చిన్న పిల్లల హక్కుల పరి రక్షణ కోసం ‘లైంగిక నేరాల నుండి చిన్న పిల్లల రక్షణ చట్టం, 2012’ (POCSO)ను ఒక శక్తివంతమైన ఆయుధం గా మలిచింది. ఈ శాసనం భారత రాజ్యాంగంలోని అధిక రణ 15(3) ద్వారా, ఐక్యరా జ్యసమితి చిన్న పిల్లల హక్కుల ఒడంబడిక స్ఫూర్తితో ఉద్భవిం చింది. పద్దెనిమిది ఏళ్ల లోపు వయసున్న వారందరినీ ఈ చట్టం చిన్న పిల్లలుగా గుర్తి స్తుంది. వారిపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడం దీని ప్రధాన లక్ష్యం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉదంతం జాతీ య మీడియా దృష్టిని ఆకర్షించింది. చట్టం కఠిన అమలు ఎంత అవస రమో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. చట్టం పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల 16 నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న వారు భావోద్వేగ ప్రేరేపిత చర్యల వల్ల నేరస్తులుగా మారుతున్నారు. పోక్సో చట్టం సమ్మతి (Consent) ని అంగీకరించదు. మైనర్లు ఇచ్చే అంగీకారం చట్టరిత్యా చెల్లదు.
ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్ ఉదంతం
సాంకేతికత పెరిగేకొద్దీ చిన్న పిల్లలపై నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఇన్‌స్టా గ్రామ్ ట్రాప్ బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్ ఉదంతాలు సమాజాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. సోషల్ మీడియా వేదికగా మైనర్లను, ముఖ్యంగా ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని, విలాసవం తమైన జీవితాన్ని ఎరగా వేసి స్నేహం చేయడం, ఆపై వారి ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి లక్షలాది రూపాయలు వసూలు చేయడం ఒక మాఫియాగా మారింది. ఈ కేసుల్లో ప్రధాన నిందితులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకోవడం నేర ప్రవృత్తి ఎంత గా వేళ్లూనుకుందో తెలియజేస్తోంది. సైబర్ పోక్సో నేరాల విషయంలో చట్టం మరింత వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది.
అధికార బలం vs చట్టం
పోక్సో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్నకు ఇటీవల కేంద్ర మంత్రి కుమారుడిపై నమోదైన కేసు ఒక పరీక్షగా నిలిచింది. ఒక మైనర్ బాలికను వేధించారనే ఆరోపణలపై కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే, దీనికి ప్రతిగా సదరు యువకుడు తనపై హనీ ట్రాప్ జరిగిందని, రూ. 5 కోట్లు ఇవ్వాలని బాధితురాలి కుటుంబం తనను బ్లాక్‌మెయిల్ చేస్తోందని కౌంటర్ ఫిర్యాదు చేయడం ఈ కేసును సంక్లిష్టంగా మార్చింది. ముఖ్య మంత్రి ఈ కేసుపై, త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించారు. అధికారం, హోదా లేదా రాజకీయ ప్రాబల్యం విచారణను ప్రభావితం చేయకూడదని బాధితుల తరపున సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
పోక్సో కేసులో బాధితురాలి వయసు వివాదం ప్రధాన అంశంగా మారింది. బాధితురాలికి రెండు వేర్వేరు జనన ధృవీకరణ పత్రాలు ఉండటంతో, ఆమె మైనరా? మేజరా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. నిందితుడి తరపు లాయర్లు ఈ వయసు తేడాలను హైకోర్టు ముందు ఉంచారు.
పోక్సో కేసుల్లో అరెస్టు ప్రక్రియ
పోక్సో చట్టం కింద నేరం నమోదైనప్పుడు పోలీసులు అనుసరించా ల్సిన ప్రక్రియ అత్యంత కఠినంగా, స్పష్టంగా ఉంటుంది. పోక్సో కింద నమోదయ్యే నేరాలు కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్. అంటే, మేజిస్ట్రేట్ నుండి ముందస్తు వారెంట్ లేకపోయినా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయవచ్చు. సమాచారం అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాలి. నేరం జరిగిన 24 గంటల లోపు బాధితు రాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. అరెస్టు చేసిన 24 గంటల లోపు నిందితుడిని ప్రత్యేక పోక్సో కోర్టు లేదా మేజిస్ట్రేట్ ముందు హాజరుపర చాలి. సాధారణ కేసుల్లో నిందితుడు నేరం చేశాడని పోలీసులు నిరూ పించాలి. కానీ పోక్సోలో సెక్షన్ 29 ప్రకారం, నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
రోమియో-జూలియట్ క్లాజ్
పోక్సో చట్టం అమలులో అత్యంత చర్చనీయాంశమైన అంశం రోమియో-జూలియట్ క్లాజ్. ఇది నేరుగా చట్టంలో ఒక సెక్షన్ కాకపో యినప్పటికీ, న్యాయస్థానాలు కౌమార దశలో ఇష్టపూర్వకంగా ఏర్పడే శారీరక సంబంధాల విషయంలో అనుసరించే విచక్షణను ఇది సూచి స్తుంది. ఇద్దరూ మైనర్లు అయి ఉండి లేదా వయస్సులో స్వల్ప వ్య త్యాసం ఉన్నప్పుడు, వారి మధ్య పరస్పర సమ్మతితో ఏర్పడిన సంబం ధాలను క్రూరమైన అత్యాచారాల కోణంలో చూడకూడదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ఇటీవల అనేక హైకోర్టులు, ప్రేమ వ్యవహా రాల వల్ల తలెత్తే ఇటువంటి కేసుల్లో కఠిన శిక్షలు విధిస్తే యువత భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నాయి. వయస్సు నిర్ధారణ, నేర ఉద్దేశ్యాన్ని నిశితంగా పరిశీలించి, ఇవి నిజమైన లైంగిక వేధింపులు కానప్పుడు విచక్షణతో తీర్పులు ఇవ్వాలని సూచించాయి.
