Thursday, March 12, 2026
Homeఎడిటోరియల్ / బహుళRohit Vemula Act: ‘రోహిత్‌ వేముల చట్టం’ అందివచ్చేనా...

Rohit Vemula Act: ‘రోహిత్‌ వేముల చట్టం’ అందివచ్చేనా…

HCU Rohit Vemula: రోహిత్‌ వేముల తిరిగి సభ్య సమాజం ముందుకు వచ్చాడు. మతో న్మాద శక్తుల మధ్య ఊపిరి విడిచి విద్యాసంస్థల చిరునామా మారాడు. దళిత, వెనుకబడిన వర్గాల విద్యా ర్థులపై జరుగుతున్న కుల వివక్ష, వేధింపులను నిరోధించడానికి ‘రోహి త్‌ వేముల చట్టం’ తీసుకురావలసిన ఆవశ్యకతను తెలంగాణ రాష్ట్ర డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్ల డించడంతో రోహిత్‌ తిరిగి మన మధ్యకు వచ్చినట్లయింది. పదేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యా లయం (హెచ్‌సీయూ) యాజమాన్యం ఐదుగురు విద్యార్థులను పదిహేను రోజుల పాటు బహిష్కరించింది.

- Advertisement -

ఈ విద్యార్థులు తరగతులకు హాజరు కావ చ్చు. కానీ హాస్టల్‌లో ఉండకూడదు. మెస్లో భోజనం చేయకూడదు. లైబ్ర రీలో అడుగుపెట్టరాదు. ఇతర విద్యార్థులతో మాట్లాడకూడదు. ఇది ఒకర కంగా విశ్వవిద్యాలయ బహిష్కరణగానే చెప్పుకోవచ్చు. దీంతో ఈ ఐదుగురు విద్యార్థులు క్యాంపస్లో ‘వెలివాడ’ పేరుతో ఓ గుడారం వేసుకుని గడిపారు. ఈ క్షోభను భరించలేని ఐదుగురిలోని ఓ విద్యార్థి, అతనే రోహిత్‌ జనవరి 17, 2016న సూసైట్‌ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా జరగ డానికి ప్రధాన కారణం, విద్యార్థి వర్గా ల మధ్య జరిగిన ఘర్షణ.

యాకుబ్‌ మెమెన్‌ ఉరిశిక్షను వ్యతిరేకించిన వర్గం (ఐదుగురు విద్యార్థులు), అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) విద్యార్థి వర్గం మధ్య జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఏబీవీపీ నాయకలపై దాడి చేశారన్న ఆరోపణలు ఆ ఐదుగురు దళిత విద్యా ర్థులపై ఉంది. ఏబీవీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేంద్ర ప్రభుత్వం అధి కారులపై తెచ్చిన వొత్తిడితో ఐదుగురు విద్యార్థులు బహిష్కరణకు గురయ్యారు. మానసిక క్షోభతో రోహిత్‌ ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఆనాటి నుంచీ విద్యాసంస్థల్లో వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలనే డిమాండ్‌ దేశవ్యాప్తంగా వెల్లువెత్తింది.
రోహిత్‌ ఆత్మహత్య అనంతర పరిణామాలు ఉద్వేగభరితంగా మారా యి.

హెచ్‌సీయూలో మొదలైన నిరసన జ్వాల దేశవ్యాప్తంగా ఎగిసిపడింది. పార్లమెంట్‌ను కుదిపేసింది. కుటుంబానికి న్యాయం జరగాలని, కుల వివక్షను సమాజం నుంచి చెరిపేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశా యి. దేశవ్యాప్తంగా విభజన, విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తోందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు విరుచుకుపడ్డాయి. విశ్వవిద్యాలయాల పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని విమ ర్శించారు. మూడు రోజలపాటు పార్లమెంట్‌లో జరిగిన చర్చ, చివరకు కాం గ్రెస్, బీజేపీల మధ్య సభాహక్కుల తీర్మానానికి దారితీసింది. కానీ, రోహిత్‌ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను, కారకులను వెల్లడి చేయలేకపో యింది.

