పల్లవి
ప్రజాకవి కాళోజీ అందుకో మా వందనాలు
జనయాతన సూసినోడా!జనం కొరకు బతికినోడా!
పరపీడన పోవాలని..సమపాలన రావాలని
అక్షరాలు ఎక్కుపెట్టి సైనికుడై సాగినోడా! చరణం
అవనిపైన జరుగుతున్న అన్యాయాలన్ని జూసి
నిప్పుల కొలిమైనోడా!నిగ్గాదీసి నిల్చినోడా!
నిరంకుశ పాలనపై నిప్పు కనికవైనోడా!
నియంత నైజామును ఎదిరించి పోరినోడా!
బహుభాషల ప్రతిభాశాలి కాళన్న లాల్ సలాం!! చరణం
మహారాష్ట్ర రక్తాన్ని పంచుకున్న దీరుడా!
కర్ణాటక పాలు తాగి మనిషిని ప్రేమించినోడా!
అనునిత్యం జనం కొరకు పలువరించినోడా!
బతుకే ఒక సమరమని లోకానికి చాటినోడా!
అందుకో మా వందనాలు నిఖిలాంధ్ర కాళోజీ! చరణం
భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామివైనావు
తెలంగాణ విమోచ పోరులోన కలిసి కొట్లాడినావు
యుద్ధాలు-ఉద్యమాలు-మత-రాజకీయాలు..
అక్షరాలు ఏవైనా మనిషి కొరకని పలికినావు
సాహితి లోకానికి వన్నేతెచ్చినవాడా!అందుకో మా వందనాలు చరణం
ధిక్కార స్వరాన్ని పిక్కటిల్ల జేసినోడా!
దిక్కు మొక్కు లేనొల్లకు బాసటగా నిల్చినోడా!
ఊరూర ఉద్యమాన్ని పరిఢవిల్ల జేసినోడా!
సగటు మనిషి కొరకు కవితా వస్తువై నోడా!
అభ్యుదయ హృదయమా!అందుకో వందనాలు చరణం
తెలంగాణ పోరుగడ్డ విప్లవాల పులి బిడ్డా !
మా గుండెలొ కొలువుదీరి కీరనమై వెలిగినావు
నువ్వు జూపిన మమకారం చిరకాలం చిగుంచును
నీయాదిలో మేముంటం నిన్ను మర్వలేకుంటం
నీ “అక్షర” దారిలోన అనితరం పోరుతాము
( రేపు 9 సెప్టెంబర్ కాళోజీ జయంతి సందర్భంగా రాసిన గీతం)
-జి.చంద్రమోహన్ గౌడ్
9866510399