Gandhian Philosophy: మహాత్మా గాంధీ అస్తమించి నేటికీ 78 సంవత్సరాలు. భారతదేశం అస్తిత్వంలో గాంధీ స్థానం చెక్కుచెదర లేదు. 100 సంవత్సరాల క్రితం మహా త్మా గాంధీ అవిభాజ్య భారతదేశంలో జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సమస్త భారతీయులం దరి ఆకాంక్షలకు ప్రతినిధిగా గాంధీ నిలబడ్డారు. బ్రిటిష్ వలస పాలన అం తమొందించడం ఒక అంశమైతే వైవి ధ్యమైన విభిన్నమైన భారతీయు లందరినీ సమైక్యం చేయడం మరొక అంశం. అందుకే మహాత్మా గాంధీ సిద్ధాంతం- ఆచరణ అంతా భారత దేశ పునర్నిర్మాణం కోసం సాగింది.
ఈనాటి తరం మహాత్మా గాంధీ అవసరమా? అని ప్రశ్నిస్తుంది. ఈనాడు భారతదేశంలో ప్రజల మధ్య ద్వేష భావం పెంపొందించే పరి స్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితిలో భారతీయులలో స్నేహము సామరస్యము పరస్పర గౌరవం పెంపొందించే విధంగా ముందుకు సాగడానికి గాంధీ అవసరం ఎంతైనా ఉంది.
భారతదేశం గ్రామాల్లో ఉందని ఆ గ్రామీణ ప్రజలలో కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉన్నా యని గాంధీ గుర్తించారు. ఈ అసమానతలు తొలగించేందుకు తన జీవితమంతా ఉద్యమించారు. దక్షిణ ఆఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన అనుభవంతో భారత జాతీయ ఉద్యమంలో పాల్గొంటానని గోపాల కృష్ణ గోఖలే కు విన్నవించారు.
అందుకు గోఖలే ముందుగా దేశమంతా పర్యటించి భారతీయ సమాజాన్ని అర్ధం చేసుకొని ఉద్యమ స్వరూపం నిర్మించుకోవాలని సూచించారు. దీంతో రెండేళ్ల పాటు దేశమంతా తిరిగిన గాంధీ భారత దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. అంటరానితనం సమస్య, కుల వివక్ష, మత వైరుధ్యం, స్త్రీ పురుషుల అసమానతలు గుర్తించారు.
ఇవి భారతీయ ఐక్యతకు భంగం కలిగిస్తాయని భా వించిన గాంధీ ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన సమావేశాలు నిర్వ హించేవారు. హరిజనులు, ముస్లింలు, స్త్రీలు, అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేసేవారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సమ్మతి దే భగవాన్ అంటూ భజనలు చేసే వారు. ఈనాటికి భారతీయులకు పరమత సహనం, ఇతర కూలాల పైన గౌరవం పెంపొందింది.
స్త్రీ సమాన త్వం పైన విశ్వాసం పెరిగింది. కానీ దేశంలో గడచిన రెండున్న ర దశాబ్దాల కాలంగా రైట్ వింగ్ శక్తులు తమ అసత్య ప్రచారం పునాదులపైన దేశ ప్రజల మధ్య ద్వేష భావం పెంపొందిస్తు న్నారు. ఇందుకు కేంద్రంలోనూ అనేక రాష్ట్రాల్లో అధికారం అనుభవిస్తూ బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తిని నిర్లక్ష్యం చేస్తున్నది.
జాతీయ ఉద్యమాన్ని, జాతీయ నాయకుల త్యాగాలను, సిద్ధాంతా లను వక్రీకరణ చేస్తున్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ వంటి మహనీయుల త్యాగాలను కించ పరుస్తున్నారు. సనాతన ధర్మం వల్లిస్తూ దేశ ప్రజలను తిరోగమనం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు.
నేడున్న స్వేచ్ఛ సమానత్వం సోదర భావం స్త్రీ పురుషుల సమానత్వం అట్టడుగు వర్గాల అస్తి త్వం ఆత్మగౌరవం ఇంతకు ముందెన్నడూ లేవు. ఇటువంటి సమాజం సరికాదని సనాతన ధర్మం కోరుతున్నారా??
ఇటువంటి పరిస్థితులలో దేశ ప్రజల మధ్య శాంతి సహనం సామరస్యం సోదర భావం పెంపొందించడానికి మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే ముందుకు సాగాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే దిశగా మనమంతా ఉద్య మించాలి. భారతీయ ఆత్మకు, ఆకాంక్ష లకు ప్రతినిధిగా నిలిచిన రాజ్యాంగాన్ని అమలుచేయడమే మహాత్మా గాంధీకి మనం అందించే నిజమైన నివాళి.
తడక యాదగిరి
(అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓయూ)

