Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Jayashankar Sir Joharlu: జయశంకర్ సార్ కు 'జోహార్లు'

Jayashankar Sir Joharlu: జయశంకర్ సార్ కు ‘జోహార్లు’

జయశంకర్ సార్ కు “జోహార్లు”

- Advertisement -

పల్లవి
అక్కంపేట, ఆత్మకూరు ఓరుగల్లు జిల్లాలో
ఎరుపెక్కిన పోరు పొద్దు ఉదయించిన సూర్యుడా
తెలంగాణ సాధనలో ముందుండి నడిచినావు
విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపి నావు
వీరుడా మా కొత్త పల్లి జయశంకరు సారూ..
అందుకో మా జోహార్లు జయశంకర్ సారూ

యాచకులము కాదుమేము శాసకులం అన్నావు
టి ఆర్ ఎస్ స్థాపనలో కీలకంగా మారినావు
తెలంగాణ పితామహుడా..సిద్ధాంతకర్త
అందుకో మా జోహార్లు! తెలంగాణ వందనాలు

స్వార్థమంటే తెలియనోడా ఉద్యమల ఉక్కుమనిషి
ఆస్తి నంతా వొదులుకొని జీవితాన్ని దారవోసినావు
విశాలాంధ్ర,నాన్ ముల్కీ ఉద్యమాల వీరుడా.
అందుకో మా జోహార్లు జయశంకరుడా

తెలంగాణ పోరు పిలుపు విశ్వానికి చాటినావు
ఉక్కు పిడికిలెత్తిపట్టి ఎదిరించి నిల్చినావు
ఆజన్మ బ్రహ్మ చారి ! అక్షర మేధావుడా!
అందుకో మా వందనాలు! విప్లవాల వందనాలు

వలసవాద పాలనపై అలుపెరగని పోరు జేసి
ఆశించిన తెలంగాణ సాధించి తీరుతమని
రాజి లేని దారి లోన పోరు మంటలెట్టి నావు
యోధుడా జయశంకరుడా అందుకో వందనాలు

ఇడ్లీ,సాంబరొద్దని గో బ్యాక్ అని తరిమినావు
ఊరూరా ఉద్యమాన్ని ఉధృతం చేసినావు
పల్లె పల్లె జనం లోన తిరుగు బాటు లేపి నావు
రణధీరుడా జయశంకరుడా.. అందుకో జోహార్లు

పల్లె నుండి డిల్లీ వరకు లొల్లిని వినిపించినావు
శాసించే తెలంగాణ ఆశించి పోరినావు
కోరుకున్న తెలంగాణ సాధించి తీరినావు
అందరి గుండెల్లో నిల్చి నింగిలోన చేరినావు
అందుకో మా తెలంగాణ పోరు దండాలు

నిప్పు కనం కొత్త పల్లి జయశంకర్ మా సారు
జంకంటె తెలియనోడా జనం ముందు నడిచినోడా
విశ్వ బ్రహ్మ జయశంకర్ విప్లవాల వందనాలు
యోధుడా మా జయశంకర్ తెలంగాణ వందనాలు
నీ యాదిలో మేమంతా ఉద్యమాలు నడుపుతాము
అభివృద్ధి తెలంగాణకు అలుపెరుగక పోరుతాము

                 - గడ్డమీది చంద్రమోహన్ గౌడ్
                           9866510399
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News