Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్One nation one law: ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే పౌరస్మృతి

One nation one law: ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే పౌరస్మృతి

ఆధునిక మానవులు మతానికి, మత విశ్వాసాలకు అతీతంగా జీవిస్తున్నారా?

ప్రస్తుతం భారత ప్రభుత్వ ప్రధాన కర్తవ్యాలలో ప్రధానమైన అంశం ఇది. ఉమ్మడి పౌరస్మృతి అంటే ప్రస్తుతం అందరికీ అవగాహన ఉన్న విషయమే. ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లల్ని దత్తత తీసుకోవడం వంటి విషయాలు అన్ని మతాల వారికి చట్టంలో ఒకే విధంగా లేకపోవడమనే చర్చ భారత పార్లమెంట్‌లో కొనసాగుతున్నది. భారత ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజల ప్రధానమైన విషయాలను పక్కన పెట్టి ఉమ్మడి పౌరస్మృతి అనే చర్చను లేవనెత్తుతున్నది. భారత ప్రభుత్వంలోని పాలకులకు ఇప్పటికిప్పుడే ఉమ్మడి పౌర స్మృతిని చట్టంగా తీసుకురావలసిన అవసరం ఉమ్మడి పౌర స్మృతి చట్టంగా చేయకపోతే వచ్చే నష్టమేమిటో, పాలకుల ఇబ్బందులు ఏమిటో వారి బాధలేమిటో వారికి మాత్రమే తెలుసు. భారత ప్రభుత్వ పాలకులు ఉమ్మడి పౌరస్మృతిపై చెబుతున్న విషయాలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొదటి విషయం పెళ్ళిళ్ల విషయంలో చట్టంలో అన్ని మతాల వారికి ఒకే విధంగా లేవని ఉమ్మడి పౌరస్మృతిని చట్టంగా రూపుదిద్దాలని చట్టాన్ని ఒక మతం కోణం నుండి చూస్తున్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి…! పెళ్లిళ్ల విషయంలోనైన విడాకుల విషయంలోనైనా ఆచరించే ప్రతి పనిలో ఎవరి మత విశ్వాసాల ఆధారంగా ఎవరి మత ఆచారాల సంప్రదాయాల ఆధారంగా ఆ… మతం వారి పద్ధతులు ఉంటాయి గానీ పెళ్లిళ్ల, విడాకుల, వారసత్వ, దత్తత విషయాలలో చట్టంలో అన్నీ మతాల వారికి ఒకే లాగా లేవు కాబట్టి దానిని సవరించి అని మతాల వారికి ఒకే విధమైన సంప్రదాయాలను రూపొందిస్తామనీ చెప్పటం ఎంత నీతిమాలిన పని…! ఏ మతంలో తరతరాల బూజు ఉంటుంది. మతాన్ని సంస్కరించాల్సి వస్తే అన్ని మతాలను సంస్కరించాల్సిన అవసరం వుంటుంది. ఎందుకంటే మాతాలు పుట్టి కొన్ని వందల సంవత్సరాలవుతున్నది కొన్ని మతాలైతే వేల సంవత్సరాలవుతున్నది. మతం ఏదైన అది ఎంత ప్రాచినమైనదైతే అది అంత అనాగరికంగా వుంటుంది కాబట్టి. మతం అంటేనే ఆ మతంలో జీవించే వారి సంప్రదాయాలు ఇతర మతాల వారికి భిన్నంగా ఉంటాయనే విషయం ఈ దేశాన్ని పాలిస్తున్న పాలకులకు అర్థం కాకపోవడం ఎంత ఆశ్చర్యం!. అన్ని మతాలలో పెళ్లిళ్ల, విడాకుల, వారసత్వ, దత్తత ఒకేలా ఉండవు కదా…! మరీ ముఖ్యంగా భారత్‌ లాంటి వేల భాషలు ఉన్న వివిధ మతాలున్న దేశాలలో ఇది సాధ్యం కాని పని…! ఒకే మతం కలిగిన దేశంలో ఉమ్మడి పౌరస్మృతి సాధ్యమవుతుంది కానీ భిన్న ఆచారాలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశాలలో సాధ్యం కాదు అలా చేయడం కూడా సరైన పని కాదు. ప్రజలను