Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్OU Telugu literary Congress 2024: ఓయూ తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024

OU Telugu literary Congress 2024: ఓయూ తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024

గుండెల నిండా ఆశలు నింపే ఓయు ఆర్ట్స్ కాలేజీకి పల్లెటూరి నుండి వచ్చే పేద విద్యార్థుల మెదలలో అక్షర జ్ఞానాన్ని అందించి, ఆత్మస్థైర్యాన్ని నింపి, బతుకుతెరువు చూపించి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి, విద్యార్థుల ఎదుగుదలలో వారి వెంట మేమున్నాంఅని ధైర్యం చెప్పే ప్రొఫెసర్లను కల్లారా చూసుకొని, ఆర్ట్స్ కళాశాల రూపాన్ని కళ్ళనిండా నింపుకొని సాహిత్య సభలను చూసి తెలుగు భాష గొప్పతనాన్ని ప్రతి ఒక్కరము మన భుజాల పైకి ఎత్తుకొని భావితరాలకు తెలుగు భాష యొక్క స్ఫూర్తిని నింపడానికి ఓయూ తెలుగు శాఖ నిర్వహిస్తున్న చారిత్రాత్మక కార్యక్రమమే “ తెలుగు లెటర్ కాంగ్రెస్ 2024 ”.
పాఠశాల ప్రారంభంలో పలకపై చుట్టే శ్రీకారంతో మొదలుకొని విశ్వవిద్యాలయంలో పి.హెచ్ డి వరకు తెలుగు భాషను అన్ని దశల్లో శిఖరాగ్రాన నిలబెట్టడానికి ప్రపంచం నలుమూలలా తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకొని తమ ఆత్మ గౌరవాన్ని చాటుకునేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులందరూ ఆహ్వానిస్తున్న తెలుగు ప్రపంచ మహాసభల సంబురమే తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024.
వందేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి నిరంతరం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది.పాశ్చాత్య సంస్కృతిని అంటి పెట్టుకోకుండా, తామరాకు మీద నీటి బొట్టులా తెలుగు భాష తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకొని నిరంతరం ఎన్నో కొత్త అంశాలను పరిశోధనాత్మకంగా వెలుగులోకి తీసుకురావడంలో ఉస్మానియా తెలుగు శాఖకు వెన్నతో పెట్టిన విద్య. పద్యం, కవిత్వం, నవల, నాటకం, కథ, కథానిక, విమర్శ, జానపద సాహిత్యం, సంస్కృత సాహిత్యం, స్త్రీ వాదం, దళితవాదం, మైనారిటీ వాదం, ఇంకా ఎన్నో సాహిత్య అంశాల పైన విశేషమైన పరిశోధనలు జరిపి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలల చాటి చెప్పింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ.

