Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Rahul Gandhi LoP: ప్రతిపక్ష నేతగా రాహుల్‌ రాణిస్తారా?

Rahul Gandhi LoP: ప్రతిపక్ష నేతగా రాహుల్‌ రాణిస్తారా?

ప్రతిపక్ష నేతగా ఎదగడానికి సుమారు రెండు దశాబ్దాల సమయం తీసుకున్న రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు ప్రతి పక్ష నాయకుడు కాగలిగారు. అయితే, ఆయన ఈ పదవిలో రాణిస్తారా? ప్రధాని పదవిని చేపట్టగలుగు తారా? రాహుల్‌ గాంధీకి సంబంధించినంత వరకు ఇవి నిజంగా అంతుబట్టని ప్రశ్నలే. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయ కుడు, నెహ్రూ-గాంధీ కుటుంబ రాజకీయ వారసుడు అయిన రాహుల్‌ గాంధీని ఈ మధ్య ఒక ఫోటోలో చూసిన వారికి అనేక ఒడిదుడుకుల అనంతరం ఆయన మళ్లీ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారనే భావన కలుగుంది. స్పీకర్‌ ఎన్నిక అనంతరం ఆయన ఓం బిర్లాతో కరచాలనం చేస్తుండడం, ఆయన వెనుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ జిజిజు నిలబడి ఉండడం రాహుల్‌ గాంధీకి సంబంధించినంత వరకూ ఒక పెద్ద విశేషమేనని చెప్పవచ్చు. స్పీకర్‌ను ఆయన సీటు దగ్గరకు ప్రధానితో పాటు రాహుల్‌ కూడా తోడ్కొని వెళ్లడం కూడా ఆయన దశ, దిశ మారుతోందనడానికి సంకేతంగా కనిపించింది. స్పీకర్‌ను ఆయన స్థానం వద్దకు తోడ్కొని వెళ్లడం అన్నది 1950 నుంచి వస్తున్న సంప్రదాయమే. అయితే, ఇందులో రాహుల్‌ గాంధీ పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారి.
వీటన్నిటిని బట్టి రాహుల్‌ గాంధీ దశ తిరగబోతోందని భావించవచ్చా? ఒక ప్రతిపక్ష నాయకుడుగా లోక్‌ సభలో ముందు వరుసలో కూర్చోవడానికి రాహుల్‌ గాంధీకి రెండు దశాబ్దాల కాలం పట్టింది. భారత్‌ జోడో యాత్ర ల్లోనూ, ఎన్నికల ప్రచారాల్లోనూ రాహుల్‌ గాంధీ వేసుకున్న ప్యాంటు, టీషర్టు ఈసారి లోక్‌ సభలో కనిపించలేదు. లోక్‌ సభ మొదటి రోజున ఆయన కుర్తా పైజామా ధరించి హాజ రవయ్యారు. వారసత్వం విషయానికి వస్తే, ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీ కూడా ప్రతి పక్ష నాయకులుగా వ్యవహరించారు. అటల్‌ బిహారి వాజ్‌ పేయా ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న విషయం గుర్తుండే ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్‌ గాంధీకి అనేక సౌకర్యాలు, ప్రత్యేక హక్కులు అంది వస్తాయి. ప్రతిపక్ష నాయకుడంటే క్యాబినెట్‌ హోదా లభిస్తుంది. ఒక వ్యక్తిగత కార్యదర్శితో సహా పలువురు ఉద్యోగులు ఆయనకు సహాయ సహకారాలు అందజే స్తారు. అనేక ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు. లోక్‌ పాల్‌, సి.బి.ఐ డైరెక్టర్‌, చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌, ఎన్ని కల కమిషనర్లు, విజిలెన్స్‌ కమిషనర్‌, ఇన్ఫర్మేషన్‌ కమి షనర్‌ తదితర కీలక పదవులకు వ్యక్తుల్ని ఎంపిక చేసే కమిటీల్లో సభ్యుడిగా ఉంటారు.
విషయ పరిజ్ఞానం ఉందా?
