మూసీ-తుమ్మిడి హట్టి
ఇప్పుడు ముసీ సుందరీకరణ కేవలం డబ్బుల కోసమేనని విపక్షా లు, ప్రజా సంఘాలు అంటున్నాయి. గాంధీ విగ్రహాన్ని పెట్టేందుకు ప్రజలకు ఇండ్లు కూల్చాల్సిన అవసరం ఏమిటనేది అందరూ వేస్తున్న ప్రశ్న. కొత్త ఎకానామీ సృష్టిస్తామని ప్రభుత్వం అంటున్నది. ఇదేకాదు ప్రాణహిత నదిపై తుమ్మెడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ఈ ప్రభు త్వం అంటున్నది. దాన్నివల్ల ప్రయోజనం ఉండదని విపక్ష బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. ఖర్చు పెరుగుతుందే తప్ప అనుకున్న స్థాయిలో నీటిని నిల్వ చేయడం సాధ్యం కాదని అంటున్నది. ఇట్లాంటి విషయాలు చా లానే ఉన్నాయి. ఈ రెండు అంశాలపై ప్రజల్లో చర్చ చేస్తే బావుండేది. సాంకేతిక అంశాల పట్ల ప్రజలకు అవగాహన ఉండదు కదా అనే సందేహం రావొచ్చు. రావడం మంచిదే. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేపడుతున్న ప్రాజెక్టుల గురించి జనంలో చర్చ జరగితే మంచిదే కదా! దానిలోని మంచి చెడ్డలపై ప్రజలకు అవగాహన కలుగుతుంది కదా! ఈ విషయాల గురించి పార్టీలు ఎందుకు పట్టించుకోడం లేదు. ప్రభుత్వం మారిన ప్రతీసారి గత ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలం భించిందని నిందారోపణలు చేసే బదులు జనం మధ్యలోనే నిర్ణయా లు తీసుకుంటే అస్సలు సమస్యనే ఉండదు. నిజానిజాలేమిటో ప్రజలకు అర్థం అవుతాయి. ఎవరు ప్రజాక్షేమం కోసం పనిచేస్తున్నారో సులభం గా అర్థం చేసుకుంటారు. ఈ రెండు సందర్భాలు కేవలం ఉదాహరణ మాత్రమే.
అమరావతి-మూడు రాజధానులు
ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గడిచిన ఐదేళ్ల పాటు తీవ్ర చర్చ జరిగింది. ఎ.పి. మూడు రాజధానుల అంశాన్ని గత ప్రభు త్వం తెరపైకి తెచ్చింది. అమరావతి రైతులు దీనిపై ఆందోళన చేశారు. టీడీపీ హయాంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, కొన్ని సామాజిక వర్గాల మేలు కోసమే భూసేకరణ జరిగిందని ఇట్లా చాలా విషయాలను గత ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చెప్పింది. బయటా చెప్పింది. ఇదే అంశంపై నాయకుల వ్యక్తిగత విషయాలపై కూడా చర్చ మళ్లింది. అభివృద్ధి ఒకే దగ్గర కేంద్రీకృతం కావొద్దనే ఉద్దేశ్యంతో తామీ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెప్పింది. అంతేకాదు గత అనుభ వాలను ద్వారా తామీ నిర్ణయం తీసుకున్నామని వివరణ కూడా ఇచ్చింది. ఇది మాత్రమే కాదు గత ప్రభుత్వం తీసుకున్న విధానాలను కూడా మార్చింది. తమదైన ముద్రతో కొత్త విధానాలు తీసుకొచ్చింది. మద్యం, ఇసుక విధానాలు చెప్పుకోదగ్గవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాలను మార్చింది. మూడు రాజధానులు కాకుండా అమరావతే రాజధానిగా ఉంటుందని పార్లమెంట్‌లో చట్టం అయ్యేలా చంద్రబాబు ప్రభు త్వం జాగ్రత్తలు తీసుకున్నది. ఇక అమరావతికి ఢోకా లేదని బాబు అన్నారు. ఇదే సందర్భంలో జగన్ మ.వి.గన్ పేరుతో రాజధాని ప్రాంతానికి మరో ప్రా ంతం సూచించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని అయితే బావుంటుందనేది ఆయన అభిప్రాయం.
