Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Recruitments: విలువలను వెక్కిరిస్తున్న మాజీ న్యాయమూర్తుల నియామకాలు

Recruitments: విలువలను వెక్కిరిస్తున్న మాజీ న్యాయమూర్తుల నియామకాలు

అత్యున్నత న్యాయమూర్తి పదవినుండి విరమణ పొంది నెలలు కూడా గడువకుండానే భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గోగాయ్‌ని రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్త ర్వులు ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేసాయి. భారత రాష్ట్రపతి నిర్ణయాన్ని రంజన్‌ గోగాయ్‌ సున్నితంగా తిరస్కరిస్తారనుకున్న వారి ఆశలు నిరాశలయ్యాయి. పై పెచ్చు నేను ప్రమాణస్వీకారం చేసిన తరువాత వివరణ ఇస్తాను అని ఆయన తెచ్చిపెట్టుకున్న గంబీరంతో పలికితే ఏం చెప్పబోతున్నాడో అని ఎదురుచూసింది దేశం. తీరా వారు చెప్పిన కారణాలు ఏంటయ్యా అంటే భారత న్యాయ వ్యవస్థను ఐదారుగురు వ్యక్తులతో కూడిన ఒక లాబీ పరివేక్షిస్తున్నదట, వారికి అనుగుణంగా ఉన్నప్పుడు తాను వారికి ప్రియునిగా కనిపించాడట ఇప్పుడేమో అప్రియుడై పోయిండట! ఆకాశమంత ఎత్తు ఎదిగిన వ్యక్తి ఆలోచన వాన చినుకులా నేల జారిపోతే అంతకు మించిన ఆత్మ వంచన మరోకటి ఉంటుందా? ఇది ఈనాడే కొత్తగా మొదలైందా అని అంటారేమో, నిజమే ఈనాడు కొత్తగా మొదలు కాలేదు కాని ఇప్పుడు ఈ అవగుణం కొత్తపుంతలు తొక్కుతున్నది. థింక్‌ ట్యాంక్‌ విధి సెంటర్‌ ఫర్‌ లీగల్‌ పాలిసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు పదవీ విరమణ పొందిన చివరి 100 మంది సుప్రీం, వివిధ హైకోర్టు న్యాయమూర్తులలో 70 మంది తిరిగి వివిధ హోదాలలో ఉద్యోగాలను, పదవులు అలంకరించారు, అందులో కేవలం 56% నియామకాలకు మాత్రమే చట్టా నికి అవసరమైనవి చేయబడ్డాయి (వివిధ ట్రిబ్యునల్స్‌ అధ్యక్షులు, సభ్యులు, లోకాయుక్త, మానవహక్కుల అధ్య క్షుల లాంటి నియామకాలు, వివిధ కమిటీల చైర్మెన్స్‌ మొద లైనవి). అన్యోపదేశంగా ఈ నివేదిక 44% నియామకాల నైతికతను ప్రశ్నించకనే ప్రశించింది. మరో నివేదిక అందిం చిన సమాచారం ఏమిటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చే ప్రతి తీర్పు పదవీ విరమణ తరువాత కొత్త ఉద్యోగం పొందే అవకాశాన్ని 15 నుండి 20% పెంచుతున్నదంటే పరిస్థితి ఏమిటో ఎవరైనా ఉహించావచ్చు.
దేశంలోనే అత్యున్నత న్యాయమూర్తి పదవి నుండి విరమణ పొందిన వ్యక్తి, రాజకీయ పదవిని అదీ నామినే టెడ్‌ పదవిని కాంక్షించడం నైతిక విరుద్దం కాదా అని ప్రశ్నించిన గొంతుకలకు రంజన్‌ గోగాయ్‌ గారిచ్చిన వివరణ ఒక న్యాయకోవిదుని వివరణలా కాకుండా ఒక సామాన్య రాజకీయ నాయకుని వివరణలాగా జుగుప్సా కరంగా ఉన్నది. ఐదారుగురు లాబీయిష్టుల చేతిలో న్యా యస్థానం బందీ అయింది, వారి ప్రోద్భలంతోనే నామీద విమర్శల జడివాన కురుస్తున్నదని చెప్పుకొచ్చిన తీరు చూస్తుంటే ఈ మాటలంటున్నది నిజంగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తేనా అన్న ఆశ్చర్యం కలుగక మానదు. అయ్యా మీరు చెప్పిందే నిజమయితే, కొందరి లాబీయింగు లోనే అత్యున్నత న్యాయవ్యవస్త నలుగుతున్నది నిజమే అయితే, ప్రధాన న్యాయమూర్తి హోదాలో, రాజ్యాంగ పరిరక్షకుని హోదాలో నాడు మీరెందుకు వారిని అదుపు చేయలేదు? అప్పుడెందుకు ప్రశ్నించలేదు? పదవిలో ఉన్నప్పుడు కానరాని లాబీదారులు, పదవీ విరమణ తరువాతనే కనిపించారా? మీరు చెప్పిందే నిజమైతే 32 మంది అత్యున్నత న్యాయమూర్తులలో ప్రథమునిగా, సువిశాల భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగానికి సంరక్షకునిగా మీరు విఫలమైనట్లే కదా? అంతగొప్ప పదవిలో ఉన్నప్పుడు చేయలేక పోయిన పని, తీసుకురాలేని మార్పు ఇంత చిన్న పదవితో మాత్రం ఎలా చేయగలుగుతారు మహాశయా! వారధిలా నిలవడానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి హోదా సరిపోదా?
