స్థానిక సంస్థల పితామహుడు లార్డ్ రిప్పన్ ప్రోత్సాహంతో మన దేశంలో స్థానిక సంస్థలు పునరుజ్జివనం పొందాయి. 1919 అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టాల ద్వారా స్థానిక సంస్థలు కొంత మేరకు బలోపేతం జరిగి స్వతంత్ర అనంతరం పంచాయతీ రాజ్ వ్యవస్థ ని బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.
ఈ నేపథ్యం లో గ్రామ పంచాయతీలను వ్యవస్తీకరించి స్వపరిపాలన దిశగా వాటిని నడిపించడానికి రాజ్యాంగం వాటికి అధికారాలను అందించాలని అదేశిక సూత్రాలోని 40 వ అధికారణ స్పష్టంగా చెబుతుంది.
పటిష్టమైన పంచాయతీ రాజ్ వ్యవస్థ స్వరూపం ఏ విదంగా ఉండాలని 1957 లో బల్వంత రాయ్ మొహత కమిటీ 1977 లో అశోక్ మొహత కమిటీ 1985 లో జీవికే రావు మొహత కమిటి లాంటి అనేక అధ్యాయనాలు సిఫార్సులా ఆధారంగా నూతన పంచాయతి రాజ్ చట్టం 73 వ రాజ్యాంగం సవరణ ద్వారా ఆవిర్బవించింది.
73 వ రాజ్యాంగ సవరణ స్థానిక సంస్థల స్వయం పాలన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల జోఖ్యాన్ని కొంత వరకు నివారించింది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచేల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల పంచాయతీ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ లు ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది.
అలాగే రాజ్యాంగం లోని 11 వ షెడ్యూల్ లో పొందు పరచిన గ్రామాల అభివృద్ధి నీ వేగవంతం చేయడానికి ఉద్దేశించిన 29 అంశాల అమలును రాజ్యాంగం స్థానిక సంస్థలకు ప్రసాధించింది.
గ్రామాల అభివృద్ధి కోసం దేశంలో మొత్తం 2 లక్షల 69 వేల పై చిలుకు గ్రామ పంచాయతీల ద్వారా స్థానిక స్వపరిపాలన సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఈ పంచాయతీలా ద్వారా ఎన్నికైన 31 లక్షల మంది ప్రతినిధులలో 13 లక్షల 80 వేల మంది అంటే సుమారుగా 44% శాతం మంది మహిళల ప్రజా ప్రతినిధులు గ్రామాల అభివృద్ధి లో కీలక పాత్ర పోషించడం గమనార్హం.
పంచాయతీ రాజ్ వ్యవస్థ నూతన నిర్మాణం కోసం ఏర్పడిన కమిటీలు ప్రధానంగా క్షేత్ర స్థాయిలో వనరుల పంపిణీ అధికార వికేంద్రీకరణ వంటి అంశాలను సిఫారసులు చేశాయి..పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా ప్రధానంగా వనరుల పంపిణీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పనులలో ప్రజల బాగా సామ్యాన్ని పెంచి పేదరికాన్ని నిర్ములన చేయడం 1993 నూతన పంచాయతీ రాజ్ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశంగా గమనించవచ్చు.
వాటి సిఫార్సుల ఆధారంగా నే 73 వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 243 ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసింది భారత ప్రభుత్వం.
భారత రాజ్యాంగ మౌలిక లక్షణాలలో సామ్యవాదం ఒకటి సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను నెలకొల్పడం ద్వారా స్వాతంత్య్రం నాటికి పెరిగిపోయిన ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు తగ్గించడమే లక్ష్యంగా భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం లోని ఆర్టికల్ 36 నుండి 51 వరకు గల అదేశిక సూత్రాలలో అంతర్లీనంగా పొందు పరిచారు..
భారత రాజ్యాంగ పీఠికలో మాత్రం 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాన్ని చేర్చడం జరిగింది..
