Saturday, November 15, 2025
Homeఓపన్ పేజ్Social Justice : ముస్లింల రిజర్వేషన్లు... మత రాజకీయాల వలయంలో సామాజిక న్యాయం!

Social Justice : ముస్లింల రిజర్వేషన్లు… మత రాజకీయాల వలయంలో సామాజిక న్యాయం!

Social Justice for Muslims : 75 ఏళ్ల స్వాతంత్రానంతరం కూడా ముస్లింలను మైనార్టీగా, పరాయి దేశస్థులుగా, పరాయి మతస్తులు గా, ఓటు బ్యాంకులుగా, బుజ్జగింపు రాజకీయాల లబ్ధిదారులుగా, మత ఛాందసవాదులుగా ముద్రలు వేసి ఏదో రూపంలో వారిని ప్రధాన స్రవంతికి దూరం పెడుతున్నారు. ఇక భారతదేశంలో ముస్లింల జనాభా 17.2 కోట్లు. ఇది స్పెయిన్‌, బ్రిటన్‌, ఇటలీ దేశాల జనాభాకు సమానమే. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ముస్లిం జనాభా భారత్‌లోనే ఉంది. సున్నీలు, షియా లు, బోహ్రాలు, అహ్మదియా వంటి మతపరమైన శాఖ లతో పాటు, అష్రఫ్‌, అజ్లాఫ్‌, అర్జాల్‌ వంటి సామాజిక వర్గాలుగా భారతీయ ముస్లింలు చీలిపోయి ఉన్నారు. భాష, ప్రాంతం, జీవనశైలిపరంగా కూడా ఈ సమా జం విభిన్నంగా కనిపిస్తుంది. తమిళనాడు ముస్లింలు తమిళం మాట్లాడితే, కేరళలో మలయాళం, ఉత్తరాది లో ఉర్దూ, అలాగే భోజ్‌పురి, తెలుగు, గుజరాతీ, మరాఠీ, బంగ్లా వంటివి మాట్లాడేవారు కూడా ఉన్నా రు. భారతీయ ముస్లింలు ప్రజాస్వామ్యాన్ని నమ్ము తారు. రాజ్యాంగ హామీలపై గర్వపడతారు. కానీ వాస్త వికంగా చూస్తే, ముస్లింలపై వివక్ష ఒక రోజు రెండు రోజుల్లో ప్రారంభమైంది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా మును పటి ప్రభుత్వా లు ముస్లింలను ఓటు బ్యాంకుగా చూసి నా, అభివృ ద్ధికి పెద్దగా దోహదం చేయలేదు.

- Advertisement -

2006లో వచ్చిన సచార్‌ కమిటీ రిపోర్టు భారత ముస్లింల స్థితిగతులపై దృష్టి సారించిందంటే అది మొదటిసారి. అక్షరాస్యత 2001లో 59.1%, 2011 లో 68.5% అయినా అది ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే తక్కువే. 6–-14 ఏళ్ల వయసులో 25% ముస్లిం పిల్లలు స్కూలుకు వెళ్లడం లేదు. ఉన్నత విద్యలో ముస్లింల శాతం 2%కే పరిమితం. ప్రభుత్వ ఉద్యోగా ల్లోనూ వారి శాతం అత్యల్పం. దేశ జనాభాలో 13.4% ఉన్నా, ఐఏఎస్లో 3%, ఐఎఫ్‌ఎస్లో 1.8%, ఐపీఎస్లో 4% లోపే ఉన్నారు. సగటు తలసరి ఆదా యంలోనూ ముస్లింలు దేశ సగటుకన్నా తక్కువగానే ఉన్నారు.

