Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Optimism: ఆపద ఉన్నచోట - ఆశావాదం వెతకాలి

Optimism: ఆపద ఉన్నచోట – ఆశావాదం వెతకాలి

విషయ పరిజ్ఞానంను పెంపొందించుకోవడం లో మునిగిపోయిన మనం వివేకపూరిత మైన జ్ఞానమును కోల్పోయాము కేవలం పుస్తక జ్ఞానం వలన ప్రయోజనం లేదు. అనుభవ జ్ఞానము అత్యవస రము అమెరికాలో ప్రతి రెండు వివాహాలలో ఒకటి విడాకులకు దారి తీస్తుంది.
మొదట మూర్తిమత్వ వికాసం మన నుంచే రావాలి. పిల్లలు తమ తల్లిదండ్రులను గొప్ప ఆత్మ విశ్వాసము కలిగి ఉండాలని దృఢ నిర్ణయాలు తీసుకో వాలని కోరుకుంటారు. ఈనాటి మానవుడు దృష్టిని మార్చుకొనక సృష్టిని మార్చుటకు ప్రయత్నిస్తున్నాడు. ఎలక్ట్రానిక్‌ రూపంలో ఎంత దగ్గరగా ఉన్నామో, భావో ద్వేగల పరంగా అంత దూరంగా జరుగుతున్నాము.
థింక్‌ లైక్‌ ఏ సీఈఓ, యాక్ట్‌ లైక్‌ అద్లేట్‌..
ప్రతి వ్యక్తి సుఖంగాను సౌకర్యం గాను ఉన్న సమయంలో ఎలా ఉన్నాడు అన్నది కాదు, సవాళ్లు, వివా దాలు ఎదురైనప్పుడు ఎలా ఉన్నాడు అన్నదానిపై వ్యక్తి త్వం ఆధారపడి ఉంటుంది. జీవితంలో అతి పెద్ద రిస్క్‌ ఏమిటంటే ఏ రిస్కు చేయకపోవడమే ప్రతి భయం అనే గోడ వెనుక అమూల్యమైన నిధి దాగి ఉన్నది.
‘అత్యధిక ఒత్తిడి ఉంటేనే బొగ్గు వజ్రంగా మారు తుంది’ హెర్నాండ కోర్టిస్‌ విజయంకు అతి దగ్గర దారి సత్యమార్గమే రెండు బిందువుల మధ్య దగ్గర దారి సరళ రేఖ గాని వక్ర రేఖ కాదు. నిన్ను ఎవరు ఓడించ లేరు. నిన్ను నువ్వు తప్ప సరిగ్గా గొప్ప విజయం సాధించే ముందు ప్రతి వాళ్ళకి ఏదో ఒక సమస్య తలె త్తుతుంది. ఉన్న బాటను చదును చేస్తూనే శిఖరాగ్రంపై వైపు చూపు నిలిపే వాడే నిజమైన విజేతగా నిలబడ తాడు. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడికి కావల సింది. ద్రవ్యం కాదు తెలివితేటలు మాత్రమే. అం దుకే నిజమేనా విజేత శక్తిని విడుదల చేస్తారు గాని సంకు చితం చేయరు. సింగపూర్లో సీతాకోకచిలుకల రెక్కల చప్పుడు నార్త్‌ కెరోలినాలో కురిసే తుఫాను ప్రభావితం చేయగలదు. దానినే ‘బటర్‌ ప్లే ఎఫెక్ట్‌’ అంటారు.
రేపటి గురించి చింతించకు ఎందుకంటే రేపు తన గురించి తానే స్వయంగా ఆలోచించుకుంటుంది. ఈనాడు ఉన్న చెడు గురించి ఆలోచించడానికి ఈ ఒక్క రోజే సరిపోతుంది. విద్యా ధైర్యం అనేవి కవల పిల్లలు అవి నీ చెంత ఉన్నంత వరకు ఏది అసాధ్యం కాదు. సరిగ్గా గురి కుదిరి కొట్టబడిన బాణం వంద ఓటముల ఫలితం. భయానికి విరుగుడు జ్ఞానం ఎదు టివాడు చెడు చూసిన చోట మీరు అవకాశాలు వెతుక్కోండి. నిరాశవాదులు ఎవరు నక్షత్రాల గురించి విజ్ఞానాన్ని గురించి కనుక్కోలేదు. తెలియని ప్రాంతా లకు నౌకాయానం చేయలేదు మనిషి మేదస్సుకు కొత్త స్వర్గాన్ని తెరవలేదు.
చితి శవాన్ని కాలిస్తే దిగులు బతికున్న వాడిని కాలుస్తుంది.