నాడు కాబోయే ప్రదానన్యాయమూర్తి హోదాలో ఉండికూడా మీరు ప్రెస్‌ మీట్‌ పెడితే, యావత్‌ ప్రపంచం మీవైపు చూసింది. భారత న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయేమోనని ఎదురుచూసింది. మీ మీద అత్యాచార ఆరోపణలు వచ్చినప్పుడు (బహుశా ప్రపంచ న్యాయవ్యవస్త చరిత్రలోనే మొదటిసారి కావచ్చు) దేశంలో ఏ ఒక్కరూ మీ నిజాయితీని శంకించలేదు, కానీ మీ మీది ఆరోపణలను విచారించే కమిటీలో నిస్సిగ్గుగా మీరే స్వయంగా కూర్చున్నరోజు మొదటిసారి ప్రపంచానికి మీ నిజస్వరూపం వ్యక్తమయ్యింది. అక్కడ మొదలైన మీ నైతిక పతనం నిన్నటి రాజ్యసభ సభ్యత్వంతో పరిపుర్ణమయ్యింది. వ్యక్తిగా మీరు పతనమైతే ఎవరికీ నష్టం లేదు, కాని మహోన్నత వ్యవస్తకు నాయకత్వం వహించిన మనిషి, అతి సామాన్యంగా ఆలోచించడం ఎందరో ఔత్సాహికులకు నిరాశను కలిగించింది. ఆస్తులు సంపాదించుకోని ఆదర్శ న్యాయమూర్తిగా ప్రపంచం మిమ్మల్ని కీర్తిస్తుంటే అంతగొప్ప వ్యక్తి నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని ఉప్పొంగిన యువ న్యాయవాదులకు మీరందించిన సందేశం ఏమిటి, శ్రీరంగ నీతులు చెప్పడానికేగాని చేయడానికి కాదనా లేక మీ ఉన్నతికి కారణం పట్టుదల, తపన కాదు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే అనా?
ఈ సందర్భంలో ప్రఖ్యాత న్యాయకోవిదుడు, ప్రముఖ న్యాయవాది, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి దివంగత అరుణ్‌ జెట్లీ పదవీ విరమణ తరువాతి నియామకాలను ఉద్దేశించి చేసిన వాఖ్యలను గుర్తుచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వారు స్పష్టంగా చెప్పారు పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పులు పదవీ విరమణ తరువాత చేసే ఉద్యోగాల ద్వారా ప్రభావితం అవుతాయి, ….. ఇది న్యాయవ్యవస్థ స్వాతంత్రానికే ముప్పు. దురదృష్టవశాత్తు వారు కేంద్రప్రభుత్వ పదవిలో ఉన్నకాలంలోనే పదవీ విరమణ పొందిన నాటి భారత ప్రధాన న్యాయమూర్తి పీ. సదాశివం కేరళ రాష్ట్ర గవర్నర్‌గా నియమించబడ్డారు. 2013 ఆనాటి గుజరాత్‌ రాష్ట్ర మంత్రి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మీద తులసీరాం ప్రజాపతి కేసులో దాఖలైన రెండవ ఎఫ్‌.ఐ.ఆర్‌ ను రద్దుచేసిన సుప్రీం కోర్టు బెంచ్‌లో సదాశివం కూడా సభ్యులు కావడం, 2014 మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడగానే ఈ నియామకం జరగడం గమనించాల్సిన విషయం
ఇటీవలి కాలంలో సుప్రీం న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన శ్రీ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించడం అనేక చర్చలకు దారితీసింది, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన పదవీ విరమణ చివరి రోజు చివరి నిముషంలో రామజన్మభూమి లాంటి కీలకమైన కేసులో తీర్పును వెల్లడించిన రంజన్‌ గోగాయ్‌ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో నజీర్‌ కూడా ఒక్కరు కావడం, పదవీ విరమణ పొందిన నెలరోజులకే వారిని గవర్నర్‌ పదవి వరించడం గమనించాల్సిన విషయం, అదేవిధంగా ఇదే తీర్పులో సభ్యుడైన మరో న్యాయమూర్తి శ్రీ జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ పదవీ విరమణ పొందిన మూడు నెలల తరువాత జాతీయ కంపనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మెన్‌గా నియమించ బడ్డారు. పదవీ విరమణ తరువాత కొత్త ఉద్యోగాలను పొందిన న్యాయమూర్తులందరూ అవినీతిపరులనీ గానీ, ప్రభుత్వంతో లాలూచీ పడ్డారని గాని చెప్పలేం, పదవికి వన్నె తెచ్చినవారు ఎందరో ఉన్నారు. కాకపొతే సహజ న్యాయసుత్రాలకు విరుద్దంగా, అనుమానాలకు తావిచ్చే విదంగా నియామకాలు జరగడం, అత్యున్నత హోదాను అనుభవించినవారు అంతకన్నా తక్కువ హోదాకలిగిన పదవులకు ఆర్రులు చాపడం అనేక అనుమానాలకు తావిస్తున్నది, అనుమానాలను నివృత్తి చేయాల్సిన భాద్యత అటు న్యాయవ్యవస్థ మీద ఇటు పార్లమెంటరీ వ్యవస్థమీద ఎంతైనా ఉన్నది.