2013లో ఏర్పాటైన కుండూ కమిటీ కూడా, సచార్‌ నివేదికలతో పోలిస్తే పరిస్థితుల్లో మెరుగుదల ఏమీ లేదని స్పష్టంగా తెలిపింది. ముస్లింలలో పేద రికం అధికం, ఆదాయ వినియోగాల్లో దళితుల తరు వాత స్థానం వారిదే. మైనారిటీల అభివృద్ధి భద్రతపైనే ఆధారపడి ఉండాలని కమిటీ పేర్కొంది. 2014లో ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు ముస్లింల అభివృద్ధి గురించి కాదు, వారి భద్రత గురించి చర్చ సాగుతుంది. విద్వేష పూరిత నేరాలు పెరిగాయి. కొట్టి చంపడం, వీడియో లు తీసి ప్రచారం చేయడం వంటి ఘటనలు తారాస్థా యికి చేరాయి. మతపరమైన చట్టాలు, ఉదాహరణకు 2019 పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా, ముస్లింలను ప్రత్యక్షంగా దూరంగా ఉంచే ప్రయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో, ముస్లింల హక్కులను కాపాడే విషయం లో రాజ్యాంగమే చివరి ఆశ. కానీ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, నిష్పక్ష మీడియా వంటి వ్యవస్థలు బలహీనపడితే, మైనారిటీల హక్కులు ప్రమాదంలో పడతాయి. భారతదేశ భవిష్యత్‌ ప్రజాస్వామ్య పరిరక్ష ణకు ముస్లింల అభివృద్ధి అత్యంత కీలకం. రాజకీయా లు, సామాజిక న్యాయం అంటే కేవలం ఒక నినాదం కాదు. అది మన దేశ రాజ్యాంగ స్ఫూర్తిలోని ప్రాణసూ త్రం. మన దేశం స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచీ బలహీన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి, సామాజికంగా అణగారిపోయిన వారికి న్యాయం జరిగేలా రిజర్వేషన్ల విధానం కొనసాగుతుంది. అయి తే ఈ ప్రక్రియలో ముస్లింల పట్ల కనిపించే వివక్ష ఆత్మ విమర్శకు తావిస్తుంది. ముస్లింలు భారతీయులు కాద న్నట్టు, వారికోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనుకో వడం దేశద్రోహం అన్నట్టు మతవాద శక్తులు ప్రచారం చేయడం తీవ్రమైన సమస్య. రాజ్యాంగం లోని ఆర్టిక ల్స్​‍ 15(4), 16(4) వంటి విభాగాలు, సామాజికంగా, విద్యాపరంగా వెనుక బడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వానికి అధికారం ఇస్తాయి. అనగా, ఇది మతం ఆధారంగా కాదు – వెనుకబడిన స్థితి ఆధారంగా ఉంటుంది. మండల్‌ కమీషన్‌, సచార్‌ కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమీషన్‌ వంటి అధ్యయనాలన్నీ ముస్లింలలో అనేక సామాజిక- ఆర్థిక వెనుకబాటును స్పష్టంగా చూపాయి. కొంత మంది ముస్లింలు ఒక వర్గంగా ఓబీసీ జాబితాలో ఉన్నప్పటికీ, మొత్తం సముదాయానికి రిజర్వేషన్‌ అందడం జరగలేదు.

ముస్లింల ఆర్థిక స్థితి: సచార్‌ కమిటీ పరిశీలన : 2006లో విడుదలైన సచార్‌ కమిటీ నివేదిక ప్రకారం, ముస్లింల విద్యార్హత స్థాయి దళితుల కన్నా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింల శాతం 3% లోపే. బ్యాంకింగ్‌, సివిల్‌ సర్వీసులు, పోలీస్, ఆర్మీ రంగాల్లో ముస్లింల ప్రతినిధిత్వం దాదాపు శూన్యం. ముస్లింలు నివసించే ప్రాంతాల్లో విద్యా, ఆరోగ్య, శానిటేషన్‌ సేవలు చాలా అధమ స్థాయిలో ఉన్నాయి. ఈ విషయాలు చూస్తే ముస్లింలకు రిజర్వేషన్లు మతం కోసం కావాలని కాదు; వారి ఆర్థిక, విద్యా వెనుక బాటు కారణంగా అవసరం అనే విషయం స్పష్టమవు తుంది. భారతదేశం లౌకిక రాజ్యం. కానీ కొన్ని మత పరమైన భావజాలాలు సమాజాన్ని ధ్రువీకరించేం దుకు మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నా యి. ఈ మతవాదులు ముస్లింలపై రిజర్వేషన్లను వ్యతి రేకించడాన్ని న్యాయంగా చూపించేందుకు “రాజ్యాం గం మతరహితంగా ఉండాలి” అనే మాటను వక్రీకరిం చుకుంటారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో క్రైస్తవ, ము స్లిం, బౌద్ధ పూర్వజన్ములు సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించి ఓబీసీ జాబితాలో చేర్చారు. తమిళనా డు, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, రాజ స్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అస్సాం, బీహార్‌, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ముస్లింలకు 4% వరకు రిజర్వేషన్‌ ఉంది. దీనికి న్యాయాధి కారత కూడా ఉంది. అయితే, హిందూ మతానికి చెందినవా రికి మాత్రమే రిజర్వేషన్‌ ఉండాలన్న భావన స్తబ్ధతతో కూడినది. ఇది రాజ్యాంగ విరుద్ధం. రిజర్వేషన్లను మతపరంగా చిత్రీకరించాలనేదే అసలు కుట్ర. రిజర్వే షన్‌ విషయంలో మతపరమైన రాజకీయాలు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ముస్లింలను శాశ్వతం గా శత్రువులుగా చూపించడం, ఓటు బ్యాంక్‌ రాజకీ యాల కోసం ఒక వర్గాన్ని నేరస్థులుగా, జిహాదీగా చిత్రీకరిస్తూ పక్కదారి పట్టించడం, రాజ్యాంగంపై నమ్మకాన్ని నాశనం చేయడం, ముస్లింలకు రిజర్వేషన్‌ ఇవ్వడం మతానికి విరుద్ధంగా అనిపించేలా ప్రచారం చేసి, సామాజిక మైనారిటీలను తిరస్కరించే వాతావర ణం కల్పించడం. దళిత, వెనుకబడిన వర్గాలను ముస్లింలకు వ్యతిరేకంగా మలచడం, “మీ రిజర్వేషన్‌ ముస్లింల వల్ల తగ్గిపోతుంది” అన్న డబ్బింగ్‌తో వర్గాల మధ్య చిచ్చు పెట్టడం పెద్ద ఎత్తున చేస్తున్నది బీజేపీ.