ప్రత్యేక కోర్టులు – విచారణలోని జాప్యం
తెలంగాణ హైకోర్టు 2018లో ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించింది. ముఖ్యంగా 2020 ఆదేశాల ప్రకారం, మైనర్ బాధి తుల సాక్ష్యాలను సేకరించే సమయంలో కోర్టు అధికారులు న్యాయవా దుల గౌన్లు ధరించకూడదు. ఇది చిన్న పిల్లల్లో ఆందోళనను తగ్గించి, వారు స్వేచ్ఛగా వాంగ్మూలం ఇచ్చేందుకు దోహదపడుతుంది. కానీ, జాతీయ మీడియాలో సైతం తెలంగాణలోని కొన్ని హై-ప్రొఫైల్ కేసుల దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పేరుకే పరిమితమై, ఏళ్ల తరబడి విచారణ సాగడం బాధితులకు మరో రూపంలో హింసను మిగులుస్తోంది.
బాధితులు – నిందితులు
పోక్సో కేసులలో సుమారు 90 శాతానికి పైగా కేసులలో నింది తులు బాధితుల బంధువులు, పొరుగువారు లేదా కుటుంబానికి అత్యం త సన్నిహితులుగా ఉంటున్నారు. మరోవైపు, నిందితులలో అన్ని వర్గాల వారు కనిపిస్తున్నారు. సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తులు కూడా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. బాధితుల విషయానికొస్తే, ఆడపిల్లలతో పాటు మగపిల్లలు కూడా లైంగిక వేధింపు లకు గురవుతున్నారని, అయితే సామాజిక కారణాల వల్ల మగపిల్లల కేసులు వెలుగులోకి రావడం తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ వంటి నేరాలకు కనీసం పదేళ్ల జైలు శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షలు ఉన్నాయి.
2019 సవరణ ప్రకారం పన్నెండేళ్ల లోపు బాధితుల విషయంలో కోర్టులు మరణశిక్ష కూడా విధిస్తాయి. ఈ చట్టం ‘ప్రెసంప్షన్ ఆఫ్ గిల్ట్’ (Section 29 & 30) సూత్రంపై పనిచేస్తుంది. అంటే, నిందితుడే తాను నిర్దోషినని కోర్టులో నిరూపించుకోవాలి. పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం, బాధితుల వివరాలను వెల్లడించడం తీవ్రమైన నేరం. మీడియా లేదా పౌరులు బాధితుల వివరాలను సామాజిక మాధ్యమాల్లో పంచు కోవడం చట్టవిరుద్ధం.
బలహీన వర్గాల దైన్యం
బాధితుల్లో ఎక్కువ మంది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. ఉన్నత వర్గాల వారు పరువు కోసం కేసులను నమోదు చేయడం లేదు, మరోవైపు పేదవర్గాలకు న్యాయం అందడం గగనమవుతోంది. నిందితుల్లో అత్యధిక శాతం బాధి తుల పరిచయస్తులే ఉంటున్నారని ఎన్‌సిఆర్‌బి నివేదిక సూచిస్తోంది.
పరిష్కార మార్గాలు
ప్రభుత్వాలు కేవలం మీడియా ప్రచారం కోసం కాకుండా, వ్యవస్థా గత మార్పుల కోసం పని చేయాలి. పాఠశాలల్లో లైంగిక విద్యను కేవలం మొక్కుబడిగా కాకుండా, అవగాహన కలిగించేలా చేయాలి. ఆన్‌లైన్ చైల్డ్ పోర్నోగ్రఫీని అణచివేయడంలో ఐటి చట్టం, పోక్సో చట్టం సమన్వ యంతో పని చేస్తుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, బాధితు లకు న్యాయం చేకూరినప్పుడే చట్టంపై సామాన్యులకు నమ్మకం కలుగు తుంది. ప్రభుత్వం, పౌర సమాజం సమన్వయంతో పనిచేసినప్పుడే చిన్న పిల్లలకు పూర్తి రక్షణ లభిస్తుంది. పాఠశాలల్లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలి. రాజకీయాలకు అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోయేలా దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛనివ్వాలి.
ఫిర్యాదు చేయడం ఎలా? చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు ఏ స్థానిక పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు లేదా 24/7 అందుబాటులో ఉండే జాతీయ చైల్డ్ హెల్ప్‍లైన్ నంబర్ 1098 కు కాల్ చేయవచ్చు.
కాలమ్ : లాజిక్
డా. కట్కూరి
పాలసీ విశ్లేషకుడు