ఢిల్లీలో చేశారు కదా!
గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏం జరిగిందనే అంశాల గురించి సోషల్ మీడియా ద్వారా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వైసీపీ కూడా ప్రస్తు త నిర్ణయం వల్ల కలిగే భవిష్యత్తు అంశాల గురించీ మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ రెండు పార్టీల నాయకులు ఆయా విధానాల గురించి ప్రజల మధ్య చర్చ చేయలేదు. తాము బాగుందని భావించారు. అనుకున్నట్లుగానే ముందుకెళ్లారు. అసెంబ్లీలో చర్చ చేశారు. తమ అంచనాతోనే నిర్ణయాలు తీసుకున్నారు. చట్టం చేశారు. ప్రభుత్వాలు మారిన వెంటనే గతంలోని విధానాలు మారిపోయాయి. ఈ పరిణామాలన్నీ ప్రజలు కేవలం ప్రేక్షకుల్లా చూ స్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజల మధ్య చర్చకు పెట్టి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? అనే సందేహం రావొచ్చు. ఢిల్లీలో ఆప్ రాష్ట్ర ప్రభుత్వం తాము తీసుకునే నిర్ణయాల గురించి తొలుత ప్రజ ల మధ్య చర్చకు పెట్టింది. వారి నుండి అభిప్రాయాలు తీసుకున్నది. ప్రత్యక్షంగా కొన్నిసార్లు, సోషల్ మీడియా ద్వారా మరి కొన్నిసార్లు జనాభిప్రాయాలు తీసుకున్నది. ఫలితంగా చాలా వైద్యం, విద్య, ఉచిత విద్యుత్, ఉచిత తాగునీరు వంటి కీలకాంశాల్లో అద్భుత నిర్ణయం తీసు కున్నది. ఆ తర్వాత ప్రజల మధ్య కాకుండా ఆప్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వాటి పర్యావసానాలు, ప్రభావాలు ఎట్లా ఉన్నాయో అందరికీ తెలిసిందే.
___________________________________________________
READ ALSO:
సాంస్కృతిక రంగంలో శాస్త్రీయ భావాలతో ముందుకెళ్లాలి
కులం కావాలా? సమానత్వం కావాలా?
పేరుకేనా ‘ప్రజా’ప్రభుత్వాలు?
___________________________________________________
ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల గురించి ప్రజలు అప్పటిక ప్పుడే మాట్లాడరు. తమ నిరసనను ఏదో రూపంలో వ్యక్తం చేస్తారు. గతంలో మాదిరిగా ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళనా కార్యక్ర మాలు ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ప్రజల నుండి తమ నిర్ణ యాలకు సంపూర్ణ మద్దతు ఉందని భావించాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అన్ని సందర్భాల్లో విపక్షాల ప్రేరేపిత అభిప్రాయాలు ఏమీ ఉండవు. సాధార ణ ప్రజలు ఎవరి మెప్పు కోసమో మాట్లాడరు కదా.. అయినా ప్రభుత్వా లు ప్రజల ఆలోచనను అర్థం చేసుకోకపోతే ఎన్నికల ఫలితాల తర్వాత విషయాన్ని పార్టీలు అర్థం చేసుకోక తప్పదు. మన దగ్గరే కాదు మిగతా రాష్ట్రాల్లోనూ జరుగుతున్నది ఇదే. అందుకే ప్రజల మధ్యనే పార్టీలు నిర్ణయాలు తీసుకుంటే ముమ్మాటికీ వారికి ప్రజా మద్దతు ఉంటుంది. ప్రజల హృదయాల్లో ఆయా పార్టీల నాయకులు చెరగని ముద్ర వేస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు.
–
కాలమ్ : భిన్నస్వరం
గోర్ల బుచ్చన్న