ముస్లింలు భారతీయులు కాదా : ప్రతి ముస్లిం వ్యక్తి భారతీయుడే. సైన్యంలో, సైన్స్​‍ రంగంలో, ఐఏఎస్, ఐపీఎస్లలో, చరిత్రలో దేశానికి చిత్తశుద్ధిగా సేవ చేస్తున్న కొందరు ముస్లింలు ఉన్నారు. ముస్లింలను వేరుగా చూస్తూ, వేరే నిబంధ నలతో చట్టాలు రూపొందిస్తే అదే అసలైన మత పరమైన వైషమ్యం.

ఈ కులాలకు రిజర్వేషన్‌ ఇస్తే తప్పేంటి : అచ్చుకట్టలవాండ్లు, సింగలి, సింగంవాల్లు, అచ్చుపనివాల్లు, అచ్చుకట్టువారు, అచ్చుకట్టువాండ్లు, అత్తరు సాయెబులు, అత్తరోల్లు, ధోబీ ముస్లిం / ధోబీ ముసల్మాన్‌, తురక చాకలి, తులుక్కవన్నన్‌, ముస్లిం రజకలు, ఫకీర్‌, ఫకీర్‌ బుడిబుడికి, ఘంటి ఫకీర్‌, ఘంట ఫకీర్లు, తురక బుడిబుడికి, దర్వేష్‌ ఫకీర్‌, గారడి ముస్లిం, గారడి సాయె బులు, పాములవాండ్లు, కనికట్టు వాల్లు, గారడోల్లు, గారడిగ, గోసంగి ముస్లిం, ఫకీర్సాయెబులు, గుడ్డిఎలుగు వాల్లు, ఎలుగుబంట్ల వాల్లు, ముసల్మాన్‌ కీలు గుర్రా లవాళ్లు, హజామ్‌, నాయి, నాయి ముస్లిం (ముస్లిం మంగలివారు), నవిద్‌, లబ్బి, లబ్బాయి, లబ్బాన్‌, లబ్బ- పకీర్ల, బోరె వాలె, దీర పకీర్లు, బంతల్ల, ఖురేషి, కురేషి / ఖురేషి, కసబ్‌, మరాఠి కసబ్‌, ముస్లిం కటిక, కటిక ముస్లిం, షేక్‌ / షైక్‌, సిద్ది, యాబ, హబ్సి, జసి, తురక కాశ, కక్కుకొట్టే జింక సాయెబులు, చక్కిటకానెవాలె, తెరుగడు, గోంట్లవారు, తిరుగటిగంట్లవారు, రోల్లకు కక్కు కొట్టేవారు, పత్తర్పోడులు, చక్కటకరె, తురక కాశ – ఈ కులాలు ఏమన్నా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఇండస్ట్రీ పరంగా ఎదిగిన కులాలా? ఈ కులాలు బీసీ‘ఈ’లో ఉన్నారు. సుప్రీంకోర్టులోని సివిల్‌ అపీల్‌ క్ర.సం. 2628-2637 / 2010 ఇతర విషయా లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కోర్టు తీర్పుకు లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో రిజర్వే షన్లు కల్పిస్తలేరా? అక్కడ రిజర్వేషన్లు తీసివేశారా? తెలంగాణలో ఎందుకు తీసేయమంటున్నారు? మత ఆధారిత ఎన్నికల కోసమా అంటే తెలంగాణలో హిందూ ముస్లింల కలయిక ఉండకూడదు అని నిర్ణయమా అని ప్రజలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు.

