Sunday, September 8, 2024
Homeఓపన్ పేజ్Rising Unemployment in India: పెను సవాలుగా నిరుద్యోగ సమస్య

Rising Unemployment in India: పెను సవాలుగా నిరుద్యోగ సమస్య

మూడవ పర్యాయం అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఉద్యోగాల కల్పన అనేది ఒక పెద్ద సవాలుగా మారబోతోంది. త్వరలో బడ్జెట్‌ ను ప్రవేశపెట్ట బోతున్న నేపథ్యంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వా ల్సిన పరిస్థితి ఏర్ప డుతోంది. దేశంలో టెక్నాలజీ రంగంలో ముందుకు దూసుకుపోతున్నప్పుడు సహజంగా కంపెనీల్లో ఉద్యోగాల అవసరం బాగా తగ్గుతోంది. దీనివల్ల తప్పకుండా నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశమే ఉంటుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. కొత్త బడ్జెట్‌ లో మోదీ ప్రభుత్వం ఈ రెండు కీలక అంశాల మధ్య సమతూకం పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఉత్పత్తి రంగంలో స్తబ్ధత ఏర్పడినందువల్ల ఉద్యోగాల కల్పన కష్టసాధ్యంగా మారుతోందని ఇటీవల ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల భారతదేశం గురించి తన నివేదికలో పేర్కొంది. దేశంలో దాదాపు 21 శాతం కార్పొరేట్‌ సంస్థలు ఆధునిక టెక్నాలజీ కారణంగా తక్కువ మంది ఉద్యోగులతో సంస్థల నిర్వహణను కొనసాగిస్తున్నట్టు అనేక సర్వే సంస్థలు ఇప్పటికే తెలియజేశాయి.
దేశంలో నిరుద్యోగ సమస్య రాను రానూ పెరుగుతున్నట్టు జాతీయంగానే కాక, అంతర్జాతీయంగా కూడా అనేక సర్వే సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.ఎల్‌.ఓ) ఇటీవల విడుదల చేసిన ‘భారత నిరుద్యోగ నివేదిక’ ప్రకారం నిరుద్యోగ సమస్య విషయంలో భారతదేశం అధ్వాన స్థితిలో ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ సమస్య పెరుతూనే ఉంది తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదని కూడా అది తెలిపింది. దేశంలోని జనాభాలో నిరుద్యోగుల సంఖ్య దాదాపు 83 శాతం ఉంటుందని అది పేర్కొంది.
దేశంలో దాదాపు 93 శాతం మంది యువతీ యువకులు అవ్యవస్థీకృత, లాంఛన ప్రాయమైన ఉద్యోగాలే చేస్తున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది. ఇదే ఇండొనీషియా, వియ త్నాంలలో అవ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య 60 శాతం మాత్రమే ఉంటోంది. ఇక పురుషుల 77 శాతంతో పోలిస్తే మహిళా ఉద్యోగుల శాతం 32 శాతం కూడా ఉండడం లేదు. ఉద్యోగాలు, చదువులు, శిక్షణలు లేని యువతీ యువకుల సంఖ్య 29 శాతా నికి పైగానే ఉంటున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇది ఆసియాలోనే అత్యధిక శాతం కింద పరిగణించాల్సి ఉంటుంది. విచిత్రమేమిటంటే, పరిశ్రమలు, కర్మాగారాలు, వాణిజ్య సంస్థలు, ఇతర కార్యాలయాలు తమ వద్ద ఉన్న ఉద్యోగులు, కార్మికుల సంఖ్య బాగా తక్కువని, తాము తక్కువ సంఖ్య ఉద్యోగులతో సంస్థలను నిర్వహించాల్సి వస్తోందని తరచూ చెప్పడం జరుగు తుంటుంది. చదువులు ఉంటున్నాయి కానీ, ఉద్యోగాలకు అవసరమైన శిక్షణలు యువతీ యువకులకు లభ్యం కావడం లేదు. దేశం ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ, నిరుద్యోగ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు.
కోవిడ్‌ తర్వాత దేశంలో ఆర్థికంగా బాగానే పుంజుకొంది కానీ, ఉద్యోగాల కల్పన మాత్రం యథాతథంగా కొనసాగుతూ వస్తోంది. లాభదాయకంగా ఉన్నా లేకపోయినా ఎక్కువ మంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం కూడా జరిగింది. నిలకడగా ఆదాయం ఉన్నా లేకపోయినా మరెందరో యువతీ యువకులు స్వయం ఉపాధికి తరలి వెళ్లారు. వ్యవసాయేతర రంగంలో ఉద్యోగాల కల్పన వెనుకపట్టు పట్టింది. ప్రైవేట్‌ రంగంలో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకోవడమన్నది ఎక్కువైంది. నిజానికి, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉన్నట్టు గొప్పగా చెప్పుకునే భారతదేశంలో యువత పరిస్థితి మాత్రం ఏ విధంగా చూసినా అధ్వానంగా ఉంటోంది. ఈ యువ జనాభాను సద్వినియోగం చేసుకోవడమన్నది బాగా తక్కువ స్థాయిలో ఉంది. ఇక మున్ముందు ఈ యువ జనాభా బాగా తగ్గిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. అంతేకాదు, ఈ యువ జనాభాలో ఏమాత్రం అసంతృప్తి చెలరేగినా అది సామాజిక, ఆర్థిక, రాజకీయ ఘర్షణలకు, ఉత్పాతాలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News