Homeఎడిటోరియల్ / బహుళEl Niño period: ఎల్‌నినో కాలంలో సామాజిక భద్రత అత్యవసరం

El Niño period: ఎల్‌నినో కాలంలో సామాజిక భద్రత అత్యవసరం

నేడు తెలంగాణలో తాగునీటి కొరతను కేవలం వర్షా భావ సమస్యగా చూడలేం. వాతావరణ మార్పులు, జలవనరు లపై పెరుగుతున్న ఒత్తిడి, పట్టణీకరణ, వ్యవసాయ సంక్షోభం, రాజకీయ నిర్ణయాలు, సామాజిక అసమానతల సమ్మిళిత పరి ణామంగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గడం ప్రజారోగ్యం, ఆహార భద్రత, జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవా లంటే ప్రకృతి పరిణామాలతోపాటు ప్రభుత్వ విధానాలు, వన రుల పంపిణీ, ప్రజల అవసరాలను సమగ్రంగా పరిశీలించాలి.

- Advertisement -

ఎల్‌నినో: ప్రపంచ వాతావరణ వ్యవస్థలో ఆందోళన

ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) అంచనాల ప్రకారం, 2026 చివరినాటికి పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు బలపడే అవ కాశం ఉంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని అసమానంగా మార్చి, కొన్ని ప్రాంతాల్లో కరువును, మరికొన్ని ప్రాంతాల్లో వరదలను, అధిక ఉష్ణోగ్రతలను తీవ్రతరం చేయవచ్చు. అయితే ఎల్‌నినో ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు. భారతదేశ రుతుపవ నాలపై దాని ప్రభావాన్ని హిందూ మహాసముద్ర ద్విధృవ సూచిక, వాతావరణ పీడన వ్యవస్థలు, స్థానిక పరిస్థితులతో కలిపి విశ్లేషించాలి. బలమైన ఎల్‌నినో భారత దేశంలో తక్కువ వర్షపాతానికి ప్రమాద సూచికగా పరిగణించబడుతున్నప్పటికీ, ప్రతిసారీ కరువు తప్పనిసరిగా ఏర్పడుతుందని చెప్పలేం. అందువల్ల తెలం గాణలో వర్షపాతం, జలాశయాల నిల్వలు, భూగర్భజలాల స్థాయులు, పంటల పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి. వాతావరణ హెచ్చరికలను ముందస్తు ప్రణాళిక లకు ఉపయో గించడమే ప్రభుత్వ బాధ్యత.

తెలంగాణలో జల సంక్షోభం: ప్రకృతి ప్రభావమా, పాలనా వైఫల్యమా?

2026 అక్టోబర్‌లో వెలువడిన నివేదికల ప్రకారం, కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గడం, భూగర్భ జలాల క్షీణత కారణంగా మిషన్‌ భగీరథకు అనుసంధానమైన కొన్ని ప్రాంతాల్లో సరఫరా ఒత్తిడి పెరిగింది. సుమారు 500 గ్రామీణ నివాస ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయాలు ఏర్పడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ పరిస్థితి ముందస్తు చర్యలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమస్యలు, మరమ్మతులు, నీటి పంపింగ్‌పై రాజకీయ వివాదాలు తెలంగాణ జలవనరుల నిర్వ హణలోని బలహీనతలను ప్రశ్నించేలా చేస్తున్నాయి. అయితే ప్రస్తుత సంక్షోభానికి ఒక్క ప్రాజెక్టునే కారణంగా చూపడం సరి కాదు. జలాశయాల నిల్వలు, నదీ ప్రవాహాలు, పంపింగ్‌ సామర్థ్యం, విద్యుత్‌ వ్యయం, పైప్‌లైన్‌ లీకేజీలు, భూగర్భజలాల వినియోగం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలి. భారీ ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వాటి నిర్వహణ, పర్యావరణ పరి రక్షణ, నీటి పంపిణీ సామర్థ్యానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రభుత్వ చర్యలు: ప్రణాళికల నుంచి ఫలితాల వరకు

తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ సరఫరా పర్యవేక్షణ, ప్రత్యామ్నాయ నీటి వనరుల గుర్తింపు, హైదరాబాద్‌కు అదనపు నీటి సరఫరా వంటి చర్యలను చేపడుతునట్లు పేర్కొన్నది. 2026 మార్చిలో 12,457 గ్రామ పంచాయతీల సర్పంచులతో సంప్రదించి నీటి సరఫరా క్రమబద్ధత, నాణ్యత, పైప్‌లైన్‌ లీకే జీలు, పంపుల పనితీరుపై సమాచారం సేకరించినట్లు అధి కారులు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో బావులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపైనా దృష్టి సారించారు. హైదరాబాద్‌కు రోజుకు అదనంగా 60 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సమకూర్చే ప్రతి పాదనలో కృష్ణా జలాల నుంచి 15, మిషన్‌ భగీరథ నుంచి 40, ఉస్మాన్‌సాగర్‌-హిమాయత్‌సాగర్‌ నుంచి ఐదు మిలియన్‌ గ్యాలన్లు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తరలించే పైప్‌లైన్‌ పనులనూ ప్రస్తావించారు. అయితే ఇవి ప్రతిపాదనలు లేదా లక్ష్యాలు మాత్రమే. పూర్తి స్థాయి సరఫరాగా భావించరాదు. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికల అమలు, క్షేత్రస్థాయి ఫలితాలను ప్రజలకు వెల్లడించాలి. దీర్ఘకాలిక జల భద్రత కోసం జలాశయాల నిల్వలు, మండలాలవారీ నీటి లభ్యత, భూగర్భజలాల పరిస్థితిపై బహిరంగ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నీటి వృథాను తగ్గించడం, లీకేజీలను అరికట్టడం, మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగించడం వంటి చర్యలను వేగవంతం చేయాలి. అంతేకాకుండా, ప్రతి జిల్లాలో నీటి కొరతపై ముం దస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేసి, వేసవి ప్రారంభానికి ముందే అత్యవసర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. స్థానిక సంస్థలకు అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం అందించాలి. ప్రజలకు నీటి సరఫరా వివరాలను క్రమం తప్పకుండా ప్రకటించడం ద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పెంచాలి.

