Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Quality life: రాజకీయాలు పౌర సమాజం-వైరుధ్యాలు నివారణ

Quality life: రాజకీయాలు పౌర సమాజం-వైరుధ్యాలు నివారణ

మానవ సంబంధాలు, జీవితం ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి

మంచి పాలన అనేది ప్రభుత్వ సంస్థలు ప్రజా వ్యవహారాలను ఎలా నిర్వహిస్తుందో, ప్రజా వనరులను ఎలా నిర్వహిస్తుందో తప్పనిసరిగా దుర్వినియోగం, అవినీతికి అతీతంగా, చట్టబద్ధమైన పాలనకు తగిన విధంగా మానవ హక్కుల సాధనకు హామీ ఇచ్చే ప్రక్రియ. పాలన అనేది “నిర్ణయం తీసుకునే ప్రక్రియ, నిర్ణయాలను అమలు చేసే (లేదా అమలు చేయని) ప్రక్రియ”. ఈ సందర్భంలో పాలన కార్పొరేట్, అంతర్జాతీయ, జాతీయ లేదా స్థానిక పాలనకు అలాగే సమాజంలోని ఇతర రంగాల మధ్య పరస్పర చర్యలకు వర్తిస్తుంది.
”మంచి పాలన” అనే భావన అసమర్థ ఆర్థిక వ్యవస్థలు లేదా రాజకీయ సంస్థలను ఆచరణీయ ఆర్థిక వ్యవస్థలు, రాజకీయ సంస్థలతో పోల్చడానికి ఒక నమూనాగా ఉద్భవించింది. సమాజంలో ఎంపిక చేయబడిన సమూహాలకు విరుద్ధంగా ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు, పాలక సంస్థల బాధ్యతపై భావన కేంద్రీకృతమై ఉంది. తరచుగా “అత్యంత విజయవంతమైన” దేశాలు ఉదారవాద-ప్రజాస్వామ్య రాజ్యాలుగా వర్ణించబడినందున , ఐరోపా ,అమెరికాలలో కేంద్రీకృతమై ఉన్నాయి, మంచి పాలనా ప్రమాణాలు తరచుగా ఈ రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఇతర ప్రభుత్వ సంస్థలను కొలుస్తాయి. సహాయ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాల అధికారులు తరచుగా “మంచి పాలన” యొక్క అర్థాన్ని సంస్థ యొక్క ఎజెండాకు అనుగుణంగా ఉండే అవసరాల సమితికి కేంద్రీకరిస్తారు, “మంచి పాలన” అనేది అనేక విభిన్న సందర్భాలలో అనేక విభిన్న విషయాలను సూచిస్తుంది.

- Advertisement -

1.మానవ అభివృద్ధి:
దేశానికి నిజమైన సంపద ఆ దేశ ప్రజలే! వారి స్వేచ్ఛను ఎంపికను విస్తృత పరిచే ఆర్థిక అభివృద్ధి ముఖ్య లక్ష్యం. మానవాభివృద్ధిని కొలిచే సాధనమే మానవాభివృద్ధి సూచిక! ఇవి సూచికను ఐక్యరాజ్యసమితి చెందిన యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం( యుఎన్డిపి) రూపొందించి ఏటా విడుదల చేస్తుంది. ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంలో ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధి అవి మహబూబ్ నిర్వహించారు. హక్కు ప్రకారం మానభవ అభివృద్ధి నమూనాలో నాలుగు అంశాలుంటాయి.

  1. సమానత్వం- ప్రజలందరూ సమాన అవకాశాలు పొందాలి.
  2. సుస్థిరత మనం పొందే సంక్షేమం తర్వాత తరం కూడా పొందాలి.
  3. ఉత్పాదకత- మానవ మూలధనంలో పెట్టుబడి ద్వారా ఉత్పాదకత పెంచడం.
  4. సాధికారిక- ప్రజలు తమ ఎంపికను అనుగుణంగా పనిచేయడం.
    మానవాభివృద్ధి సూచికను 1990 నుంచి యు ఎన్ డి పి ప్రచురిస్తుంది. దీనిని మహబూబ్ ఉల్క ఆధ్వర్యంలో రూపొందించారు. తర్వాత దానిని విస్తరించడంతోపాటు సవరిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో మానవ అభివృద్ధికి చెందిన ఇతర సూచిలను అభివృద్ధి చేశారు.1995 లింగా సంబంధిత అభివృద్ధి సూచి( జీడిఐ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్), 1995 లింగ సాధికారిక కొలమానం (జీఇఎం జెండర్ ఎంపవర్మెంట్ మెన్సూర్)
    1997 మానవ పేదరిక సూచిక-1( హెచ్ పి వన్ పవర్ టి ఇండెక్స్) 1998 మానవ పేదరిక సూచిక-11 (హెచ్ పి వన్ ఉమన్ ప్రాపర్టీ ఇండెక్స్) మానవ అభివృద్ధి సూచిలో పరిగణలోనికి తీసుకునే అంశాలు ఇది మూడు అంశాల్లో సాధించిన సగటు ఫలితాలను తెలియజేస్తుంది. ఒక దేశ ప్రగతి స్థాయిని తెలుసుకోవాలంటే అక్కడి జనాభా ఆరోగ్యం అక్షరాస్యత ఆయురారోగ్యాలను పరిశీలించాలి. నిత్యజీవితంలో పౌరుల శ్రేయస్సును దేశ పురోగతిపై సమగ్ర దృక్పథాన్ని ఆ సూచికలు ప్రతిబింబిస్తాయి. అందుకే ఐక్యరాజ్యసమితి అలాంటి ప్రమాణాలు ఆధారంగా ఏటా సూచీలను సిద్ధం చేసి నివేదికలను విడుదల చేస్తుంది. దేశాల్లో మానవ అభివృద్ధి స్థాయిలను తెలిపే ఆ రిపోర్టుల గురించి పరీక్ష కార్డులు రంగా తెలుసుకోవాలి అందుకోసమే పరిగణలోనికి తీసుకొని అంశాలు సూచి ఆధారంగా దేశాల వర్గీకరణ భారతదేశ స్థానం మానవాభివృద్ధి సూచిలోని ఉప విభాగాల గురించి సమగ్ర అవగాహన ఏర్పరచుకోవాలి.
    2.పాలకులకు ప్రభుత్వ మనుగడ ఎంత ముఖ్యమో ప్రజాప్రయోజనాలు కూడా అంతే. పాలనాపరమైన విధానాల వల్లనే ఒక ప్రభుత్వానికి మంచి పేరు సాధ్యమౌతుంది. సుపరిపాలనకు కొన్ని లక్షణాలను చర్చిద్దాం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక ప్రభుత్వం కొనసాగడం అనేది ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా జరగాలి. అంటే పాలకులకు ప్రభుత్వమ నుగడ ఎంత ముఖ్యమో ప్రజా ప్రయోజనాలు కూడా అంతే అని అర్థం. ఏర్పడబోయే ప్రభుత్వాన్ని ప్రజలు తమ ఓట్ల ద్వారా ఎన్నుకునే క్రమములో సామాజిక ప్రయోజనాలను అంచనా వేసి సమర్థులు, ప్రతిభావంతులు, విజ్ఞానవంతులు, విద్యావంతులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంలో అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే క్రమంలో జల్లెడ పట్టిన మాదిరిగా అవినీతి, నేరారోపణలకు అవకాశం లేకుండా ఎంపిక చేసినప్పుడు మాత్రమే చట్టసభలు నేరస్తులు, అవినీతిపరులు, అవకాశవాదులకు అవకాశం లేకుండా విలసిల్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పార్లమెంటులో ముఖ్యంగా లోక్సభలో 83 శాతం మంది నేరస్తులు లేదా నేరచరిత్ర ఉన్నవాళ్లు ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతుంటే ఎన్నికల సందర్భంలో ఆరోపణలు ఉన్నవారికి ఆయా రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టం చేసినట్లయితే ఇలాంటి దుస్థితి దాపురించేది కాదు కదా! దేశ ప్రజలను పరిపాలించే పాలకులు సమర్థవంతులు, నిజాయితీపరులు, సేవా దృక్పథం కలిగిన వారు అయినప్పుడు మాత్రమే ప్రజలను కర్ణబిడ్డల వలె పాలించే అవకాశం ఉంటుంది పరిపాలనకు నిర్వచనం అదే కదా. ఎన్నికల సంఘం తనను తాను ప్రక్షాళన చేసుకుని, ఎన్నికల వ్యయాన్ని తగ్గించి, అభ్యర్థుల ఖర్చుతోపాటు ప్రలోభాలు తాయిలాలు ఉచితాలకు ఆస్కారం లేకుండా చేయగలిగిన నాడు ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైన తన అధికారాన్ని వినియోగించగలిగితే ఎన్నికలు న్యాయబద్ధంగా సజావుగా జరగడానికి డబ్బు ప్రమేయం లేకుండా పేద వాళ్ళు సైతం సమర్థులు చట్టసభల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది.
