వాణిజ్యం పేరుతో భారత దేశంలోకి దొంగ చాటుగా చేరి సుదీర్ఘకాలం పాటు దేశ సంప దను యధేచ్చగా దోచుకొని వెళ్తూ వెళ్తూ దేశాన్ని పత ప్రాతిపదికన రెండు ముక్కలుగా విడగొట్టి పోయారు బ్రిటి ష్ వాళ్ళు. అయితే ఒక్క రోజు తేడాతో బ్రిటిష్ వారి నుండి స్వాతంత్య్రం పొంది 75 వసంతాలు పూర్తవుతున్న తరు ణంలో భారత్ మరియు పాకిస్తాన్ దేశాల ప్రస్తుత పరిస్థితి బేరీజు వేస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఒక వైపు బల హీనమైన ఆర్ధిక పరిస్థితి, పేదరికం, నిరక్షరాస్యత, సాం ఘిక దురాచారాలతో కొట్టుమిట్టాడుతున్న భారతదేశం ఎన్నో రాజకీయ ఒత్తిడులు, సంక్షోభాలను అధిగమించి ఎంతో సంయమనంతో మానవ మరియు సహజ వనరు లను వినియోగించుకుంటూ, ప్రణాళికాబద్ధంగా కొనసా గుతూ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుతుగున్న ఆర్ధిక వ్యవస్థగా దూసుకుపోతుంటే మరోవైపు పాకిస్తాన్ మాత్రం రాజకీయ అనిశ్చితి, మిలటరీ పాలకుల దుందు డుకు చర్యలు, తీవ్రవాద కలాపాలకు అడ్డాగా మారి ఆర్ధిక పతనావస్థ వైపు పరుగులు పెడుతోంది. నేటి ఈ పరిస్థితికి దారితీసిన కారణాలను ఒకసారి అవలోకిద్దాం.
ఆర్ధిక మాంద్యానికి కారణాలు
2022 వేసవిలో పాకిస్తాన్‌లో భీభత్సం సృస్చ్టించిన వరదల కారణంగా 30 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టాన్ని చవిచూడటం, కుంటుబడిన దేశీయ ఉత్పాదకత, ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన విదేశీ ఋణాలతో పూర్తి గా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుని రోజురోజుకు పెరిగిపో తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేక చతికిలబడి ప్రపంచ బ్యాంకు మరియు బాహ్య దేశాల వైపు బేలగా చూస్తోంది. నెలల తరబడి ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సవాళ్ల కారణంగా ఆహారం, గ్యాస్ మరియు చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. సంవత్సరాల తరబడి దేశం చేసిన అధిక బాహ్య ఋణాలు, సకాలంలో వాటిని తిరిగి చెల్లించలేక పోవడంతో కరెన్సీ క్షీణించి దిగుమతులు మరింత భారం గా మారాయి. తలసరి తక్కువ ఉత్పాదకత కారణంగా చెల్లింపుల సమతౌల్య సంక్షోభం ఏర్పడడంతో దేశం విని యోగించే దిగుమతులకు నిధులు సమకూర్చడానికి తగి నంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించలేక పోయింది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, అడు గంటుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలతో జూన్ 2022 నాటికి ద్రవ్యోల్బణం ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు సుశాంత్ సరీన్ అధ్యయనం ప్రకారం, పాకిస్థాన్ గత 25 ఏళ్లలో ప్రతి ఐదేళ్లకు రెట్టింపు అప్పులు చేస్తోంది. 1999లో మిలటరీ అధినేత జనరల్ ముషారఫ్ ఏలుబడి మొదట్లో దేశీయ ఋణాలు 3.06 ట్రిలియన్లు కాగా 2022లో ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగేనాటికి 62.5 ట్రిలియన్లు. దేశీయ ఋణాలు సంవత్సరానికి సగటున 14 శాతం పెరుగుతుండగా, అదే కాలానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 3 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2022 ఆర్థిక సంవత్స రంలో రూ. 5.2 ట్రిలియన్లు గా ఉన్న రుణ సేవల బాధ్య తలు మొత్తం ఫెడరల్ ప్రభుత్వ ఆదాయాన్ని మించి పోయింది. 2019 ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ బ్యాంకు తన ముందుంచిన అనేక నిబంధనలు మరియు షరతులను అంగీకరించి ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నించి నప్పటికీ ఋణం పొందడంలో విఫలమయ్యారు.
