Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Sevalal: సేవాలాల్‌ మహారాజ్‌ స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడుదాం

Sevalal: సేవాలాల్‌ మహారాజ్‌ స్ఫూర్తితో అభివృద్ధికి పాటుపడుదాం

ఈ సృష్టి మీద రోజుకు ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరూ గిడుతూ ఉంటారు. అందులో కొందరు మాత్రమే మహనీయులుగా అవతార పురుషులుగా ఆరాధ్యదైవాలు చరిత్ర పుట్టలో నిలిచి, చరిత్రను తిరగరాసి ఆదర్శవంతులుగా సమాజంలో నిలుస్తారు. మరికొంత మంది మాత్రం చరిత్ర సృష్టిస్తారు.. ఆ కోవకు చెందిన మహనీయుడు సేవాలాల్‌ మహారాజ్‌…
తన జీవిత కాలంలో ప్రజల శ్రేయస్సును కోరుకుంటూ స్వశక్తితో జీవించే మార్గాన్ని చూపిస్తూ తండా ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను సాంఘిక దురాచారాలను పారదొలి సమాజంలో ఉన్న నిరక్షరాస్యతను, ఆర్ధిక అసమానత్వంతో కృంగిపోతున్న సమాజాన్ని రూపుమాపడానికి అనేక సంస్కరణలు ఉద్యమంలాగా చేపట్టి తండా తండా తిరిగి చైతన్యం పరుస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తన జీవితాన్ని త్యాగం చేసి సమాజ సేవ కోసం అంకితం చేసిన మహనీయుడు సేవాలాల్‌ తన పేరులో ఉన్న సేవాభావాన్ని మాటల్లో చెప్పకుండా తాను అనుకున్న ప్రతి పనిని ఆచరణలో చేస్తూ ప్రజల మనలను పొందారు. దేశవ్యాప్తంగా ప్రజల ఆరాధ్యదైవంగా నేడు కొలువబడుతున్నారు. అందుకే నేడు వారిని ఆదర్శంగా తీసుకొని బంజారా సమాజంలో ఐక్యమత్యంగా ముందుకు సాగుతుంది అని భావించవచ్చు.
సేవాలాల్‌ మహారాజ్‌ భక్తజనుల ఆరాధ్యదైవంగా దేశవ్యాప్తంగా బంజారా సమాజంలో భగవత్‌ స్వరూపుడిగా అవతార పురుషుడిగా సామాజిక కాంతి వీరుడుగా పూజించబడుతున్న ఆరాధ్య దైవం సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్‌ ఆనాడు. సమాజంలో ఆ శాంతి సంక్షోభంతో ఉన్నప్పుడు తన ధర్మ బోధనల ద్వారా జాతిని ధర్మమార్గంలో నడిపించి జాగ్రత్త పరిచి బంజారా సమాజంలో ఆదర్శం ఐక్యమత్యాన్ని చూపించిన బంజారా జాతి యొక్క శక్తిని శాంతిని ఉత్సాహాన్ని ఐక్యమత్యాన్ని పెంపొందించు తపస్వి దైవం సంభూత సంపన్నుడు బంజారా జాతిని దశ దిశా నిర్దేశిస్తు సంరక్షిస్తున్న దైవం శ్రీ భగవాన్‌ సేవాలాల్‌ మహారాజ్‌ గారు బంజారా జాతీలో అతి చిన్న వయసులోనే తన అమూల్యమైన సందేశంతో దశ దిశా నిర్దేశస్తూ సమాజంలో అనేక సామాజిక సంస్కరణలు చేపట్టి నిరంతరం సమాజసేవ వారికి తన జీవితాన్ని త్యాగం చేసి దైవ సన్నిధి చేరుస్తున్నారు. ఆయన మార్గాన్ని ఆదేశిక సూత్రాలను పాటించి పుణ్యాత్ముల అవుదాం…
సమస్త జీవకోటికి మాతృ రూపం తల్లిగా వెలసిన అమ్మ భవాని గురించి అమ్మను పూజించాలి కానీ ఫలితం ఆశించవద్దు నీ బంజారాలకు బోధించాడు. సేవాలాల్‌ మహారాజ్‌ అహింస పాపమని మత్తు ధూమపానం శాపమని హితువు పలికిన మానవుడు మహానుభావుడు బంజారా జాతికే కాకుండా యావత్‌ సమాజానికి ఆదర్శ పురుషుడు అయ్యాడు సేవాలాల్‌ మహారాజ్‌ ఆనాడు బంజారా జాతి పేరు ప్రతిష్టలను గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి తన జీవిత కాలంలో ఆచరణలో చూపెట్టి ప్రతి ఒకరు బంజారాలు హింస మత్తు పానీయాలకు బానిస కాకూడదని హితవు పలికాడు. ఆచరణలో బంజారా సమాజం వ్యాపారం నియమితం యుద్ధ సామాగ్రిలు, ముడి సరుకులు తరలించుడం కోసం స్థిర నివాసం లేకుండా దేశం వ్యాప్తంగా బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు అవసరమైన యుద్ధ సామాగ్రిని ఆయా ప్రాంతాలకు చేర వేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌ పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయింది. ఈ పరిస్థితుల్లో జాతి యావత్తు అంధకారంలో ఉన్నప్పుడు ఆ జాతిని సరైన మార్గంలో నడిపించుటకు కొందరు దైవ సంభూతులు ఈ భూమ్మీద జన్మిస్తారు.