ఏ దేశం అయిన సర్వ సత్తాక రాజ్యాంగ వెలుగొందాలి అంటే ఆ దేశం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలి ఆర్థికంగా అభివృద్ధి సాధించలేని రాజ్యం ప్రపంచ దేశాలతో పోటీ కొనసాగించలేక అభివృద్ధి చెందిన దేశాల దగ్గర మొకరిల్లాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక స్వాలంబన లేని రాజ్యంలో సామాజిక రాజకీయ అసమానతలు పెరిగిపోవడం సహజ సిద్ధంగా జరుగుతుంది.
సరిగ్గా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా పెరిగిపోయిన ఆర్థిక అసమానతలను తగ్గించడమే లక్ష్యంగా సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ ను ఎంచుకోవడం జరిగింది.
అమెరికా యూరప్ లాంటి దేశాలు పెట్టుబడి దారి ఆర్థిక విధానాలను అనుసరిస్తే చైనా లాంటి దేశాలు కమ్యూనిజం తరహా ఆర్థిక వ్యవస్థను అనుసరించారు అలాగే ప్రపంచంలోని రాష్యా లాంటి దేశాలు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థను అనుసరించి అనతి కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించడం జరిగింది.
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొత్తలో దేశం సామ్యవాద తరహా ఆర్థిక విధానాలను అనుసరించినప్పటికి క్రమ క్రమంగా 1991 నూతన ఆర్థిక సంస్కరణల ద్వారా పూర్తి స్థాయి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గా భారత దేశం రూపాంతరం చెందింది.
అసలు సామ్యవాదం కమ్యూనిజం పెట్టుబడి దారి విధానం అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్బంగా ఉంది.
సామ్యవాదం:- ఉత్పత్తి పంపిణీ వ్యవస్థ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతిలో ఉండడాన్ని సామ్యవాద తరహా లేదా సోషలిస్ట్ తరహా ఆర్థిక వ్యవస్థ అంటారు.. ఈ తరహా వ్యవస్థలలో ప్రయివేట్ వ్యక్తుల జోక్యం అతి తక్కువ గా లేదా సెలెక్టివ్ రంగాలలో మాత్రమే ఉంటుంది లేదా అసలే ఉండక పోవచ్చు అంటే ఈ తరహా వ్యవస్థలో ప్రభుత్వమే ఉత్పత్తి సంస్థలను స్థాపించి ప్రభుత్వమే ఉత్పత్తిని ప్రజలకు పంపిణీ చేస్తుంది.
కమ్యూనిజం:- ఈ వ్యవస్థలో శ్రమ విభజన ఉంటుంది శ్రామిక శక్తికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఉత్పత్తి మొత్తం శ్రామికుల చేతిలో ఉండి పంపిణీ వ్యవస్థ కూడా శ్రామికుల చేతిలోనే ఉండే వ్యవస్థను కమ్యూనిజం తరహా ఆర్థిక వ్యవస్థ అంటారు ఈ వ్యవస్థ ను అనుసరించే చైనా ఆర్థికాభివృద్ధిని సాధించింది.
పెట్టుబడి దారి తరహా ఆర్థిక వ్యవస్థ:- ఈ వ్యవస్థలో ఉత్పత్తిలో గాని పంపిణీ ప్రక్రియలో గాని ప్రభుత్వ జోఖ్యం ఉండదు పెట్టుబడి దారులు స్వేచ్ఛగా ఉత్పత్తి ప్రక్రియను కొనసాగించి పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఈ తరహా వ్యవస్థలో ప్రయివేట్ వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది ప్రభుత్వం ఉత్పత్తి ని సృష్టించదు పంపిణీ బాధ్యతను తీసుకోదు.
