Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్North Korea: అపహాస్యం అవుతున్న ఉత్తర కొరియా

North Korea: అపహాస్యం అవుతున్న ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ప్రయోగాలు ఆపితే సరి, లేకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయి

ఇటీవల కాలంలో ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహం ప్రయోగం చేస్తుండటం అవి విఫలం కావడం తెలిసిందే. ఈ ప్రయోగాలు ఎందుకు చేస్తుంది అంటే కేవలం దక్షిణ కొరియాను భయబ్రాంతులను చేయటానికి ఈ నిఘా ఉపగ్రహాల ప్రయోగం జరిగి ఉండొచ్చు. ఉత్తర కొరియా ఈ విధంగా భయంకు గురిచేయడానికి కారణం అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా మొదలగు దేశాలు వాషింగ్టన్‌ లో సమావేశం కావడం ఉత్తర కొరియా జీర్ణించుకోలేక పోతున్నది అనే విషయం స్పష్టం. ఈ దేశాలకు అమెరికా అండ ఉండటం కూడా ఉత్తర కొరియా మండిపడుతోంది. అందు నిమిత్తమే తన బలంను చూపించుకోవాలనే మిషతో ఉపగ్రహాల ప్రయోగం చేస్తుందనేది స్పష్టం. ఈ నిఘా ఉపగ్రహాల వలన దక్షిణ కోరియాను ఇబ్బందుల పాలుచేయడమే. ముఖ్యంగా అమెరికా, జపాన్‌, దేశాలు ఉత్తర కొరియా చేసే ప్రయోగాలను అంతగా లెక్క పెట్టవు. ఉత్తర కొరియా చేస్తున్న నిఘా ప్రయోగాలు ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఉల్లంగిస్తోందని జపాన్‌ ప్రధాని కిషిదా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని అమెరికా కూడా ఖండించింది. ఉత్తర కొరియా అనవసరంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని దేశాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే స్నేహపూర్వకంగా, దౌత్య మార్గాలలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. వాషింగ్‌టన్‌లో సమావేశం నిర్వహిస్తున్న తరుణంలోనే ఉత్తర కొరియా నిఘా ప్రయోగం చేయడం దాని స్వభావాన్ని తెలుపుతోంది. ఇది భయపెట్టే సంఘటన తప్పా మరేమి కాదని ఆయా దేశాలు వ్యాఖ్యానించాయి. ఉత్తర కొరియా మొదటి ప్రయోగం విఫలమైన తరుణంలో, రెండోసారి కూడా విఫలమైంది. ఈ విషయం ఉత్తర కొరియా అంతరిక్ష కేంద్రం వెల్లడి చేసింది. రాబోయే అక్టోబర్‌ మాసంలో మూడవ సారి ప్రయోగానికి సంసిద్ధమైనట్లు భోగట్ట. ఇలా వరుస విఫల ప్రయోగాలతో ఉత్తర కొరియా రాకెట్లు విఫలం కావడం ఆ దేశానికే అంతుపట్టడం లేదు. సహజంగా శత్రుదేశమైన దక్షిణ కొరియా, ఉత్తర కొరియా పట్ల తీవ్ర నిరసన తెలియచేసింది. ఆ దేశ నిరసన వల్లే మా ప్రయోగాలు క్షినించాయని ఉత్తర కొరియా భావిస్తోంది. నిఘా ఉపగ్రహం గత గురువారం విఫలమైంది. ఉత్తర కొరియా చేపట్టిన రాకెట్లు సాంకేతిక లోపం కారణంగా విఫలమైందని ఆ దేశ కే. సి. ఎన్‌. ఏ వార్త సంస్థ తెలియచేసింది. ఉత్తర కొరియా చేపడుతున్న అణు, రాకెట్‌ ప్రయోగాలు జపాన్‌ కాని, అమెరికాను కాని, దక్షిణ కోరియాను కాని ఏమి చేయలేవని, ఆ దేశం తన ప్రాబల్యం, బలం చూపాలనే ధోరణి కనిపిస్తుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎంత చేసినా ఉత్తర కొరియా, దక్షిణ కొరియాపై దాడి చేయాలని, ఆ దేశాన్ని అస్థిర పరచాలని అక్కడ అభివృద్ధి జరగకూడదని తలంపుతోనే ఉంది. దక్షిణ కొరియాకు అండగా అమెరికా ఉండటం, మరోవైపు జపాన్‌ సైతం అండగా ఉండటంతో ఉత్తర కొరియా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తూనే, తమ బలం అపారమని నిఘా ఉపగ్రహాల ప్రయోగం చేస్తుందనేది తెలుస్తోంది. ఏతావాత ఉత్తర కొరియా ఆసియా ఖండంలో తన ప్రాబల్యం చూపాలనే ధోరణిలో కనపడుతోంది. ఈ దిశలోనే అటు చైనాకు దగ్గర కావడం, ఇటు రష్యాకు స్నేహ హస్తం అందించడం చేస్తోంది. రష్యా, ఉక్రైన్‌ యుద్ధం వలన ఎంతో నష్టం జరిగింది, జరుగుతున్నది ఇది అన్ని దేశాలకు తెలిసిన సత్యం. ఇది చూసి కూడా దేశాలపై ఉపగ్రహ, అణుప్రయోగాలు చేయడం ఉత్తర కొరియాకు తగదు. రష్యా, ఉక్రైన్‌ యుద్ధంలో మూడో దేశం తల దూరిస్తే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఏరి కోరి యుద్ధం తెచ్చుకోవడం, అణు ప్రయోగాలు చేయడం ఉత్తర కొరియాకు తగదు. ఈ దిశలో ఉత్తర కొరియా చేపట్టిన ప్రయోగాలు విఫలమైనవి. కనుక ఏ ప్రమాదం లేదు. ఒక వేళ అవి విజయవంతం అయిఉంటే ఉత్తర కొరియాకు అడ్డ, అదుపు ఉండేది కాదు. అది పెట్రేగి పోయి ఉండొచ్చు.. నిఘా ఉపగ్రహం విఫలం అయినందుకు ఉత్తర కొరియా తగిన కారణాలు అన్వేషణ చేయవచ్చు. ఏమైనా ఉత్తర కొరియా నిఘా ప్రయోగాలు విఫలం కావడం విశ్వంలో అది అపహాస్యం లేదా అబాసుపాలు కావడం జరుగుతోంది. ఇంతటితో ఉత్తర కొరియా ప్రయోగాలు ఆపితే సరి, లేకపోతే పరిస్థితులు భయానకంగా ఉంటాయి. ఉత్తర కొరియా ఇక ముందు ఇటువంటివి చేయకుండా, ఏదైనా సమస్య ఉంటే దేశాల మధ్య సఖ్యతతో పరిష్కరించుకోవాలని, అణు ప్రయోగాలు, ఉపగ్రహ నిఘాలు దాదాపు నిలుపుదల చేస్తుందని ఆశిద్దాం.

  • కనుమ ఎల్లారెడ్డి,
    93915 23027
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News