Saturday, October 5, 2024
Homeఓపన్ పేజ్Opposition: ఐక్యతకు ఆమడ దూరం

Opposition: ఐక్యతకు ఆమడ దూరం

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాల ఐక్యత అనేది ఓ ఎండమావిగా, అందని ద్రాక్షపండుగా మారుతోంది. ఈ ఐక్యతకు అడ్డువస్తున్న అంశం ఒకటే. అయితే గియితే ప్రతిపక్షాలు ఒకే తాటి మీదకు వచ్చి ఓ ప్రంట్‌గా ఏర్పడితే, ఈ ఫ్రంట్‌కు నాయకత్వం వహించేది ఎవరు? సహజంగానే ఈ నాయకత్వ పదవి కోసం దాదాపు ప్రతి బీజేపీయేతర పార్టీ పోటీపడుతోంది. ఈ విషయం ముందుగా తేలిపోతే తప్ప ఫ్రంట్‌ ఏర్పాటు సాధ్యం కాదనేది అర్థమైపోతోంది. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ కార్గే,
రాహుల్‌ గాంధీ కూడా జాతీయ స్థాయి పార్టీ అయిన కాంగ్రెస్‌ సారథ్యంలో మాత్రమే ప్రతిపక్షాల ప్రంట్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తుందంటూ ప్రకటనలిచ్చారు. దీంతో కొన్ని ప్రతిపక్షాలు కాంగైన్‌ మీద కారాలు, మిరియాలు నూరుతున్నాయి. ప్రతిపక్ష కూటమికి నాయకుడంటే భావి ప్రధాని అభ్యర్థి అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పడిన ప్రంట్‌ మాత్రమే ప్రధాని నరీంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీపై విజయం సాధించగలదని, ఇతర పార్టీలకు చెందినవారివరైనా ఈ ఫ్రంట్‌కు నాయ
కత్వం వహిస్తే ప్రజల్లో నమ్మకం కలగదని ఆయన కుండబద్దలు కొట్టారు.

రాహుల్‌ గాంధీ అయితే మరో అడుగు ముందుకు వేశారు. కాంగ్రెస్‌కు మొదటి నుంచి మిత్రపక్షంగా ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రస్తుతం బీజేపీకి బి-టీమ్‌గా, ఒక చెంచాగా మారిందంటూ సూటిగా ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, కాం!గైన్‌ భాగస్కామ్యం లేకుండా ప్రంట్‌ ఏర్పడడం గానీ, ప్రభుత్వం ఏర్పడడం గానీ జరిగే పని కాదని చాలా పార్టీలు చాటుమాటుగా అంగీకరిస్తున్నాయి కానీ, బహిరంగంగా మాత్రం ఎక్కడా పెదవి విప్పడం లేదు. కార్లే నాయకత్వంలోని కాంగ్రెస్‌ మాత్రం తమ నాయకత్వంలో మాత్రమే ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమవుతుందని ప్రకటించి, తమ ప్రధాన షరతును చెప్పకనే చెప్పింది. వాస్తవానికి, 2014లో, ఆ తర్వాత 2019లో కాంగైస్‌ నాయకత్వంలోనే పొత్తులు చోటు చేసుకున్నాయి కానీ, ఎన్నికల్లో అతి దారుణంగా పరాజయానికి గురయ్యాయి. బీజేపీతో నేరుగా పోటీపడిన రాష్ట్రాలలో కాంగైస్‌ దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం దాని సంఖ్యాబలం కనీ వినీ ఎరుగని స్థితిలో అట్టడుగుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రతిపక్షాలకు కాంగైస్‌ ఈ దశలో షరతులు పెట్టడ
మనేది ఒక విధంగా “వినాశకాలే విపరీత బుద్ది” అనే చెప్పాల్సి ఉంటుంది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో మూడ్‌ మారిన మాట నిజమే కానీ, ప్రజల మూడ్‌ కూడా కాంగైస్‌కుసానుకూలంగా మారిందనడానికి ఇంకా దాఖలాలు కనిపించలేదు.
దేశంలోని ప్రతిపక్షాలన్నీ చేతులు కలిపితే తప్ప బీజేపీ మీద విజయం సాధించడానికి అవకాశం లేదన్న సంగతి కాంగ్రెస్‌ నాయకత్వానికి కూడా తెలుసు. ఈ నగ్నసత్యాన్ని అర్థం చేసుకుని కాంగ్రెస్‌ ప్రతిపక్ష ఐక్యతకు నడుం బిగిస్తుందని ఇతర పార్టీలు ఆశించాయి. ప్రతిపక్షాలతో చర్చలకు చొరవ తీసుకోవాల్సిందిగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బహిరంగంగానే కాంగకైస్‌ నాయకత్వానికి సూచించారు.
విచిత్రమేమిటంటే, ఇంకా ప్రయత్నాలు ప్రారంభించక మునుపే కాంగైస్‌ ప్రతిపక్షాల ప్రంట్‌కు నాయకత్వ బాధ్యతలను తలకెత్తుకుంది. కొన్ని ప్రతిపక్షాలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్టు ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఏయే పార్టీలతో చర్చిస్తోందో మాత్రం ఇంతవరకూ బయటపెట్టలేదు. అంతేకాదు, ఎవరు ఎవరితో చర్చలు జరుపుతున్నారన్నది కూడా వెల్లడి కావడం లేదు. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ పొత్తుతోనే ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. ఆయనకు కూడా కాంగైస్‌ ఏ పార్టీతో చర్చలు జరుపుతోందో తెలియడం లేదు. పైగా, ప్రతిపక్షాలతో చర్చలకు ఉపక్రమించాలంటూ ఆయనే కాం(గైన్‌ను అభ్యర్థిస్తున్నారు. తాము ఇప్పటి వరకూ ఏ పార్టీతోనూ చర్చలు ప్రారంభించలేదని, 2024 ఎన్నికలకు ఎటువంటి వ్యూహాన్నీ రూపొందించలేదని కొందరు కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు.

ఏ పార్టీతో చర్చలు జరిపినప్పటికీ ఆ పార్టీ కాంగ్రెస్‌ నాయకత్వానికి అంగీకరిస్తోందా లేదా అన్నది తేలవలసి ఉంది. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించడం జరిగింది. ఆ పార్టీలు కాంగ్రెస్‌నాయకత్వానికి ససేమిరా అంటున్నాయి. ఈ ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి లోక్‌సభలో వందకు పైగాసీట్టున్నాయి. బీజేపీ మీద పోటీ చేయడానికి కాంగ్రెసేతర ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని అవన్నీ భావిస్తున్నాయి. అంతేకాదు, ఈ పార్టీలన్నీ వేటి వ్యూహాల్ని అవి రూపొందించుకోవడం ఇప్పటికే ప్రారంభమై పోయింది. అందువల్ల కాంగైస్‌ ఈ సమయంలో నాయకత్వం గురించి పాకులాడకుండా, ముందుగా ఐక్యత కోసం ప్రయత్నాలు సాగించడం మంచిది. త్వరలో తొమ్మిది రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నస్థితిలో కాంగ్రెస్‌ నాయకత్వం కోసం ప్రయత్నించేకన్నా, ఐక్యత కోసం చొరవ తీసుకుని నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News