ఉదాహరణ : ఒక దళిత, ముస్లిం బీదరితనం నుంచి పైకి రావాలంటే, అతనికి ఎస్సీ హక్కులు రావు. అదే వ్యక్తి హిందూ ధర్మానికి చెందినవాడైతే మాత్రం ఎస్సీ రిజర్వేషన్‌ లభిస్తుంది. ఇది ఏమి న్యాయం? ఇది మతం ఆధారంగా వంచన కాదా? ముస్లిం రిజర్వేషన్ల వల్ల రాజకీయం చేయడం జరిగింది అన్న వాదన నిజం కాదు. కానీ కొన్ని పార్టీలు ఈ అంశాన్ని రాజ కీయంగా మలచి, ముస్లింలను విమర్శించే మత పరమైన వేదికగా మార్చాయి. ఇదే సమయంలో, శివసేన, ఎఐడీఎంకే, టీడీపీ, వైసీపీ, కేరళ సీపీఎం వంటి పార్టీలు స్థానిక స్థాయిలో ముస్లింలకు రిజర్వే షన్‌ మంజూరు చేశాయి. బీజేపీ కూడా 2004లో జన కల్యాణం మేనిఫెస్టోలో ముస్లిం రిజర్వేషన్‌ ప్రతిపా దించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తగ్గింది. రిజర్వేషన్‌ అనేది దయాదాక్షిణ్యం కాదు. అది పునరావాస హక్కు. సామాజిక దురవస్థల కారణంగా కొంతమంది వర్గాలు అణచివేయబడ్డారు. అటువంటివారికి సమాన అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు అవసరం. ఇది బ్రాహ్మణుల మీద వ్యతిరే కత కాదు. హిందూ మతానికి వ్యతిరేకత కాదు. ఇది సామాజిక సమానత్వానికి, సమతుల్యతకు మద్దతు.
బహుళ జనాభా వెనుకబడి ఉంటే దేశ అభివృద్ధే వెనకడుగు వేస్తుంది. సామాజిక అసమతుల్యత పెరిగి, అసంతృప్తి పెరిగి శాంతిభద్రతలు దెబ్బతింటాయి. మతపరమైన విద్వేషాలు రాజ్యం మొత్తాన్ని వెన్నాడ తాయి. ముస్లింలలోని వెనుకబడిన కులాల స్థితిని తెలియజేసే విధంగా కులగణన చేపట్టాలి. జస్టిస్ సచార్‌, రంగనాథ్‌ మిశ్రా సిఫార్సుల అమలు, విద్య, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు మద్దతు ఇవ్వాలి. ఓబీసీలోని మైనారిటీ కోటాను బలోపేతం చేయాలి. ముస్లింలకు రాజకీయ స్థాయిలో కూడా న్యాయం జరగాలి. పార్టీ టికెట్లు, పదవులలో సమాన హక్కులు కల్పించాలి. ముస్లింలు ఈ దేశ పౌరులు. వారు స్వా తంత్య్ర సమరంలో రక్తం చిందించినవారు. అమరు లైనవారు. ఈ దేశ అభివృద్ధికి ఎంతో కొంత పాత్ర వహిస్తున్నవారు. వారు వెనుకబడితే దేశమంతా వెనుక బడుతుంది. మతాన్ని అడ్డం పెట్టుకుని ముస్లింలకు న్యాయం నిషేధించడం రాజ్యాంగ విరుద్ధం. సామా జిక న్యాయాన్ని పటిష్టంగా నిలబెట్టా లంటే, ముస్లిం లకు కూడా అదే సరైన హక్కులు కల్పించాలి. రిజర్వే షన్లపై మతవాదుల కక్షను అడ్డుకోవాలి. అప్పుడే భారతీయ లౌకికత్వానికి గౌరవం కలుగుతుంది.

మన్నారం నాగరాజు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad