Tuesday, September 24, 2024
Homeఓపన్ పేజ్Russia-China: చైనాకు రష్యా, ఉత్తర కొరియా తోడ్పాటు

Russia-China: చైనాకు రష్యా, ఉత్తర కొరియా తోడ్పాటు

మాస్కో, బీజింగ్‌ మరింత దగ్గరగా వచ్చాయని మన స్నేహం పటిష్టమన్న రష్యా

ఏనాడూ చైనాకు, రష్యా సహకారం ఇవ్వలేదు. ఉత్తర కొరియా అడపా, దడపా మద్దతు ఇచ్చినా, రష్యా దూ రంగా ఉండేది. అయితే మారుతున్న పరిణామల దృష్యా చైనాకు రష్యా దగ్గర అవుతున్నట్లు కనపడుతోంది. ఇటీవల చైనా అధ్యక్షుడికి 70 ఏళ్ళు నిండిన సందర్భంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. అయితే ఇది గతంలో లేదు. ఉక్రైన్‌ తో యుద్ధం వచ్చినప్పటి నుంచి రష్యాను కొన్ని దేశాలు ప్రక్కన పెట్టాయి. అది తెలిసే రష్యా అధ్యక్షుడు, జిన్‌ పింగ్‌ కు దగ్గర కావాలని, చైనా, రష్యా మంచి భాగస్వామ్య దేశాలుగా ఉండాలని ఒకరికొకరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ దిశలో మాస్కో, బీజింగ్‌ మరింత దగ్గరగా వచ్చాయని మన స్నేహం పటిష్టంగా ఉంటుందని పుతిన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. ఇందుకు చైనా అధ్యక్షుడు చేసే ప్రతి ప్రయత్నాన్ని పుతిన్‌ ప్రశంసించారు. జిన్‌ పింగ్‌ చేసే కృషి వల్లనే తమ మధ్య సయోధ్య పెరిగిందని
ఒకరికొకరు నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నామని వెల్లడించాడు. సుదీర్ఘకాలం చైనాకు అధ్యక్షుడిగా వ్యవహరించడం రాజకీయ పరిణితి చెందిన నాయకునిగా అన్ని విషయాలలో అయనకు పట్టు ఉందని ఓ బలమైన దేశం, మరో బలమైన దేశంతో సఖ్యతతో, సామరస్యంగా మెలగడం గొప్ప చర్య అని, జిన్‌ పింగ్‌కు ఉన్నటువంటి ఆదరణ చైనాలో స్పష్టమైందని పుతిన్‌ వ్యాఖ్య నించాడు. ఆయన సారథ్యంలో చైనా అన్ని రంగాలలో పుంజుకుందని, ముఖ్యంగా పౌరుల జీవన ప్రణామాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయని, విశ్వంలో బీజింగ్‌ యొక్క స్థాయి, స్థానం బలపడుతోందని రష్యా అధ్యక్షుడు చెప్పడం గమనార్హం. రెండు దేశాల మధ్య సహకారం బలపడుతోందని ఇది ఆశించిన స్థాయిలో మరింత బలోపేతం కావాలని పుతిన్‌ వక్కానించారు. పుతిన్‌ చైనా గురించి ఎన్నడు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు చైనాతో సంబంధాలు బలపడటంతో, అ దేశానికి దగ్గర కావాలని కాంక్షిస్తున్నాడు. అదేవిధంగా జిన్‌ పింగ్‌కు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జంగ్‌ ఉన్‌ కూడా 70వ జన్మదిన శుభాకాంక్షలు అందించారు. కిమ్‌ జింగ్‌ ఉన్‌ ఆసాంతం చైనా అధ్యక్షుడిని ప్రశంసలతో ముంచెత్తాడు.
విశ్వవ్యాప్తంగా చైనా స్థానం దృఢతరంగా ఉందని ఓకే మహాత్తర శక్తివంతమైన నాయకత్వాన్ని ఆయన కొనసాగిస్తున్నారని చైనా ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శిగా ఉండగలదని, రాబోయే రోజులలో చైనా ఓకే బలమైన స్థానం పొందగలదని తన సందేశంలో పేర్కొన్నాడు. అంతేకాక ఆయన ఒకే నిరంతర శ్రామికుడు ఉత్సాహవంతమైన ఆయన హయాంలో చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ బలం పుంజుకుందని కిమ్‌ అభినందనలతో ముంచెత్తాడు. చైనా తన పరిధిని విస్తరించుకుంటుందని అ దేశంతో మా స్నేహం బలపడాలని