సేవాలాల్‌ మహారాజ్‌ బోధనల ద్వారా బంజారా జాతిని పురోగమిస్తుంది దేవత అనుగ్రహంతో జన్మించిన వారు కారణజన్ములు వారి జన్మకు సార్థకత ప్రయోజనం ఉంటుంది. ఇలా ఒక జాతిలో ఒక మహిమానిత్వాతులు జన్మించి సమాజచే వారు దైవ సంభూతులుగా ఆరాధింపబడుతారు. అలాంటి కోవకు చెందిన భగవాన్‌ శ్రీ సేవా లాల్‌ మహారాజ్‌ బంజారాలకు ఆరాధన దైవముగా వెలుగొందుతున్నారు. ఈ దుర్భర స్థితిని తొలగించి సామాజిక ఇలా అనేక సంస్కరణలు ద్వారా మార్పు చేసి బంజారా లను చైతన్యపరిచి అభివృద్ధి బాటలో నడిపించుటకు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ భూమిమీద ఉద్భవించిన భగవతుని అవతారాలు ఆరాధ్యలు గురువులుగా నిలిచారు.
బంజారా తండాలో పరిస్థితులు అస్తవ్యస్తమైన సమస్యలు ఎదుర్కుంటూ బతికేవారు అప్పుడు సప్తమాతలకు తండా ప్రజలందరూ కలిసి మా బంజారా జాతీయ ఐక్యం చేసి ఒకతాటిపై తీసుకు వచ్చే మహానుభావుడికి వరం ఇవ్వమని సాత్‌ భవానీలను వేడుకుంటారు. అప్పుడు బంజారాలకు ఆ మహా పురుషుడికి అందించాలనే పదేపదే వేడుకుంటారు ప్రార్థిస్తారు ఆ క్రమంలో స్వాత్‌ భవానీలు అను గ్రహంతో బంజారా ప్రజల కోరిక మేరకు మహానుభావుని వరంగా ఇస్తారు. ధర్మనీ భీమానాయక్‌ దంపతులు సం తానం లేక తపస్సు చేస్తుండేవారు ఈ క్రమంలో సప్త మాతృకలు భవాని విధించిన షరతులను స్వీకరించడానికి కూడా సిద్ధం అవుతారు అప్పుడు వారి కుటుంబానికి సంతానాన్ని ప్రసాదిస్తారు ఆ వరప్రసాదంగా జన్మించిన పుత్రుడే సేవలాల్‌ పిలువబడుతున్నారు.
అయితే సేవాలాల్‌ మహారాజ్‌ జననం 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపూర్‌ జిల్లా రాంజీ నాయక్‌ తండలో జన్మించాడు. ఈయనకు సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవాలాల్‌ పెరిగిన తర్వాత కొంత కాలంలో మారెమ్మగా పిలవబడే జగదాంబ ప్రత్యక్షమై సేవాలాల్‌ పైన అమ్మవారి అనుగ్రహంతో తో శక్తి మహిమలను ప్రసాదిస్తూ సేవాలాల్‌ మారాజ్‌ కి ముందుకు నడిపిస్తారు.