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు:
ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఫిబ్రవరి 16 న 38.42 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 23తో ముగిసిన వారానికి ఏడాది ప్రాతిపదికన 41.54 శాతానికి చేరుకోవడంతో ఆర్ధిక మాంద్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ద్రవ్యోల్బణంలో కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసినట్లు పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పిబిఎస్) విడుదల చేసిన సెన్సిటివ్ ప్రైస్ ఇండికేటర్ (ఎస్ పిఐ) గణాంకాలు తెలిపాయి. 8 మార్చ్ 2003 నాటికి ఒక కిలో గోధుమలు రు.118, గోధుమ పిండి రు.125, గోధుమ రవ్వ రు.160, శెనగ పప్పు రు.260, పెసర్లు రు.240, సిరి శెనగ పప్పు రు.260, బ్లాక్ టీ రు.1800, గ్రీన్ టీ రు. 1550, పంచదార రు.120, బెల్లం రు.140, పాలు రు. 160, పెరుగు రు.180, పాల పౌడర్ రు.1450, నెయ్యి రు.1800, బీఫ్ రు.700, చికెన్ రు.420 గా ఉన్నాయి. ధరల వ్యత్యాసం పరంగా చూస్తే ఉల్లిపాయలు 433.44 శాతం, చికెన్ 101.86 శాతం, డీజిల్ 81.36 శాతం, కోడి గుడ్లు 81.22 శాతం, సాధా రణ బియ్యం 74.12 శాతం, బాస్మతి బియ్యం నూకలు 73.05 శాతం, పెట్రోల్ 69.87 శాతం, పెసర్లు 67.98 శాతం, అరటిపళ్ళు 67.68 శాతం, టీ 63.89 శాతం, శెనగ పప్పు 56.93 శాతం, బ్రెడ్ 55.36 శాతం, సిరి శెనగ పప్పు 53.42 శాతం, ఎల్పీజీ గ్యాస్ 52.68 శాతం మరియు సిగరెట్లు 50.02 శాతం పెరిగాయి. ఇది కాక విదేశీ ప్రయాణాలపై ఎక్సైజ్ సుంకం కూడా పెరిగింది.
కుదేలైన ఆర్ధిక వ్యవస్థ:
మార్చి 2022 చివరి నాటికి 11.425 బిలియన్ డాలర్లుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ రిజర్వ్‌లు క్రమంగా డిసెంబర్ నాటికి దాదాపు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 6.715 బిలియన్ డాలర్లకు మరియు విదేశీ మారక నిల్వలు కేవలం ఐదు వారాల సరుకుల దిగుమతు లకు సరిపోయేంతగా క్షీణించాయి. మార్చి 2022 లో డాలర్ తో రు.183.48 గా ఉన్న రూపాయి మారకం విలువ స్థిరంగా క్షీణిస్తూ 9 డిసెంబర్ 2022 నాటికి రూ.224.40 కి చేరి ఆర్థిక సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. జనవరి 2023లో మొట్ట మొదటి సారిగా పాకి స్తాన్ యొక్క అతిపెద్ద బ్యాంక్ కార్య నిర్వహణాధికారి హబీబ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ గాడితప్పిన దేశ ఆర్ధిక పరిస్థితి నేపథ్యంలో వాటాదారులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే అది ‘ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ’ అని అభిప్రాయపడ్డాడు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా జనవరి 2023 లో పాకిస్తాన్ తన కరెన్సీపై కృత్రిమ పరిమితిని ఎత్తివేసింది, దీనివల్ల కొన్ని రోజుల్లో డాలర్‌తో రూపాయి 20% పడిపోయింది. ప్రభుత్వం ఇంధన ధరలను 16% పెంచడంతో పాటు పాకి స్తాన్ సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేటును 100 బేసిస్ పాయింట్లు పెంచింది. 2023 సంవత్సరం ప్రథమార్థంలో పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం సగటున 33% ఉండవచ్చని ఫిబ్రవరి 2023లో ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీ ఆర్థికవేత్త ఒకరు అంచనా వేశారు. మరో పక్క పాకిస్తాన్ వినియోగదారుల ధరల సూచీ 31.5%కి పెరిగి 50 సంవత్సరాల గరిష్ట వార్షిక రేటును నమోదు చేసింది.
