Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Sahithi Vanam: తిరుగులేని శైవ భక్తి గ్రంథం

Sahithi Vanam: తిరుగులేని శైవ భక్తి గ్రంథం

శివ భక్తులైన నయనార్లకు సంబంధించి ఇది చాలా అరుదైన గ్రంథం. అరవై మూడు మంది చర్రిత ప్రసిద్ధి చెందిన శివ భక్తులు, అంటే నయనార్ల గురించి రాసిన ఈ గ్రంథం ఆసాంతం చదివిస్తుంది. చదివిన వారిలో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపుతుంది. శ్రీవైష్ణవంలో విష్ణు భక్తులైన ఆళ్లార్లు ఉన్నట్టే, ఈ శివ పురాణంలో శివ భక్తులైన నయనార్లు ఉంటారనే విషయం తెలిసిందే. ‘శివభక్త చరితము’ అనే ఈ 63 మంది శివ భక్తుల చరితాన్ని పొంగూరి సూర్యనారాయణ శర్మ అనే సాహితీవేత్త 1962 ప్రాంతంలో అచ్చ తెలుగు భాషలో, అందులోనూ వ్యావహారిక భాషలో అనువదించడం జరిగింది. తమిళనాటతెలుగు పండిట్‌గా పనిచేస్తూనే ఆయన సుమారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం సెక్కిళర్‌ రాసిన ‘అరవత్తి మువ్వర్‌’ అనే తమిళ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. చెన్నైలోనివావిళ్ల రామస్వామి శాస్ర్తులు ప్రచురణ సంస్థ వారు ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాలనే ఉద్దేశంతో దీని వెలను కేవలం ఎనిమిదిన్నర రూపాయలుగా నిర్ధారించారు. వారి ఆశయం, ఆకాంక్ష నెరవేరి ఈ గ్రంథాన్నిలక్షలాది మంది కొని చదవడం జరిగింది. ప్రస్తుతం ఈ పుస్తకం వేల రూపాయలు పెట్టి కొనడానికి కూడా అందుబాటులో లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ నయనార్లు విభిన్న కాలాలకు చెందినవారు. ఈ నయనార్ల కాలం నాటి సామాజిక, చారిత్రక పరిస్థితులను, వాటితో పాటు వారి కుటుంబ పరిస్థితులనుఒక పక్క వివరిస్తూనే, మరొక పక్క వారి ఆధ్యాత్మ పురోగతిని కళ్లకు కట్టినట్టు గ్రంథకర్త వివరించారు. నిజానికి ఇందులో కొంత మంది నయనార్ల కథలను గతంలో ‘చందమామ’లో సంక్షిప్తంగా, మరింత సులువైన తెలుగు భాషలో ప్రచురించడం జరిగింది. ఇందులో కన్నప్ప, తిరుజ్ఞాన సంబంధార్‌, సుందరమూర్తి నయనార్‌, కారైక్కాల అమ్మయార్‌, అప్పర్‌ నయనార్‌ తదితరులకథలు కొన్ని జన బాహుళ్యానికికరతలామలకమే. దాదాపు ప్రతి కథా భక్తులలోనే కాక, భక్తులుకానివారిలో కూడా స్ఫూర్తిని రగలుస్తుంది. ఇక ప్రతి నయనార్‌ కథ చివరా తప్పకుండా ఆశివ భక్తుడి నుంచి గ్రహించాల్సిన నీతి తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకు, ‘నియమ పాలనములు, ఇంద్రియ నిగ్రహములు శివ సాయుజ్య ప్రాప్తి హేతువులు’, ‘శివ భక్తాపకారమే శివ ద్రోహము’ వంటివి. ఈ నయనార్లు శివ భక్తులుగామారిన విధానం, వారు శివానుగ్రహాన్ని పొందిన విధం, చివరగా శివ సాయుజ్యాన్ని పొందిన తీరు వగైరాల గురించి గ్రంథకర్త అంచెలంచెలుగా రాస్తూ వచ్చి విధానం ప్రతి కథారచయితనూ ఆకట్టుకుంటుంది.
పండిత పొంగూరు సూర్యనారాయణ శర్మ రచనా శైలి నిజంగా అద్భుతమనే చెప్పాలి. తమిళంలో సెక్కిళర్‌ పరమ గ్రాంథికంలో రాసిన కథలను ఆయన ఎంతో సరళమైన భాషలో, నాస్తికుడిని సైతం వీర శైవ భక్తుడిగా మార్చగలిగిన స్థాయిలో ఈ కథలను తెనిగించడం అసాధారణంగా కనిపిస్తుంది. ఒక పక్క ఓ స్కూల్‌ టీచర్‌వృత్తి, మరొకపక్క తెలుగు భాష మీద పట్టు, పాండిత్యం, మరొక భక్త శివుడి మీద అపారమైన భక్తి ప్రపత్తులు , ఆధ్యాత్మిక ప్రవృత్తి వగైరాలన్నీ ఈ కథా కథనంలో కనిపిస్తాయి. ఎక్కడా కాల్పనికత లేకుండా, వీరశైవ భక్తుల జీవిత చరిత్రలను వాస్తవికంగా రాయడమనేది ఈ గ్రంథకర్తకే చెల్లింది. ఇటువంటి పుస్తకం ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమైతే, చదువరుల భక్తి పండినట్టే లెక్క.

- Advertisement -

జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News