వారి ఆచారాల నుండి మత విశ్వాసాల నుండి దూరం చేయడమే అవుతుంది. అయినా నేటి ఆధునిక భారతీయ పౌరులు ఏ మతం వారైనా వారి మతాన్ని, వారి మతానికి అతీతంగా జీవించే స్థితిలో ఉన్నారా…! నేటి ఆధునిక ప్రపంచంలో మతాన్ని మత విశ్వాసాలను వదులుకోవడం అంటే భగవంతున్ని, భగవంతునిపై విశ్వాసాలను వదులుకోవడమే ఎందుకంటే ? భగవంతుని నీడలో మతం ఉంటుంది కాబట్టి. కొన్ని భగవంతుడు లేని మతాలు కూడా ఉన్నాయి. వాటి విషయాలు తర్వాత చూద్దాం. పదమూడు, పద్నాలుగు రాష్ట్రాలతో పుట్టిన దేశాన్ని వివిధ రాజరిక సంస్థానాలనూ, వివిధ రకాలైన షరతులతో కొన్ని రాజరిక రాజ్యాలను బలవంతంగా కలుపుతూ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కొన్ని కేంద్ర ఆధీనంలోని ప్రాంతాలను కలిపి ఇంత పెద్ద విశాలమైన దేశంగా రూపొందించారు. కొత్తగా ఈ దేశాన్ని నిర్మాణం చేసేట్టప్పుడూ షరతుల మీద కలిపిన రాష్ట్రాలలోని ప్రజలకు, బలవంతంగా ఇండియాలో విలీనం చేసిన ప్రాంతాలలో రాజరిక సంస్థానాలలోని ప్రజలకు వారి విశ్వాసాలనూ, వారి భౌతిక సరిహద్దులనూ, ఆచారాలను, వారి మతాలను గౌరవిస్తామనీ హామీలిస్తూ విశాలమైన భారతదేశాన్ని తయారు చేశారు. దేశం పుట్టినప్పటి నుండి భారత ప్రజలపై వారి విశ్వాసాలకూ, వారి ఆచారాలకు విరుద్ధంగా చట్టాలు తయారు చేయడం జరుగుతూనే ఉన్నది. అందులో భాగంగానే ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి తెరమీది కొచ్చింది. ఈ దేశాన్ని రూపొందించుకునే క్రమంలో, చట్టాలు తయారు చేసుకునే క్రమంలో, ఈ దేశం భిన్న మతాలున్న లౌకిక దేశమని రాజ్యాంగంలో చెప్తూ చట్టాలు తయారు చేశారు. ఉమ్మడి పౌరస్మృతి చట్టంగా చేయాలని ఆరాటపడే పాలకులకు దేశంలోని మెజార్టీ పౌరులైన వెనుకబడిన కులాలకు పరిపాలనలో రాజకీయ భాగస్వామ్యం గుర్తుకు రాకపోవడం ఈ దేశాన్ని అవమానించినట్లు కాదా..! మెజార్టీ బిసి కులాల ప్రజలకు పరిపాలనలో రాజకీయ రిజర్వేషన్లు లేకుండా పరిపాలన కొనసాగుతున్న స్వతంత్ర భారత దేశంలో ఉమ్మడి పౌరసత్వంపై అంత ఆరాటం ఎందుకు? అందరూ సమానమే అందరము సమానమే ఉమ్మడిగా ఉండాలని ఆలోచన చేసే పాలకులకు ఈ దేశంలో మెజార్టీ పౌరులైన వెనుకబడిన కులాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించినప్పుడు అందరూ సమానమే అందరమూ సమానమేననీ పాలకులు చెప్తున్న మాటలకు అర్థం ఉంటుంది గానీ కేవలం నాలుగైదు అగ్రకులాలు రాజ్యమేలుతూ అన్ని మాతాల వారికి చట్టం సమానంగా వర్తించాలనీ చెప్తూ, హిందూ మతంలోని వందలాది కులాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకుండా, భారతీయ సమాజంలో ఇతర మతాలను కనీస గౌరవం లేకుండా చేస్తూ భారతీయులమంతా సమానమైన వ్యక్తులుగా ఉండాలని నీతులు చెప్తే, భారతీయ పౌరులంతా సులభంగా నమ్ముతారా…! నేటి ఆధునిక మానవులు మతానికి, మత విశ్వాసాలకు అతీతంగా జీవిస్తున్నారా!
గుండమల్ల సత్యనారాయణ
9505998838

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News