Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్SC: ముందస్తు అరెస్టులకు న్యాయస్థానం అడ్డుకట్ట

SC: ముందస్తు అరెస్టులకు న్యాయస్థానం అడ్డుకట్ట

ముందస్తు అరెస్టులు లేదా నివారణ నిర్బంధాలు వలస పాలకుల నుంచి వారసత్వంగా సంక్రమించిన వ్యవహారాలని, దీనివల్ల ప్రభుత్వాలకు ఏకపక్షంగా వ్యవహరించేందుకు అవకాశం కలుగుతోందని సుప్రీం కోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశంలో కొద్దిగా సంచలనం సృష్టించాయి. వ్యక్తి స్వేచ్ఛను నియంత్రించ డానికి తప్ప ఈ రకమైన చట్టాలు మరే విధంగానూ ఉపయోగపడడం లేదంటూ సుప్రీంకోర్టు అభిప్రా యపడడం ప్రభుత్వాలను ఒక విధంగా హెచ్చరించినట్టయింది. నిర్బంధితుల హక్కులకు సంబంధిం చిన వ్యవహరిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ కొన్ని ప్రమాణాలకు, విలువల కు కట్టుబడి ఉండడం అనేది కొన్ని దశాబ్దాలుగా జరగడం లేదని న్యాయస్థానం భావించింది. నిర్బంధా నికి సంబంధించిన ఉత్తర్వులను న్యాయస్థానాలు సాంకేతిక కారణాలపై పక్కన పెడుతున్నప్పటికీ, నిర్బం ధితులకు అందుతున్న ఉపశమనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. ఒక వ్యక్తి ముందస్తు ని ర్బంధానికి గురైనా కొన్ని నెలల తర్వాత కానీ, ఇందుకు సంబంధించిన కేసును కొట్టివేయడం జరగడం లేదు. అంతేకాదు, ఒక్కోసారి పూర్తి నిర్బంధ కాలాన్ని అనుభవించిన తర్వాత గానీ సదరు వ్యక్తి విడుద ల కావడం జరగడం లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరిపిన కేసు ఈ రెండవ కోవకు చెందినదే.
మొత్తానికి, ముందస్తు అరెస్టులపై లేదా నిర్బంధాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేయడం కొద్ది గా ఉపశమనం కలిగిస్తోంది. సాధారణంగా న్యాయస్థానాలు ఈ ముందస్తు నిర్బంధాలకు సంబంధించి పోలీసులు అనుసరించిన పద్ధతులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. అసలు సద రు వ్యక్తి నేరం చేశాడా లేదా, ముందస్తు అరెస్టు చేయాల్సిన అగత్యం ఉందా లేదా అన్న అంశాన్ని ఇవి ప రిశీలించడం లేదు. ఏ వ్యక్తినైనా ముందస్తుగా అరెస్టు చేస్తున్నప్పుడు ప్రభుత్వమే ఈ కేసు పూర్వాపరాల ను సాకల్యంగా పరిశీలించాలని, ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా చివరికి విజయం నిందితుడినే వ రిస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నిజానికి, ముందస్తు నిర్బంధానికి సంబంధించిన కొన్ని కేసులు తీవ్రస్థాయిలో ఆందోళన కలిగించేవిగా ఉంటున్నాయి. నిర్బంధితులు తమ కేసుకు సంబంధించిన వివ రాలను అందజేయడంలో, ఈ అరెస్టులకు వ్యతిరేకంగా అపీలు చేసుకోవడంలో ఆలస్యాలు జరుగుతుడడం ఒక బాధాకరమయిన విషయంగా మారిపోయింది.
ఇక ముందస్తు నిర్బంధాలకు సంబంధించి పోలీసులు చెబుతున్న కారణాలు, ఎఫ్‌.ఐ.ఆర్‌ దాఖలు చే స్తున్న తీరు కూడా ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉంటున్నాయి. ఒక కేసులో లోపభూయిష్టంగా ఉన్న మిరపకా యలను అమ్మినందుకు ’గూండా’గా పరిగణించి ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. విచిత్రమేమిట ంటే, ముందస్తు అరెస్టుల విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. ఇందుకు కారణమేమిటంటే, ఈ రాష్ట్రంలో అక్రమ మద్య విక్రేతలు, మురికివాడలను కబ్జా చేసేవారు, అటవీ ఉత్పత్తులను చోరీ చేసేవారు, వీడియో పైరసీ చేసేవారు, లైంగిక దాడులు చేసేవారు, సైబర్‌ నేరస్థులు కూడా గూండా నిరో ధక చట్టం కిందకే వస్తారు. అలవాటుగా నేరాలు చేసేవారికి ఈ చట్టాన్ని పరిమితం చేయకుండా, ప్రతి నేరస్థుడిని ఈ చట్టం కిందకు తీసుకు రావడం జరుగుతోంది. సాధారణ నేరాలకు పాల్పడినవారిని సై తం దాదాపు ఏడాది పాటు అరెస్టు చేసి, వారికి బెయిలు రాకుండా చేయడం, వారిని విచారణ లేకుండా నిర్బంధించడం దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యవహారమే. చట్టాలను దుర్వినియోగం చేయడం సర్వసాధా రణ విషయమైపోయింది.
ముందస్తు అరెస్టులకు రాజ్యాంగంలో అవకాశం ఉన్నమాట నిజమే కానీ, ప్రభుత్వాలు వీటి విషయం లో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరాన్ని కాదనలేం. దేశంలో నేరాలు తగ్గాలన్న పక్షంలో, నేరస్థుల్లో భయం ఉండాలన్న పక్షంలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాల్సి ఉంటుంది. త్వరత గతిన వి చారణలు, దర్యాప్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అడ్డూ ఆపూ లేకుండా తమ అధికారాలను ఉపయో గించుకున్నంత మాత్రాన సరిపోదు. విచక్షణారహితంగా దీన్ని ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవ స్థకు చెడే తప్ప ఏమాత్రం మేలు చేయదు. అనుమానం వచ్చినంత మాత్రాన ఒక వ్యక్తిని దీర్ఘకాలం పా టు అరెస్టు చేయడం, వ్యక్తి స్వేచ్ఛను హరించి వేయడం, బెయిలు రాకుండా చేయడం వంటి పనులు దీ ర్ఘకాలంలో వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News