Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Mother: చీపురుకు చోటు, పండుటాకులకు చేటు

Mother: చీపురుకు చోటు, పండుటాకులకు చేటు

మానవ జన్మ ఒక వరం. ఆ జన్మనిచ్చిన తల్లి దండ్రుల బాగోగులు చూసుకోవడం కనీస బాధ్యత. అప్పుడే ఆ జన్మకు సార్థకత. ఇలా కుటుంబ పరంగా, వృత్తిపరంగా, సమాజపరంగా ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరి బాధ్యతలను వారు సక్రమం గా నిర్వహిస్తే, సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు సంఘ జీవియైన మనం సమాజం కోసం సామాజిక బాధ్యతలను విస్మరించరాదనే ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి. కాదు కూడదంటే? రేపటి సమాజం ఏమైపోవాలి? మీ పిల్లలు మీ ప్రవర్తనను చూస్తు న్నారనే సోయితో మెదలండి.. తమ కన్న పిల్లల్ని చూసు కుంటున్నట్లే మా కన్న పిల్లలు మమ్మల్ని చూసుకోవాలని కోరుకోవడం ధర్మమే కదా! తల్లిదండ్రులు తమ కన్నబిడ్డల కోసం చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టి పెంచి పెద్ద చేసి, ప్రయోజకులను చేయడానికి ఎంతో కష్టపడతారు. అలాం టి వారికి ప్రేమను పంచాల్సిన వారే నిరాదరణకు గురి చేస్తూ ఒంటరిగా వదిలేస్తున్నారు. ఆస్తులు పంచుకొని కొం దరు, బతుకుదెరువు కోసమని ఇంకొందరు రెక్కలు వచ్చాక వృద్ద తల్లిదండ్రులను, కుటుంబ పెద్దలను గాలికి వదిలేస్తుం డడంతో ఆ పెద్ద మనస్సులు కక్కలేక మింగలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్ళు చెమ్మగిల్లి చిన్నపోతున్నారు. గుండెల్లో పెట్టు కొని చూడాల్సిన వారసులు నిర్లక్ష్యంగా, అమానవీయంగా వదిలేస్తుంటే? కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుం దని భరించలేని మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తుల కోసం గొడవ పడుతున్నారు కానీ వారికి పట్టెడన్నం పెట్టు టకు వంతుల పేరిట వేధిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడే వారికి కనీసం మందులు కూడా ఇవ్వని వారు కొంద రైతే, సూటిపోటి మాటలతో వేధిస్తున్న వారు ఇంకొందరు. కొన్ని సందర్భాల్లో చేయి చేసుకుంటున్న వారూ ఉన్నారు. ఇంకొందరు అమానవీయంగా అవసరమైతే కర్కశంగా చంపేసేందుకు కూడా వెనకాడడం లేదు.! వృద్ధ తల్లిదం డ్రుల్లో ఎవరైనా ఒకరు చనిపోయి ఒంటరిగా ఉన్న వృద్దులు ఏ కవికి- రవికి, ఇంటలిజెన్స్‌ కూడా అందనంత స్థాయిలో జీవితాలను మరీ ఘోరంగా, దారుణంగా నెట్టు కొస్తున్నారు. ఇలాంటి బాధలను బయటకు చెప్పుకోలేని వారు కొందరైతే, మరికొందరు సహాయం కోసం పోలీస్‌ స్టేషన్లు, వృద్ధుల సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తున్నారు.
ప్రధానంగా ఆస్తుల పంపకాల్లో అసంతృప్తులే తల్లిదం డ్రులపై వేధింపులకు కారణంగా కనిపిస్తున్నాయి. వృద్ధుల సహాయ కేంద్రానికి వస్తున్న ఫోన్‌ కాల్స్‌ లో 80 శాతం వరకు ఇలాంటివేనని తెలుస్తుంది. నిరాదరణ కారణంగా ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడుతున్న వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడం బాధాకరం. దీనికి నివారణ మార్గాలను కుటుంబం, సమాజం, పాలకులు వెతకాల్సి ఉంది. కుటుంబ వ్యవస్థ, విలువల్ని పలువురు పట్టించుకోవడం లేదు. స్వతంత్ర జీవనశైలికి అలవాటుపడి తల్లిదండ్రులను దూరం పెడుతున్నారు. వృద్దుల జీవిత చివరి దశలో చీత్కా రాలకు తోడుగా వంతుల వారి బాగోగుల పేరిట వేధిం పులే? ‘ఆస్తులు కావాలి..