Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్NE Elections: ఈశాన్యంలో ఎన్నికల వేడి

NE Elections: ఈశాన్యంలో ఎన్నికల వేడి

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌ మేఘాలయల్లో ఒకటి రెండు నెలల్లో జరగబోయే శాసనసభ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి ఒక విధంగా అగ్నిపరీక్ష కాబోతున్నాయి. ఎన్నికల కమిషన్‌ ఇంకా ఎన్నికల తేదీ లను ప్రకటించలేదు కానీ, ఇవి ఫిబ్రవరిలో గానీ, మార్చిలో గానీ జరిగే అవకాశం ఉంది. త్రిపురలో బీజేపీ రాష్ట్ర శాఖలో కొద్ది రోజులుగా కీచులాటలు చోటు చేసుకుంటు న్నాయి. ఫలిత ంగా ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేబ్‌ కొద్ది రోజుల క్రితం తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆదివాసీ ఐ.పీ.ఎఫ్‌.టీ అలక పాన్పు ఎక్కింది. ఈ రెండు పార్టీలు కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రద్యోత్‌ కిషోర్‌ దేబ్‌ బర్మ నాయకత్వంలోని తిప్రా మోతా అనే పార్టీ క్రమక్రమంగా బలం పుంజు కుంటోంది. ఈ పార్టీ అక్కడ ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం కోసం చాలా కాలంగా పోరాటం సాగిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తేనెతుట్టెను కదల్చినట్టవు తుందని బీజేపీ పాలకులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతు న్నారు. విచిత్రమేమింటే, ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకుండా ఐ.పీ.ఎఫ్‌.టీ కూడా విజయం సాధించే అవకాశం లేదు.
ఇది ఇలా ఉండగా, చాలాకాలం ఇక్కడ అధికారంలో ఉన్న సీ.పీ.ఐ(ఎం) కూడా మళ్లీ అధికారంలోకి రావడానికి చాలా వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌, తిప్రా మోతీ పార్టీలతో పొత్తు కుదర్చుకో వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మార్క్సిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాదు, 2021 శాసన సభ ఎన్నికల్లో ఘన విజ యం సాధించినప్పటి నుంచి త్రిపుర మీద కన్నేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ మొత్తం 60 స్థానాలలోనూ ఒంటరిగా పోటీ చేయడానికి అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది. దీని వల్ల ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్క చేయడం లేదు. ఈ రాజకీయ పరి ణామాలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్ద సవాలుగా పరిణమించనున్నాయి. ఈ పార్టీలను ఎదుర్కోవడం బీజేపీకి ఆషామాషీ వ్యవహారం కాదు కానీ, ఓట్లు చీలకుండా నివారించడానికి ఆ పార్టీ ఎత్తులు వేయక తప్పకపోవచ్చు. ప్రస్తుతం బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర శాఖతో కలిసి వ్యూహం తయారు చేస్తోంది.
ఇక మేఘాలయ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎన్‌.పీ.పీ అనే స్థానిక పార్టీతో పొత్తు ఉంది. అయితే, ఇక్కడి ఎన్‌.పీ.పీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా తాము ఇక ఏ మిత్రపక్షంతోనూ సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించి, బీజేపీని ఇరుకున పెట్టారు. ఈ ఆదివాసీ రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ప్రవేశ పెట్టడానికి ఆయన పూర్తి విముఖంగా ఉన్నారు. అంతేకాక, పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రంతో ఈ రాష్ట్రానికి సరిహద్దు సమస్యలున్నాయి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. గత నవంబర్‌లో అస్సాంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య పొరపచ్చాలు రావడానికి కారణమైంది. ఈ స్పర్ధల నుంచి బయటప డడానికి, మళ్లీ పొత్తును సాధించడానికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఎత్తులు, పైఎత్తులు
నాగాలాండ్‌ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అస్సాంతో నాగా లాండ్‌కు కూడా సరిహద్దు సమస్యలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వంటివి చాలా ఉన్నాయి. నాగాలాండ్‌లో బీజేపీ, నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ పేర ఎతో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలా కాలంగా డిమా్‌ండ చేస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని ఇప్పుడు ఈ సంస్థ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. నిజానికి ప్రత్యేక రాష్ట్రం విషయం లో ఎన్‌.ఎస్‌.సీ.ఎన్‌-ఐఎం అనే పార్టీతో చాలా కాలం బీజేపీ చర్చలు జరిపింది కానీ, ప్రస్తుతం ఆ చర్చ ల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నాగాలకు ప్రత్యేక పతాకం, ప్రత్యేక రాజ్యాంగం కావాలని ఎన్‌.ఎస్‌. సీ.ఎన్‌- ఐఎం కూడా డిమాండ్‌ చేస్తోంది.
ఏతావతా, ఈ మూడు రాష్ట్రాలలో ఈసారి జరగబోయే ఎన్నికలు బీజేపీకి ఒక పెద్ద అగ్నిపరీక్షే కాబోతోందనడంలో సందేహం లేదు. విచిత్రమేమిటంటే, బీజేపీతో పొత్తు లేకుండా ఈ రాష్ట్రాలలో ఏ పార్టీ కూడా అధికారానికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ, ఆ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఇంతవరకూ ప్రస్తావించని అంశాలను కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఈ పార్టీల్లో కొందరు నాయకులు ఢిల్లీ స్థాయిలో బీజేపీ సీనియర్‌ నాయకులతో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. వారితో రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు కూడా స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ చిన్నా చితకా సమస్య లను పరిష్కరించుకుని, ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ నాయకులు అనేక మార్గాలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీటి ఫలితం ఎలా ఉంటుందన్నది ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.
– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News