ఇక లోక్‌ సభలో ఎటువంటి చర్చనయినా ప్రారంభిం చవచ్చు. ప్రధానమంత్రి ప్రసంగాల మీద వ్యాఖ్యానాలు చేయవచ్చు. 2004లో ఆయన తల్లి సోనియా గాంధీ మాదిరిగా ఆయన కూడా తన అంతరాత్మ ప్రభోదాన్ని విన్నట్టు కనిపిస్తోంది. ‘నువ్వు ఎంతటి తెలివిగలవాడివైనా కావచ్చు. ఎంతటి ప్రతిభా సంపన్నుడివైనా కావచ్చు. నీకు పదవిలో లేకపోతే మాత్రం ఇవన్నీ నిష్ఫలం, నిరుప యోగం కావడం ఖాయం. దేశంలో విషాదకర, దురదృష్ట కర పరిస్థితి ఇది” అనే అభిప్రాయం రాహుల్‌ గాంధీకి
తప్పకుండా కలిగి ఉంటుంది. నిజానికి ఈ నెహ్రూ-గాంధీ కుటుంబం మొదటి నుంచీ పార్లమెంటును తమ సొంత జాగీరుగా పరిగణిస్తూ వచ్చింది. తామెంత చెబితే అంత అన్నట్టుగా ఉండేది. చాలావరకు నిర్లక్ష్యం చేయడం కూడా జరిగింది. రెండు దశాబ్దాల పాటు లోక్‌ సభ సభ్యుడిగా ఉన్నప్పటికీ, రాహుల్‌ గాంధీ కేవలం 99 ప్రశ్న లను మాత్రమే అడగడం జరిగింది. మొత్తం 26 చర్చల్లో మాత్రమే పాల్గొన్నారు. తమ పార్టీలకు చెందిన ఎంపీలం దరికంటే తక్కువగా పార్లమెంటుకు హాజరు కావడం జరిగింది.
విచిత్రమేమిటంటే, రాహుల్‌ గాంధీ ఏనాడూ బడ్జెట్‌ సంబంధిత చర్చల్లో పాల్గొనలేదు. బడ్జెట్‌ సమావేశాల కాలంలో కూడా ఆయన ఎప్పుడో తప్ప లోక్‌సభలో కని పించేవారు కూడా కాదు. బడ్జెట్‌ పై మాట్లాడడానికి రాహుల్‌ గాంధీ ఎంపిక చేసిన సభ్యులు కూడా మోదీకి దీటుగా మాట్లాడే వారు కాదు. మోదీని ఎదుర్కోవాలన్న పక్షంలో ఇక రాహుల్‌ గాంధీ ప్రతి రోజూ పార్ల మెంటుకు రావలసి ఉంటుంది. మోదీని ఎదుర్కోవడానికి సరైన సభ్యులను ఎంపిక చేయవలసి ఉంటుంది. ఈ అయిదు సంవత్సరాల్లో రాహుల్‌ గాంధీ అనుసరించే దృక్పథమే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ తనకు తానుగా అధికారానికి వచ్చి దాదాపు మూడున్నర దశాబ్దాలైంది. చివరిసారిగా 1984లో రాజీవ్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ 404 స్థానాలు సంపా దించుకుంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల పాటు దారీ తెన్నూ లేకుండా తిరుగుతూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ 2004లో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆ ఘనత పూర్తిగా సోనియా గాంధీకే దక్కుతుంది. ఆ తర్వాత 2009 లో కాంగ్రెస్‌ పార్టీ సోనియా సారథ్యంలోనే 200 సీట్లు సంపాదించుకోగలిగింది. 2014లో కేవలం 44 స్థానాలకే పరిమితం అయింది. 2019లో కూడా అతి కష్టం మీద 52 స్థానాలు సంపాదించుకుంది. నరేంద్ర మోదీ కాంగ్రెస్‌ పార్టీ కంటే నెహ్రూ కుటుంబం మీద అస్త్రశస్త్రాలను గురిపెట్టడం తో కాంగ్రెస్‌కు దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఎదురైంది.
ఆశయ సాధన
నెహ్రూ-గాంధీ శకం అవిచ్ఛిన్నంగా ముందుకు సాగాలన్న పక్షంలో రాహుల్‌ గాంధీ కొత్త సాధనాలను, ప్రక్రియలను సృష్టించాల్సి ఉంటుంది. అనేక విధాలుగా దూరమైపోయిన భాగస్వామ్య పక్షాలను, మిత్రపక్షాలను కూడగట్టుకోవాలన్నా, కొత్త పార్టీలను తమతో చేర్చు కోవాలన్నా రాహుల్‌ గాంధీకి అర్జునుడిని మించిన నైపు ణ్యాలు, శకునిని మించిన కుతంత్రాలు అవసరం. ఆయన కు వయసుంది. సామాజికంగా ఆమోద యోగ్యత ఉంది. ఇతర ప్రతిపక్ష నాయకులందరి కంటే ఆయన వయసులో చిన్నవాడు. ఆయన ప్రాంతీయ స్థాయి నాయకుడు కాదు. ఆయన జాతీయ స్థాయి నాయకుడు. అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌, సుప్రియా సూలే, కనిమొళి, ఒమర్‌ అబ్దుల్లా, అభిషేక్‌ బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆదిత్య థాకరే వంటివారు ఆయనకు చిరకాల మిత్రులు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌ గాంధీని ఎంపిక చేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని డి.ఎం.కె, ఆర్‌.జె.డి నాయకులు ఎన్నికల ముందు ప్రకటించడం కూడా జరి గింది. అయితే, ఈ మిత్రపక్షాలన్నీ తమ రాష్ట్రాల్లో అధి కారాన్ని కాపాడుకోవడానికి, అధికారాన్ని దక్కించుకో వడానికి మాత్రమే ఉపయోగపడతాయి.
