Saturday, October 12, 2024
Homeఓపన్ పేజ్New virus Mpox in India: కొత్త వైరస్‌తో దేశం అప్రమత్తం

New virus Mpox in India: కొత్త వైరస్‌తో దేశం అప్రమత్తం

ఇండియాలో ఎంపాక్స్..

దేశంలోకి మరో కొత్త వైరస్‌ ప్రవేశించింది. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఎంపాక్స్‌ అనే అంటువ్యాధి లక్షణాలు కనిపించడంతో ధేశం అప్రమత్తం అయింది. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ మహమ్మారి నిరోధనానికి, నివారణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఎంపాక్స్‌ అనే ఈ వైరస్‌ లక్షణాలు కనిపించిన ఈ ప్రయాణికుడిని వెంటనే దూర ప్రాంతానికి తీసుకు వెళ్లి చికిత్స ప్రారంభించడం జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ వ్యాధి ఏ దేశం నుంచి వచ్చిందో, ఏ వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయో ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించకపోయి ఉండవచ్చు. అతని పరిస్థితి నిలకడగా ఉండని మాత్రం ప్రభుత్వం ఆ తర్వాత ప్రకటించింది. ఆ ప్రయాణికుడు హర్యానాకు చెందినవాడని, అతనికి ఢిల్లీలో చికిత్సను అందిస్తున్నారని కొన్ని పత్రికలు బయటపెట్టడం జరిగింది. అయితే, ప్రభుత్వం లేదా అధికారులు ఇటువంటి విషయాల్లో దాపరికంతో వ్యవహరించకుండా ప్రజలకు దీని వివరాలను తెలియజేయడమే మంచిది. ప్రజారోగ్యానికి సంబంధించిన విషయాల్లో ప్రభు త్వాలు పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ప్రజలకు కీడుకన్నా మేలే ఎక్కువగా జరుగుతుంది. ప్రభుత్వం వెల్లడించని పక్షంలో వదంతులు, దుష్ప్రచారాలు ఎక్కువగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది.
ఆ ప్రయాణికుడు ఎవరెవరిని కలుసుకున్నదీ, ఎక్కడి నుంచి వచ్చిందీ తదితర వివరాలన్నీ సేకరించామని, అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఇది దేశమంతా వ్యాపించే అవకాశాలు లేవని కూడా స్పష్టం చేశారు. ఈ ఎంపాక్స్‌ వైరస్‌ అనేక ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే వ్యాపిస్తున్నందువల్ల గత నెల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం జరిగింది. ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర స్థితిని కూడా ప్రకటించింది. ఈ ఎంపాక్స్‌ వైరస్‌ గాలి నుంచి, నీటి నుంచి సంక్రమించే మహమ్మారి కాదు. ఇది శారీరక సంబంధాల వల్ల, సన్నిహితంగా మెలగడం వల్ల వ్యాప్తి చెందడం జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికా దేశాల్లో పుట్టి పెరిగి, చుట్టుపక్కల అనేక దేశాలకు వ్యాపించిన ఈ వైరస్‌ కొద్ది రోజుల క్రితం ఒక ఐరోపా దేశంలో కూడా కనిపించింది.
ఇది పేద దేశాలకు మాత్రమే పరిమితమని భావించిన అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలు దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అయితే, పాశ్చాత్య దేశాలలో ఈ వ్యాధి నివారణకు అవసర మైన వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పటికీ, దాన్ని ఆఫ్రికా దేశాలకు పంపించే ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఇది ఐరోపా దేశాల్లో కూడా కనిపించడం ప్రారంభించే సరికి పాశ్చాత్య దేశాలు దీనిని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు రవాణా చేయడం మొదలుపెట్టాయి. పెరుగుతున్న డిమాండుకు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రపంచ దేశాల మధ్య ప్రయాణాలు, పర్య టనలు, సంపర్కాలు ఎక్కువవుతుండడంతో అంటువ్యాధులు, మహమ్మారులు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. వీటిని మొదట్లోనే తుంచేయాలి తప్ప నిర్లక్ష్యం చేయడం శ్రేయస్కరం కాదు. 2022 జనవరి, 2024 ఆగస్టులకు మధ్య 120 దేశాల్లో లక్ష మందికి పైగా ప్రజలకు ఎంపాక్స్‌ సోకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
భారతదేశం విషయానికి వస్తే, దేశంలో వ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థలన్నీ అప్రమత్తంగా ఉన్నా యని, అవి పూర్తి కాలం చైతన్యవంతంగా పూర్తి చేస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియ జేసింది. ఆరోగ్య సంరక్షకులు, ఆరోగ్య కార్యకర్తల్లో ఈ వ్యాధికి సంబంధించిన అవగాహన కల్పిం చాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. అంటువ్యాధులు, వైరస్‌ లు, మహ మ్మారులకు సంబంధించిన చరిత్ర కలిగిన దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికులందరి మీదా నిఘా పెట్టి ఉంచాలని, ముఖ్యంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తి స్థాయిలో పర్య వేక్షణ ఉండాలని గత నెలే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించినా, ఈ లక్షణాలున్నట్టు అనుమానం కలిగినా అటువంటి వ్యక్తులను వెంటనే వేరు చేసి, చికిత్సాలయాలకు తీసుకు వెళ్లాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇంత వరకూ దేశంలో ఒక్క కేసే కనిపించినప్పటికీ, నిఘా, పర్యవేక్షణలను భారీగా పెంచాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News