నీటి హక్కులు, వనరులపై అధికారం

కృష్ణా, గోదావరి జలాల పంపిణీ, అంతర్రాష్ట్ర సంబం ధాలు, ప్రాజెక్టుల నిర్వహణ తెలంగాణ జల భద్రతను ప్రభా వితం చేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో జనాభా పెరుగు దల, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, నిర్మాణ రంగం నీటి డిమాం డ్‌ను పెంచుతున్నాయి. ఆర్థికాభివృద్ధికి నీరు అవసరమే అయిన ప్పటికీ, పట్టణ వాణిజ్య ప్రయోజనాల కోసం గ్రామీణ ప్రజల తాగునీటి హక్కులు, రైతుల జీవనోపాధులు దెబ్బతినకూడదు. ఈ సంక్షోభం వనరుల పంపిణీలోని అసమానతలను కూడా బయటపెడుతోంది. అధిక ఆదాయం కలిగిన కుటుంబాలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయగలవు. పేద కుటుం బాలు మాత్రం నీటి కోసం పని మానుకోవాల్సి వస్తుంది. అందువల్ల నీటి నిర్వహణలో మార్కెట్‌ శక్తుల కంటే ప్రజల ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

అట్టడుగు వర్గాలపై ప్రభావం: సామాజిక న్యాయం అవసరం

పట్టణ బస్తీలు, దళితవాడలు, గిరిజన తండాలు, బీసీ, మైనారిటీ వర్గాల పేద కుటుంబాలు నీటి కొరతను తీవ్రంగా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మహిళలు, బాలికలు నీటి సేకరణ కోసం అదనపు సమయం కేటాయించాల్సి వస్తుంది. రోజువారీ కూలీలు పని కోల్పోతారు. అధిక ధరలకు నీటిని కొనుగోలు చేయడం వల్ల ఆహారం, విద్య, వైద్యానికి కేటాయించే ఆదాయం తగ్గుతుంది. కలుషిత నీరు ప్రజారోగ్య సమస్యలను పెంచు తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు బోర్లు ఎండిపోవడం, పంటలు దెబ్బతినడం వల్ల అప్పులు, వలసల ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందువల్ల నీటిని కేవలం వస్తువుగా కాకుండా గౌరవప్రదమైన జీవితానికి అవసరమైన ప్రాథమిక హక్కుగా చూడాలి. జనాభా, పేదరికం, ఆరోగ్య ప్రమాదాలు, నీటి లభ్యత ఆధారంగా సరఫరాలో ప్రాధాన్యత నిర్ణయించాలి. నీటి కొరత సమయంలో పేదలకు సరఫరా నిలిపివేసి, కొనుగోలు చేయగలిగినవారికే నీరు అందించే పరిస్థితి రాకూ డదు. నీటి నిర్వహణలో మహిళల అనుభవాలు, స్థానిక సమాజాల అవసరాలు, సంప్రదాయ జల సంరక్షణ పద్ధతులకు కూడా గుర్తింపు ఇవ్వాలి.

భవిష్యత్‌ కార్యాచరణ
1. ప్రభావిత బస్తీలు, గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలి. ధరలు, నాణ్యత, సరఫరా సమయాలను పర్యవేక్షించి, ప్రజలకు ఫిర్యాదు వ్యవస్థను అందుబాటులో ఉంచాలి.
2. చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పునర్భరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్ర మలు, ఉద్యానవనాలు, నిర్మాణ రంగంలో వినియోగించాలి.
3. చెక్‌డ్యామ్‌లు, చిన్న నీటి నిల్వలు, సూక్ష్మసేద్యం, తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహించాలి. ఉపాధి హామీ పనులను నీటి సంరక్షణతో అనుసంధానించాలి.
4. నీటి నిర్వహణ కమిటీల్లో మహిళలు, దళితులు, గిరిజ నులు, బీసీలు, మైనారిటీలు, చిన్న రైతులకు నిర్ణయాధికారం కల్పించాలి. ప్రభుత్వ వ్యయాలు, సరఫరా ఫలితాలపై సామా జిక తనిఖీలు నిర్వహించాలి.
అదే సమయంలో పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలకు నిరంతర సురక్షిత నీటి సరఫరాను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలి. వాతావరణ అంచనాల ఆధారంగా వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ, స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. సంక్షోభం వచ్చిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడమే బాధ్యతాయుతమైన ప్రజాపాలనకు నిజమైన నిదర్శనం.
తెలంగాణ జల సంక్షోభం ప్రకృతి విధించిన పరీక్ష మాత్రమే కాదు. పాలనా సామర్థ్యం, అభివృద్ధి నమూనా, సామాజిక న్యాయ దృక్పథానికి కూడా పరీక్ష. ఎల్‌నినోను నివారించలేకపోయినా, దాని ప్రభావాలను తగ్గించే ప్రణాళికలు రూపొందించాలి. ప్రకృతి సంరక్షణ, బాధ్యతాయుతమైన పాలన, ప్రజల భాగస్వామ్యం, అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణ సమన్వయంతోనే తెలంగాణకు స్థిరమైన జల భద్రత సాధ్యమవుతుంది.

డా.నాగం కుమారస్వామి
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
పాలమూరు యూనివర్సిటీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News