Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Orissa Assembly elections: ఒడిశాలో అమీ తుమీ పోరాటం

Orissa Assembly elections: ఒడిశాలో అమీ తుమీ పోరాటం

అచ్చు జయలలిత లానే నవీన్ పరిస్థితి కూడా

రాజకీయాలనే సరికి ఇక్కడ నీతి నియమాలు ఉండవని, ఏది చేసినా చెల్లిపోతుందని అందరికీ అర్థమై పోతుంది. ఎవరికి ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో చెప్ప డం చాలా కష్టం. ఇతరులను వంచించడం, తనను తాను వంచించుకోవడం కూడా ఇక్కడ సహజ పరిణామమే. అధి కారం చేపట్టడానికి ప్రజల తీర్పును కోరుతున్నామనే ముసుగులో రాజకీయాలను ఉపయోగించి ప్రత్యర్థులను అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రయత్నం చేయడం జరుగు తుంది. ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో బీజేపీ, పాలక బిజూ జనతాదళ్‌ (బి.జె.డి)ల మధ్య జరుగుతున్న వాడి వేడి మాటలను, పదజాలాన్ని చూసిన వారికి ఇదే విషయం నిర్ధారణ అవుతుంది. క్రీస్తుపూర్వం 321లో జరిగిన కళింగ యుద్ధం మాదిరిగానే లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కూడా అత్యంత శక్తిమంతుడైన నరేంద్ర మోదీకి, సాదా సీదా రాజకీయ నాయకుడుగా కనిపించే నవీన్‌ పట్నాయక్‌కు మధ్య ఒడిశాను చేజిక్కించుకోవడానికి భీకర సమరం జరుగుతోంది.
ఒడిశా ముఖ్యమంత్రిగా ఆరవ సారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న 77 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ తనకు వీలైనంతగా మోదీ సైన్యంతో పోరాడుతున్నారు. తన రాష్ట్రం గురించి తప్ప మిగిలిన భారతదేశం గురించి ఏమాత్రం పట్టని నవీన్‌ పట్నాయక్‌ను ఆయన విమర్శకులు సైతం విమర్శించరు. కానీ, ఇప్పుడు ఎన్నికల ప్రచారం పేరుతో సాగుతున్న దుర్భాషల యుద్ధంలో ఆయన పాల్గొ నక తప్పడం లేదు. నవీన్‌ పట్నాయక్‌లోని లోపాలనన్ని టినీ వేలెత్తి చూపించడం, ఆయన నెరవేర్చని వాగ్దానా లన్నిటినీ గుర్తు చేయడం, దుర్భాషలను సంధించడం పెద్ద ఎత్తున జరుగుతోంది. అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండ డానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న నవీన్‌ పట్నాయక్‌ ఒక పక్క, ఆయనను నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడా నికి, కనీసం తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ మరొకపక్క ప్రస్తుతం ఒడిశాను అతలా కుతలం చేస్తున్నాయి.
నవీన్‌కు అగ్ని పరీక్ష
ఆయన ఇంత వరకూ రాష్ట్రాన్ని ఎలా పాలించారన్నది లెక్కలోకి రావడం లేదు. ఆయన అందరికీ దూరంగా ఉండడం, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను తన పక్కన పెట్టుకోవడం మీద అంతా దాడి చేయడంం జరుగు తోంది. పట్నాయక్‌ తన వెనుకటి ప్రాభవాన్ని కోల్పో యారని, ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోందని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో విలువేమీ లేనందువల్ల, పట్నాయక్‌ ఒంటరిగా మిగిలిపోయినం దువల్ల, ఆయన మీద విజయం సాధించడానికి ఇదే మంచి అవకాశమని బీజేపీ పావులు కదుపుతోంది. నిజానికి ఇటువంటి ప్రయత్నం చేయడం వల్ల బీజేపీ తమకు బాగా నమ్మకస్థుడైనా భాగస్వామ్య పక్షాన్ని దూరం చేసుకుం టోంది. పార్లమెంటులో అనేక బిల్లులకు బి.జె.డి అడగ కుండానే మద్దతునివ్వడం జరిగింది. నవీన్‌ పట్నాయక్‌ పాలనా దక్షతను పక్కనపెట్టిన బీజేపీ ఇప్పుడు ఆయనను ఏదో విధంగా పదవి నుంచి దించడాన్నే పరమావధిగా పెట్టుకుంది. ఆయనకు ప్రజల్లో ఆకర్షణ తగ్గిందని, దీన్ని తాము సొమ్ము చేసుకోవాలని మాత్రమే బీజేపీ భావి స్తోంది. ఒడిశాతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులతో ఆయన పాలన సాగిస్తున్నారని కూడా ప్రచారం సాగి స్తోంది.