విద్యుత్ సబ్సిడీ ఉపసంహరణ కారణంగా అక్టోబర్ 2022లో దేశవ్యాప్తంగా 1,600 గార్మెంట్ మిల్లులు మూ తపడ్డాయని, ఫలితంగా ఐదు మిలియన్ల మంది ఉపాధి కోల్పోయారని ఆల్ పాకిస్తాన్ టెక్స్‌టైల్ మిల్స్ అసోసి యేషన్ ప్రకటించింది. డిసెంబర్ 2022లో దేశవ్యాప్తంగా మిల్లులు 50% కంటే తక్కువ సామర్థ్య వినియోగంతో నడిచాయని, 2023 నుండి వస్త్ర ఎగుమతులు మరింత పడిపోవచ్చని ఏపీటీఎంఏ ఆందోళన వెలిబుచ్చింది. మరో వైపు పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జాబితా లోని ప్రముఖ కంపెనీలు పాక్ సుజుకి మోటార్స్, మిల్లత్ ట్రాక్టర్స్, ఇండస్ మోటార్స్ కంపెనీ, ఘంధార టైర్ అండ్ రబ్బర్ కంపెనీ, నిషాత్ చునియన్ మరియు ఫౌజీ ఫర్టిలైజర్ బిన్ ఖాసిమ్ తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. నానాటికీ తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో వ్యాపారులు విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించు కోవాలని అవసరమైతే మూసివేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
దిద్దిబాటు చర్యలు:
రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియం త్రించడం, విదేశీ మారక నిల్వలను స్థిరీకరించడం మరి యు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రక్రియలో భాగంగా అనవసరమైన మరియు విలాసవంతమైన వస్తువుల దిగుమతిని పాకిస్తాన్ నిషేధించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) బెయిలౌట్ ఒప్పందానికి ప్రతిష్టంభన ఏర్పడడంతో దాని షరతులకు తలొగ్గి మే 2022 లో ఇంధన ధరలపై పరిమితిని ఎత్తివేసింది. ఐఎంఎఫ్ విద్యుత్ ధరలను పెంచాలని, పన్నుల వసూళ్లను వేగవంతం చేయా లని మరియు బడ్జెట్‌లో భారీ కోతలు విధించాలని కూడా పట్టుబట్టింది. ఫెడరల్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ 14 మే 2022న విలేకరులతో మాట్లాడుతూ, దిగుమతుల కారణంగా అదనపు ఆర్థిక ఒత్తిడి ఏర్పడుతుందని, 2020లో 640 మిలియన్ డాలర్ల విలువ గల టీ దిగుమతి చేసుకుని ప్రపంచంలోనే అతిపెద్ద టీ దిగుమతిదారుగా నిలిచిన పాకిస్తానీయులు తమ టీ వినియోగాన్ని వీలైనంత మేర తగ్గించుకోవాలని చెప్పారు.
1958 నుండి ప్రపంచంలోనే అత్యధికంగా 23 సార్లు ఐఎంఎఫ్ నుండి ఇలాంటి బెయిల్ అవుట్ సహాయాన్ని పొందిన పాకిస్తాన్ కు ఈసారి మాత్రం పరిస్థితి అంత అనుకూలంగా లేదు. పెట్రోల్ మరియు డీజిల్ పై ఇస్తున్న అధిక సబ్సిడీని ఐఎంఎఫ్ షరతుల మేరకు తగ్గిస్తే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతో పాకిస్తాన్ పూర్వ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బేఖాతరు చేసాడు. ఇలాంటి కీలక తరుణంలో ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)ని సంతృప్తి పరచేందుకు 25 శాతం పెరిగిన అమ్మకపు పన్నుతో ‘మినీ-బడ్జెట్’ను ప్రవేశపెట్టిన కొన్ని గంటల లోపే లీటరు పెట్రోలు ధర రు.22.20 ఎగ బాకి రు.272కి చేరింది. మరోపక్క 2022 జూన్-అక్టోబర్ మధ్య కాలంలో పాకిస్తాన్‌లో సంభవించిన వరదల కార ణంగా దాదాపు 33 మిలియన్ల మంది ప్రజల జీవితాలు కకావికలం కాగా దాదాపు 30 బిలియన్ డాలర్ల ఆస్థి నష్టం వాటిల్లింది. నాటి వరదల ధాటికి నేటికీ 6 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటుండగా ఆ సంఖ్య వచ్చే సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో 8.5 మిలియన్లకు చేరనుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు ఆసుపత్రులలో మందులు లేకపోవడం, వ్యవ సాయానికి