అంతేకాకుండా సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ మహిమలు అద్భుతమైనవి వీటి మీద అనేక కథనాలు కలవు వాటిలో పురుషుని స్త్రీ గా మార్చడం. ఒక ముంతా బియ్యంతో 1000 వంద మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు నెలల తర్వాత బతికించడం. విషం కలిపిన తీపి వంటకాలు నిర్వీర్యం చేయడం, వాగులు నీళ్ల ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను ఆవులను దాటించడం, సేవాలాల్‌లకు అపకీర్తి తీసుకురావాలని చేసిన వారి కుట్ర లను పటాపంచలు చేయడం, అద్భుతమైన మహిమలు కలవాడు. సేవాలాల్‌ ఆయన ఆజన్మ బ్రహ్మచారి పుట్టుకతోనే దేవి సంపాదన కలవాడు నీ స్వార్ధపరుడు ఆజాను బావుడిగా ప్రకాశిస్తూ బంజారా సంస్కృతి పరిరక్షణకు ధర్మరక్షణకు బంజారాలకు సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని బంజారా ధర్మాన్ని కాపాడడానికి మొదటి జన్మనెత్తిన ఆరాధ్యదైవం సేవాలాల్‌ మహారాజ్‌.
మహారాజ్‌ సమాజానికి ఆధ్యాత్మిక బోధనలతో పాటు శాకాహారిగా, మూఢనమ్మకాలు, మత్తు పానీయాలుకు వ్యతిరేకంగా సాంఘిక దురాచారాలను, రూపుమాపడానికి అనేక సంస్కరణలు చేపట్టారు. అలాగే అహింసావాదిగా నేటి సమాజానికి కావలసిన ఆత్మస్థైర్యానికి కల్పించిన వ్యక్తిగా భావించవచ్చు. ఆధ్యాత్మిక భక్తి శక్తులతో చివరి వరకు అంకితభావంతో నిజాయితీకి కట్టుబడి బంజారా జాతి ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిన మహారాజుగా చెప్పవచ్చు. వారు చూపిన బాటలో ప్రయాణించి వారి ఆశయ సాధనలోని అందరూ భాగస్వాములై బంజారా సంస్కృతి, భాష, ధర్మ పరిరక్షణకు, నిరక్షరాస్యత నిర్మూలన అక్షరాస్యత పెంపొందించడం మూఢనమ్మకాలను రూపుమాపడం ఇలాంటి అనేక అంశాలను నుంచి సమాజాన్ని విముక్తి పొందడానికి అందరు తమ బాధ్యతగా భావించాలి. అప్పుడే సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలకు నిజమైన సార్థకత ఉంటుందని ఆశిద్దాం…
సమాజంలో జరుగుతున్న దురాచారాలను స్వస్తి చెపుతూ సమసమాజ స్థాపనపై అందరూ భాగస్వాములు కావాలి. ఈ క్రమంలో బంజారాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అంతరించిపోతున్న సంస్కృతి పరిరక్షణకు అందరూ పాటుపడాలి. సేవాలాల్‌ స్ఫూర్తితో ఐక్య మత్యంతో పని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది. కనుక ప్రతి తండాలో యువతే కథా నాయకులుగా, మార్గదర్శకులుగా తమతమ తండాల్లో శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 284వ జయంతి మహాభోగ్‌ బండరో కార్య క్రమాన్ని నిర్వహించి. బంజారాల సంస్కృతి సాంప్రదా యాలు ప్రత్యేక భాష, వేషధారణ, పండుగలు ఆచారాలు సంప్రదాయాలతో కూడిన ఆరాధన నైవేద్యం వీటి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటే విధంగా జయంతి పండుగ జరుపుకోవాలి.