    పాలకులకు కొన్ని సూచనలు
    ప్రజాస్వామ్య విలువలను గౌరవించే సంస్కారం ప్రభుత్వాలకు ఉండాలి. నిర్బంధం అణచివేతతో ప్రజల, ప్రగతి కాముకుల హక్కులను కాలరాచే దుష్ట సంస్కృతి ఎప్పుడైనా ప్రభుత్వాలకు ప్రమాదకరమే. ప్రజల చేతిలో పరాభవం ఓటమి తప్పదు అని తెలుసుకుంటే మంచిది. సుపరిపాలనకు ప్రజాస్వామ్య విలువలు చాలా ముఖ్యం. పాలకులు ప్రజల హక్కులను కాపాడే క్రమంలో న్యాయబద్ధంగా పరిపాలించే బదులు పోలీసులను అడ్డుపెట్టుకొని అలచివేతకు పాల్పడితే చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు కనుమరుగైన విషయాన్ని మనం గమనించవచ్చు. మేధావులు బుద్ధి జీవులు హక్కుల కార్యకర్తలకు అఖిలపక్షాలకు ప్రాధాన్యత నిచ్చి పరిపాలనలో భాగస్వాములను చేసుకుంటే ఆ పాలన సజావుగా సాగుతుంది.
    ఆర్థిక అరాచకత్వాన్ని సమర్ధించకూడదు
    అనుత్పాదకరంగానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సంపదను సృష్టించే క్రమములో పెద్ద ఎత్తున ప్రోత్సహించి పేద వర్గాల ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా, సంపద కేంద్రీకరణను నిరోధించి ప్రజాధనాన్ని సమ పంపిణీ చేసే విధంగా ప్రభుత్వ విధానం ఉన్నప్పుడు రాష్ట్రం లేదా దేశం అప్పులపాలు అయ్యే అవకాశం ఉండదు . కేంద్ర ప్రభుత్వం గత పది ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పును అదనంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పులు చేయగా తెలంగాణ రాష్ట్రం అప్పు 5 లక్షల కోట్ల పైబడి దాటిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ దుస్థితి ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.
  5. అసమానతలు అంతం చేసే క్రమంలో సమగ్ర భూ పరిమితి చట్టాన్ని అమలులోనికి తెచ్చి మిగులు భూములను నిర్ధారించి భూమిలేని పేద వర్గాలకు పంపిణీ చేయాలి. అదే క్రమంలో ప్రభుత్వం పేరున ఉన్న భూములను రాబోయే తరాలకు భద్రపరిచి రియల్ ఎస్టేట్ దందా గాళ్లు ఆక్రమించుకోకుండా కఠిన చర్యలు తీసుకొని అవినీతిని కట్టడి చేయాలి. సాధారణంగా శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు మంత్రులు కూడా భూ ఆక్రమణలకు పాల్పడకుండా ఉక్కు పాదంతో అణచివేయాలి. పేద వర్గాలకు భూమిని పంపిణీ చేయడం ద్వారా ఆదాయం పెరగడంతో పాటు అసమానతలను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది.
    ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని ఆపివేసి భవిష్యత్తు తరాలకు పర్యావరణ పరిరక్షణలో పాలక పక్షాలు తోడ్పడవలసి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో తమ వేతనాలను పెంచుకున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నవి. చట్టసభల సభ్యులకు వేతనాలను స్వచ్ఛందంగా తగ్గించుకొని తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి. అదే సందర్భంలో సేవా దృక్పథంతో పనిచేయడానికి సిద్ధమని సవాల్ విసరాలి.
    రాజకీయ అవినీతితో పాటు ఉద్యోగ వర్గాలలో అవినీతిని కట్టడి చేయగలిగితే రాజ్యాంగ పలాలను మరింత సునాయసంగా ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా పేదరిక నిర్మూలన, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాల మెరుగుదల, దారిద్రరేఖ దిగువన ఉన్న వర్గాలను పైకి తేవడానికి తపన, మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు విద్యా వైద్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అందించగలిగితే ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ప్రజలకు ఉచిత పథకాలను క్రమంగా తగ్గించవచ్చు. ఇక రైతులు, కార్మికులు, చేతివృత్తుల వాళ్ళు, వలస కార్మికులు, చిరు వ్యాపారులు, అసహాయులకు ప్రభుత్వం అండగా ఉండి భరోసా కల్పించడంతో పాటు దేశానికి తిండి పెట్టే రైతన్నకు వెన్ను తట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించి సామాన్య ప్రజల ప్రభుత్వాన్ని అందించగలగాలి. ఇప్పటికీ దళిత వర్గాలు బహుజనులు ముఖ్యంగా బీసీ సమాజం చట్టసభల గడప దాటకుండా రాజ్యాధికారానికి దూరంగా వెలివేయబడ్డ విషయాన్ని పాలకులు గమనించి ఆయా వర్గాల యొక్క హక్కులను కాపాడే విధంగా రాజకీయ అధికారాన్ని కట్టబెట్టడానికి చట్టసభల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తే కొంతవరకైనా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. అదే నిజమైన పరిపాలన అని అనిపించుకుంటుంది.
  6. 3. పరిపాలనలో మానవీయ విలువలు:
  7. మానవీయ కోణంలో ఆలోచించి నిజమైన మనుషులుగా జీవిద్దాం ! తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేకపోవడం విచారకరం ఆ లోటు మన కుటుంబాలలో రాకుండా చూసుకుందాం!. గత పొరపాట్లను సవరించుకుందాం! ఆవేశాలు, అహంకారాలు, పంతాలు, పట్టింపులు మనలను ఇంతకాలం ఒంటరిగా దోషిగా నిలబెట్టిన సందర్భాలను ఒక్కసారి నెమరు వేసుకుందాం! మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దే క్రమంలో విస్తృతమైన అవకాశాలను, విలువైన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం మానుకొని, కక్షలు పెంచుకొని, నోటి మాటకు నోచుకోకుండా, కసి నింపుకొని కాపురాలు కూల్చుకున్న మనం మన గతాన్ని ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం!. మన పొరపాట్లను సవరించుకోవడానికి, మన ఆవేశాన్ని సంస్కరించుకోవడానికి , మన లోటుపాట్లను పరిగణనలోకి తీసుకోవడానికి , అవసరమైతే మనలను మనమే నిందించుకుని మంచి వైపు బాటసారులుగా, పయనించడానికి ప్రయత్నిద్దాం. వ్యతిరేక ఆలోచనలు, నిందలు, నిట్టూర్పులు, వేదనాభరిత జీవితానికి అలవాటు పడిన బలహీనతలు, అన్య మనస్సులను గాయపరచడానికి ఎగిసిపడుతున్న మన ఆరాటాన్ని కొంత తగ్గించుకుందాం!. అప్పుడు మాత్రమే నిజమెంతో నిలకడగా తెలుస్తుంది .”దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేయాలన్నా, మానవుడు సంఘజీవి అన్న అరిస్టాటిల్ సూక్తిని శాశ్వతం చేయాలన్నా, వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అన్న శ్రీశ్రీ నినాదములోని అంతరార్తాన్ని జనానికి చాటి చెప్పాలన్నా కుటుంబ సంబంధాలతో అనుబంధమున్న మానవ సంబంధాలను ఒక్కసారి మనసు విప్పి మాట్లాడుకుందాం. నోరు పారేసుకున్న మనం మనుషులను మనసులను దూరం చేసుకొని మూగబోయిన గొంతులతో తల్ల డిల్లుతున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులు- కొడుకులు కూతుళ్ళు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు, వదినే మరదండ్లు, అత్తా కొడండ్లు , చివరికి ఇరుగుపొరుగు అందరము ఆశిక్ష అనుభవించిన-అనుభవిస్తున్న వాళ్లమే. !