రోహిత్‌ తల్లికి న్యాయం అందే దిశలో ప్రభుత్వ చర్యలు తీసుకోలేక పోయింది. దీంతో ఉద్యమం ఉధృతమవడంతో వర్సిటీ పాలక మండలి, మిగిలిన నలుగురు విద్యార్ధులపై క్రమశిక్షణ చర్యల్ని రద్దు చేసింది. అయితే తమ డిమాండ్లన్నీ నెరవేర్చేవరకూ పట్టువిడవబోమంటూ విద్యార్థి నేతలు ఆమరణ దీక్ష కొనసాగించారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండటానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని విద్యార్థులు డి మాండ్‌ చేస్తూనే ఉన్నారు.

విశ్వవిద్యాలయాల్లో కుల, ఆర్థిక వివక్షను అరికట్టేందుకు ‘రోహిత్‌ వేముల చట్టం’ తీసుకురావలని ‘జస్టిస్ ఫర్‌ రోహిత్‌ వేముల’ ప్రచార కమిటీ పదేళ్లుగా పోరాడుతూనే ఉంది. రోహిత్‌ తల్లి రాధిక కూడా చట్టం కోసం పట్టుబడుతూనే ఉంది. దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థులపై జరుగుతున్న కుల వివక్ష, వేధింపులను నిరోధించడం లక్ష్యంగా చట్టం ఉండాలన్నది కమిటీ భావన. క్యాంపసుల్లో కుల ఆధారిత వివక్షను నేరంగా పరిగణించ డం, బాధితులకు రక్షణ కల్పించడం అత్యవసరంగా మారింది.

చట్టాన్ని తీసుకురావడం వల్ల విద్యార్థుల్లో ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఆస్కారమే ర్పడుతుంది. చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వారెంట్‌ లేకుండానే అరెస్టు చేసే అధికారం (కాగ్నిజబుల్‌), నాన్‌ బెయిలబుల్‌గా ఉండాలని కోరుకుం టున్నారు. విచారణలో వివక్ష నిగు ్గతేలిస్తే ఆయా వ్యక్తులు, సంస్థలు, సం ఘాలపై చర్యలు, జరిమానాలు ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నా రు. బాధిత విద్యార్థులకు సత్వర న్యాయం అందేలా ప్రత్యేక అధికారాలను ఏర్పాటు చేయడం వంటి అంశాలతో పదేళ్లుగా పోరా డుతూనే ఉన్నారు.

ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా ఆలోచన చేస్తున్న దాఖలాలు కాన రావడం లేదు. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభు త్వాలు ఈ చట్టంపై దృష్టి పెట్టడం, ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్ర మార్క ప్రకటన చేయడంతో బహుజన విద్యార్థుల్లో ఆశ చిగురించింది.

చట్టం తీసుకురావాలనే డిమాండ్‌ 2016లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య తర్వాత దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. అప్పటినుంచీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ చట్టంపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో చట్టం ముసాయిదా విడుదల అయింది. ప్రభుత్వ, ప్రైవేట్‌, డీమ్డ్‍ విశ్వవిద్యాలయాలతో పాటు కర్ణాటక లోని ఉన్నత విద్యా సంస్థల్లో వివక్షను నివారించడానికి, అణగారిన వర్గాలకు విద్యకు సమాన అవకాశాలను కల్పించడానికి ఈ ముసాయిదా బిల్లును ప్రతిపాదించారు.

ఈ బిల్లు కింద నిందితులను వారెంట్‌ లేకుండా అరెస్టు చేస్తారు. ఏడాదిపాటు జైలుశిక్ష లేదా పదివేల రూపాయల జరి మానా ఉంటుంది. ఈ పరిహారాన్ని నేరుగా నిందితుడికి చెల్లించాలి. పదే పదే నేరం చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించేలా ముసాయిదాను తయారుచేశారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ లో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ చట్టంపై దృష్టి సారిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఈ చట్టం రూపుదాల్చాల్సి ఉంది.

కర్ణాటక తయారుచేసిన ముసాయిదాకు అవసరమై న మార్పులు చేసి చట్టంగా తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే, ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక అడుగు ముందుకేసి, చట్టం తీసుకురా వడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. వీలైనంత తొందరలో రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. కుల వివక్షలేని సమాజం కోసం రోహిత్‌ వేముల కలలు కన్న దేశం కోసం ప్రతి ఒక్కరూ కదలాలని, ఆయన పేరుతో చట్టం తీసుకురావాలని రాహుల్‌ గాంధీ కూడా గతంలో ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

కోడం పవన్‌కుమార్‌
జర్నలిస్ట్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News