గిరిజనులకు మహారాజ్‌ సేవలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి పండుగను గుర్తించి ప్రభుత్వం అధికారికంగా చేపట్టడం బంజారా జాతికి ఆత్మ గౌరవానికి గుర్తించారని చెప్పవచ్చు. భారత దేశ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల జనాభా ఉన్న బంజారాలకు ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్‌ జయంతి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా చేపట్టడం బంజారాలకు ఇది గర్వకారణం. జయంతి కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుని కర్ణాటక ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ఇలా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే సేవాలాల్‌ జయంతిని అధికా రికంగా చేపట్టడం శ్రీకారం చుట్టారు. ఆనాడు శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ కలలు కన్న కలలు ఇప్పుడిప్పుడే సహకారం అవుతున్నాయి మా తండాలో మా రాజ్యం ఎన్నో ఏళ్ల కల రాష్ట్రంలో అనేక తండాల గ్రామపంచాయతీ ఏర్పడి సహకారం అయిన వేళ కొత్త పాలక మండలిలో సేవాలాల్‌ మహారాజ్‌ ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో నవయువ నాయకులు ప్రతి తండాలో ఇవాళ అభివృద్ధికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉంది. మా తండాను మేమే స్వయం పాలనతో పాలించు ఉంటున్నామని ఆనం దోత్సవాలు తండాల్లో కనిపిస్తుంది. ఆ రోజు తండా తండా తిరిగి ప్రజలను చైతన్య పరుస్తూ తండాలో ఉన్న మత్తు పానీయాలు మూఢనమ్మకాలు సామాజిక సంస్కరణలు చేపట్టి తండా ప్రజలకు దశ దిశ నిర్దేశించిన మహనీయుడు సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని గుర్తించి ఇవాళ గౌరవించుకోవడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి తండాల గ్రామపంచాయతీలో సేవాలాల్‌ మారాజ్‌ బండార్‌ కార్యక్రమం కార్యక్రమం ఘనంగా నిర్వహించు కుంటున్నారు. సేవాలాల్‌ చూపిన బాటలో పయనించి తండాల్లో ప్రతి ఒక్కరు నిరక్షరాస్యులను రూపుమాపి అక్షర శాతాన్ని పెంపొందించి ప్రతి ఒక్కరు చదువుకునే లాగా అన్ని రంగాల్లో రాణించాలని యువత మన తండాలకు మనమే కథానాయకులుగా వహించి భాషా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ జాతి ఐక్యత కోసం పాటుపడి అప్పుడే నిజమైన సేవాలాల్‌ మహారాజ్‌ జయంతికి భోగ్‌ బండారో, నివాళులు అర్పించిన వాళ్ళ మవుతాం. అలాగే సేవాలాల్‌ మహారాజ్‌ స్ఫూర్తితో మన తండాల్లో మనమే కథానాయకులై కాలక్రమేనా పోటీ ప్రపంచంలో వస్తున్న మార్పులను పసిగట్టి బంజారా సమాజం బంజారా యువత ఆధునిక సాంకేతిక పరి జ్ఞానాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని పోటీపడే ఆసక్తిని పెంపొందించుకొని సమాజ మార్పు కోసం సమాజంలో ఉన్న నిరుద్యోగ నిర్మూలన, ఆర్థిక అసమానతలు, నిరక్షరాస్యత నిర్మూలన, అక్షరాస్యత పెంపొందించుకోవడం వైపు అడుగులు వేస్తూనే యువత మానవనులుగా తయారు కావాలి. సమాజ పురోగతి కోసం సమాజాన్ని సన్మార్గంలో నడిపించడం వైపు ప్రయా ణించాలి ఈ క్రమంలో అందరూ చదవాలి అందరూ చదువుకోవాలి అందరూ ఎదగాలి అనే సంకల్పంతో సమాజాన్ని ఒక దశ దిశ నిర్దేశిస్తూ గిరిజన తండాల్లో కూడాల్లో నిరక్షరాస్య రహిత తండాలుగా గూడాలుగా తీర్చిదిద్ది మూఢనమ్మకాలు అసాంఘిక కార్యకలాపాల రూపుమాపడానికి 284 సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి సందర్భంగా ఈ నియమాలు నిబంధనలు పాటించి ఎంతో పవిత్రమై సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి పండుగను అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా సేవాలాల్‌ మారారు. జయంతి జరుపుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పతి గడపగడప ప్రతి తండాల గ్రామపంచాయతీలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో ప్రతి చోట సేవా లాల్‌ మహారాజ్‌ బోగ్‌ బండారు కార్యక్రమాన్ని నైవేద్యం సమర్పించి బండారు కార్యక్రమం ఎక్కువ నియమ నిబంధనలు పాటించి సేవాలాల్‌ మారాజు 284వ జయం తి పండుగను ఘనంగా నిర్వహించుకుందాం – సమాజ అభివృద్ధికై బాటలేద్దాం.
– డాక్టర్‌ గుగులోతు శంకర్‌ నాయక్‌
రాష్ట్ర సమాచార కమిషనర్‌
9908817986
(నేడు సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News