శరీరము మనస్సు వేరు, వేరు కాదు వాటికి విడి విడిగా వైద్యం చేయకూడదు. మనం చేసే పాపాలని దేవుడైన క్షమిస్తాడేమోగాని మన నాడీ మండలం క్షమించదు. అందని చందమామ కోసము, నేల పాలైన పాల కోసం ఏడవకుండా ఉండండి. గుడ్డి వాడిగా ఉండటం అంతా దుఃఖించవలసిన విషయం కాదు గుడ్డితనాన్ని భరించలేక పోవటమే అసలైన దుఃఖము. నేను మార్చలేని విషయాన్ని స్వీకరించడా నికి మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యాన్ని ఆ రెంటికి గల తేడాను తెలుసుకోవడానికి కావలసిన మనో ధైర్యాన్ని దేవుడా నాకివ్వు – రిన్‌ హోల్డ్‌ నీబర్‌.
మీరు మీ గురించి అనుకునేది మీ వ్యక్తిత్వం కాదు, మీరు అనుకునేది మీ వ్యక్తిత్వం. తన ఆత్మను స్వాధీన పరుచుకున్న వ్యక్తి ఒక నగరాన్ని స్వాధీన పరుచుకున్న వ్యక్తి కన్నా శక్తివంతుడు. అన్నీ ఉన్న నెపోలియన్‌ ఆరు రోజులు కూడా సంతోషంగా లేడు. ఏమీ లేని హెలెన్‌ కెల్లర్‌కు జీవితం అందంగా అనిపిం చింది. సుఖం అనేది చాలా మటుకు ఆనందం కాదు. మిల్టన్‌ అంధుడు కావటం వల్లనే అంత మంచి కవి త్వం రాయగలిగాడు. చెవిటి వాడవ్వడం వల్లనే బీతో వెన్‌ అంత చక్కటి సంగీతాన్ని స్వరపరిచి ఉండవచ్చు.
అందత్వం, చెవుడు ఉన్న హెలెన్‌ కెల్లర్‌ అద్భుత విజయాలు సాధించింది. దోస్తోవ్స్కీ, టాల్‌ స్టాయ్‌ జీవి తంలో యాతనలని అనుభవించి ఉండకపోతే అజరా మరమైన రచనలు చేసి ఉండేవారు కాదు. ఎవరూ చద వనిది ప్రతి రోజు కొంచెం చదువు. ఎవరు ఆలోచించ నిది ప్రతిరోజు ఆలోచించు.
‘నేను సాధించినది ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని సాధించగలరు అందులో నాకే మాత్రం సందేహం లేదు. అతను గాని ఆమె గాని నేను పెట్టినంత శ్రమ పెట్టి నాకు ఉన్నంత ఆశ నమ్మకం పెంచుకుంటే చాలు.’ -గాంధీ.
అందరూ కూర్చొని ఆపదలు చూసే చోట అవ కాశం వెతకాలి. అందరూ కూర్చొని దుఃఖించే చోట ఆశా భావం కలిగి ఉండాలి. ఇద్దరు మనుషులు జైలు కటకట లోంచి బయటికి చూశారు.
ఒకడు బురదను మరొకరు నక్షత్రాలను చూశాడు. ప్రారబ్దం మనకి ఒక నిమ్మకాయను అం దించినప్పుడు నిమ్మరసాన్ని తయారుచేయడానికి ప్ర యత్నిద్దాం.
ఓల్‌ బుల్‌ ప్యారిస్‌ లో ఒకసారి కచేరి చేస్తుండగా అతని వయలిన్‌ లోని ‘ఏ ‘అని తీగ ఉన్నట్టుండి తెగి పోయింది. అతను మాత్రం చెక్కుచెదరకుండా మిగతా మూడు తీగల మీద ఆ పాటను వాయించి ముగించాడు. అది కదా జీవితం అంటే. ఎదుటి వారికి మంచి చేయటం అనేది కర్తవ్యం కాదు, అది ఒక ఆనందం ఎందుకంటే అది మీ ఆరోగ్యాన్ని సంతోషాన్ని పెంచు తుంది ఇది కదా అరిస్టాటిల్‌ చెప్పిన ఉదాత్తమైన స్వార్థం.
ఎక్కడ ద్వేషం ఉందో అక్కడ ప్రేమను నాటు. గాయం ఉన్నచోట క్షమను స్థాపించు. సందేహం ఉన్న చోట నమ్మకం కలిగించు. నిరాశ ఉన్న చోట ఆశను వెలిగించు. అంధకారం ఉన్నచోట సంతోషాన్ని నెలకొల్పు.
అడగండి అది మీకు ఇవ్వబడుతుంది.
వెతకండి అది మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి మీకోసం అది తెరుచుకుంటుంది.
– సాదే సురేష్‌
9441692519

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News