Friday, February 13, 2026
Homeఎడిటోరియల్ / బహుళNallamala Forest Water Crisis: నల్లమల అడవిలో దాహార్తి.. మౌనంగా చూస్తున్న పాలన!

Nallamala Forest Water Crisis: నల్లమల అడవిలో దాహార్తి.. మౌనంగా చూస్తున్న పాలన!

Impact of Deforestation: నల్లమల అడవులు దక్షిణ భారతదేశా నికి ఊపిరితిత్తుల్లాంటివి. జీవ వైవిధ్యానికి నిలయంగా, అరుదైన వృక్షజాలం-జంతుజా లానికి ఆశ్రయంగా నిలిచిన ఈ అరణ్యం నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షా భావ పరిస్థితులు నెలకొన డంతో అడవిలోని సహజ నీటి వనరులు పూర్తిగా ఎండిపోయా యి. ఫలితంగా అక్కడ నివసిస్తున్న అడవి జం తువులు తాగునీరు లేక తీవ్రంగా అలమటిస్తు న్నాయి. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు పాలనా వైఫల్యానికి స్పష్టమైన ప్రతిబింబం కూడా.

- Advertisement -

నల్లమల ప్రాంతంలో సాధారణంగా చెరువులు, వాగులు, గుంతలు వంటి సహజ నీటి వనరులు వేసవి కాలంలోనూ కొంతవర కు జంతువులకు ఉపశమ నంగా ఉండేవి. కా నీ ఈ ఏడాది వర్షాలు చేతికందక పోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అడ విలోని జంతువులు దాహార్తితో అడవుల నుంచి బయటకు రావడం, గ్రామాల సమీపానికి చేరడం, ప్రమాదాలకు గురవడం వంటి సం ఘటనలు పెరుగు తున్నాయి. ఇది జంతువుల కు మాత్రమే కాదు, మనుషులకు కూడా ప్ర మాదకరమైన పరిణామమే.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యం త్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవ సరం ఉంది. అటవీ శాఖ, పర్యావరణ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. కానీ వాస్తవం లో చూస్తే పరిస్థితిపై ప్రభుత్వ స్పందన చాలా మందగించింది. కొద్ది ప్రాంతాల్లో తాత్కాలి కంగా నీటి తొట్లు ఏర్పాటు చేసినా, అవి సరిపోవడం లేదు. విస్తారమైన నల్లమల అడవు లకు ఇవి చుక్కల్లో మునకలే.

అడవి జంతువులకు తాగునీరు అందించ డం ప్రభుత్వానికి దయాదాక్షిణ్యం కాదు– అది రాజ్యాంగ బాధ్యత. పర్యావరణ పరిరక్ష ణ, జీవ వైవిధ్య సంరక్షణ అనేవి కేవలం ప్రకటనలకే పరిమితం కావద్దు. ఎండాకాలం ప్రారంభమయ్యే ముందే అడవుల్లో నీటి లభ్య తపై ప్రణాళిక ఉండాలి. బోరు బావుల ద్వారా సోలార్‌ మోటార్లతో నీటిని తొట్లకు పంపిం చడం, పాత చెరువులు-వాగులను పునరు ద్ధరించడం, వర్షపు నీటి నిల్వకు శాశ్వత ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు ఇప్పటికైనా చేపట్టాల్సిందే.

అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నీటి వన రుల స్థితిని పర్యవేక్షించడం, అత్యవసర పరి స్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయ డం కూడా సాధ్యమే. ఇవన్నీ ఖర్చుతో కూడు కున్న పనులుగా ప్రభుత్వం భావిస్తే అడవులు నశించిన తర్వాత చెల్లించాల్సిన మూల్యం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి.
అధికారులు కూడా ఫైళ్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయాలి. “వర్షాలు వస్తే చూసుకుందాం” అనే నిర్లక్ష్య ధోరణి వదిలేయాలి.

ప్రకృతి తన హెచ్చరికలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇప్ప టికైనా మేల్కొనకపోతే, రేపు ఎదురయ్యే పర్యా వరణ విపత్తులకు మనమే బాధ్యులం. నల్లమల అడవులు మనవి కావు మనం నల్లమల అడవుల వాళ్లం. అక్కడి జంతువుల దాహం తీర్చడం అంటే ప్రకృతితో మన బాధ్య తను నెరవేర్చడమే. ప్రభుత్వం తక్షణమే సమ గ్ర కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలి. లేదంటే, మౌనంగా చూస్తూ ఉండే ఈ పాలన పై ప్రజల ప్రశ్నలు మరింత ఘాటుగా మార డం ఖాయం.

కె బాపురావు
జర్నలిస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News