Homeఎడిటోరియల్ / బహుళప్రజల నుంచి దూరమైన విప్లవవాదులు

ప్రజల నుంచి దూరమైన విప్లవవాదులు

ఇండియాలో ఆధునికత పేరుతో అమలు అవుతున్న లిబరలైజేషన్‌-ప్రైవేటైజేషన్‌-గ్లోబలైజేషన్‌ (ఎల్పీజీ) విధానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇవి కేవలం ఆర్థిక సంస్కరణలు కాదు; కుల ఆధారంగా నిర్మించ బడిన వృత్తి వ్యవస్థలను, జీవన విధానాలను కుదేలు చేసే శక్తులుగా మారాయి. ఈ మొత్తం ప్రక్రియను కేవలం ఆర్థిక కోణంలో మాత్రమే చూడటం సరి పోదు. ఇది ఆధిపత్య త్రివర్ణ-త్రికుల అర్ధభూస్వా మ్య-అర్ధ పెట్టుబడిదారీ నిర్మాణాలతో, సామ్రాజ్య వాద శక్తులతో కలిసిన ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తోంది. అందుకే ఈ ఎల్పీజీ విధానాలు ఈ దేశ వాస్తవంలో “బ్రాహ్మణీకరణ” (ఎల్పీజీ-బి) రూపా న్ని దాల్చాయి అనే విమర్శను విస్మరించలేం.

- Advertisement -

చేతివృత్తులు, సేవావృత్తులు, ఉత్పత్తి వృత్తులు-ఇవి కేవలం ఉపాధి మార్గాలు కాదు; ఇవి బీసీ, ఎస్సీ వర్గాల అస్తిత్వానికి మూలాలు. కానీ కార్పొరేట్‌ ఆధి పత్యం, మార్కెట్‌ శక్తులు, యాంత్రీకరణ ఈ వృత్తుల ను నాశనం చేస్తూ, ఆ వర్గాలను అస్తిత్వ సంక్షోభం లోకి నెడుతున్నాయి. ఈ విధంగా ఆర్థిక విధానాలు, కుల ఆధిపత్య నిర్మాణాలు ఒకదానికొకటి బలపరిచే విధంగా పనిచేస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య దళిత, గిరిజన, బీసీ, మహిళా సమాజాలు మరోవైపు మతం ముసుగులో కి నెట్టబడ్డాయి. తమ హక్కుల కోసం పోరాడాల్సిన వర్గాలు మతపరమైన గుర్తింపుల్లో బంధింపబడే పరిస్థితి ఏర్పడింది. కుల అణచివేతను, ఆర్థిక దోపి డీని కప్పిపుచ్చడానికి మతాన్ని వినియోగించే రాజకీ యాలు బలపడుతున్నాయి. ఈ సందర్భంలో మన కొక ప్రత్యామ్నాయ సామాజిక-సాంస్కృతిక విము క్తి దిశ మరింత ప్రాసంగికంగా మారుతుంది.
మావోయిస్టు ఉద్యమం ఒక దశలో ప్రజల్లో విస్తృత భాగస్వామ్యాన్ని నిర్మించినప్పటికీ, క్రమంగా బీసీ, ఎస్సీ వాస్తవాల నుంచి దూరమైంది. బీసీల ప్రశ్నపై దాదాపు శూన్య స్పందన, వృత్తి సంక్షోభంపై స్పష్టమైన అజెండా లేకపోవడం, కుల సమస్యను పరి మితంగా అర్థం చేసుకోవడం, ఇవి ఉద్యమాన్ని మెజారిటీ సమాజం నుంచి వేరుచేశాయి. ఫలితం గా, ఆ ఉద్యమంపై జరిగే అణిచివేతలకు విస్తృత సామాజిక వ్యతిరేకత రాకపోవడం సహజ పరిణా మంగా మారింది.

తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో పార్లమెం టరీ వామపక్షాల పరిస్థితి మరింత సంక్షోభాన్ని చూపుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత, వామ పక్ష శక్తుల్లోని కొంత భాగం తెలంగాణ రాష్ట్ర సమితి వంటి అధికార రాజకీయాల్లో కలిసిపోవడం, ప్రజ ల్లో విశ్వాస సంక్షోభాన్ని పెంచింది. ఒకప్పుడు ప్ర త్యామ్నాయంగా కనిపించిన శక్తులు, అధికార వ్యవస్థలో భాగమవ్వడం దేశ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు.

