భారతదేశం కేవలం రాజకీయంగానే కాకుండా, సామాజికంగా కూడా ఆధునీక రించబడాలని జవహర్‌లాల్ నెహ్రూ బలంగా నమ్మారు. కుల వివక్ష, లింగ అసమానతలతో కూడిన సమాజంలో ప్రజాస్వామ్యం పరిపూర్ణం కాదని ఆయన భావించారు. ఈ సామాజిక విప్లవంలో ఆయనకు తోడుగా నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న హిందూ కోడ్ బిల్లు భారతీయ మహిళా చరిత్రలో ఒక మైలురాయి.
అంబేద్కర్‌ను ఆహ్వానించిన నెహ్రూస్వతంత్ర భారత తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే సమయంలో, దేశానికి అత్యంత సమర్థుడైన న్యాయ నిపు ణుడు కావాలని నెహ్రూ భావించారు. కాంగ్రెస్తో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, దేశం కోసం అంబేద్కర్‌ను తొలి న్యాయ శాఖ మంత్రిగా (1947-1951) నియమించి, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిని చేశారు. నెహ్రూ దార్శనికత, అంబేద్కర్ మేధస్సు కలిసి దేశ సామా జిక ముఖచిత్రాన్ని మార్చాయి.
హిందూ కోడ్ బిల్లు – ఒక సామాజిక సమరం
భారతీయ సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య పోకడలను సవాలు చేస్తూ, మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి డాక్టర్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. దీనికి నెహ్రూ పూర్తి మద్దతు ప్రకటిం చారు. బహుభార్యాత్వానికి స్వస్తి చెప్పడం, వివాహ వయస్సు పెంపు, విడాకులు తీసుకునే హక్కు కల్పించడం, ఆస్తిలో మహిళలకు వాటా ఇవ్వడం.
నాటి సమాజంలోని ఛాందసవాదుల నుండి ఈ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పార్లమెంటు లోపల, బయట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నెహ్రూ విప్ జారీ చేసే సాహసం చేయలేకపోయారు. బిల్లు వీగిపోయింది. అస్సలు రాజ్యాంగంలోనే చేర్చాల్సినవి. వ్యతిరేకత వల్ల ఆగి పోయి రాజ్యాంగ సవరణగా ముందుకు తేబడింది. బిల్లు వీగి పోవడంతో అంబేద్కర్ రాజీనామా చేశారు. నిజానికి వీగిపోయినందున నెహ్రూయే రాజీనామా చేయాలి.
హిందూ కోడ్ బిల్లు, బీసీ రిజర్వేషన్లు
రాజ్యాంగంలో చేర్చడం సాధ్యం కాక పోవడంతో మన స్తాపం చెందిన డాక్టర్ అంబేద్కర్ 1951 సెప్టెంబర్‌లో న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ కాలంలో అమలులోకి రావలసిన ఈ రెండు నేటికీ అమ లులోకి రాలేదు. భారత సామాజిక రాజకీయ వ్యవస్థలో అనేక సంఘర్షణలకు ఇవి కారణం అవుతున్నాయి.
అయితే 1952 సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, నెహ్రూ అదే బిల్లును నాలుగు విడి చట్టాలుగా విభజించి పార్లమెంటులో ఆమోదింపజేశారు:
హిందూ వివాహ చట్టం (1955): బహుభార్యాత్వాన్ని నిషేధించి, ఏకపత్నీ వ్రతాన్ని తప్పనిసరి చేసింది.
హిందూ వారసత్వ చట్టం (1956): కుమార్తెలకు తండ్రి ఆస్తి లో సమాన హక్కును కల్పించింది.
హిందూ దత్తత, భరణం చట్టం (1956): దత్తత, విడాకుల తర్వాత భరణం పొందే హక్కును కల్పించింది.
హిందూ మైనారిటీ సంరక్షక చట్టం (1956).
కుల నిర్మూలన, అస్పృశ్యత నివారణ
అంబేద్కర్ రూపొందించిన రా జ్యాంగంలోని 17వ అధికరణం (అస్పృశ్యత నివారణ) అమలుకు నెహ్రూ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
అస్పృశ్యత (నేరాల) చట్టం – 1955: అస్పృశ్యతను పాటించడం శిక్షార్హమైన నేరంగా మారుస్తూ పార్లమెంటులో చట్టం చేశారు.
రిజర్వేషన్ల అమలు: షెడ్యూల్డ్ కులాలు, తెగల (SC/ST) కోసం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలును పకడ్బందీగా చేపట్టారు.
స్త్రీ విద్య, సాధికారత
మహిళల ఆర్థిక స్వతంత్రత కోసం నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు. నాటి ఆరోగ్య మంత్రి రాజకుమారి అమృత్ కౌర్ సహకారంతో మహి ళా శిశు సంక్షేమ కార్యక్రమాలను విస్తరించారు. సామాజికంగా అణగారిన వర్గాల మహిళలు చదువుకోవడానికి ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు.
ఆనాటి కీలక వ్యక్తులు
హెచ్.వి. పాట్కర్: అంబేద్కర్ తర్వాత న్యాయ శాఖలో కీలక పాత్ర పోషించారు.
సి.సి. బిశ్వాస్: హిందూ కోడ్ బిల్లు వివిధ భాగాలను ఆమోదింపజేయడంలో నెహ్రూకు సహకరించారు.
నేడు భారతీయ మహిళలు పొందుతున్న చట్టపరమైన రక్షణలు, ఆస్తి హక్కుల వెనుక డాక్టర్ అంబేద్కర్ కలలు, జవహర్‌లాల్ నెహ్రూ పట్టుదల ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం రాజకీయ సంబంధం కాదు, అదొక సామా జిక సంస్కరణా పర్వం. నెహ్రూ తన రాజకీయ అధికారాన్ని అంబేద్కర్‌కు అండగా నిలిపి, భారతదేశాన్ని ఒక ఆధునిక, సమసమాజం వైపు నడిపించారు.
రచయిత, సామాజిక తత్వవేత్త