బహుశా ఈ కారణంగానే ఒడిశాలో మూలాలు లేని మాజీ ఐ.ఎ.ఎస్‌ అధికారి ఒడిశా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిచడం జరుగుతోంది. మొదటి నుంచి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న వి. కార్తికేయన్‌ పాండ్యన్‌ అనే మాజీ ఐ.ఎ.ఎస్‌ అధికారి ఒడిశా సంస్కృతీ సంప్రదా యాలను కాల రాస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒడిశాకు చెందిన ఐ.ఎ.ఎస్‌ అధికారిని పెళ్లి చేసుకున్న పాండ్యన్‌ వెనుకబడిన ఒడిశా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు. నవీన్‌ పట్నాయక్‌ గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు పాండ్యన్‌ మీద కూడా అస్త్రశస్త్రాలను సంధిస్తోంది. విచిత్రమేమిటంటే రెండు మూడు వారాల క్రితమే మోదీ ఒడిశా వచ్చి నవీన్‌ పట్నాయక్‌ను ప్రశం సించడం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్యా పొత్తుకు సంబంధించిన చర్చలు విఫలం కావడంతో ప్రస్తుతం ఎవరి పోరాటాన్ని వారు సాగించుకోవలసి వస్తోంది. పట్నాయక్‌ విషయంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నందువల్ల ఈ అవకాశాన్ని జారవిడుచుకోరాదని బీజేపీ గట్టి నిర్ణయంతో ఉంది.
అధికారమే ప్రధానం
ఇక్కడి 21 లోక్‌ సభ స్థానాల్లో 15 స్థానాలను చేజిక్కిం చుకోవాలని, ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసు కోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది. పొత్తుకు సంబం ధించిన చర్చలు విఫలమైన దగ్గర నుంచి పట్నాయక్‌ ప్రభుత్వం మీద అన్ని వైపుల నుంచీ బీజేపీ దాడి చేయడం మొదలుపెట్టింది. పట్నాయక్‌ ప్రాభవాన్ని తగ్గించడం, సంస్కృతీ సంప్రదాయాలు మట్టిలో కలిసిపోతున్నాయని ఆరోపించడం జరుగుతోంది. స్థానిక బీజేపీ నాయకులు ఇక్కడ పట్నాయక్‌ మీద వ్యక్తిగతంగా కూడా విమర్శలు సంధించడం ప్రారంభించారు. “పట్నాయక్‌ ఈ రాష్ట్రాన్ని పాతికేళ్లుగా పాలిస్తున్నారు కానీ, ఆయనకు ఇక్కడి ఒక్క జిల్లా ప్రధాన కేంద్రం పేరు కూడా తెలియదు. ఇక ప్రజల సాధక బాధకాలు ఆయనకు ఎలా తెలుస్తాయి’ అంటూ మోదీ విమర్శించారు. ‘మీరు 2014, 2019 సంవత్సరాల్లో ఒడిశాకు చేసిన వాగ్దానాలు మీకు గుర్తున్నాయా? ఒడిశా అభివృద్ధికి మీరు చేసిందేమిటి? సంస్కృత భాష అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు గానీ ఒడిశా భాష అభివృద్ధికి ఒక్క రూపాయయినా ఇచ్చారా? భారత రత్న ఇవ్వడానికి ఒడిశాలో ఎవరూ కనిపించలేదా? ముందు మీ గురించి మీరు తెలుసుకోండి’ అంటూ పట్నా యక్‌ ధ్యజమెత్తుతున్నారు.
‘ఇక్కడ జరుగుతున్న శాసనసభ ఎన్నికలు ఒడిశా వైభవానికి అద్దం పడతాయి. ఒక తమిళ వ్యక్తిని అంద లాలు ఎక్కిస్తారా? మేం గనుక అధికారంలోకి వచ్చే పక్షం లో ఒడిశా సంస్కృతీ సంప్రదాయాలు తెలిసిన యువ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తాం’ అంటూ హోం మంత్రి అమిత్‌ షా కూడా వ్యాఖ్యానించారు. ‘నేను పుట్టింది తమిళనాడే కావచ్చు. కానీ, ఉద్యోగ బాద్యతలు నిర్వ ర్తిస్తున్నది ఒడిశా. నేను ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిననేది ముఖ్యం కాదు. తమిళనాడు నా జన్మభూమి. కానీ ఒడిశా నా కర్మ భూమి. నేను మొదట భారతీయుడిని. ఆ తర్వాతే తమిళ వ్యక్తిని’ అంటూ పాండ్యన్‌ కూడా సమాధాన మిచ్చారు. నిజానికి పట్నాయక్‌ కూడా మితవాద హిందు త్వవాదే. భారతదేశంలో అనేక దేవాలయాల పునరుద్ధర ణకు మోదీ, బీజేపీ కృషి చేస్తున్నట్టే ఆయన కూడా ఒడిశాలో పూరీతో సహా అనేక పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. దేవాలయాల పునరుద్ధరణకు ఆయన ఈ ఏడాది రూ. 4,000 కోట్లు కేటాయించడం జరిగింది.
ఆయన అయోధ్య రామ మందిరం ప్రారంభం కావ డానికి ముందు రూ. 800 కోట్ల వ్యయంతో నిర్మించిన పూరీ జగన్నాథ ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఒడిశా ముఖ్యమంత్రి మీద ఇతర రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు దాడి చేయడం ఎక్కువైంది. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న మాజీ ఐ.ఎ.ఎస్‌ అధికారి అశ్వినీ వైష్ణవ్‌ కు రాజ్యసభ స్థానాన్ని ఇచ్చింది బీజేడీ ప్రభుత్వమే. అయితే, రాష్ట్రం మీద పూర్తి అధికారాన్ని సంపాదించాలన్నది బీజేపీ ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. ఒక మిత్రపక్షంగా ఉండిపోవడానికి ఈ పార్టీ సిద్ధంగా లేదు.

  • కె.వి. రామాచారి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News