Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Money lenders sucking poor: పేదల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు

Money lenders sucking poor: పేదల నడ్డి విరుస్తున్న వడ్డీ వ్యాపారులు

తనఖా పెట్టినవి కాజేసేవరకూ..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలో వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని చౌటుప్పల్, సంస్ధాన్ నారాయణపురం, పోచంపల్లి, ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆశ్రయించి అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వారం, పది రోజులకు ఒక లెక్క, నెల దాటితే మరో లెక్క పది రూపాయలకు పైనే వడ్డీ వసూళ్లు, డబ్బులు ఇవ్వడానికి బైక్ లను ,కారులను, ఇల్లు పత్రాలు, ప్లాట్ డాక్యుమెంట్స్ తనఖా పెట్టుకుంటారు. ఇష్టం వచ్చినట్టు వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రజల అవసరాల నిమిత్తం వడ్డి వ్యాపాలను ఆశ్రయిస్తే జలగల్ల పీక్కు తినేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు ప్రజల నడ్డి విరుస్తున్నారు. వడ్డీ వ్యాపారుల చేతిలో చిక్కుకున్న సామాన్య మధ్యతరగతి , చిరు ఉద్యోగులు విలవిలలాడిపోతున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుని వడ్డీల పై వడ్డీలు వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. అధిక వడ్డీకి మాత్రమే డబ్బు అప్పుగా ఇస్తామని నిబంధనలు పెడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు వాటికి కూడా అంగీకరించి డబ్బులు తీసుకుంటున్న పరిస్థితి. చౌటుప్పల్ డివిజన్ లో జోరుగా సాగుతున్న వడ్డీ వ్యాపారం. పేద, మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఫైనాన్స్ సంస్థలను,వడ్డీ వ్యాపారులకు ఆశ్రయిస్తాయి. మోటార్ సైకిల్ ,కారు పేపర్లు కుదోపెట్టి ఫైనాన్స్ తీసుకుంటే అసలుకు సమానంగా వడ్డీ అయితుంది సమయానికి కట్టకుంటే అదనపు చార్జీలు మొత్తం తీసుకున్న ఫైనాన్స్ అప్పు తీరేలోపు తడిసి మోపెడవుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాలేక రెండు మూడు నెలల కిస్తీలు కట్టకుంటే అప్పుడుంటది ఇగా వారి ఊరికొచ్చి,వారి వాడలో స్నేహితులతో చెప్పి, పరువు తీసే ప్రయత్నం చేస్తారు. ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా వసూలు చేసి తీరుతారు.

- Advertisement -

అదేవిధంగా ప్రజల అవసరాలను గమనించుకొని కొన్ని మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన అప్పును వారం, వారం వసూలు చేసే ప్రయత్నం ఇచ్చిన అప్పు డబ్బులు తీరేవరకు వారం వారం చెల్లించాలనె నిబంధనలు పెట్టి నానా ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.

వడ్డీ వ్యాపారులు కొంత ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వాలంటే వ్యవసాయ భూములను, ఇండ్లను, ప్లాట్లను మార్ట్ గేజ్ రూపంలో తనఖా పెట్టుకుని అధిక వడ్డీ వసూలు చేస్తున్నావారు ఎందరో.. ఇలా తిరిగి అప్పు చెల్లించలేక కట్టిన డబ్బులన్నీ వడ్డీ కిందికి జమచేసి భూములను, ఇండ్లను, ప్లాట్లను పోగొట్టుకున్న కుటుంబాలు ఎందరో..!

అదేవిధంగా చిరు వ్యాపారస్తులకు డబ్బు అవసర నిమిత్తం వడ్డీ వ్యాపారుల ఆశ్రయిస్తే డైలీ ఫైనాన్స్ రూపంలో ఇచ్చిన డబ్బులు వసూలు చేసే విధానం, అధిక వడ్డీకి మాత్రమే ఇస్తామని ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదనే పద్ధతి. అప్పు ఇచ్చే ముందే కొంత వడ్డీని కట్ చేసుకుని ఇచ్చే పద్ధతి. రోజు సాయంత్రం దుకాణాల దగ్గర వసూలు చేసుకుని వెళ్తారు. చిరు వ్యాపారస్తులు రోజంతా సంపాదించిన డబ్బంతా ఫైనాన్స్ కట్టడానికే సరిపోతుంది. ఇలాంటి చిరు వ్యాపారస్తులకు ప్రభుత్వ బ్యాంకులు రుణాలు ఇస్తే ఇలాంటి వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించే పరిస్థితి వచ్చేది కాదు.