రాహుల్‌ గాంధీకి ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా తమ కంటూ బలమేమీ లేదు. అక్కడి ప్రాంతీయ పార్టీలకు అను గుణంగానే నడుచుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. 2004లో కూడా సోనియా గాంధీ అనేక పార్టీలతో రాజీ పడి, సఖ్యత పెంచుకుని, వారికి కీలక పదవులిచ్చి అధి కారంలో కొనసాగాల్సి వచ్చింది. ఇందులో శరద్‌ పవార్‌ కూడా ఉన్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయి. లోక్‌ సభలో మోదీని ఎదుర్కోవడమన్నది రాహుల్‌ గాంధీకి అగ్గిపరీక్షే అవుతుంది. మోదీ మాదిరిగా రాహుల్‌ గాంధీ సూటిగా, స్ఫుటంగా మాట్లాడగలిగిన వక్తేమీ కాదు. విషయ పరి జ్ఞానంలో కూడా ఆయన మోదీ కంటే బాగా వెనుకబడి ఉన్నారు. మోదీ విధానాల్లోనే కాదు, మోదీ ప్రసంగాలు, ప్రకటనల్లో సైతం లోపాలను వెతికి పట్టుకునే చాకచక్యం ఉంటే తప్ప రాహుల్‌ లోక్‌ సభలో రాణించడం కష్టం. మోదీ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన వ్యక్తి. ఆయనకు ప్రజాకర్షణ బాగానే ఉంది. ప్రస్తుతం మిత్ర పక్షాల ఆధారపడాల్సి వస్తున్నందువల్ల కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. రాహుల్‌ గాంధీ ఆ పొరపాట్లను పట్టుకోవాల్సి ఉంటుంది.
మారని దృక్పథం
ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌ గాంధీ అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇల్లు అలగ్గానే పండుగ కాదన్నట్టుగా ప్రతిపక్ష నాయకుడైనంత మాత్రాన సరిపోదు. ప్రతిపక్ష నాయక పాత్రలో విజయవంతం కావాలి. ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాలు, విదేశీ సం బంధాలు, పాలనా వ్యవహారాలు, రక్షణ, జాతీయ భద్రత వంటి విషయాల్లో ఆయన సరైన సలహాదార్లను, నిపుణు లను నియమించుకోవాల్సి ఉంటుంది. మోదీని ఎదుర్కో వాలన్న పక్షంలో రాహుల్‌ కొత్త రాజకీయ, వక్తృత్వ నైపుణ్యాలను తప్పనిసరిగా ఒంటబట్టించుకోవాలి. నెహ్రూ కుటుంబానికి చెందిన ప్రతి వ్యక్తీ తనకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీని మార్చడం జరిగింది. నెహ్రూ నుంచి సోనియా గాంధీ వరకు ప్రతివారూ తమకు తోచిన సిద్ధాం తాలను తాము పార్టీలోకి చొప్పించడం జరిగింది. సోనియా గాంధీ పార్టీ వ్యవహారాలకు చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నందువల్ల రాహుల్‌ గాంధీ ఆ బాధ్యత లను తలకెత్తుకోవాల్సి ఉంటుంది.
ఇక 2013లో రాహుల్‌ గాంధీయే తమ పార్టీ గురించి వివరంగా చెప్పారు. “కాంగ్రెస్‌ పార్టీ ఓ తమాషా పార్టీ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినప్పటికీ, ఇక్కడ ఎటువంటి నియమ నిబంధనలూ పనిచేయవు. రెండు నిమిషాలకొకసారి మేమే నిబంధనలు సృష్టించి, ఆ తర్వాత వాటిని బుట్టదాఖలు చేస్తుంటాం. పార్టీలో ఎవరికీ ఎటువంటి నియమాలూ పట్టవు” అని ఆయన తమ పార్టీకి సంబంధించి చెప్పిన విషయాలు చాలావరకు నిజమేననిపి స్తాయి. ఆయన మాత్రం ఒకే ఒక నియమాన్ని పాటించాలి. నెహ్రూ-గాంధీ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలి. ప్రధాన మంత్రి పదవిని చేపట్టడానికి ఆయన అడుగు దూరంలో ఉన్నారు. భారత్‌ జోడో యాత్రల పుణ్యమాని ఆయన పప్పూ నుంచి ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగారు. ఇక ఆయన గాంధీ పేరుతో చెలామణీ కావడం సాధ్యం కాదు. ఇది చాలా కాలం పాటు చెల్లింది. ఇకనైనా ఆయన తమ పార్టీని ప్రజల పార్టీగా తీర్చిదిద్దడం మంచిది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News