Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్No change: అదే జోరు..అదే పోరు

No change: అదే జోరు..అదే పోరు

మనిషి మారినా పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితుల్లో మార్పులేదు. గత గవర్నర్‌తో ఏమాత్రం సఖ్యత లేక ముఖ్యమంత్రి దినదినగండంలా గడిపారు. అయితే ఆ గవర్నర్‌ స్థానంలో కొత్త గవర్నర్‌ వచ్చి మొదట మురిపించినా తరువాత కరిచే స్థితికి చేరుకోవడం ఆమెకు గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. కొంతమందికి ఉద్వాసన పలికారు. మరికొంతమందిని పొరుగురాష్ట్రాలకు పంపారు. ఇంకొన్ని భర్తీ అయ్యాయి. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ స్థానంలో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నియమిస్తారని విస్తృతంగా ఊహాగానాలు వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలాగే గవర్నర్‌గా ముత్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ నియామకం గురించి మరొక అంచనా ప్రచారంలోకి వచ్చింది. కానీ అది కూడా జరగలేదు. ఇప్పుడు, కెప్టెన్‌ నాన్‌ ప్లేయింగ్‌ ఫీల్ట్‌లో మిగిలిపోయారు. నఖ్వీ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు.
తొలిరోజుల్లో మమత పట్ల మంచిగురి
గతంలో పశ్చిమబెంగాల్‌ జగదీప్‌ ధనకర్‌ ఉన్నప్పుడు రాష్ట్రంలో నిత్యమూ ఘర్షణ పూర్వక వాతావరణమే కనిపించేది. గవర్నర్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా సఖ్యతతో ఉండేవారు కాదు. రోజూ ఉప్పూ నిప్పు గానే మెసలుకునేవారు. ఆయన్ని ఉప రాష్ట్రపతిగా ధన్‌కడ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారని తెలిసిన తరువాత మమత ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే నిత్యం చిన్నపిల్లల్లా చిన్నచిన్న అంశాలకు కూడా కలహాలతో గడుపుతూ ఉంటే ఇక పాలన సంగతెలా?! ధన్‌కడ్‌ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన స్థానంలో సివి ఆనంద్‌ బోస్‌ను రాష్ట్రపతి నియమించారు. 1977 ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన ఆనందున్ను ఏరికోరి పశ్చిమ బెంగాల్‌కు పంపారు. గత నవంబర్‌లో ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సి.వి. ఆనంద బోస్‌… ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అమితమైన ఆరాధకుడిగా కనిపించారు. ఆయన చూపిన అప్యాయతకు మురిసిపోయిన మమత అత్యున్నతమైన ఆతిథ్యంతో ఆయన్ని పరవశింపజేశారు. ఉదాహరణకు, కోల్‌కతాలో ఆయనకు అతనికి ఇష్టమైన స్వీట్‌ షాప్‌ నుంచి రెండు కుండల్లో రసగుల్లాలు అందించారు. అంతేకాకుండా మమత రచనలు, పెయింటింగ్లు, సంగీత కంపోజిషన్లు, అల్బమ్లు ఆయన నుంచి అద్వితీయ ప్రశంసలు నోచుకున్నాయి.
ఎంజీఎన్‌ఆర్‌ఏ, పీఎంఏవై నిధుల విడుదలలో జాప్యంగానీ, దాటవేత ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందని మమత తరచూ విమర్శిస్తుంటారు. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగంలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు. ఆ ప్రసంగంలోని ఒక్క వాక్యం కూడా వదిలిపెట్టకుండా గవర్నర్‌ చదివేశారు. ఎంజీఎన్‌ఆర్‌ ఈజీఏ, పీఎంఏవై నిధుల విషయంలో కేంద్రాన్ని తప్పుపడుతూ ఉన్న భాగాలను కూడా ఆయన యథాతథంగా చదివేశారు. గత గవర్నర్‌ ప్రవర్తనను ఒక్కసారి గుర్తు చేసుకోండి. తనను పిలిచినా పిలవకపోయినా ప్రతి సందర్భంలోనూ మమతలోని లోపాల్ని, తప్పుల్ని ఎత్తిచూపడమే ధన్‌కడ్‌ పనిగా పెట్టుకుని వ్యవహరించేవారు. అయితే ఆనంద్‌ మాత్రం అలాకాదు. చర్చాగోష్టుల్లోను, ఇతరత్రా సందర్భాల్లోనూ తనను పిలవాలని అనుకునే వరకు అందుబాటులోఉండరు.
అంతలోనే మార్పు
మొదట మమత పట్ల ఎంతో ఆదరణ, అభిమానం చూపిన ఆనంద్‌ వ్యవహార శైలిలో ఇటీవలి కాలంలో మార్పు కనిపిస్తోంది. గవర్నర్‌ వ్యవహారశైలిని మమత నిశితంగా పరిశీలిస్తున్నారు. మమతకు మద్దతు పలికేలా నిన్నటి వరకు గవర్నర్‌ ప్రవర్తించడం పట్ల రాష్ట్ర బీజేపీ కూడా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో గత 11న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ రాజభవన్‌లో గవర్నర్‌ ఆనంద్‌ ఏకాంతంగా చర్చలు జరిపారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఆ సుదీర్ఘ చర్చల అనంతరం ఆయనలో హఠాత్తుగా మార్పు వచ్చింది. లోకాయుక్త నియామకంపై పరిపాలనా ఉత్తర్వుల్లో చట్టపరమైన లొసుగులున్నాయని, తద్వారా గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయలేక పోతున్నారని రాజభవన్‌ మీడియా ప్రకటన విడుదల చేసింది. అంతేగాక గవర్నర్‌ తన ప్రిన్సిపల్‌ సెక్రటరీ నందినీ చక్రవర్తికి ఉద్వాసన పలికారు. ఆమె మమతా బెనర్జీకి చాలా సన్నిహితురాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News