తల్లిదండ్రులు వద్దు’. అనే ఇలాంటి వేధింపుల నిరోధానికి అత్యవసర పరిస్థితుల్లో సత్వర సహాయం కోసం 2020 అక్టోబర్లో ప్రభుత్వం వృద్ధుల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14567ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ కేంద్రానికి ఏటా 35 వేలకు పైగా ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని తెలు స్తుంది. ఫిర్యాదును నమోదు చేస్తున్న వృద్ధులకు సంక్షేమ శాఖ క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి సహాయం అందిస్తుంది. ఆపదలో ఉన్న వారికి రక్షణతో పాటు న్యాయ సహాయం చేస్తుంది. తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకుంటే వారి సంతానం నుండి మెయింటెనెన్స్‌ డబ్బులు వచ్చేలా చేయవచ్చు. అంతేకాదు ఇచ్చిన ఆస్తు లను వెనక్కి తీసుకునే హక్కులు కూడా ఉన్నాయని తెలుసు కోవాల్సి ఉంది. వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకో వలసిన కనీస బాధ్యతను నిర్వహించాల్సిన కుటుంబ వ్యవస్థ, విలువల్ని ఇటు ఇళ్లలోనూ, విద్యాలయాలలోను విధిగా పాఠ్యాంశంగా బోధించాల్సిన పరిస్థితులు కనిపిస్తు న్నాయి. ఎల్డర్లీ లైన్‌ కాల్‌ సెంటర్‌ కు రోజుకు 20 నుంచి 40 కాల్స్‌ వస్తున్నాయంటేనే పరిస్థితి ఎంత అమానవీయంగా ఉందో అర్థమవుతుంది. దీనిలో మాట్లాడి బాధలు పంచుకుంటున్నారు. అలాంటి వారితో మాట్లాడి మానసికంగా ఉపశమనం పొందుతుంటారు. కేసుల తీవ్రతను బట్టి వెంటనే అప్రమత్తమై ఎఫ్‌ఆర్‌ఓ పోలీసు సహకారంతో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ చేసి చట్టంలోని సెక్షన్లు, శిక్షలు వివరిస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆశ్ర మానికి చేర్చాలంటే అక్కడికి తరలిస్తారు. ఇలా నెలకు దాదాపు 15 నుంచి 20 మంది వరకు వృద్ధులను ఆశ్రమాలకు పంపిస్తున్నారని తెలుస్తుంది. ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి.. వేధింపులు, పునరావాసం: 2020-21/ 459, 2021-22 /1186, 2022-23/ 1424.అలాగే పింఛన్లు, న్యాయ సహాయం కోసం:2020-21/564, 2021-22 /1161, 2022-23/ 1129. భావోద్వేగ సమస్యలు: 2020-21/41, 2021-22/ 57, 2022-23/ 36. కరోనా సహాయం:2020-21/ 177, 2021- 22/ 4407, 2022-23/ 1144. ఇతర సమాచారం: 2020-21/ 1078, 2021-22/ 2247, 2022-23/1024. ఇలా ఉంది. మరికొందరు మానసికంగా, భౌతికంగా, అనారోగ్యంగా, వయోభారంతో తమ పనులు తాము చేసుకోలేని దీన స్థితిలో ఉండి ఒక మనిషి పై ఆధారపడి కాలం వెళ్ళదీసేవారు అభద్రతతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వీరి బాధ్యతలు పంచుకోవలిసినవారు నిర్లక్ష్యం చేస్తుంటే కూడా ఫిర్యాదు చేయలేక బంధాల నడుమ కృషించిపోతున్నారు. ఆత్మీయ స్పర్శతో కాసేపు గడపాలని వీరు ఆశించడం నేరమా! అవకాశం ఇవ్వకూడదా.. ఇది కనీస బాధ్యత కాదా! సమాజమా.. నిలదీయలేని వారి స్థితి గమనించి మానవీయతను చాటండి అని ప్రాధేయపడుతున్నారు.
మనిషిగా పుట్టినందుకు ఆస్తి పాస్తులు సంపాదించడమే గొప్పతనం కాదు? మనిషి నడవడికతోనే అంటే.. సామాజిక స్పృహ, మానవీయ కోణం పైనే తన గొప్పతనం ఆధారపడి ఉంటుంది. ఇంట్లో కనిష్ట వస్తువైన చీపురుకు ఇంట్లో ఓ మూలన చోటిస్తున్నారు. అంతేకాదు ఇంటికి కాపలా కాసే కుక్కకు బుక్కెడు అన్నం పెడుతూ, ధనవంతులైతే ఖరీదైన పెడిగ్రీ ఆహారంతో పాటు స్నానాలు చేయిస్తూ దాన్ని డాక్టర్లకు చూపిస్తున్నారు. ఆ కుక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నారు. మీ కోసం పంచప్రాణాలు పణంగా పెట్టి జీవితాంతం విలువైన కాలాన్ని సంతానం కోసం ధారపోసిన వృద్ధ తల్లిదండ్రులకు ఇంట్లో చోటు లేకుండా చేసి వృద్ధాశ్రమాలకు తరలించడం అమాన వీయం కాదా!. పండుటాకులనే నిర్లక్ష్యం వీడండి. ఏదో ఒక రోజు మనం ఆ దశకు చేరుకోవాల్సిందే. మనకూ అనారోగ్యం వస్తుంది, అనారోగ్యం రాకుండా ఎవ్వరు తప్పించు కోలేరు. వెనకో, ముందో.. ప్రతి ఒక్కరిని మృత్యువు కబళి స్తుంది. దాన్ని తప్పించుకోలేం.. మరి ఎందుకయ్యా ఆ మిడిసి పాటు.. అహంకారాన్ని, సంపాదన మీదున్న దురాశను వీడండి. వృద్ధులను- వృద్ధాప్యాన్ని ప్రేమతో పలకరిస్తూ సేవ చేసి మీ బాధ్యతలను నెరవేర్చండి. సమాజం, పాలకులు వృద్ధాశ్రమాలు లేని సమాజం ఏర్పడేలా చూడాల్సి ఉంది.
మేకిరి దామోదర్‌
సామాజిక విశ్లేషకులు

  • 9573666650
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News