Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Russia Ukrain war wont end: యుద్ధం ఆగే పరిస్థితే లేదు

Russia Ukrain war wont end: యుద్ధం ఆగే పరిస్థితే లేదు

ప్రపంచ శాంతి పిచ్చి వాని కల

దాదాపు సంవత్సరకాలం నుండి రష్యా, ఉక్రైన్‌ దేశాలు పట్టు వీడటం లేదు. ప్రతీకార జ్వాలాలు రేగుతూనే ఉన్నాయి. రెండు దేశాల మధ్య సయోధ్య అనే మాటే వినబడటం లేదు. శాంతికి అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ దిశలో ఉక్రైన్‌ తాజాగా వేర్చ్‌ వంతెనను పేల్చి వేసింది. వంతెన పాక్షికంగా దెబ్బ తినింది. గతంలో కూడా ఉక్రైన్‌, రష్యా నల్ల సముద్రంపై నిర్మించిన రైలు వంతెనను కూల్చి వేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా రష్యా, ఉక్రైన్‌లోని పలు పట్టణాలను ధ్వంసం చేసింది. వేర్చ్‌ వంతెనను పేల్చి వేసిన ఉక్రైన్‌ చాలా సాహసంతో వ్యవహరించింది. అమెరికా, బ్రిటన్‌ దేశాల సాయంతో, ఆ దేశాల ఒత్తిడితో ఉక్రైన్‌ ఈ పని చేసి ఉంటుందని భోగట్టా. ఇలా ఈ వంతెనపై దాడి జరగడం ఇది రెండవ సారి. అందుకే రష్యా అక్కడ భారీ భద్రతను పెంచింది. అయినా దాడి జరగడం గమనార్హం. ఈ దాడికి రష్యా స్పందించింది. ప్రస్తుతం ఈ వంతెనపై ఎటువంటి రాకపోకలు జరగడం లేదని పేర్కొంది. అసలు వంతెన దెబ్బ తినిందా! లేదా అనేది ఇక్కడ ప్రశ్న. రష్యా ఎంతో ప్రతిష్టాకరంగా భావించే ఈ వంతెనను అమెరికా, బ్రిటన్‌ దేశాలు ఉక్రైన్‌కు సాయం అందించాయి. రెండు భారీ పేలుళ్ళు జరిగినట్లు తెలుస్తోంది. రష్యా అనుమానించినట్లుగా ఈ కుట్రలో ఉక్రైన్‌ తో పాటు అమెరికా, బ్రిటన్‌ హస్తం కూడా ఉన్నట్లు రష్యా అనుమానిస్తోంది. వంతెన దెబ్బ తినడం మా విజయం అని ఉక్రైన్‌ చెబుతోంది. ఇలా రష్యా, ఉక్రైన్‌ తమ శక్తి సామర్థ్యలూ తెలుపుకుంటున్నాయి. యుద్ధం ఆగిపోవాలని వాళ్ళు కోరుకోవడం లేదు. ఉక్రైన్‌ ఎటూ ‘నాటో’ లో చేరడం లేదు. చేరటానికి దరఖాస్తు చేసింది అంతే. ప్రస్తుతం ఎట్టి పరిసస్థితులలోనూ ఉక్రైన్‌కు అవకాశం ఉండదు. దీనిని రష్యా గమనిస్తే చాలు. అంతే కానీ ఎందుకీ దాడులు ప్రజాస్వామ్యవాదులు సందించే ప్రశ్న ఇది. అమెరికా, బ్రిటన్‌ దేశాల సహకారంతోనే ఉక్రైన్‌ ఈ దాడి చేసిందని తెలుస్తోంది. అందు నిమిత్తమే ఉక్రైన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కి రష్యా నరమేధానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యనించాడు. రష్యా మాపై చేస్తున్న దాడులన్నీ క్రూరమైనవే అని జెలెన్‌ స్కి పేర్కొన్నాడు. ఇలా దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ ఉంటే ఇక యుద్ధం ఎలా ఆగుతుంది.. యుద్ధం ఆపాలనే టర్కి చాలా తహతహలాడుతోంది. కాని ఇది ఇంకా ఉదృతం అయ్యే విధంగా ఉంది. ఇప్పుడు ఏ దేశం కూడా రష్యా, ఉక్రైన్‌కు చెప్పే సాహసం చేయవు. ఎందుకంటే గతంలో మాదిరి ఇప్పుడు పరిస్థితులు లేవు. రష్యా ఇంకా పెట్రేగి పోవచ్చు. రెండు దేశాలకు అసలు యుద్ధం ఆపాలి అనే ధ్యాసే లేదు. ఏవో కొన్ని దేశాలు మాత్రమే యుద్ధం ఆగాలి అని కోరుకుంటున్నాయి. ఓకే వేళ యుద్ధం ఆగితే అది కలలో మాటే. ఇక్కడ మనకు ఇటలీ నియంత ముస్సోలిని చెప్పిన మాట గుర్తుకు వస్తోంది. ఆయన చెప్పినట్లు ‘ప్రపంచ శాంతి పిచ్చి వాని కల’ అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. ఇప్పుడు విశ్వంలో ఏ దేశం శాంతిగా ఉంది? ప్రతి దేశం అభద్రత భావంతోనే ఉంది. దేశాల మధ్య సఖ్యత కూడా కొరవడుతోంది. ఇప్పుడు రష్యా, ఉక్రైన్‌ యుద్ధం కావొచ్చు, రేపు మరో యుద్ధం కావొచ్చు. ఇక శాంతి ఎక్కడ? అంతా అశాంతే. ఇటువంటి పరిణామాలు ఏర్పడినప్పుడు దేశాలు ఎలా ప్రగతి సాధిస్తాయి.? ఎలా ఆర్ధిక స్థిరత్వం సాగిస్తాయి. రష్యా, ఉక్రైన్‌ దేశాలకు మానవతా దృక్పదమే లేదు. ఒకదాన్ని మించి మరొకటి దాడులు, ప్రతి దాడులతో రెచ్చిపోతున్నాయి. ఉక్రైన్‌ ఇంతలా దైర్యంగా దాడులు చేయడం అంటే అమెరికా, బ్రిటన్‌ దేశాలు చేస్తున్న సహాయమే. లేకపోతే ఏనాడో రష్యాది పైచేయి అయేది. దరిమిలా యుద్ధం ఆగి ఉండేది. ‘నాటో’లో చేరం మా దేశ రక్షణ ఇక రష్యా చూసుకుంటుందని జెలెన్‌ స్కి ప్రకటన చేసి ఉంటే రష్యాకు అంగీకారం అయి ఉండేది. నిజానికి ఇక్కడ యుద్ధం ఇంకా కొనసాగుతుంది అనకుంటే అది అమెరికా చలువే. ప్రస్తుతం కనుచూపు మేరలో యుద్ధం ఆగిపోయే పరిస్థితి లేదు. పై హెచ్చు దాడులు ప్రతి దాడులతో రెండు దేశాలు చెలరేగవచ్చు.

  • కనుమ ఎల్లారెడ్డి,
    పౌరశాస్త్ర అధ్యాపకులు,
    93915 23027.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News