Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Nuclear energy: అణు ఇంధనానికి మార్గం సుగమం

Nuclear energy: అణు ఇంధనానికి మార్గం సుగమం

250 ఏళ్లకు సరిపడా థోరియం నిక్షేపాలు మనకున్నాయి

తమిళనాడులోని కల్పాక్కంలో గత వారం ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో భారీ ఎత్తున అణు ఇంధన ఉత్పత్తికి మార్గం సుగమం చేశారు. ఫలితంగా, అనేక సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్న ఈ అణు ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఒక్కసారిగా ఉత్పత్తి అందుకుంది. కల్పాక్కంలోని ప్రోటోటైప్‌ ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లో ఇంధనాన్ని నింపడం ద్వారా ఆయన ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నిజానికి అనేక సంవత్సరాల క్రితం అప్పటి ప్రధానమంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ ఈప్రాజెక్టును లాంభనంగా ప్రారంభించడం జరిగింది కానీ, అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు దాదాపు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చందనంగానే ఉంటోంది. ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు దీన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి అతివృద్ది ప్రయత్నమే చేశారు కానీ, ఆశించిన స్థాయిలో కృతకృత్యులు కాలేకపోయారు. అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధి స్తాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తమకు అందకుండా చేస్తాయని గత ప్రభుత్వాలు భయపడడం జరిగింది.
నిజానికి, 1958 ప్రాంతంలో వైజ్ఞానిక దార్శనికుడు హోమీ బాబా దీనికి రూపకల్పన చేశారు. ఈ ప్రోటోటైప్‌ ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్లర్లో ఇంధనాన్ని నింపడం ద్వారా ఈ ప్రాజె క్టుకు మోదీ మార్గం సుగమం చేయడంతో భారతదేశం తన మూడు దశల అణు ఇంధన ఉత్పత్తికి సంబంధించి రెండవ దశలోకి ప్రవేశించినట్టయింది. మొదటి దశలో యురేనియాన్ని ఇంధ నంగా ఉపయోగించిన ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్లను ప్రారంభించడం జరిగింది. రెండవ దశలో, ఈ రియాక్టర్లలో యురేనియాన్ని మండించి ఉత్పత్తి చేసిన ప్లుటోనియాన్ని ఉపయో గించి బ్రీడర్‌ రియాక్టర్లను నెలకొల్పడం జరుగుతుంది. ఈ బ్రీడర్లు ఎక్కువగా ప్లుటోనియాన్ని ఖర్చు చేసే అవకాశమున్న ప్పటికీ, అణు ఇంధనాన్ని కొద్ది కొద్దిగానైనా ఉత్పత్తి చేయడానికి వీలు కలుగుతుంది. మూడవ దశలో పూర్తిగా థోరియం ద్వారా అణు ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభమవుతుంది. భారతదేశంలో ధోరియం నిల్వలకు కొరత లేదు. బ్రీడర్‌ రియాక్టర్లలో కూడా థోరియంను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
కాగా, 2003లో వాజ్‌ పేయీ ప్రభుత్వం మొదటిసారిగా ఈ బ్రీడర్‌ రియాక్టర్లను ప్రారం భించింది కానీ, ఇది మందకొడిగానే ముందుకు వెళ్లింది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో ఒక పక్క అమెరికాతో అణు ఒప్పందం కొనసాగుతున్నా ఈ బ్రీడర్లను కొనసా గించడం జరిగింది. విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం అందినా అందకపోయినా, ఇతర దేశాలు ఆంక్షలు విధించినా విధించకపోయినా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లడానికి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం కొద్ది ప్రయత్నం చేసింది. ఈ బ్రీడర్‌ రియాక్టర్ల కార్యక్రమాన్ని అంతర్జాతీయ భద్రతా వ్యవస్థల కిందకు తీసుకు రావాలని అమెరికా సూచించింది. అయితే, భారత్‌ ఈ సూచనను లెక్క చేయలేదు. కానీ, ఈ బ్రీడర్‌ ప్రాజెక్టు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం జరగలేదు. అంతేకాదు, దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ ప్రాజెక్టు ఎటువంటి పురోగతీ లేకుండా ఆగిపోయింది. మోదీ నడుం బిగించడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ ఊపందుకుంది.
అయితే, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కూడా ప్రచారార్భాటమేమీ లేకుండా బాగా తగ్గు స్థాయిలో పునఃప్రారంభం కావడం జరిగింది. నిజానికి, ఈ ప్రాజెక్టు ఆలస్యం అవు తున్న కొద్దీ అణు శాస్త్రవేత్తలు దూరంగా కావడమో, వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడమో జరుగుతుంది. ఈ అణు ఇంధన ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకుని వీటికి అను బంధంగా ప్రారంభమైన పరిశ్రమలు మూతపడే ప్రమాదం కూడా ఏర్పడింది. అంతే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల వల్ల విద్యుదు త్పత్తి తగ్గిపోతున్న నేపథ్యంలో అణు ఇంధన ఉత్పత్తి అవసరం బాగా పెరుగుతోంది. భారతదేశానికి దీని అవసరం మునుపటికన్నా ఎక్కువగా ఉంది. ఇక్కడి అణు విద్యుతుత్పత్తి మరో ఆరు నెలల కాలంలో జాతీయ గ్రిడ్ లో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనివల్ల అనేక పరిశ్రమలు ప్రారంభం కావడం, ఇప్పుడున్న పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్‌ అందడం వంటివి జరుగుతాయి.
థోరియం ఆధారిత అణు విద్యుత్‌ రియాక్టర్లను నెలకొల్పాలని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దశాబ్దాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అమెరికా కూడా ప్రైవేట్‌ పెట్టుబడి దార్ల సహాయంతో అయినా థోరియం ఆధారిత రియాక్టర్లను నెలకొల్పాలనే ఆలోచ నలో ఉంది. థోరియం ద్వారానే దేశంలో అణు విద్యుదుత్పాదన జరగాలని హోమీ బాబా కోరుకున్నారు. ఆయన ఆశయానికి తగ్గట్టుగా థోరియం సహాయంతో, పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అణు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో 250 సంవత్సరాలకు సరిపడ థోరియం నిక్షేపాలున్నాట్టు కనుగొనడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ మరింతగా వేగం పుంజుకోవాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా అణు విద్యుత్తు చాలా అవసరం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News