ప్రభుత్వాలకు, ప్రభుత్వ విదానాలకు సర్వీసు చర మాంకంలో వంతపాడి పదవీ విరమణ తరువాత కొత్త పద వులను, ఉద్యోగాలను పొందినవాళ్ళలో వీళ్ళే మొదటి వాళ్ళు కాదు, ఈ ప్రస్తానం ఇంతటితో ఆగిపోదు. ఈ క్రమంలోనే ఈ జాడ్యాన్ని అదుపుచేయడానికి అనేక రకా లైన సూచనలు ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా న్యాయ మూర్తులుగా పదవీ విరమణ చేసిన తరువాత కనీసం 2 సంవత్సరాల వరకూ ఎటువంటి రాజకీయ, లాభదాయక, నామినేటెడ్‌ పదవులలో సదరు న్యాయమూర్తులు నియ మించబడరాదన్న నిబందన తేవాలని, అదేవిదంగా మాజీ న్యాయమూర్తులు అధ్యక్షులుగా, సభ్యులుగా కొనసాగే వివిధ ట్రిబ్యునల్స్‌, కమిటీలకు ముందస్తుగానే అందుకు అర్హులైన మాజీ న్యాయమూర్తులతో కూడిన పట్టిక తయారు చేసి అందులోనుండి సీనియారిటీ మరియు పనితీరు ఆదరంగా నియామకాలు చేపట్టేవిదంగా ఏర్పాట్లు చేయాలని పలు సూచనలు ముందుకు వస్తున్నాయి. ఇదే విషయమై ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు పదవీ విరమణ పొందిన తరువాత ఎందు సంవత్సరాల పాటు కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ ఉండాలని కోరుతూ బాంబే న్యాయవాదుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ అహ్మద్‌ మొహ్దీ అబ్దీ ఉన్నత న్యాయస్థానంలో నిన్నీమద్యనే రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం కూడా జరిగింది.
విమర్శించిన వారంతా కాంగ్రెస్‌ వాదులో లేక కమ్యూనిస్టులో అని అనుకుంటే అది భారత ప్రజాస్వా మ్యాన్ని అవమానించడమే అవుతుంది. నాడు వాళ్ళు చేయ లేదా, అప్పుడు తప్పుకానిది ఇప్పుడు తప్పేలా అవుతుందని వాదిస్తారేమో, వంకరగా వాదిస్తే కొందరి నోళ్ళు మూత పడొచ్చుగాక కానీ మీ అంతరాత్మలను గొంతు నొక్కలేర న్నది సత్యం. ఇటువంటి నిర్ణయాలు, నియామకాలు భారత న్యాయవ్యవస్థ వెలువరించిన ఎన్నో తీర్పులమీద నీలినీడలు కమ్ముకునేలా చేస్తాయాన్ని కఠిననిజం. న్యాయ స్థానాల మీద ప్రజలకున్న అచంచల విశ్వాసం మీద దెబ్బ కొట్టడం సమంజసం కాదు. న్యాయమూర్తిగా వీరిచ్చిన తీర్పుల కన్నా, మాజీ న్యాయమూర్తులుగా మీరు తీసు కున్న ఈ నిర్ణయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, జీవించినంత కాలం, జీవితం తరువాత కూడా. ధర్మో రక్షతి రక్షితః.

  • చందుపట్ల రమణ కుమార్‌ రెడ్డి న్యాయవాది
    9440449392
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News