ఈ నేపథ్యంలో భూ పంపిణీ వంటి మూల ప్రశ్నలపై వామపక్షాల మౌనం మరింత ఆందోళన కరం. ధరణి వంటి వ్యవస్థలు వచ్చిన తర్వాత భూమిలేని దళిత, బీసీ, ఆదివాసీ గిరిజన వర్గాల పరిస్థితి మరింత క్లిష్టమైంది. భూమి హక్కు అనే ప్రశ్న ను పక్కనపెట్టి సంక్షేమం – సబ్సిడీల రాజకీయాలపై ఆధారపడటం, వామపక్షాల చారిత్రక ధోరణికి విరుద్ధం.

————————————————————
ALSO READ:

ఔషధ భద్రత, నియంత్రణ- – ప్రజారోగ్య పరిరక్షణ

కులమే పేదరికానికి మూలం

గద్దరే తెలంగాణ జాతిపిత: తెల్లాపూర్‌ డిక్లరేషన్‌

————————————————————

మరో వైపు, బీసీల్లో “రాజ్యాధికార ఆకాంక్ష” పెరుగుతోంది. వారు కేవలం సంక్షేమం కాదు; అధి కారంలో భాగస్వామ్యం కోరుకుంటున్నారు. కానీ విప్లవ – వామపక్షాలు వారిని ఎక్కువగా ‘క్యాడర్‌’ గానే ఉపయోగించాయి తప్ప, నాయకత్వ స్థాయికి తీసుకురావడంలో విఫలమయ్యాయి. “విప్లవ శ్రేణు ల్లో క్రింది కులాల నాయకత్వం ఎదిగిన సందర్భాల్లో కూడా, ఆ నాయకత్వం తమ సమాజాల మౌలిక సమస్యలను రాజకీయ అజెండాగా మలచడంలో పరిమితంగానే మిగిలింది.” అణగారిన కులాల వర్గాల నాయకత్వ లేమి, బీసీ సమాజంలో వామ పక్షాలపై దూరాన్ని పెంచింది. విద్యా రంగంలో ప్రైవేటీకరణ వల్ల బీసీ, ఎస్సీ యువత ఉపాధి కోసం పోరాడుతూ, రాజకీయ చైతన్యం నుంచి దూరమవు తున్నారు. ఇది ఒక రాజకీయ శూన్యతను సృష్టిస్తోంది.

“ఈ మొత్తం పరిస్థితి ఒక ద్వంద్వ సంక్షోభాన్ని స్పష్టంగా చూపుతోంది. అటు సాయుధ పోరాటం ప్రజల నుంచి దూరమై బలహీనపడింది; ఇటు పార్ల మెంటరీ వామపక్షాలు విశ్వాసాన్ని కోల్పోయాయి.” ఇలాంటి పరిస్థితుల్లో ఒక స్పష్టమైన రాజకీయ దిశ అవసరం.

ఈ దేశ భవిష్యత్తు కోసం వర్గపోరాటం, కుల నిర్మూలన రాజకీయాల కలయిక తప్పనిసరి. ఫూలే – అంబేడ్కర్‌ చూపిన మార్గాలు మార్క్సిస్టు దృక్పథం తో విమర్శనాత్మకంగా కలిసినప్పుడే సమగ్ర విముక్తి సాధ్యం అవుతుంది. అదే సమయంలో, పార్లమెంట రీ రాజకీయాల్లో ఏర్పడిన దళారీ వ్యవస్థను నిర్మూ లించడానికి నిజమైన మార్క్సిస్టు రాజకీయ శ్రేణులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఫూలే-అం బేద్కర్‌ ప్రతిపాదించిన కుల నిర్మూలన దృక్పథాన్ని విమర్శనాత్మకంగా స్వీకరించి, వర్గపోరాటంతో అను సంధానం చేసే రాజకీయ శక్తులే నేటి అవసరం.

మొత్తంగా చూస్తే, నేటి పరిస్థితి ఒక స్పష్టమైన పాఠాన్ని చెబుతోంది: వామపక్షాలు తమను తాము పునర్నిర్మించుకోకపోతే, ప్రజల విశ్వాసాన్ని కోల్పో తాయి. అయితే అదే సమయంలో, ఈ సంక్షోభం ఒక అవకాశం- కొత్త సమగ్ర రాజకీయ దిశను నిర్మించడానికి. ఈ దిశలో ముందుకు వెళ్లే శక్తులే ఈ దేశ భవిష్యత్తును మారుస్తాయి. “లేకపోతే, విప్లవం నినాదంగా మిగిలిపోతుంది, ప్రజల జీవితం మాత్రం అలాగే నిలిచిపోతుంది.”

పాపని నాగరాజు
సామాజిక విశ్లేషకులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News