కోరుకుంటున్నట్లు కిమ్‌ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయపరంగా చైనా శక్తి వంతమైన దేశంగా ఉందని, అ దేశంతో మాకు తోడ్పాటు, సహకారం సహాయం అవసరమని మీ నాయకత్వంలో చైనా అగ్రదేశంగా దూసుకుపోవాలని కిమ్‌ తన సందేశంలో పేర్కొన్నారు. అందుకు సూచనగా కిమ్‌ చైనా అధ్యక్షునికి ‘పూలు’ పంపారు. పూలు పంపడంలో ఉద్దేశం ఏమనగా చైనాకు ఇక ఎదురు ఉండదు. చైనాతో ఎల్లప్పుడు మేము స్నేహితులుగానే ఉంటామని తెలుస్తోంది. ఈ మేరకు కొరియా వార్త సంస్థ కూడా చైనా అధ్యక్షుడి గురించి ఆయన నాయకత్వ పటిమను వెల్లడించింది. జిన్‌ పింగ్‌ పుట్టినరోజు సందర్బంగా వైట్‌ హౌస్‌ కాని, భారతదేశం కానీ ఏ మాత్రం స్పందించలేదు. రష్యా, చైనా స్నేహం భారత్‌ గమనిస్తోంది. భారత్‌ తో స్నేహాన్ని రష్యా ఎప్పుడూ వదులుకోదు. అది రష్యాకు కూడా తెలుసు. అయితే చైనా దృక్పధం వేరు. ఆసియా ఖండంలో భారత్‌ యొక్క ప్రాభావాన్ని తగ్గించాలని చైనా తలుస్తోంది. అందు నిమిత్తమే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు రావాల్సిన శాశ్వత స్టానానికి ప్రధాన అడ్డంకి చైనాయే. ఒక దశలో అమెరికా ఒప్పుకున్నా ‘వీటో’ అధికారంతో చైనా తన పవర్‌ చూపిస్తుంది. భారత్‌ అంటే యేమాత్రం చైనాకు గిట్టదు. అదే విధంగా ఉత్తర కొరియా కూడా భారత్‌ తో సరైన సంబంధాలు లేవు. ఆసియా ఖండంలో ఈ మూడు దేశాలు ఉన్నా చైనా, ఉత్తర కొరియా ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకమే. ఇప్పుడు చైనాకు అండగా రష్యా చేరడంతో చైనాకు కొత్త ఊపు వచ్చినట్లు అయింది. చైనాకు రష్యా, ఉత్తర కొరియా ప్రస్తుతం సహాయ సహకారాలు, తోడ్పాటు అందిస్తున్నాయి. అందు నిమిత్తమే చైనా తన ప్రాభవాన్ని చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. రష్యాను దగ్గరకు తీసుకుంటే అమెరికాను ఏకాకి చేయవచ్చని చైనా ఆలోచనగా ఉంది. కాని అది అంత సులభం కాదు. ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన దేశం అమెరికా. విస్తృత సైనిక సామర్థ్యం, అత్యంత ప్రతిభవంతమైన సాంకేతిక పరిజ్ఞానం అమెరికా సొత్తు. విశ్వంలో అన్ని దేశాలు ఏకమైనా అమెరికా చెక్కు చెదరదు. అందుకే చైనా, రష్యా, ఉత్తర కొరియా దేశాల తొడ్పాటు కోరుకుంటోంది. చైనా, రష్యా బంధం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. పుతిన్‌ కు జిన్‌ పింగ్‌ యొక్క వైఖరి తెలుసు. గతంలో భారత్‌తో చేసుకున్న పంచశీల ఒప్పందానికి తూట్లు పొడిచిన సంగతి కూడా పుతిన్‌కు అవగతమే. అందుకే ఎట్టి పరిస్థితులలోను రష్యా, భారత్‌ ను విడువదు. భారత్‌ తో స్నేహం భగ్నం కావాలని జిన్‌ పింగ్‌ ఆలోచన అయుండొచ్చు. అయితే అదంతా అనుకున్నట్లుగా జరుగదు. రష్యాతో సంబంధాలు బెడిసిన ఉత్తర కొరియా మాత్రం చైనాకు అండగా ఉంటుందని, చైనా ప్రతి చర్యని, అలాగే ఉత్తర కొరియా ప్రతి చర్యని రెండూ అభినందించుకుంటాయి. రష్యా కంటే ఉత్తర కొరియా చైనాతో ఎక్కువ సంబంధాలు కలిగి ఉంటుందనేది నగ్న సత్యం.

  • కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు,
    93915 23027.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News