- Advertisement -

ప్రతి ఏటా సైన్స్ కాంగ్రెస్, ఎకనామిక్ కాంగ్రెస్ ల పేర్లతో సమావేశాలు నిర్వహించుకోవడం మనం దినపత్రికలలో చదువుతుంటాంప్రసారమాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. ఇదేవిధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు భాషకు కూడామొట్టమొదటి తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024 పేరుతో తెలుగు భాషాభివృద్ధికై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ తెలుగు సాహిత్య మహాసభలను 2024 ఫిబ్రవరి 15,16,17 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించడానికి పూనుకుంది. ఈ మహత్తర కార్యానికి ప్రొఫెసర్ సి కాసిం కన్వీనర్ గా, ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ కో కన్వీనర్ గా, ఆచార్య సూర్య ధనంజయ్, ప్రొఫెసర్ విజయలక్ష్మి , ప్రొఫెసర్ వారిజారాణి, డాక్టర్ ఎస్ రఘు సాభాధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా పరిశోధక విద్యార్థులైన ఇమ్మిడి మహేందర్, రాజీవ్, బొడ్డుపల్లి అఖిల్ ,జబ్బు మధు, బూడిద ఆంజనేయులు, కురుమయ్య, గుర్జకుంట స్వరాజ్, పల్లె సతీష్, ప్రవీణ్ కుమార్, చేవెళ్ల యాదగిరి, సూరపల్లి జయప్రకాష్ నారాయణ, శాంతి, లావణ్య, సోమనాథ్, మారేపల్లి లక్ష్మణ్, రాము, లక్ష్మి, వీరితోపాటుMA తెలుగు విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ తెలుగు లిటరరీ కాంగ్రెస్ 2024లో దాదాపుగా 350 కి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు పరిశోధకులు తెలుగు సాహిత్యంలో నూతన ధోరణుల పైన పలు రకాల పత్రాలు సమర్పణ చేస్తారు పలు అంశాల పైన ప్రసంగాలు పాఠాలు కవితలు కథలు పద్యాల పైన తమ పరిశోధనాత్మకమైన ప్రసంగాల ద్వారా నేటి కాలంలో తెలుగు భాషా ధోరణి శ్రోతలకు తెలుపుతారు దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న తెలుగు లెటర్రి కాంగ్రెస్ 2024 కార్యక్రమంలో కేవలం ఎంపిక చేయబడ్డ ప్రముఖ కవులు, రచయితలు, సాహిత్య విమర్శకులు, తెలుగు భాష సాహిత్య విషయాలలో ప్రసిద్ధి చెందిన వారు మాత్రమే తమ పరిశోధనా పత్రాలు సమర్పిస్తారు వాటిపైన ప్రసంగిస్తారు.
తెలుగు మహాసభలలో మొదటి రోజు చర్చకు వచ్చే అంశాలు కవిత్వం గురించి వివరిస్తూ కవిత్వం ఎలా రాయాలి నూతనంగా కవిత్వం రాస్తున్న యువ కవులకు కవిత్వ తత్వాన్ని వివరించేవారు ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ సభాధ్యక్షులుగా ముఖ్యఅతిథి సతీష్ చందర్, డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గుంటూరు లక్ష్మీ నరసయ్య డాక్టర్ గండ్ర లక్ష్మణరావు ప్రొఫెసర్ సి కాసిం డాక్టర్ చంద్రయ్య మొదలైన వారంతా 2024 ఫిబ్రవరి 15 మధ్యాహ్నం రెండు నుండి నాలుగు వరకు ఆర్ట్స్ కాలేజీ రూమ్ నంబర్ 133లో సమావేశాలు జరుగుతాయి.
కథలు అంటే ఇష్టపడని వారు ఉండరు. మానవ జీవితంలో ఎన్నో కథలు ప్రతి ఒక్కరి జీవితాన్ని తరచి చూస్తే మనకు ఎన్నో కథలు తారస పడుతూ ఉంటాయి. కథలు ఎలా రాయాలి? సినిమాలకు రాసే కథలు రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెలకువలు పాటించాలి మొదలైన అంశాలు కథకు సంబంధించిన శిల్పము, నైపుణ్యము, ఇవన్నీ వివరించేవారు సభాధ్యక్షులు: ప్రొఫెసర్ సూర్య ధనంజయ, ముఖ్యఅతిథి: ఓల్గా, అట్టాడ అప్పలనాయుడు, మహమ్మద్ ఖదీర్ బాబు. కాలువ మల్లయ్య ,వేణు ఉడుగుల, ప్రొఫెసర్ బన్నఅయిలయ్య మొదలైన వారు ఆర్ట్స్ కళాశాలలో 2024 ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రము 4 నుండి 6 వరకు రూమ్ నెంబర్ 133లో జరిగే సమావేశంలో పాల్గొని తమ విలువైన కథలకు సంబంధించిన అంశాలను వివరిస్తారు.
తెలుగు సాహిత్య మహాసభలలో రెండవ రోజు 2024 ఫిబ్రవరి 16 మొదటి సమావేశం ఉదయము 10 నుండి మధ్యాహ్నం 1 వరకు ఆర్ట్స్ కళాశాల రూమ్ నంబర్ 133 లో “నవల సమయం” పేరుతో నవల యొక్క ఔషత్యాన్ని వివరించేవారు సభాధ్యక్షులు: డాక్టర్ ఏలే విజయలక్ష్మి, ముఖ్యఅతిథి :అంపశయ్య నవీన్, బండి నారాయణస్వామి, పెద్దింటి అశోక్ కుమార్, ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు, అల్లం రాజయ్య, కాసుల ప్రతాపరెడ్డి మొదలైన వారు పాల్గొని నవల రచన ఎలా చేయాలి? నవల లోని శిల్పం ఎలా నిర్మించాలి పాత్రల ప్రాధాన్యత ఎలా ఉండాలో పరిశోధనాత్మకమైన ప్రసంగాల ద్వారా వివరిస్తారు.
మరో సమావేశం2024 ఫిబ్రవరి 16 మధ్యాహ్నం 2 నుండి 4 వరకు “విమర్శ దర్శనం” పేరుతో తెలుగు సాహిత్యంలో విమర్శ యొక్క ప్రాధాన్యత ఏమిటి? ఉత్తమ విమర్శ ఎలా ఉండాలి? విమర్శ ద్వారా సాహిత్యంలో నూతన కోణాన్ని ఎలా ఆవిష్కరించవచ్చో వివరించేవారు సభాధ్యక్షులు: డాక్టర్ ఎస్. రఘు, ముఖ్యఅతిథి: ప్రొఫెసర్ అనుమాండ్ల భూమయ్య, ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, ఇమ్మిడి మహేందర్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి, పి వరలక్ష్మి తమ ప్రసంగాల ద్వారా తెలుగు సాహిత్యంలో విమర్శ యొక్క ప్రాధాన్యాన్ని వివరిస్తారు.
తెలుగు సాహిత్య మహాసభలలో మూడవ రోజు 2024 ఫిబ్రవరి 17 ఉదయం10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్ట్స్ కళాశాల రూమ్ నెంబర్ 133లో పరిశోధకుల గురించి “పరిశోధన విపంచి” అనే పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పరిశోధనలో అంశం ఎలా ఎంచుకోవాలి? సమాచారాన్ని ఎలా సేకరించాలి? సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించాలి? సిద్ధాంత గ్రంథం ఎలా రాయాలి? సిద్ధాంత వ్యాసాలు రాయాలంటే ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? పరిశోధనలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? మొదలైన అంశాలను అనుభవజ్ఞులైన ఆచార్యులు వివరిస్తారు. సభాధ్యక్షులు :ప్రొఫెసర్ వారిజారాణిరని ముఖ్యఅతిథి: ప్రొఫెసర్ ఏల్లూరిశివారెడ్డి,ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, డా. పులికొండసుబ్బాచారి, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి. డా. నలిమెల భాస్కర్, డా.సంగిశెట్టి శ్రీనివాస్ డా. ఎం. ఎం వినోదిని మొదలైన వారు పరిశోధన గురించి విశ్లేషణాత్మకమైన వివరణను ఇస్తారు.
మధ్యాహ్న భోజన విరామం తర్వాత “వర్తమాన తెలుగు భాషా సాహిత్యల గమనం” గమ్యం గురించి వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖ అధ్యక్షులతో “చర్చాగోష్టి” మధ్యాహ్నం 2 నుండి 4 వరకు జరుగుతుంది. సాయంత్రం 4 నుంచి6 గంటల వరకు సాహిత్య మూల్యాంకనం పైన పానెల్ డిస్కషన్ జరుగుతుంది. ఈ విధంగా పైన సూచించిన కార్యక్రమాల అన్నింటికీ పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు తెలుగుని బోధించే టీచర్స్, లెక్చరర్స్,అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్ మొదలైన వారందరికీ ప్రవేశ ఫీజు 600 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా హాజరు అవ్వాలి. తెలుగు పరిశోధక విద్యార్థులకు, ఎం.ఏ తెలుగు విద్యార్థులకు ఎలాంటి ఫీజు అనేది లేదు. ఈ విధంగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు.

