు శాతం రిజర్వేషన్లను బీసీ బి గ్రూపులో 14 శాతం జనాభా ఉండగా 10% రిజర్వేషన్లను బీసీ డీ గ్రూపులో అత్యధికంగా 28 శాతం జనాభా ఉండగా అతి తక్కువ 7 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం, అంతే కాక డీ గ్రూప్‌లో విద్య పరంగా, ఆర్థికంగా సామా జికంగా అభివృద్ధి చెందిన కులాలు ఉండడం ఈ అసమాన తలకు ప్రధాన కారణంగా కనబడుతుంది.
తెలంగాణ సాధించుకొని తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా ఈ అసమాన తలను తొలగించకపోవడం ప్ర భుత్వ వైఫల్యంగా భావించవచ్చు. వెనుకబడిన తరగతు లలో డీ గ్రూపులోని ముదిరాజ్‌, ఆరెకటికే, దర్జీ, ఉప్పర, తమ్మలి, భట్రాజ్‌, యాదవ, వంజరి కులాలకు చెందిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 50 సంవత్స రాలుగా బీసీ డీ గ్రూప్‌లోని 30 కులాల వరకు విద్య, ఉద్యోగాల్లో నష్టం చవిచూస్తున్నప్పటికీ కుల సంఘాలు, బీసీ సంఘాలు రిజర్వేషన్లలోని లోపాలను ఎత్తిచూపి సవ రించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం విస్తు గొలుపుతుంది. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు సరిపడా రిజర్వే షన్లు ఉండగా అగ్రకులాలకు ఈడబ్లుఎస్‌ కింద 10 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇక ముస్లింలు ఈడబ్లూఎస్‌, బీసీ ఈ గ్రూప్‌, బీసీ బీ గ్రూప్‌ ద్వార రిజర్వేషన్లు పొంద డమే కాక ప్రత్యేక మైనారిటీ స్కూల్స్‌, కళాశాలలు, వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలలు విద్యనందిస్తున్నాయి.
జనాభాలో 14% గా ఉండి ఆధిమ తెగగా, విముక్త జాతిగా పరిగణించబడే ముదిరాజులను బీసీఏలో చేర్చా లనే (జీఓ 15/2009 అమలు) సమస్య గత 12 సంవత్స రాలుగా సుప్రీంకోర్టులో నలిగి తిరిగి రాష్ట్ర బీసీ కమిషన్‌ పరిధిలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగి స్తుంది. ముదిరాజులను బీసీ ఏలో చేరుస్తూ రిజర్వేషన్ల శాతాన్ని (2 లేదా 3 శాతం) పెంచితే అసమానతలు తగ్గే అవకాశం ఉంటుంది. బీసీ డి గ్రూప్‌ కులాలకూ ఊరట లభిస్తుంది.దీనిద్వారా 90% వెనుకబడిన తరగతుల వారి కి సమన్యాయం జరుగుతుంది. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేసి న ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోక పోవడం, కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ జడ్జి ఉండాల్సిన స్థానం లో రాజకీయ నాయకులను పెట్టడం వెనకున్న మర్మమే మిటో తెలియనిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి లోపాలను సవరించి అసమానతలను తొలగిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -


అల్లాదుర్గం సురేష్‌
సామాజిక విశ్లేషకులు

  • 9885674402
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News