    జీవితం ఒక్కటే అని తెలిసి కూడా-సహనాన్ని చంపుకొని, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నోరు పారేసుకోవడం, నిందలు విమర్శలు ముఖం చూడని మాటలు, జీవితానికి నేడే చివరి రోజు అన్నట్లు కసిపించుకొని, కడుపు నిండా నింపుకున్న ద్వేషాన్ని గర్వాన్ని అసహనాన్ని అసందర్భంగా వ్యక్తం చేసి మనుషులను దూరం చేసుకునే క్రమంలో దెబ్బతింటున్న కుటుంబ సంబంధాలు అంతకుమించి మానవ సంబంధాలు మనిషిని ఒంటరిగా చేస్తున్న ప్రమాదకరమైన పరిస్థితిని మనం ఎందుకు అంచనా వేయడం లేదు?. ఎవరితో నాకేమిటని, ఎవరు మాట్లాడకపోయినా నా జీవితం గడుస్తుందని, మర్యాద గౌరవం కోసం పలకరించే సందర్భంలోనూ పంతాలు పెంచుకొని నిండు నూరేళ్ల జీవితాలను నిలువునా కాల్చి వేస్తున్నది మనం కాదా ! ఒకవేళ కలచివేసిన ఆ సంఘటనకు, సన్నివేశానికి, వైరుధ్యానికి, సంఘర్షణకు, కయ్యానికి, ఎదుటి వాళ్లే కారణమని మనం భావించినా మన భావనలో వాస్తవం ఉన్నా ఇతరత్రా సంబంధాలలో మనం కూడా నోరు జారుతున్న సందర్భాలు లేవంటారా! కన్న తల్లిదండ్రులను కడుపు చీల్చిన మాటలతో దూరం చేసుకున్న వాళ్లు, అంతులేని విషాదగాథ గా శాశ్వత యుద్దంగా అత్తా కోడళ్ళ బంధాలకు సమాధి కట్టిన వాళ్లు, ఒకే కడుపును పుట్టినా సా హచర్యాన్ని మరిచి గత స్మృతులకు తెరవేసి స్వార్థం మాటున శాశ్వతంగా బంధాలను నిలువునా కూల్చిన అన్నా తమ్ముళ్లు ఎందరో ఎందరెందరో !