2024 ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో సాయంకాలం సాహిత్య సభలు అనేవి ఆర్ట్స్ కళాశాల ముందర సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు కవిత వసంతం పేరుతో ఉచితంగా పాట కవులు : అందెశ్రీ, జయరాజు, విమలక్క, యోచన,మాట్ల తిరుపతి, చింతల యాదగిరి, కంకిపాటి రాజా తమ పాటలతో అలరిస్తారు. వచన కవులు: ధర్మశయనంశ్రీనివాసాచార్య, యాకూబ్, విల్సన్ సుధాకర్, అన్నవరం దేవేందర్, పగడాల నాగేందర్, సిద్దెంకి యాదగిరి, పొన్నాల బాలయ్య, తగుళ్లగోపాల్,పల్లిపట్టు నాగరాజు, మహేశ్వరం అంబదాసు, తమ వచన కవితల ద్వారా అందరికీ కవిత్వం యొక్క మాధుర్యాన్ని పంచుతారు.
రెండో రోజు సాయంకాలం 6 నుండి 9 వరకు “కవితా పొద్దు” పేరుతో పాట కవులు: మాస్టార్జీ, గజల్ శ్రీనివాస్, వరంగల్ శ్రీను, అంబటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, ఏపూరిసోమన్న, కొమిరె వెంకన్న, పల్లె నర్సింహా తమ కవిత్వం ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తీసుకొస్తారు.
వచన కవులు: నాలేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, స్కైబాబా,బెల్లి యాదయ్య, అరసవెల్లి కృష్ణ, సిరికి స్వామి నాయుడు, గుడిపల్లి నిరంజన్, తైదల అంజయ్య, పసునూరి రవీందర్, పుప్పాల శ్రీరామ్, మెర్సీమార్గరేట్ ,వనపట్ల సుబ్బయ్య, భూపతి వెంకటేశ్వర్లు మొదలైన వారు పాల్గొనే “కవితా పొద్దు” నిర్వాహకులు బూడిద. ఆంజనేయులు తెలుగు పరిశోధక విద్యార్థి
మూడవ రోజైన 2024 ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రము 6 గంటల నుండి 7,గంటల 30 నిమిషాల మధ్యకాలంలో మొట్టమొదటి తెలుగు మహాసభలు“ తెలుగు లిటరరి కాంగ్రెస్ 2024” ముగింపు వేడుకల సమావేశాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇంతటి మహాతరమైన వికీ ప్రతి ఒక్క సాహిత్య అభిమాని సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ

పల్లె సతీష్
తెలుగు పరిశోధక విద్యార్థి
ఉస్మానియా విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News