Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Rising cases: పెరిగిపోతున్నకేసుల భారం

Rising cases: పెరిగిపోతున్నకేసుల భారం

న్యాయ స్థానాల్లో న్యాయాన్ని వెలువరించడంలో జరుగుతున్న అసా ధారణ జాప్యం గురించి ఇటీవలి కాలంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అపరిష్కృతంగా ఉండిపోతున్న లక్షలాది కేసుల పరిష్కారానికి గట్టి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, కేవలం న్యాయ మూర్తుల సంఖ్యను పెంచినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూ్‌డ స్పష్టం చేశారు. పైగా ప్రతిభావంతులైన న్యాయమూర్తులు లభ్యం కావడం కూడా రాను రాను గగనమైపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ న్యాయ వ్యవహారాల స్థాయీ సం ఘం చైర్మన్‌ సుశీల్‌ కుమార్‌ మోదీ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదైనా అసాధారణ, సాంప్ర దాయేతర ప్రయత్నం చేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాంప్రదాయిక ప్రయత్నం వల్ల తాత్కాలిక ప్రయోజనం ఒనగూడుతుందే తప్ప శాశ్వత పరిష్కారం లభించదని, పైగా ఇటువంటి ప్రయత్నం పైపై మెరుగులు అద్దడం లాంటిదే అవు తుందని ఆయన అన్నారు.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి అటు ప్రభుత్వం వద్ద గానీ, ఇటు న్యాయ వ్యవస్థ వద్ద గానీ ఏమన్నా పద్ధతులు, ప్రక్రియలు ఉన్నాయా? చాలాకాలంగా న్యాయ నిపుణులు అనేక మార్గాలు సూచిస్తున్నారు కానీ, ఇవేవీ ఆచరణ యోగ్యంగా కనిపించడం లేదు. జస్టిస్‌ చంద్రచూడ్‌ చెప్పినట్టు, ప్రతి భావంతులైన, సమర్థులైన హైకోర్టు న్యాయమూర్తులు లభ్యం కావడం రాను రానూ కష్టమైపోతోంది. కా నీ, ప్రతి ఏటా పదుల సంఖ్యలో హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడం మాత్రం యథావి ధిగా సాగిపోతోంది. హైకోర్టు న్యాయమూర్తులు 62 ఏళ్ల వయసుకే పదవీ విరమణ చేయడం జరుగుతుంది. కొత్త న్యాయమూర్తుల నియామకం జరగకుండా 62 ఏళ్ల న్యాయమూర్తులను పదవీ విరమణ చేయించడం వల్ల హైకోర్టు కేసుల పరిష్కారం అనేకానేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. పదవీ విరమ ణ చేయాల్సిన న్యాయమూర్తులను మరి కొంత కాలం పదవుల్లో కొనసాగించడం ద్వారా పెండింగ్‌ కేసు లను కొంత వరకైనా పరిష్కరించడానికి వీలు పడుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
మొత్తానికి, సుప్రీంకోర్టు, హైకోర్టులలో పేరుకుపోతున్న కేసులను సాధ్యమైనంత త్వరగా తగ్గించడాని కి కొన్ని క్రియాశీల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. దేశం లోని న్యాయస్థానాలలో 4.70 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గత మార్చిలో పార్లమెంటులో ప్రకటించింది. ఇందులో సుప్రీం కోర్టులో 70,154 కేసులు, దేశంలోని 25 హైకోర్టులలో మార్చి నాటికి 58,94,060 కేసులు అపరిష్కృతంగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇటువంటి దయనీయ పరిస్థితి తలెత్తకుండా ఉండడానికి న్యాయ వ్యవస్థలోనే అంతర్గతంగా ఒక వ్యవస్థ లేదా యంత్రాంగం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను పరిశీలించడం, నియామకాలను మదింపు చేయడం వంటివి ఈ యంత్రాంగం నియంత్రణ లో ఉండాలని కూడా వారు సూచిస్తున్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించ డానికి ఒక స్ప ష్టమైన, నిర్దిష్టమైన వ్యూహం అవసరమని వారు చెబుతున్నారు. ఉన్నత న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో వీటి అమలు వ్యవస్థను పని చేయించాలని, ప్రతి కేసుకూ కాల పరిమితి విధించాలని వారు అభిప్రాయప డుతున్నారు.
ఆన్‌లైన్‌ కోర్టులు అవసరం
అంతేకాదు, డిజిటల్‌ లేదా ఆన్లైన్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని, న్యాయ వ్యవస్థను విస్తరించాలని, దీ నివల్ల కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని కూడా వారు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ్యయ వ్యవస్థను వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందని కూడా వారు చెబుతున్నారు. విచిత్రమేమిటంటే, ౠ ఎండింగ్‌ కేసుల్లో చాలా భాగం ప్రభుత్వానికి చెందినవే. అనేక కేసుల్లో ప్రభుత్వాలే ప్రతివాదులు. ఈ కే సుల పరిష్కారంలో ప్రభుత్వపరంగా జరగాల్సిన పనులేవీ జరగడం లేదు. తమకు సంబంధించిన కేసు లను పరిష్కరించడానికి ప్రయత్నించాల్సిన ప్రభుత్వాలు కాలయాపనతో సరిపుచ్చుతున్నాయి. ముఖ్యంగ అఫిడవిట్లు దాఖలు చేయడం, వివరాలను అందజేయడం వంటి విషయాలలో ప్రభుత్వ తాత్సారం ను రానూ శ్రుతి మించుతున్నట్టు న్యాయమూర్తులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. పాలనా సంబంధమైన ఆలస్యాలు కూడా న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆలస్యాలుగా ప్రచారం జరుగుతున్నాయి.
ప్రజలు, న్యాయమూర్తులు, కేసులకు సంబంధించిన నిష్పత్తిలో అనూహ్యమైన తేడాలుంటున్నాయనే ది న్యాయమూర్తుల ఫిర్యాదుగా ఉంది. న్యాయ వ్యవస్థలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు న్యాయ మూర్తుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఫలితంగా ప్రజలకు న్యాయం అందడంలో, అంటే న్యాయ మూర్తులు తీర్పులు వెలువరించడంలో విపరీతమైన జాప్యం జరగక తప్పడం లేదు. హైకోర్టులలో 50 శాతం కూడా న్యాయమూర్తుల నియామకం జరగడం లేదు. త్వరితగతిన కేసులను పరిష్కరించడానికి తాము చేయగలిగినంత చేస్తున్నామని కేంద్రం గత మార్చిలో కూడా ప్రకటించింది. అయితే, ఆచరణలో మాత్రం అటువంటిదేమీ కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News