    స్వార్థం, ద్వేషం, అసూయ, పంతం, నైరాశ్యం, లోపాయకారి ఒప్పందం, కుటుంబ సభ్యులందరూ ఒకే తాను ముక్కలు కావడం, భిన్న అభిప్రాయాలకు తావు లేకపోవడం, కుటుంబ బంధాలు రెండు వర్గాలుగా చీలిపోవడం, ఘర్షణ సంబరాలతో బాంధవ్యాలను ప్రేమానుబంధాలను కుటుంబ గౌరవాలను మరిచిపోవడం, చావో రేవో తేల్చుకోవాలనే క్షణికావేశంలో నోటికి తాళం వేయడం వరకే కాదు ఆత్మహత్యల వరకు కూడా ఈ కుటుంబ బంధాల ఘర్షణ వాతావరణం దారితీస్తున్నది. ” జరగబోయే పరిణామాలు కొద్దో గొప్పో అంచనా వేయగలిగి కూడా మౌనంగా ఉండడం, వర్గసంఘర్షణకు దారితీయడం వల్ల ఏర్పడుతున్న చిద్రమవుతున్న కుటుంబ మానవ సంబంధాల చిత్రం దిగజారిన సమాజానికి దిక్సూచిగా మారుతున్నది నిజం కాదా! “
    మానసిక క్షోభ అవసరమా! ఆలోచించు! ఆచరించు! జీవితాన్ని అర్థవంతంగా మార్చుకో!:-
    మధ్య దళారీ వ్యవస్థ వల్ల కొన్ని సందర్భాలలో వైరుధ్యాలు, అసమానతలు, అంతరాలు, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. కానీ కుటుంబ బంధాలను చిగురింప చేయడంలో మధ్యవర్తుల పాత్ర చాలా కీలకమైనది. ఆ చొరవ, స్వాభిమానము, సామాజిక బాధ్యత, మానవ సంబంధాల బలోపేతానికి కృషి చేయాలనే ఆరాటం, సానుకూల దృక్పథం, మధ్యవర్తిత్వ సమర్థత ఎన్నో కుటుంబాలను నిలబెట్టే అవకాశం ఉంటుంది. చర్చలు సంప్రదింపుల సమాలోచనలతో అంతర్జాతీయ సమస్యలే పరిష్కారానికి నోచుకున్నప్పుడు ఇరుపక్షాలు రాజీపడి, జీవిత అంతరంగాన్ని మదించి, సారాన్ని గుర్తించి, ఒంటరి వేదన నుండి మేల్కొని, మాట్లాడుకోవడానికి సిద్ధపడితే, ఇరు పక్షాలు కొంత నిజాయితీగా లోపాలను అంగీకరిస్తే బలమైన రసానిక బంధం లాగా సుదూర ప్రాంతాలను కలిపే దృఢమైన వంతెనలాగా మానవ సంబంధాలు బలోపేతం కావడం సాధ్యమే కదా! ద్వేషం స్థానంలో ప్రేమ, అసూయ స్థానములో ఆత్మీయత, అహంకారం స్థానంలో అవ్యాజమైన ప్రేమానురాగాలు, గర్వం స్థానంలో గంభీరమైన హుందాతనం, జీవన సారాంశాన్ని అర్థం చేసుకునే తత్వం బలపడినప్పుడు, అందరూ ఒకే దారిలో కాకుండా భిన్నాభిప్రాయాలను కలిగి ఉన్నప్పుడు చర్చలు సంప్రదింపుల ద్వారా నోటి మాట కూడా నోచుకోని నిత్యం ఘర్షణలతో చెలరేగుతున్న సంసారిక బంధాలకు చిగురింపజేయవచ్చు.
    వికృత చేస్తలతో విరక్తి కలిగిస్తున్న కొందరైనా మనిషిని మనిషిగా చూడగలిగే మానవీయ తత్వాన్ని పెంచి పోషించుకుంటారని, ఆ వైపుగా పరివర్తన చెందుతారని, ఓకే జీవితానికి వైరుధ్యాలతో ప్రయోజనం ఏమిటని నిండు మనసుతో జీవితాన్ని అర్థవంతంగా చేర్చిదిద్దుకోవడానికి కృషి చేస్తారని ఆశించడం అత్యాశ కాదు. మన మన జీవిత అనుభవాలలో ఎన్నోచోట్ల మన పంతాలను విస్మరించి కలిసిపోవడానికి చేసిన ప్రయత్నాలు, ఇతర కుటుంబాలను కలపడానికి చేసిన కృషి విశ్వ మానవ ప్రేమకు నిదర్శనంగా నిలబడుతుందని నిలబడాలని నిలిచి జీవితంలో అందరూ గెలిచి యుద్ధం లక్ష్యం కూడా శాంతియే అన్నట్లు ఘర్షణ భిన్నాభిప్రాయాల యొక్క అంతిమ లక్ష్యం స్నేహ బంధమే అని మానవాళి గుర్తించే విధంగా కృషి చేద్దాం.

డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News