ఇక్కడ ప్రజలు డైలీ ఫైనాన్స్, కొందరు వారానికి ,మరికొందరు నెలకు, తానఖా పెట్టుకొని ముప్పు తిప్పలు పెడుతూ ఇచ్చిన డబ్బు పై, ప్రజల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు.

వాస్తవానికి ఎవరికైనా సరే అన్ని దారులు మూసుకుపోతేనే ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ప్రజల అవసరాలనే ఆసరాగా చేసుకుని నిబంధనలను పక్కన పెట్టి, అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వివిధ సంస్థలపై, వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి సంస్థలను వ్యాపారస్తులను కొంత నియంత్రించకపోతే. దీనివల్ల ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతూ సమాజంలో ఎవరికి చెప్పుకోలేక మనస్సును చంపుకొని ,వాల్లు వేధించే తీరుకు రాత్రుల్లు నిద్రలు రాక బీపీలు,షుగర్ వచ్చి అనారోగ్య పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఎందరో..
అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో దాదాపు వందకు పైగా ఫైనాన్స్ సంస్ధలు మోటార్ సైకిల్, కార్ల ఆర్సీలను, పేపర్లను తనఖా పెట్టుకొని ఫైనాన్స్ ఇస్తారు. ఉదాహరణకు ఇరువై ఐదు వేలు ఫైనాన్స్ తీసుకుంటే ఐదువేలు డాక్యుమెంట్ ఛార్జ్ వేస్తారు.ఆఫీస్ చార్జ్ అని మరో వెయ్యి కలిపి మొత్తం మూఫై ఒక్క వెయ్యి కి ఫైనాన్స్ చేస్తారు. దీనినే కొన్ని నెలల వరకు కట్టుకుంటూ రావాలె. ఒక నెల అటో, ఇటో అయితే అదరపు చార్జీలు.గాచారం బాలేక మూడు నెలలు కిస్తీలు కట్టకుంటే వాహనం గుంజుకుపోతారు, కిస్తీలతోపాటు అదనపు చార్జీలు కడితేనే వాహనం ఇచ్చే పరిస్థితి ఉంటది. కుటుంబ ఆర్దిక పరిస్థితులు, ఆనారోగ్య సమస్యలు ఏవన్నా చెప్పు వాళ్ళకు కనీసం వినను కూడా వినరు కొంత మానవత్వం కూడా ఉండని పరిస్థితి. వడ్డీ మాత్రం చాలా అధికంగా ఉంటుంది.
చౌటుప్పల్ పట్టణంలో ప్రభుత్వ అనుమతులు ఉన్న ఫైనాన్స్ సంస్థలు ఎన్ని ? అనుమతులు లేకుండా కూడా నడిచేవి మరెన్నో ?

ఇలాంటి ఫైనాన్స్ సంస్థ దగ్గర వడ్డీ, వ్యాపార దగ్గర డబ్బులు తీసుకుంటే డబ్బులు ఇచ్చే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి కుటుంబంలో జరిగిన పరిణామాలు, శుభకార్యాలు, కీడు దినాలు, ఇవన్నీ అవసరం లేదు వారికి, ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తేనే మంచిది లేకుంటే బజారుకీడుస్తామని బెదిరింపులు ఇజ్జత్ కి ఉన్న బంగారమో, భూమినో అమ్మి కట్టిన, అప్పు తీరని పరిస్థితి. అప్పు మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ తడిసి మోపెడు చేసి మెడకు రుద్దే పరిస్థితి.

ఇలాంటి ఫైనాన్స్ సంస్థలు,వడ్డీ వ్యాపారుల ఊబిలో చిక్కుకున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత అండగా ఉండాలి అధికారులు. అందరూ బయటికి చెప్పుకునే పరిస్థితులు ఉండవు కాబట్టి అధికారులు వడ్డీ వ్యాపారులపై నిఘా పెట్టండి చౌటుప్పల్ లో ఉన్న ఫైనాన్స్ సంస్థలు అనుమతులను పరిశీలించండి వాళ్ళ దగ్గర ఉన్న వాహనాల పూర్తి వివరాలను సేకరించండి ఇలాంటి వ్యాపారాలను కట్టడి చేసి.పేద, మధ్యతరగతి కుటుంబాలను కాపాడాలని కోరుకుంటున్నారు ఇక్కడి ప్రజలు.

గుండమల్ల సతీష్ కుమార్.
9493155522.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News