Tuesday, July 2, 2024
Homeఓపన్ పేజ్Sadbhavana Diwas: సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ

Sadbhavana Diwas: సాంకేతిక విప్లవానికి నాంది పలికిన రాజీవ్ గాంధీ

సద్భావనా దివస్ సందర్భంగా రాజీవ్ కు నివాళి

భారతీయులలో జాతీయ సమైక్యత, ప్రేమ మరియు శాంతిని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 20న సద్భావన దివాస్ ను జరుపుకుంటారు. భారత దేశ ఆర్థిక అభివృద్ధి మరియు దేశంలో సామాజిక మరియు శాంతి సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకొని కృషిచేసిన భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సద్భావన దివస్ ను జరుపుకుంటారు. భారతదేశం లో అతి చిన్న వయస్కుడైన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్యకాలంలో 6వ ప్రధానిగా తన ఉత్తేజ కరమైన మాటలతో సమాజ శ్రేయస్సుకై తన వ్యక్తిత్వంతో భారతీయుల హృదయాలలో చెరగని ముద్ర వేశాడు. తన పరిపాలనా కాలంలో తన మాటల్లో భారతదేశం ప్రాచీన దేశం కానీ, యువత ఎక్కువగా ఉన్న దేశం అని యువకులు అసహనంలో ఉన్నార ని , నేను చిన్నవాడిని ఐనా నాకు కూడా ఒక కల ఉంది. నేను కలలుగన్న భారతదేశం కావాలంటే బలమైన స్వతంత్ర స్వాలంబన ఉండాలని అన్నాడు. భరత జాతి సేవలో యువతకు ప్రాధాన్యత ఇస్తే, ప్రపంచ దేశాల్లో ముందువరుసలో ఉంటుందని అన్నారు.
సద్భావన దివస్ ప్రతిజ్ఞ: కులం ,మతం ,ప్రాంతం లేదా భాషతో సంబంధం లేకుండా భారత దేశ ప్రజలందరి బావోద్వేగ ఏకత్వం మరియు సామరస్యం కోసం కృషి చేస్తానని, మన మధ్య ఉన్న తేడాలను రాజ్యాంగ మార్గాల ద్వారా పరిష్కరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని ఈ రోజున ప్రతిన భూనుతారు.
భారతదేశంలో శాంతిని, సమైక్యతను మత సామరస్యం ను ప్రచారం చేయడంలో వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రతియేటా రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డును అందిస్తారు. ఈ అవార్డు కింద వారికి ప్రశంసా పత్రం తోపాటు, లక్ష రూపాయలు ఇస్తారు. ఈ అవార్డును రాజీవ్ గాంధీ మరణం తర్వాత1992 లో పెట్టారు. రాజీవ్ గాంధీ హయాంలోనే 6 నుండి 12 తరగతులవిద్యార్థుల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తూ జవహర్ నవోదయ విద్యాలయాలను స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, పబ్లిక్ టెలిఫోన్ ఆఫీసు లను సృష్టించారు రాజీవ్ గాంధీ. వర్తక వాణిజ్య సంబంధాలు మెరుగు పరచుటకు వినియోగ వస్తువుల దిగుమతుల కొనుగోలు చేయుటకు అనుమతులు ఇచ్చారు. దేశ ప్రజల ఓటింగ్ వయస్సు 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని కలలుగన్న రాజీవ్ గాంధీ ఆధునిక మనస్సు కలిగి నిర్ణయాధికారం ప్రదర్శించ ని వ్యక్తిగా సాంకేతిక విప్లవానికి నాంది పలికాడు. అతి చిన్న వయసులో దేశ ప్రధానిగా పాలన అందించిన రాజీవ్ గాంధీ తమిళనాడు రాష్ట్రంలోని ఎల్ టి టి ఇ కి చెందిన ఆత్మాహుతి దళం 1991 మే 21న శ్రీపెరంబుదూర్ లో హత్యగా భావించి పడ్డాడు. రాజీవ్ గాంధీ స్మారక స్థలాన్ని వీర భూమి గా పిలుస్తారు. ఆయన మరణానంతరం 1991లో దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న బిరుదు ను ప్రభుత్వం అందించింది. రాజీవ్ గాంధీ మరణం దేశ ప్రజలకు కాకుండా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా చెప్పవచ్చును మంచి పరిపాలనాదక్షుడు గా పేరొందిన రాజీవ్ గాంధీ పేరు మీద అనేక ప్రాంతాల్లో యూనివర్సిటీలు, స్టేడియాలు,విమాన శ్రయాలకి, కళాశాల లు స్థాపించారు.రాజకీయ వేత్త గా, సుపరిపాలన దక్షకుడిగా పరిపూర్ణ నాయకుడిగా పేరొందాడు.ప్రధాని పీటానికి వన్నె తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ.ఓపిక,పట్టుదల కి మారు పేరు వీరు.ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా పరిపాలన చేసిన గొప్ప ప్రజా నాయకుడు రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చును.
కామిడి సతీష్ రెడ్డీ,జడలపేట జయశంకర్ భూపాలపల్లి జిల్లా..9848445134.
(ఆగస్టు 20 సద్భావన దివస్ మరియు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News