కావాల్సిన ఎరువులతో పాటు తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడడం, దిగుమతి చేసుకునేందుకు బ్యాంకులు లెటర్ ఆఫ్ క్రెడిట్ నిరాకరించడంతో పరిస్థితి మరింత జటిలంగా మారుతోంది. పాకిస్తాన్ లో 6 ఫిబ్రవరి 2023 నాటికి కేవలం 3 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉండగా ఇవి కనీసం కొన్ని వారాలకు సరిపడా ముడి చమురు దిగుమతికి కానీ దాదాపు 130 బిలియన్ డాలర్ల విదేశీ ఋణాల చెల్లింపులకు కానీ ఏమాత్రం సరిపోవు. ఇక పాకిస్తాన్ ఋణ మరియు స్థూల దేశీయో త్పత్తి (జీడీపీ) నిష్పత్తి అత్యంత ఆందోళనకరంగా 70 శాతానికి చేరుకోగా మొత్తం ఆదాయంలో దాదాపు 40 నుండి 50 శాతం కేవలం వడ్డీల కోసం కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రవాద కలాపాలకు వ్యూహాత్మక ఆర్ధిక తోడ్పాటును అందిస్తుందన్న కారణంతో 2018 నుండి పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టు లో చేర్చడంతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దాదాపుగా స్తంభించిపోయాయి. 2014లో 47 బిలియన్ డాలర్ల అంచనాతో ప్రారంభమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల వ్యయం 64 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్తాన్ కు ఏమాత్రం ఆదాయం సమకూరడం లేదు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో ఋణ ఒప్పం దానికి మార్గం సుగమం చేయడానికి మరియు మరియు అత్యంత కీలకమైన డాలర్ ఇన్‌ఫ్లోలను వేగిరం చేయడానికి మార్చి, 2023లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్‌బీపీ) వడ్డీ రేట్లను 300 బేసిస్ పాయింట్లు, పాలసీ రేటును 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఇది అక్టోబర్ 1996 తర్వాత అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా డాలర్‌తో పాకిస్తాన్ రూపాయి మారకం విలువ మరింత క్షీణించి రూ.285.09కి చేరింది. తక్షణ రుణ చెల్లింపు బాధ్యతల గురించి గవర్నర్ మాట్లాడుతూ మార్చి నుండి జూన్ 2023 వరకు 7.2 బిలియన్ డాలర్లు ఉందని వెల్లడి చేశారు. ఆ మొత్తంలో, 3 బిలియన్ డాలర్ల భారం వాయిదా వేయడానికి అవకాశం ఉందని, 4.3 బిలియన్ డాలర్లు చెల్లిస్తే 1.3 మిల్లియన్ డాలర్ల ఋణం తిరిగి పాకిస్తాన్ పొందే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ తదుపరి సమావేశం మార్చి 16న జరగనుంది. ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమి టెడ్ నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు 1.3 బిలియన్ డాలర్ల రుణాన్ని వాయిదా వేయడానికి అంగీ కరించింది. ఈ సదుపాయం మూడు విడతలుగా పంపిణీ చేయబడుతుందని అందులో మొదటి విడతగా 500 మిలియన్ డాలర్లు ఇప్పటికే పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్‌కు అందిందని, ఇది ఫారెక్స్ నిల్వలను పెంచుతుందని దార్ ఒక ట్వీట్‌లో తెలిపారు. 2019 లో 6
బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ సహాయం పొందిన పాకిస్తాన్ గతేడాది మరో బిలియన్ డాలర్లు కూడా అందుకుంది. కాగా మిత్ర దేశాలైన చైనా మరియు సౌదీ అరేబియాలు చేయూత నందించడానికి విముఖత చూపుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితులలో పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ ద్రవ్య నిధి వైపు (ఐఎంఎఫ్) వైపు వేయి కళ్ళతో ఆశగా ఎదురు చూస్తోంది.
యేచన్ చంద్ర శేఖర్
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్ స్కౌట్స్, గైడ్స్, తెలంగాణ
8885050822