Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్PG system needs new rules: లోపభూయిష్ఠంగా పీ.జీ వ్యవస్థ

PG system needs new rules: లోపభూయిష్ఠంగా పీ.జీ వ్యవస్థ

పేయింగ్‌ గెస్ట్‌ (పి.జి) వ్యవస్థ దేశవ్యాప్తమవుతున్న నేపథ్యంలో దీని మీద అధికారిక నియంత్రణ అవసరం అవుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వాల నుంచి సరైన అనుమతులు, ఆమోదాలు పొంది 2.86 లక్షల మంది తమ ఇళ్లలో చెల్లింపుల ద్వారా ఆతిథ్యం ఇవ్వడాన్ని అదనపు ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని, ప్రభుత్వ అనుమతుల్లేని కుటుంబాలు ఇంతకు రెట్టింపు ఉండే అవకాశం ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహా నగరాలు, నగరాలు, పట్టణాల్లో రాను రానూ విస్తరిస్తున్న ఈ వ్యవస్థలో భద్రతా వ్యవహారాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదానిపై ఇటీవలి కాలంలో ప్రభుత్వం దృష్టి పడింది. చెన్నై, చండీగఢ్‌, ముంబై, బెంగళూరు, కోల్‌ కతా, పుణే, పాట్నా తదితర నగరాల్లో వేలాది పేయింగ్‌ గెస్ట్‌ కుటుంబాలున్నప్పటికీ, వాటిల్లో భద్రతా ప్రమాణాలు మాత్రం అధ్వానంగా ఉంటున్నాయని, ముఖ్యంగా మహిళలకు రక్షణ కరవవడం, వారి మీద దాడులు జరగడం వంటివి చోటు చేసుకుంటున్నాయని అధికార వర్గాలు, పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఒక పేయింగ్‌ గెస్ట్‌ మీద దాడి జరగడం, ఆ యువతి చనిపోవడంతో ఈ వ్యవస్థ చర్చనీయాంశంగా మారింది.
కోరమంగళ ప్రాంతంలో ఒక అపార్ట్‌ మెంట్‌ లోని మూడవ అంతస్థులో పేయింగ్‌ గెస్ట్‌గా ఉంటున్న యువతి మీద దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచి చంపడం ఇక్కడ సరైన భద్రత లేక పోవడం మీదా, అధికారుల నియంత్రణ లేకపోవడం మీదా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఒక ఆగంతకుడు ఈ భవనంలోని మూడవ అంతస్థులోకి ఎలా రాగలిగాడన్నది అంతుబట్టడం లేదని పోలీసులు తెలిపారు. ఇతర మహానగరాలన్నిటి మాదిరిగానే బెంగళూరులో కూడా 20,000లకు పైగా పేయింగ్‌ గెస్ట్‌ సౌకర్యాలున్నాయి. హైదరాబాద్‌ నగరంలో కూడా 15,000లకు పైగా పి.టి సౌకర్యాలున్నట్టు అంచనా. అయితే, ఇందులో చాలా భాగం పి.జి వ్యవస్థలకు నగర పాలక సంస్థల అనుమతి లేదు. నగర పాలక సంస్థల నుంచి వీటిలో నాలుగవ వంతు పి.జిలకు లైసెన్సులు లేవు. లైసెన్సు లేకుండా పి.జిలను నిర్వహించకూడ దంటూ బెంగళూరు నగర పాలక సంస్థ ఇటీ వల మార్గదర్శక సూత్రాలను కూడా విడుదల చేసింది. తమ ఇళ్లలో పేయింగ్‌ గెస్టులుగా ఉండ దలచుకున్నవారి దగ్గర నుంచి గుర్తింపు పత్రాలు, ఫోటోలు, ఫోన్‌ నంబర్లు తప్పనిసరిగా తీసు కోవాలని పేయింగ్‌ గెస్ట్‌ సౌకర్యం కల్పిస్తున్న అనేక కుటుంబాలను నగర పాలక సంస్థ ఆదేశిం చింది. అంతేకాక, ఈ కుటుంబాలు కర్ణాటక ప్రజా భద్రతా చట్టం (2017) కింద తప్పనిసరిగా సి.సి.టి.వి కెమెరాలను, అగ్నిమాపక యంత్రాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పేయింగ్‌ గెస్టుల కోసం వంటవారిని, భద్రతా సిబ్బందిని ఎంపిక చేసుకునేటప్పుడు తప్పనిసరిగా పోలీసులతో వారి వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది.
పేయింగ్‌ గెస్టులు మత్తు పదార్థాలను, మద్యాన్ని వాడకూడదు. ఇక ఆ ఇంట్లో తప్పనిసరిగా ఫస్ట్‌ ఎయి్‌డ సౌకర్యం ఉండాలి. నగర పాలక సంస్థలు ఇటువంటి మార్గదర్శక సూత్రాలను తరచుగా విడుదల చేస్తున్నప్పటికీ అవి కేవలం కాగితం మీదే ఉండిపోతున్నాయి. ఒకే గదిలో చాలా మందికి అవకాశం కల్పించడం వల్ల గదులు క్రిక్కిరిసిపోతున్నాయి. వాస్తవానికి పేయింగ్‌ గెస్టుల సౌకర్యం కోసం ఎక్కువగా మహిళలు, యువతులే ప్రయత్నిస్తున్నందువల్ల వారి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కుటుంబ యజమానులు పట్టించుకోక పోవడం ఇటీవలి కాలంలో ఆందోళనకర విషయంగా మారింది. మహా నగరాలకు ఉద్యోగాల విషయంలో వచ్చినవారు ఇంటి అద్దెలు భరించలేక ఇటువంటి పి.జి సౌకర్యాల కోసం ప్రయత్నిం చవలసి వస్తోంది. అయితే, నగరాల్లో అనేక కుటుంబాలు అక్రమంగా, చట్టవిరుద్ధంగా పేయింగ్‌ గెస్ట్‌ సౌకర్యాలను కల్పించడం జరుగుతోంది. నిజానికి, ఈ పేయింగ్‌ గెస్ట్‌ సౌకర్యం ఉద్యోగులకు, ఉద్యోగార్థులకు ఒక వరంగా ఉంటూ వస్తోంది. అయితే, ఇవి క్రమంగా పెరుగుతున్నందువల్ల, లైసెన్సులు లేకుండా, అక్రమంగా కూడా ప్రారంభం అవుతున్నందువల్ల వీటిని నియంత్రించాల్సిన అవసరం కనిపిస్తోంది. అనేక పేయింగ్‌ గెస్ట్‌ కుటుంబాలు తామే చట్టం అన్నట్టుగా వ్యవహరించడం జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News