భారత రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యమైన ఈ మూడు రకాల వ్యవస్థలను అధ్యయనం చేసి భారత దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అంటే ప్రభుత్వ మరియు ప్రయివేట్ భాగస్వామ్యంలో ఆర్థిక వ్యవస్థ ఉండే విదంగా రాజ్యాంగానికి రూప కల్పన చేశారు.
కానీ సిద్ధాంత పరంగా మాత్రం భారత దేశం ఎప్పటికి సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థనే అని మరువరాదు అదేశిక సూత్రాల ద్వారా ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలను తగ్గించడానికి ఏం చేయాలని చాలా స్పష్టంగా పొందు పరచడం జరిగింది.
కానీ 1991 నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా మన దేశంలో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ కనుమరుగు అవడం గమనించవచ్చు 1991 కన్నా ముందు అనేక ఉత్పత్తి సంస్థలు అన్ని ప్రభుత్వ అధీనంలోనే కొనసాగేవి ప్రభుత్వమే ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించి ప్రభుత్వమే పంపిణీ వ్యవస్థ బాధ్యతను తీసుకునేది క్రమ క్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రయివేటికరణ చేయడం వల్ల సామ్యవాద తరహా సమాజం ఆచరణలో ముందుకు కొనసాగడం లేదు.
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు అయితే ఆ పట్టుగొమ్మల ఆర్థిక స్థిరత్వాన్ని రక్షిస్తూ ఆర్థికాభివృద్ధిని పెంపొందించే బాధ్యతను ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థకు అప్పజెప్పింది.
తెలంగాణ రాష్ట్రంలోని 12769 గ్రామాల్లో ప్రభుత్వం అదేశిక సూత్రాల అమలును క్షేత్ర స్థాయిలో సర్పంచులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా అమలు చేయించడం గర్వ కారణంగా చెప్పుకోవచ్చు.
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నివసించే ప్రజలకు ఒకవైపు కొనుకోళు శక్తి పెంచుతూనే మరో వైపు గ్రామాలకు కావలసిన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో విజయం సాధించారు.. ప్రభుత్వం ద్వారా రూప కల్పన చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు చేరువ చేయడం ద్వారా రాజ్యాంగంలో అంతర్లీనంగా పొందు పరచిన సామ్యవాద తరహా ఆర్థిక విధానాలకు ఇంకా కాలం చెల్లలేదు అని ఈ సందర్బంగా గుర్తించవచ్చు.
పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా తెలంగాణా లోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం లో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా విజయం సాధించినట్టు భావించవచ్చు ప్రతి గ్రామానికి కనీస అవసరాలు అయిన ఇంటింటికి మరుగు దొడ్ల నిర్మాణం ఇంకుడు గుంతల నిర్మాణం శ్మశాన వాటికల నిర్మాణం చెత్త నిర్వహణ కోసం డంపింగ్ యార్డుల నిర్మాణం రైతులకు మేలు చేసే రైతు కల్లాల నిర్మాణం మురుగునీటి పారుదల వ్యవస్థ రవాణా సౌకర్యాలు మెరుగు పరచడం ఒకటేమిటి గ్రామాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం లో పంచాయతీ రాజ్ వ్యవస్థ అద్భుతమైన పని తీరు కనబరచి ఇవాళ దేశానికే తెలంగాణా పంచాయతీ రాజ్ వ్యవస్థ రోల్ మోడల్ గా నిలించింది అనడం లో ఎటువంటి సందేహం లేదు.
అయినప్పటికీ స్థానిక సంస్థలు ఇంకా కొంత వనరుల కొరతను ఎదుర్కుంటున్న మాట ఎవరు కాదనలేని సత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలు స్వయం సంవృద్ధి సాధించే దిశగా చట్టాలను మరింత పటిష్టం చేసి ఆర్థిక స్వావలంబన చేకూర్చే దిశగా అడుగులు వేయాల్సిన బాధ్యత వాటి పైన ఉందనీ మరవరాదు.
శ్రీనివాస్ సార్ల
7793941842